jarmany
-
ఓటీటీకి రియల్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రస్తుతం ఓటీటీ వచ్చాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్‌ను సినీ ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా సబ్ టైటిల్స్‌తోనే చూసేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే రోజు రోజుకు కొత్త కొత్త కంటెంట్‌ను ఓటీటీలు అందిస్తున్నాయి. అదే సమయంలో క్రైమ్ థ్రిల్లర్ లాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తాజాగా కంటెంట్‌తోనే యధార్థ సంఘటనల ఆధారంగా సరికొత్త క్రైమ్ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. క్రైమ్ సీన్ బెర్లిన్: నైట్ లైఫ్ కిల్లర్ అనే పేరుతో బెర్లిన్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించారు. ఈ డాక్యుమెంటరీ సిరీస్ రహస్యమైన, విచిత్రమైన హత్యల కేసుల ఆధారంగా తెరకెక్కించారు. ఈ రియల్ క్రైమ్ కథకు జాన్ జాబీల్, కరోలిన్ షాపర్ దర్శకత్వం వహించారు. ఈ ఆసక్తికర డాక్యుమెంటరీ సిరీస్ త్వరలోనే ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే 2012లో జరిగిన చీకటి సంఘటనల గురించి అవగాహన కల్పించడానికి ఈ సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మేకర్స్. క్రైమ్ సీన్ బెర్లిన్: నైట్‌లైఫ్ కిల్లర్‌లో కేవలం మూడు సీజన్లు మాత్రమే ఉన్నాయి. ఈ సిరీస్‌లో రిక్ హబ్నర్, ట్రిస్టన్ బమ్, కార్నెలియా వెర్నర్ ప్రధాన పాత్రలు పోషించారు. -
యూదుడైన ఐన్‌స్టీన్.. హిట్లర్ బారి నుంచి ఎలా తప్పించుకున్నాడు?
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే దానిపై ప్రస్తుతానికి ఎవరి దగ్గరా సమాధానం లేదు. ఈ ఉగ్రవాద సంస్థను తుడిచిపెట్టితీరుతామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. ఈ నేపధ్యంలో జరుగుతున్న పోరులో ఇప్పటికే వేలాది మంది మరణించారు. నిజానికి ఇజ్రాయెల్ ఒక చిన్న దేశం. ఇక్కడ యూదులు అత్యధిక సంఖ్యలో నివసిస్తున్నారు. అంటే ఇది యూదుల దేశం. ఈ యుద్ధం నేపధ్యంలో యూదులకు సంబంధించి అనేక విషయాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత మేధావిగా గుర్తింపు పొందిన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ యూదు అనే విషయం చాలామందికి తెలియదు. హిట్లర్ పాలనకాలంలో ఐన్‌స్టీన్ తన ప్రాణాలను కాపాడుకునేందుకు జర్మనీ నుంచి పారిపోవాల్సి వచ్చింది. పూర్వం రోజుల్లో యూరప్‌లో యూదులు జనాభా అత్యధికంగా ఉండేది. జర్మనీలో లక్షలాది మంది యూదులు ఉండేవారు. వారిలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కూడా ఒకరు. అడాల్ఫ్ హిట్లర్ ఎన్నికైన తరువాత జర్మనీలో జాతీయవాద భావన తీవ్రతరం అయ్యింది. ఈ నేపధ్యంలో ఐరోపాయేతర ప్రజలపై నిరసనలు మొదలయ్యాయి. జర్మనీలో యూదులపై ద్వేషం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. దీనికి ప్రధానకారణం క్రైస్తవులకు, యూదులకు మధ్య వీపరీతమైన ఘర్షణలు జరిగాయి. యూరప్ లో ఉన్న క్రైస్తవులు బలంగా నమ్మేదేంటంటే.. క్రీస్తును శిలువ వేయడంలో యూదుల పాత్ర ఉందని నమ్మేవారట. దాంతో పాటు యూదులు వ్యాపారంలో బలంగా ఉండడం, ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉండడంతో.. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి యూరోపియన్లు ఎక్కువగా యూదులను ద్వేషించేవారట. చరిత్రలో రకరకాల కారణాలు పేర్కొన్నప్పటికీ.. యూదులను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారన్నదానికి మతపరమైన బేధమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. జర్మనీలో హిట్లర్ మారణహోమం సృష్టించడంతో చాలా మంది యూదులు తమ ప్రాణాలను అరచేతపట్టుకుని ఇతర దేశాలకు పారిపోయారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్లో కూడా ఇదే భయం నెలకొంది. తాను జర్మనీలో ఉంటే ముప్పు తప్పదని భావించి, అమెరికా వెళ్లి, అక్కడ ఆశ్రయం పొందారు. అయితే అప్పటికే ఐన్స్టీన్పేరు విజ్ఞాన ప్రపంచంలో మారుమోగితోంది. ఇతనే కాకుండా జర్మనీకి చెందిన ఎందరో మేథావులు, శాస్త్రవేత్తలు కూడా అమెరికాలో తలదాచుకున్నారు. 1941 నుంచి 1945 వరకు జరిగిన మారణహోమంలో హిట్లర్ దాదాపు 60 లక్షల మంది యూదులను హత్య చేయించాని, వీరిలో ఎక్కువ మంది యూదులని చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం యూదుల జనాభా ప్రపంచవ్యాప్తంగా 2 కోట్లకు తక్కువగానే ఉంది. వీరిలో ఎక్కువ మంది ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నారు. అలాగే యూదులు అమెరికా, కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్లలో కూడా ఉంటున్నారు. ఇజ్రాయెల్ ప్రస్తుత జనాభా 93 లక్షల 60 వేలు. అంటే మన హైదరాబాద్ కంటే తక్కువ జనాభా ఉంది. ఇందులో యూదుల సంఖ్య 72 లక్షల 48వేల మంది. ఇతరులు వేర్వేరు మతాలకు సంబంధించిన వారు ఇజ్రాయెల్ లో స్థిరపడి ఉన్నారు. 2020 జనగణన ప్రకారం అమెరికాలో దాదాపు 80 లక్షల మంది యూదులున్నారు. పైగా అమెరికాలో అత్యున్నత వర్గంలో ఒకరిగా యూదులు ఉన్నారు. రాజకీయాలు, వర్తక, వాణిజ్యంలలో అత్యంత ప్రభావశీలురుగా యూదులున్నారు. ఇది కూడా చదవండి: భారత్ చర్యతో వారి జీవితాలు దుర్భరం: ట్రూడో -
ఆష్విట్జ్ సీన్ వివాదం.. నెటిజన్స్‌కు జాన్వీ స్ట్రాంగ్ కౌంటర్!
శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ సినిమాలతోనూ బిజీగా ఉన్న భామ ఇటీవల వరుణ్ ధావన్ సరసన నటించిన బవాల్ చిత్రం రిలీజైంది. అయితే ఈ చిత్రాన్ని డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేశారు. జూలై 21 నుంచి ఆమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రాగా.. కొన్ని సీన్స్‌పై మాత్రం తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆష్విట్జ్తో ఉన్న సంబంధాలను తెరపై చూపించడంపై ఈ సినిమాపై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. ఆష్విట్జ్ క్యాంపులను చూపించడాన్ని వాళ్లు తప్పుబడుతున్నారు. కాగా.. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి నితీశ్ తివారీ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ వివాదంపై జాన్వీ కపూర్ స్పందించారు. (ఇది చదవండి: కమెడియన్‌తో హీరోయిన్ డేటింగ్.. సోషల్ మీడియాలో వైరల్!) వివాదంపై జాన్వీకపూర్ మాట్లాడుతూ.. 'ఇజ్రాయెల్ దేశస్థుడైన వ్యక్తి నాకు తెలుసు. అతను ఐవీ లీగ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్. అతడి పూర్వీకులు దురదృష్టవశాత్తు నాజీల నిర్బంధంలో ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల అతను ఈ చిత్రాన్ని చూసి ఆయన భావోద్వేగానికి గురయ్యారు. మేము తీసిన విధానాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. అంతేకాదు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. సన్నివేశాల్లో ఎక్కడా ఒక్కసారి కూడా బాధించేలా చూపించలేదు. కాబట్టి ఏదైనా ప్రేక్షకుల దృష్టి కోణంపైనే ఆధారపడి ఉంటుంది. మా ఉద్దేశ్యం రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన నష్టాన్ని చూపించడమే. మీరు మా ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మా ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే నేను ఏమీ చేయలేను. ఈ సినిమాలోని నా పాత్రను చూసి పలువురు విద్యార్థులు చలించిపోయారు. నా పాత్ర చూశాక వాళ్లకు ఒక ధైర్యం వచ్చిందని చెప్పారు. అది నాకెంతో గర్వంగా అనిపించింది.' అని అన్నారు. ఆష్విట్జ్ అంటే ఏంటి? రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ నాజీలు ఏర్పాటు చేసిన నిర్బంధ క్యాంపులనే ఆష్విట్జ్ అంటారు. ఈ క్యాంపుల్లో యూదులను నిర్బంధించి చిత్రహింసలు పెట్టేవారని సమాచారం. ఆష్విట్జ్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. రెండో ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులను తెలియజేస్తూ తెరకెక్కిన ‘బవాల్’లో ఆష్విట్జ్ క్యాంపులను చూపించడంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా..బవాల్‌లో వరుణ్, జాన్వీ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మాస్ ఆడియన్స్‌కు బాగా నచ్చింది. (ఇది చదవండి: విమానంలో వెకిలి చేష్టలు.. బొక్కలిరగ్గొట్టిన టాలీవుడ్ నటి) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
హింటర్‌కైఫెక్ హత్యలు.. ఇప్పటికే మిస్టరీ గానే..!
కొన్ని నేరాలు ఘోరాతి ఘోరంగా.. భయంకరంగా.. ఒళ్లు గగుర్పొడిచేలా.. ఉంటాయి! హింటర్‌కైఫెక్ మర్డర్స్ అలాంటివే! జర్మనీ అపరిష్కృత నేరాల్లో ఇదీ ఒకటి. సుమారు 100 ఏళ్ల నాటి ఆ కథే.. ఈ వారం మన ముందున్న మిస్టరీ. జర్మనీలోని మ్యూనిక్‌కి 43 మైళ్ల దూరంలో ఉంటుంది ఈ హింటర్‌కైఫెక్ అనే గ్రామీణ అటవీ భూభాగం. అక్కడ ఆండ్రీస్ గ్రూబర్(64) అనే మోతుబరి అతి పెద్ద ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు. అతని భార్య కాజిలియా గ్రూబర్(73), వాళ్ల వితంతు కూతురు విక్టోరియా(35), ఆమె ఇద్దరు పిల్లలు జూనియర్ కాజిలియా(7), జోసెఫ్(2) అంతా కలసి ఆ ఇంట్లోనే ఉండేవారు. వారికి అన్ని పనులు చేసిపెట్టడానికి ఓ పనిమనిషి వాళ్లతోనే ఉండేది. అయితే 1921 అక్టోబర్‌లో ఆమె ఉన్నట్టుండి ఆ ఇంటి నుంచి పారిపోయింది. అప్పటికే ఆమె ‘ఆ ఇంటి అటక మీద ఏవో స్వరాలు, శబ్దాలు వినిపిస్తున్నాయి. భయంగా ఉంటోంది’ అంటూ ప్రచారం చేసింది. అదే విషయాన్ని ఆండ్రీస్ కూడా చాలామందితో చెప్పేవాడు. పైగా ఇంటి వెనుకవైపు పడిన మంచు మీద ఏవో విచిత్రమైన అడుగులు కనిపించాయని, అవి ఇంటివైపు వేసిన అడుగులే కానీ బయటకు వెళ్లిన అడుగులు కావనీ, లేవనీ అతడు చెప్పాడు. అది విన్నవారంతా ‘ఇంట్లో ఓ తుపాకీ ఉంచుకోవడం మంచిది’ అని సలహా కూడా ఇచ్చారు. కానీ ఆండ్రీస్ ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. ఎట్టకేలకు ఆరునెలల తర్వాత మారియా(45) అనే ఆవిడ ఆ ఇంట్లో పనికి కుదిరింది. గ్రామస్థులతో కలివిడిగా ఉండే ఆ కుటుంబం.. 1922 మార్చి 31 తర్వాత ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. ఆదివారం రోజున చర్చ్‌కి రాలేదు. సోమవారం జూనియర్ కాజిలియా స్కూల్లోనూ కనిపించలేదు. పోస్ట్మ¯Œ బట్వాడా చేసిన ఉత్తరాలూ ఎక్కడ పెట్టినవి అక్కడే ఉన్నాయి. దాంతో గ్రామస్థుల్లో అనుమానం మొదలైంది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు.. ఆండ్రీస్ ఇంట్లోనూ వెదకడం మొదలుపెట్టారు. బెడ్రూమ్లో కొత్త పనిమనిషి మారియా రక్తపు మడుగులో పడి చనిపోయి ఉంది. రెండేళ్ల జోసెఫ్ తన ఉయ్యాల్లో నిర్జీవంగా పడి ఉన్నాడు. మిగిలిన వారు ఎక్కడా కనిపించలేదు. ఇంతలో పోలీసులూ వచ్చారు. కాసేపటికి ధాన్య కొటారంలో నాలుగు శవాలు వరుసగా ఒకదానిపై ఒకటి పేర్చి.. ఎండు గడ్డి కప్పి ఉన్నట్లుగా గుర్తించారు. ఆ శవాలను చూస్తే అక్కడున్నవారందరి వెన్నులో వణుకుపుట్టింది. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో.. ఆ హత్యలు చేయడానికి మట్టాక్ (పదునైన వ్యవసాయ పరికరం)ను ఉపయోగించినట్లు తేలింది. ఎవరెవరు ఏ విధంగా చనిపోయారు? ఏ సమయంలో చనిపోయారు? అన్నీ లెక్కలు తేలాయి. ఆ క్రమంలోనే ఏడేళ్ల కాజిలియా చావు అందరినీ కలచివేసింది. కిల్లర్ కొట్టిన దెబ్బలకు తీవ్రంగా గాయపడిన ఆ పాప.. చాలా సమయం ఆ శవాల మధ్య ప్రాణాలతో కొట్టుమిట్టాడిందని.. చనిపోయే ముందు చాలా భయపడిందని తేలింది. పైగా హత్యల తర్వాత కూడా కిల్లర్.. అదే ఇంట్లో వంట చేసుకుని తిన్నట్లు ఆధారాలు ఉన్నాయి. దాంతో పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. వందమందికి పైగా అనుమానితుల్ని విచారించారు. కానీ ఫలితం లేదు. ఈ కేసులో మరో విషాదకరమైన విషయమేంటంటే.. కొత్త పనిమనిషి ఆ ఇంటికి వచ్చిన రాత్రే ఆమె హత్యకు గురైంది. అయితే గతంలో ఆండ్రీస్ మాటలను గుర్తు చేసుకున్న చాలామంది.. హంతకుడు చాలా కాలంగా ఆ ఇంటి అటకపైన ఉన్నాడని నమ్మారు. విచారణలో భాగంగా ఆండ్రీస్ కుటుంబ చరిత్రను తవ్వడం మొదలుపెట్టారు పోలీసులు. అప్పుడో సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆండ్రీస్.. కూతురు విక్టోరియాతో లైంగిక సంబంధం కలిగి ఉన్నాడని, అందుకే 1915లో ఆ ఇద్దరికీ జైలు శిక్ష విధించారని, అయినా వాళ్లలో మార్పు రాలేదని.. జోసెఫ్ వాళ్లిద్దరికీ పుట్టిన బిడ్డేనని ఇరుగుపొరుగు చెప్పుకొచ్చారు. మరికొంత మంది.. జోసెఫ్ తండ్రి ఆండ్రీస్ కాదని.. ఆ ఇంటికి సమీపంలో నివసించే లోరెంజ్ బౌర్ అనే వ్యక్తి అని వాదించారు. దాంతో జోసెఫ్ అసలు తండ్రి ఎవరో నేటికీ తేలలేదు. తదుపరి పరీక్ష కోసం బాధితుల తలలను వేరు చేసి, వాటిని మ్యూనిక్‌కి పంపినట్లు నివేదిక రాసి.. అందరినీ ఒకేచోట ఖననం చేశారు. అయితే ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరో తెలుసుకోవడానికి ఓ డాక్టర్.. ఆ తలలను అంజనం వేసే వ్యక్తుల దగ్గరకు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. అధికారులు మాత్రం.. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆ పుర్రెలు కనిపించకుండా పోయాయని చెప్పారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా హంతకుడు ఎవరో తెలియకపోవడంతో చాలా ఊహా గానాలు మొదలయ్యాయి. నిజానికి విక్టోరియా భర్త గాబ్రియేల్ ఒక సైనికుడు. 1914లో మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయాడు. అయితే గాబ్రియేల్ చనిపోలేదని.. తిరిగి వచ్చాడని.. విక్టోరియా పాపాలు తెలుసుకుని.. ఈ ఊచకోతలకు తెగబడ్డాడనేది ఓ వర్గం వాదన. మరోవైపు.. ఈ ఘోరానికి తెగబడింది లోరేంజ్ అని.. విక్టోరియా తనతో ఉంటూనే తండ్రితో సన్నిహితంగా ఉండటం చూసి తట్టుకోలేక ఇలా చేశాడనేది మరికొందరి ఊహాగానం. అయితే 1919లో ఓ వృద్ధురాలు పోలీస్ అధికారులను కలసి.. ‘ఈ హత్యలను నా మాజీ భూస్వామి చేశాడు. మొత్తం సమాచారం అతడితోనే ఉంది’ అని తెలిపింది. అయితే ఆ ప్రధాన నిందితుడు అప్పటికి ప్రాణాలతో లేడు. 2007లో జర్మనీ పోలీసు అకాడమీలోని విద్యార్థులు.. ఎలాగైనా ఈ కేసుని క్లోజ్ చెయ్యాలని ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి.. ఒక అనుమానితుడ్ని హంతుకుడిగా గుర్తించారు. అయితే అతడు కూడా అప్పటికి ప్రాణాలతో లేకపోవడంతో అతడి కుటుంబ సభ్యుల గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని.. అతడి పేరునూ బహిర్గతం చేయలేదు. దాంతో ఈ కేసు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ∙సంహిత నిమ్మన -
జర్మనీపై భారత్ ఘన విజయం
భువనేశ్వర్: ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ హాకీ టోర్నీలో భారత జట్టు కీలక విజయాన్ని అందుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3–0 గోల్స్ తేడాతో జర్మనీని ఓడించింది. భారత్ తరఫున వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 2 గోల్స్ (18వ నిమిషం, 27వ నిమిషం) చేయగా... 45వ నిమిషంలో అభి షేక్ మరో గోల్ నమోదు చేశాడు. తాజా ఫలితంతో 11 మ్యాచ్‌ల ద్వారా 24 పాయింట్లు సాధించిన భారత్ లీగ్‌లో అగ్ర స్థానంలోనే కొనసాగనుంది. లీగ్‌లో భాగంగా రెండో మ్యాచ్ నేడు జరుగుతుంది. చదవండి: IPL 2022 RR Vs GT: హార్ధిక్ పాండ్యాకు ఏమైంది.. ? మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయాడు! -
పడిపోయాననుకున్నావా? ఈత కొట్టాలనిపించింది.. దూకేశా..
ఎటో చూస్తూ నడిస్తే ఎంతటి వారైనా బొక్కబోర్లా పడాల్సిందే! అందుకు ఎవరూ అతీతులు కాదని.. సాక్షాత్తు మృగరాజే నిరూపించింది. అసలేం జరిగిందంటే.. జర్మన్ జూ పార్క్‌లో రెండు సింహాలు ఒక నీటిగుంట గట్టు మీద క్యాజువల్‌గా నడుస్తున్నాయి. ఇంతలో ఒక సింహం ఎటో చూస్తూ, నిర్లక్ష్యంగా నడుస్తూ, స్లిప్ అయ్యి నీటి గుంటలో పడిపోయింది. ముందు షాకయినప్పటికీ తర్వాత తేరుకుని నింపాదిగా ఈదుకుంటూ పైకి వచ్చింది. అయితే దానితో పాటే ఉన్న మరో సింహం మాత్రం కంగారు పడిపోయింది. నీళ్లలోనుంచి బయటికి వచ్చేంతవరకూ హడావిడిగా తిరగసాగింది. 2018 నాటి ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. ఐతే నెటిజన్లు మాత్రం ఈ వీడియోకు సరదాగా తమ అభిప్రాయాలను పోస్ట్ చేశారు. ‘గర్వం పతనానికి దారితీస్తుంది’అని ఒకరు కామెంట్ చేస్తే, ‘బుద్ధిలేని సింహం’ అని మరొకరు కామెంట్ చేశారు. ఏది ఏమైనప్పటికీ నవ్వు వచ్చేలా ఉన్న ఈ వీడియో సన్నివేశాన్ని మాత్రం వేల సంఖ్యలో నెటిజన్లు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. చదవండి: ఈ రైళ్ల కూత కుక్కల అరుపులా ఉంటుంది.. ఐడియా అదుర్స్ కదూ.. -
ఈ సినిమాకు కథ–కర్మ–క్రియా ‘హిట్లర్’
మహా నియంత హిట్లర్‌పై ప్రపంచంలో ఎన్నో భాషల్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏమిటంటే ఒక సినిమాకు హిట్లర్ అనధికారికంగా అన్నీ తానై వ్యవహరించాడు. ఆ సినిమా పేరు ట్రయంప్ ఆఫ్ ది విల్ (మార్చి 28, 1935లో విడుదలైంది) ఈ నాజీ భావజాల చిత్రానికి లెని రిఫెన్స్టాల్ రచన, దర్శకత్వ బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హోదా(అనధికారికంగా)తో పాటు, ఫ్రేమ్ టు ఫ్రేమ్‌లో హిట్లర్ హస్తం ఉందట. ఈ సినిమా నటబృందంలో హిట్లర్ పేరు కూడా కనిపిస్తుంది. అదేంటి హిట్లర్ నటించాడా? అదేం కాదుగానీ గంభీరంగా ఉపన్యాసం ఇస్తున్న హిట్లర్ ఇందులో కనిపిస్తాడు. ‘హిట్లర్ ట్రయంప్ ఆఫ్ ది విల్ స్పీచ్’గా ఇది బాగా పాప్లర్ అయింది. 111 నిమిషాల నిడివిగల ఈ చిత్రం భావజాల ప్రచారచిత్రమే అయినప్పటికీ రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలలో ఉపయోగించే మూవింగ్ కెమెరాలు, ఏరియల్ ఫొటోగ్రఫీ, లాంగ్–ఫోకస్ లెన్స్.. మొదలైన వాటిని ఈ చిత్రంలో ఉపయోగించారు. మరో విశేషం ఏమిటంటే ఈ సినిమా జర్మనీలోనే కాదు యూఎస్, ఫ్రాన్స్, స్వీడన్... మొదలైన దేశాల్లో అవార్డ్లు గెలుచుకుంది. l -
ప్రపంచంలో నెం.1 పాస్‌పోర్ట్ ఏదో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుగా మరోసారి జపాన్ పాస్‌పోర్టు ఎంపికయింది. ‘హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్’లో ఇలా జపాన్ పాస్‌పోర్ట్ ఎంపికవడం ఇది వరుసగా మూడోసారి. ఇందుకు కారణం ఈ పాస్‌పోర్ట్‌తో వీసా లేకుండా ప్రపంచంలో 191 దేశాలు తిరిగి రావచ్చు. ఆ తర్వాత సింగపూర్ పాస్‌పోర్ట్ రెండో స్థానంలో, ఆ తర్వాత దక్షిణ కొరియా, జర్మనీ దేశాల పాస్‌పోర్టులు మూడో స్థానంలో ఎంపికయ్యాయి. సింగపూర్ పాస్‌పోర్టు ద్వారా ప్రపంచంలో వీసా లేకుండా 190 దేశాలు, దక్షిణ కొరియా, జర్మనీ పాస్‌పోర్టుల ద్వారా 189 దేశాలు తిరిగి రావచ్చు. అమెరికా, బ్రిటన్ దేశాలు స్థానాలు క్రమంగా ఇండెక్స్‌లో పడిపోతూ వస్తున్నాయి. ఈ రెండు దేశాలతోపాటు బెల్జియం, గ్రీస్, నార్వే దేశాల పాస్‌పోర్టులు ఎనిమిదవ స్థానంలో ఎంపికయ్యాయి. ఈ ఐదు దేశాల పాస్‌పోర్టులతో వీసా లేకుండా 184 దేశాలు తిరిగి రావచ్చు. అమెరికా, బ్రిటన్ దేశాలు 2015లో మొదటి స్థానంలో ఉండగా, గతేడాది ఆరవ స్థానంలోకి పడిపోయాయి. వీసా అవసరం లేకుండా 188 దేశాలను తిరిగొచ్చే అవకాశం ఉన్న ఫిన్లాండ్, ఇటలీ దేశాల పాస్‌పోర్ట్‌లు నాలుగో స్థానంలో, 187 దేశాలు తిరిగొచ్చే అవకాశం ఉన్న డెన్మార్క్, లగ్జెమ్‌బర్గ్, స్పెయిన్ ఐదో స్థానంలో, 186 దేశాలు తిరిగొచ్చే అవకాశం ఉన్న ఫ్రాన్స్, స్వీడన్ ఆరవ స్థానంలో, ఆస్ట్రియా, ఐర్లాండ్, నెదర్లాండ్, పోర్చుగల్, స్విడ్జర్లాండ్ పాస్‌పోర్టులు ఏడో స్థానంలో ఎంపికయ్యాయి. ఆస్ట్రేలియా, కెనడా, చెక్ రిపబ్లిక్, మాల్టా, న్యూజిలాండ్ తొమ్మిదవ స్థానంలో, హంగరి, లిథ్వానియా, స్లొవాకియా పాస్‌పోర్ట్‌లు పదవ స్థానంలో ఎంపికయ్యాయి. వీసా అవసరం లేకుండా 58 దేశాలు మాత్రమే తిరిగొచ్చే అవకాశం ఉన్న భారత పాస్‌పోర్ట్ 84వ స్థానంలో ఎంపికయింది. ఇది 2019లో 86వ స్థానంలో ఎంపికకాగా ఈ ఏడాది రెండు స్థానాలు మెరుగుపడింది. -
31 ఇంజనీరింగ్ కాలేజీలలో అడ్వాన్స్ రోబో టెక్నాలజీ..
సాక్షి, విజయవాడ : రొబొటిక్, మెకట్రానిక్స్ విభాగాల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు హైఎండ్ శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా ఎపీఎస్ఎస్డీసీ– జర్మనీకి చెందిన యూరోపియన్ సెంటర్ ఫర్ మెకట్రానిక్స్‌తో ఒప్పందం చేసుకుని కలిసి పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి తెలిపారు. దేశంలోనే తొలిసారిగా రొబోటిక్ విభాగంలో జర్మన్ సంస్థతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. గురువారం విజయవాడలోని గేట్‌వే హోటల్లో ఎపీఎస్ఎస్డీసీ– యూరోపియన్ సెంటర్ ఫర్ మెకట్రానిక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెండో విడత 20 ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్వాన్స్డ్ రోబోటిక్ కంట్రోల్ ల్యాబ్‌లను ఆన్లైన్ ద్వారా చైర్మన్ చల్లా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఒప్పందం ప్రకారం మొదటి విడతలో భాగంగా ఇప్పటికే 11 ఇంగిరినీరింగ్ కాలేజీల్లో అడ్వాన్సుడ్ రోబోటిక్స్ లాబ్స్ ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాల్లో 788 మంది విద్యార్థులు ఏఆర్సీ 1.0 లో శిక్షణ పూర్తి చేసుకున్నారు. రెండవ విడత 20 ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్వాన్స్డ్ రోబోటిక్ కంట్రోల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి 800 మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇండస్ట్రీ 4.0కు ఆనుగుణంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఏపీలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు రోబోటిక్స్ విభాగంలో నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాజెసింగ్ రంగంలో జర్మనీకి సంబంధించిన టెక్నాలజీని పరిశ్రమలకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఏపీఎస్ఎస్డీసీ ఎండి, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్ మాట్లాడుతూ రొబొటిక్స్, ఆటోమేషన్, మెకట్రానిక్స్ విభాగాల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశ్రమల్లో పనిచేయడానికి అవసరమైన విధంగా శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించిందన్నారు. కేవలం డిగ్రీతో ఉద్యోగం రాదని, దానితోపాటే అదనపు నైపుణ్యాలు ఉన్నపుడే ఉద్యోగాలు వస్తాయన్నారు. అందువల్లే టెక్నికల్, నాన్ టెక్నికల్ విద్యార్థులకు ఎపిఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో మార్కెట్లో డిమాండ్ ఉన్న సర్టిఫికేషన్ కోర్సుల్లో శిక్షణ మస్తున్నామన్నారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికేషన్, ప్రశంసా పత్రాలను చైర్మన్ చల్లా అందజేశారు. ఈ సందర్భంగా స్టూడెంట్ లీడర్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సెంటర్ ఫర్ మెకట్రానిక్స్(ఈసీఎం) ప్రెసిడెంట్ వీవీఎన్ రాజు, యూరోపియన్ సెంటర్ ఫర్ మెకట్రానిక్స్ ఎండీ (జర్మనీ) టిల్ క్వార్డ్ ఫ్లిగ్ తదితరులు పాల్గొన్నారు. -
భారత్ నుంచి పెరుగుతున్న వలసలు
సాక్షి, న్యూఢిల్లీ : భారతదేశం దినదినం పురోభివద్ధి చెందుతోందని మన రాజకీయ నాయకులు ఉదరగొడుతున్నప్పటికీ రోజురోజుకు మన దేశం నుంచి విదేశాలకు వలసలు పెరుగుతూనే ఉన్నాయి. అలా వలసపోయిన వారి సంఖ్య 1990లో 66 లక్షలు ఉండగా, అది 2019 సంవత్సరం నాటికి 175 లక్షలకు చేరుకుంది. ఈ డేటాను ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం విడిదుల చేసింది. మొత్తం అంతర్జాతీయంగా 2, 720 లక్షల మంది విదేశాలకు వలసపోతుండగా వారిలో 175 లక్షల మంది భారతీయులు ఉన్నారని, అయితే భారతీయులు వలసపోతున్న దేశాలు గత 30 ఏళ్లుగా గణనీయంగా మారుతూ వస్తున్నాయని డేటా వివరాలు స్పష్టం చేస్తున్నాయి. అదే విదేశాల నుంచి భారత్‌కు వలసలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అక్రమ వలసలను ఇక్కడ పరిగణలోకి తీసుకోవడం లేదు. అయితే చట్టబద్ధంగా భారత్‌లో శరణార్థులుగా ఆశ్రయం కోరుతున్న వారి సంఖ్య గత 30 ఏళ్లలో స్థిరంగా రెండు లక్షలే ఉంటోంది. భారత్‌కు వలసవస్తున్న వారి సంఖ్య 1990లో భారత జనాభాలో 0.9 శాతం ఉండగా, ప్రస్తుతానికి అది దేశ జనాభాలో 0.4 శాతానికి తగ్గింది. మరోపక్క ప్రపంచ జానాభాలో ప్రపంచ వలసల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. 2000 సంవత్సరంలో ప్రపంచ జనాభాలో ప్రపంచ వలసల సంఖ్య 2.8 శాతం ఉండగా, అది ప్రస్తుతానికి 3.5 శాతానికి చేరుకుంది. ప్రపంచ దేశాల నుంచి ఎక్కువ మంది అమెరికాకు వెళుతుండగా, ఆ తర్వాత జర్మనీ, సౌదీ అరేబియాకు ఎక్కువ మంది వలస పోతున్నారు. ఇక విదేశాల నుంచి భారత్‌కు వస్తున్న వారిలో బంగ్లాదేశీయులు ప్రథమ స్థానంలో ఉండగా, పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక, చైనా దేశీయులు వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నారు. -
చెదిరిన జీవిత చిత్రం
‘ద గర్ల్ యు లెఫ్ట్ బిహైండ్’ నవల మొదలయ్యేది మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పటి 1916లో. ఫ్రెంచ్ చిత్రకారుడైన ఇద్వార్డ్, భార్య సోఫీ చిత్రాన్ని వేస్తాడు. యుద్ధానికి వెళ్ళి పట్టుబడినప్పుడు, జర్మన్ జైల్లో పెడతారు అతణ్ని. జర్మన్లు ఫ్రాన్సులో చిన్న పల్లెటూరైన, సెయింట్ పేహోన్ను ఆక్రమించుకుంటారు. అక్కడే సోఫీ కుటుంబం చిన్న హోటెల్ నడుపుతుంటుంది. ప్రతీ సాయంత్రం జర్మన్ క్యాంప్ కమాండంట్కూ, సిపాయిలకూ తినుబండారాలు, పానీయాలూ అందించవల్సిన పని తప్పించుకోలేకపోతుంది సోఫీ. కమాండెంట్‌ను మొదట సోఫీ చిత్రం ఆకర్షిస్తుంది. ఆ తరువాత సోఫీ. ‘నేను శత్రుసైన్యం వాడినన్న సంగతి మరచిపో. నువ్వు ప్రతి క్షణం ఆ సైన్యాన్నే ఎలా నష్టపరచాలా అని యోచిస్తున్న స్త్రీవని నేనూ మరచిపోతాను. మనం కేవలం ఇద్దరు మనుష్యులుగా మాత్రమే ఉందాం’ అని సోఫీకి సూచిస్తాడు. ‘ప్రతీ క్షణపు సారాన్నీ ఆస్వాదిస్తూ, అది రుచిగా ఉన్నందుకు సంతోషపడుతూ గడపాలి’ అని భర్త చెప్పిన మాటలు గుర్తొచ్చిన సోఫీ– ఇద్వార్డును జైలునుండి విడిపించడం కోసం, కమాండంట్ షరతును ఒప్పుకుంటుంది. అనుకోకుండా జర్మన్ ఆర్మీ ఆమెను అరెస్ట్ చేస్తుంది. ఆ తరువాత ఆమె జాడ కనబడదు. రచయిత్రి జోజో మోయ్స్– కథను 90 ఏళ్ళు ముందుకు తీసుకెళ్ళి, నాలుగేళ్ళ కిందట భర్తను కోల్పోయిన, 33 ఏళ్ళ లండన్ నివాసి అయిన లివ్ వద్దకు చేరుస్తారు. పెళ్ళయిన కొత్తల్లో, భర్త ఆమెకు బహూకరించిన సోఫీ చిత్రమే లివ్ గోడమీద వేళ్ళాడుతుంటుంది. ‘కొన్నిసార్లు, జీవితం అడ్డంకుల వరుసలా కనిపిస్తుంది. మరొక అడుగు వేయడం కూడా కష్టంగా ఉంటుంది’ అనుకుంటూ జీవితం ఈడుస్తున్న స్త్రీ లివ్. దొంగిలించబడిన కళాఖండాలను వాటి హక్కుదారులకు అప్పగించే బాధ్యత తీసుకున్న అమెరికన్ అయిన పౌల్, పోలీసుగా పని చేసిన తరువాత, తన సొంత ఏజెన్సీ నడుపుతుంటాడు. ఇద్వార్డ్ కుటుంబం సోఫీ చిత్రం కావాలని కేసు పెట్టినప్పుడు, ఆ కేసు చూస్తున్నదే పౌలే. లివ్, పౌల్‌ను కలుసుకున్న తరువాత, జీవితం పట్ల ఆమె ఆశ తిరిగి చిగురిస్తుంది. ‘లోకం అంతం అయిందనుకున్నాను. తిరిగి ఎప్పుడూ మంచి జరుగుతుందని ఆశించలేదు. నేను ఇన్నాళ్ళూ ఎక్కువ తినలేకపోయాను. ఎవరినీ కలవాలని ఉండేది కాదు. ఇప్పుడు మళ్ళీ బతుకంటే ఇష్టం ఏర్పడింది’ అని పౌలుకు చెప్తుంది. అయితే, చిత్రం గురించి తెలిసిన తరువాత వారిద్దరి సంబంధం బీటు పడుతుంది. ఇద్వార్డ్ వేసిన చిత్రాల ధర ఆకాశాన్ని అంటుతోందని తెలియని లివ్, చిత్రాన్ని వదులుకోనంటుంది. అది కమాండెంట్‌కు బహూకరించబడిందని తెలిసిన పౌలు, ‘కేసు గెలవడం కన్నా జీవితంలో మరెంతో ఉంది’ అనుకుని కేసు వదిలేస్తాడు. వాస్తవానికి– సోఫీ భర్తను కలుసుకుని స్విట్జర్లాండ్‌లో, అతనితో కలిసి సంతోషంగా జీవించిందని ఆఖర్న తెలుస్తుంది. సోఫీ దృష్టికోణంతో ఉన్న కథ హటాత్తుగా లివ్ జీవితానికి చేరిన తరువాత, చాలా త్వరగా– ముందుకీ వెనక్కీ నడుస్తుంది. సోఫీకి ఏమయిందన్న రహస్యాన్ని అన్వేషిస్తూనే, లివ్ వద్దనున్న చిత్రం గురించిన ఆసక్తిని హెచ్చిస్తుంటుంది. చిత్రాలను పూర్వస్థితీకరణ చేయడంలో ఉన్న సంక్లిష్టతలను విపులీకరిస్తుంది నవల. యుద్ధకాలంలో దొంగిలించబడిన కళాఖండాల గురించి చెప్తూ కూడా రచయిత్రి– వదంతులు నిజాలని ఎలా కప్పెడతాయో అన్న తన కథనం నుంచి దృష్టి మళ్ళించరు. ‘సరైన కారణాల కోసం ఏదైనా చేసినప్పుడు కూడా అది నమ్మకద్రోహమే అవుతుందా?’ అని కథ ప్రశ్నిస్తుంది. ప్రేమ, త్యాగం, కోల్పోవడం గురించిన పుస్తకంలో యుద్ధపు వివరాలు, అమానుష ప్రవర్తన, విశదమైన లైంగిక వివరాలు ఉంటాయి. వార్తా శీర్షికల వెనకనుండే వ్యక్తిగత కథలను కనబరిచే ఈ నవలను పెంగ్విన్ బుక్స్ 2014లో ప్రచురించింది. ‘సరైన కారణాల కోసం ఏదైనా చేసినప్పుడు కూడా అది నమ్మకద్రోహమే అవుతుందా?’ అని కథ ప్రశ్నిస్తుంది. కృష్ణ వేణి -
కాంగ్రెస్ ట్వీట్.. రాహుల్‌పై జోకులు
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్లో పోస్టు చేసిన ఫొటోలు రాహుల్ గాంధీకి తలనొప్పిగా మారాయి. రాహుల్ గాంధీ వైవిధ్య భరిత హావభావాలు’ అంటూ జర్మనీ పార్లమెంట్లో రాహుల్ దిగిన నాలుగు ఫోటోలను ట్వీటర్లో పోస్ట్ చేసింది. ఇప్పుడా ఫోటోలు సోషల్ మీడీయాలో వైరలయ్యాయి. ఆ ఫోటోలపై నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు. కామేడీ కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్ ప్రస్తుతం జర్మనీలో పర్యటిస్తున్నారు. ఆ దేశ పార్లమెంటును రాహుల్ సందర్శించారు. ఈ సందర్భంగా తీసిన కొన్ని ఫొటోలను కాంగ్రెస్ ట్విట్టర్లో పోస్టు చేసి వాటికి ‘రాహుల్ వైవిధ్య భరిత హావభావాలు’ అని క్యాప్షన్ తగిలించింది. రాహుల్ సీరియస్‌గా కిందికి, పైకి, పక్కకి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఆ పోటోలు ఉన్నాయి. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మనసారా నవ్వించినందుకు రాహుల్‌కు థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నానని ఒకరంటే, ప్రపంచంలో ఎక్కడున్నా రాహుల్ నవ్విస్తూనే ఉంటారని మరొకరు కామెంట్ చేశారు. ‘పప్పు స్టేజ్ ఎక్కాక ఏం మాట్లాడాలో తెలియడం లేదు’, దేశం గురించి మీ భవిష్యత్ ప్రణాళిక ఏమిటి? అన్న ప్రజల ప్రశ్నకు రాహుల్ రియాక్షన్ ఇదీ.. అంటూ కొందరు కామెంట్ చేయగా, కాంగ్రెస్ పార్టీ తనను తానే ట్రోల్ చేసుకుంటోంది అని మరికొందరు కామెంట్ చేశారు. ‘వైవా పరీక్షల్లో నా పరిస్థితీ ఇదే’ అని మరొకరు పేర్కొన్నారు. 'రాహుల్‌ను తన సొంత సోషల్ మీడియానే దెబ్బతీసేలా ఉంది', ఏం మాట్లాడాలో తెలియక రాహుల్ అలా ఫోజు ఇచ్చారని అని మరొకరు కామెంట్ చేశారు. The many facets of Rahul Gandhi. #Bundestag pic.twitter.com/MtoNs1TxjO — Congress (@INCIndia) August 23, 2018 -
మెక్సికోరల్లో జర్మనీ...
జర్మనీ... ప్రపంచకప్ ఫేవరెట్లలోకెల్లా హాట్ ఫేవరెట్. 1982 నుంచి, అందునా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో దిగిన మూడుసార్లు టోర్నీ తొలి మ్యాచ్‌లో ఓడిపోలేదు. మెక్సికో... సాధారణ జట్టే కానీ ఈసారి తనదైన రోజున ఏ జట్టునైనా పరాజయం పాల్జేసేంత ప్రమాదకారిగా కనిపిస్తోంది....ఆ రోజు ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లోనే వచ్చింది. కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య తీవ్ర స్థాయి ప్రతిఘటనలతో సాగిన మ్యాచ్‌లో మెక్సి‘కోరల్లో’ చిక్కిన జర్మనీ బయటపడ లేకపోయింది. కనీసం ‘డ్రా’ అయినా చేసుకోలేక అనూహ్య ఓటమిని మూటగట్టుకుంది. ఫేవరెట్లలో ఒకటైన అర్జెంటీనాను శనివారం అనామక ఐస్లాండ్ నిలువరించి కప్‌పై ఆసక్తి పెంచగా, ప్రపంచ చాంపియన్‌ను ఓడించిన మెక్సికో ఒక్కసారిగా వేడి పుట్టించింది. మాస్కో: ప్రపంచ కప్‌లో రసవత్తర మ్యాచ్.డిఫెండింగ్ చాంపియన్ జర్మనీకి షాక్. ఆదివారం 78 వేల ప్రేక్షక సందోహం మధ్య ఇక్కడి లుజ్నికి స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘ఎఫ్’ మ్యాచ్‌లో మెక్సికో 1–0తో జర్మనీని బోల్తా కొట్టించి పెను సంచలనం సృష్టించింది. విపరీతమైన దాడులను ఎదుర్కొన్నా ఈ దక్షిణ అమెరికా జట్టు నిబ్బరం చూపింది. 35వ నిమిషంలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హిర్విన్ లొజానో చేసిన ముచ్చటైన గోల్‌తో ఆధిక్యంలో నిలిచిన మెక్సికో దానిని చివరి వరకు నిలబెట్టుకుంది. ఎంత ప్రయత్నించినా ప్రత్యర్థిని అందుకోలేకపోయిన జర్మనీ... ఇక గెలుపు ఊహకే దూరంగా ఉండిపోయింది. దాడులతో మొదలు... మ్యాచ్ తొలి మూడు నిమిషాల్లోనే రెండు జట్లకు చెరోసారి గోల్ అవకాశం వచ్చిందంటేనే ఆట ఏ స్థాయిలో ప్రారంభమైందో అర్థం చేసుకోవచ్చు. జర్మనీ ఎప్పటిలానే ఆధిపత్యం కోసం ప్రయత్నించింది. మెక్సికో మాత్రం బంతిని అదుపులో ఉంచుకునే తమ సహజ సిద్ధమైన ఆటను ఎంచుకోలేదు. అయినా ఆ జట్టుపై ఇదేమంత ప్రభావం చూపలేదు. డిఫెన్స్ లోపాలున్నా జర్మనీనే కొంత మెరుగ్గా కనిపించింది. అయినా ప్రత్యర్థి తేలిగ్గా లొంగలేదు. క్రమంగా మెక్సికో ప్రతి దాడులకు దిగడంతో మ్యాచ్ ఆసక్తిగా మారింది. 35వ నిమిషంలో హెర్నాండెజ్ నుంచి వచ్చిన పాస్‌ను అద్భుతంగా ముందుకు తీసుకెళ్లిన లొజానో... కీపర్ న్యూర్‌ను బోల్తా కొట్టిస్తూ గోల్‌గా మలిచాడు. తర్వాత కూడా ఇదే తీవ్రతతో ఆడిన మెక్సికో... జర్మనీని ఇబ్బందికి గురి చేసింది. పాస్‌లు సరిగా అందిపుచ్చుకోకపోవడం ఆ జట్టును దెబ్బతీసింది. వందశాతం ఆటను చూపలేకపోవడంతో ప్రత్యర్థి పని సులువైంది. బంతి జర్మనీ ఆధీనంలోనే ఉన్నా, వారిని అనుసరించే వ్యూహాన్ని పక్కాగా అమలు చేసిన మెక్సికో మొదటి భాగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ప్రయత్నించినా చిక్కలే... చావోరేవో తేల్చుకోవాల్సిన రెండో భాగంలో జర్మనీ ఆటలో తీవ్రతను పెంచింది. కానీ దుర్బేధ్యమైన ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది. ఇదే సమయంలో మెక్సికో ఆటగాళ్లు అలసిపోయినట్లు కనిపించారు. ఈ అవకాశాన్నీ ప్రపంచ చాంపియన్ వినియోగించుకోలేదు. లాభం లేదని సీనియర్ గోమె జ్ను బరిలో దింపింది. అయినా ఆ జట్టు కొట్టిన షాట్లు గోల్పోస్ట్పైగా వెళ్లాయి. చివరి నిమిషాల్లోకి వచ్చేసరికి పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. అవకాశాలు సృష్టించుకోలేని పరిస్థితుల్లో మ్యాచ్‌ను చేజార్చుకుంది. మ్యాచ్ మొత్తంలో 60 శాతం పైగా సమయం బంతి తమ ఆధీనంలోనే ఉన్నా, 25 సార్లు దాడులు చేసినా జర్మనీకి చేదు ఫలితమే మిగిలింది. మొదటి భాగంలో ప్రతిదాడి, రెండో భాగంలో రక్షణాత్మక ఆటను నమ్ముకున్న మెక్సికోనే విజయం వరించింది. తదుపరి ఈనెల 23న కొరియాతో మెక్సికో; స్వీడన్‌తో జర్మనీ తలపడతాయి. గోల్ చేశాక లొజానో ఆనందహేళ... మ్యాచ్ ముగిశాక నిరాశలో జర్మనీ ఆటగాళ్లు ముల్లర్, హామెల్స్. 36 ప్రపంచకప్‌లో తాము ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓడిపోవడం 36 ఏళ్ల తర్వాత జర్మనీకిదే తొలిసారి. చివరిసారి పశ్చిమ జర్మనీ 1982 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో 1–2తో అల్జీరియా చేతిలో పరాజయం పాలైంది. 5 గత ఆరు ప్రపంచకప్‌లలో తాము ఆడిన తొలి మ్యాచ్‌లోనే మెక్సికో గెలుపొందడం ఇది ఐదో సారి. మరో మ్యాచ్‌ను ఆ జట్టు ‘డ్రా’ చేసుకుంది. 6 ప్రపంచకప్ చరిత్రలో డిఫెండింగ్ చాంపియన్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓడిపోవడం ఇది ఆరోసారి. 1950లో ఇటలీ 2–3తో స్వీడన్ చేతిలో... 1982లో అర్జెంటీనా 0–1తో బెల్జియం చేతిలో... 1990లో అర్జెంటీనా 0–1తో కామెరూన్ చేతిలో... 2002లో ఫ్రాన్స్ 0–1తో సెనెగల్ చేతిలో... 2014లో స్పెయిన్ 1–5తో నెదర్లాండ్స్ చేతిలో... 2018లో జర్మనీ 0–1తో మెక్సికో చేతిలో ఓడిపోయాయి. 2 జర్మనీ జట్టును మెక్సికో ఓడించడం ఇది రెండోసారి మాత్రమే. గతంలో ఏకైకసారి మెక్సికో 1985 జూన్‌లో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో జర్మనీపై గెలిచింది. 3ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా మెక్సికో ప్లేయర్ రాఫెల్ మార్కెజ్ (2002, 06, 2010, 14, 18) అత్యధికంగా ఐదు ప్రపంచకప్‌లలో ఆడిన మూడో ప్లేయర్‌గా నిలిచాడు. గతంలో ఆంటోనియో కర్బజాల్ (మెక్సికో–1950, 54, 58, 62, 66), లోథర్ మథియాస్ (జర్మనీ–1982, 86, 90, 94, 98) మాత్రమే ఈ ఘనత సాధించారు. -
లోకం చుట్టిన వీరుడు వీడు
న్యూయార్క్ : ప్రపంచాన్ని చుట్టి రావాలనే కోరిక ఎవరికైనా ఉండవచ్చు. అయితే అది తీర్చుకోవడం అందరివల్లే కాదు, కొందరి వల్ల కూడా కాకపోవచ్చు. పుష్కలంగా డబ్బులున్న వారే ప్రపంచాన్ని తిరిగి రాలేదు. అంతంత మాత్రంగా డబ్బులున్నా, ప్రపంచ దేశాలను చుట్టి రావాలన్న కోరిక బలంగా ఉండడంతో 73 ఏళ్ల మన డాన్ పారిష్ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని తన కోరికను తీర్చుకున్నారు. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వమున్న 193 దేశాల్లో పర్యటించి, 852 ప్రాంతాలను చుట్టిన మొట్టమొదటి ప్రపంచ యాత్రికుడిగా రికార్డు సష్టించారు. అమెరికాలోని షికాగో రాష్ట్రానికి చెందిన డాన్ పారిష్ ఉద్యోగార్థుడైన 1965లో అనుకోకుండా జర్మనీ వెళ్లారు. అక్కడే పెళ్లి చేసుకొని ఉద్యోగంలో స్థిరపడ్డారు. అక్కడ సెలవుల్లో వివిధ ప్రాంతాల్లో తిరుగుతుంటే కలిగిన తియ్యటి అనుభూతి ప్రపంచాన్ని చుట్టి రావాలనే కోరికకు బీజం వేసింది. ముందుగా మాతృ దేశమైన అమెరికా చుట్టి రావాలనుకున్నారు. ఆ తర్వాత ప్రపంచ దేశాలను చుట్టి రావాలనుకున్నారు. అందుకోసం బోలెడు డబ్బు అవుతుందని తెలుసు. అందుకోసం రేయింబవళ్లు టెలికమ్యూనికేషన్ల విభాగంలో కష్టపడి పనిచేశారు. వృధా ఖర్చులు మానుకున్నారు. అవసరమైనంత డబ్బు సమకూరిందనుకున్నాక 1965లో ఒంటరిగా ప్రపంచ యాత్రకు శ్రీకారం చుట్టారు. ముందుగా అమెరికాలోకి 50 రాష్ట్రాలను తిరిగారు. ఆ తర్వాత ఖండాలు, దేశాలు, దీవులు తిరిగారు. ఎక్కడికెళ్లినా ఖర్చు తక్కువగా ఉండే రవాణా వ్యవస్థను ఆశ్రయించేవారు. సొంతంగా ఓ పడవ కొనుక్కొని ఆ పడవపై 60 దేశాలు తిరిగారు. ఈ సందర్భంగా అనేక దీవులను సందర్శించారు. వాటిలో బౌంటీ ఐలాండ్స్, స్కాటీ ఐలాండ్స్, పారాసెల్ ఐలాండ్స్ ప్రముఖ దీవులు కూడా ఎన్నో ఉన్నాయి. జర్మనీ నుంచే ప్రారంభమైన ఆయన ప్రపంచ యాత్ర ఫిజీలోకి కాంకాయ్ రీఫ్ వద్ద ప్రస్తుతం ముగిసింది. అమెరికాకు ప్రత్యర్థి దేశమైన ఉత్తర కొరియా వెళ్లినప్పుడు ఆయన యాత్ర గురించి అక్కడి పత్రికలు మొదటి పేజీలో వార్తలు రాశాయి. డాన్ పారిష్ ఎక్కువ కాలం ఉత్తర కొరియాలో ఉన్న అమెరికన్‌గా రికార్డు నెలకొల్పడమే అందుకు కారణం. ఆయన దాదాపు మూడేళ్లపాటు అక్కడే నివసించారు. డబ్బులు అవసరం అయినప్పుడల్లా ఆ సమయంలో ఏ దేశంలో ఉన్నారో ఆ దేశంలో దొరికి ఉద్యోగం చేసేవారు. తన యాత్ర ఇంకా ముగియలేదని, మళ్లీ మొదలుపెట్టి మరిన్ని దేశాలు తిరిగి వస్తానని చెప్పారు. తమ పర్యటనలో తమకు నచ్చిన దేశం ఏమిటని ప్రశ్నిస్తే మాతృ దేశంకన్నా మంచి దేశం ఏముంటుందని అన్నారు. జర్మనీలో తాను వివిధ ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు అనేక దేశాలు తిరిగాలన్న కోరిక పుట్టిన మాట వాస్తవమే అయినప్పటికీ కెనడా దేశస్థుడు మైక్ స్పెన్సర్ 23 ఏళ్ల పాటు 195 దేశాలు తిరిగిన రికార్డు, ఆయన అనుభవాల గురించి తెలుసుకోవడం తనకు ఎక్కువ స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. ఆయనకంటే డాన్ పారిష్ రెండు దేశాలు తక్కువ తిరిగినప్పటికీ ఎక్కువ ప్రదేశాలను సందర్శించారు. -
పారిస్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
పారిస్ : మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఫ్రాన్స్‌లో అడుగుపెట్టిన ఆయనకి అక్కడి అధికారులు సాదర స్వాగతం పలికారు. తన తొమ్మిది రోజుల విదేశీ యాత్రలో భాగంగా మోదీ తొలుత ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్నారు. నాలుగురోజుల పర్యటనలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేతోపాటు అక్కడి వ్యాపార వర్గాలతో మోదీ భేటీ అవుతారు. పౌర అణు ఇంధనం, రక్షణ తదితర రంగాల్లో ఆ దేశాలతో భారత్ ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముంది. ఈ పర్యటనలో మోదీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య బంధాన్ని కొత్త పుంతలు తొక్కించాలని భావిస్తున్నారు. ఒబామా భారత పర్యటనలో చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించినట్లే ఫ్రాన్స్‌లో 'నావ్ పే' చర్చ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మోదీ, హోలాండేలిద్దరూ కలసి పడవలో ప్రయాణిస్తూ సమాలోచనలు జరపనున్నారు. అక్కడి మొదటి ప్రపంచ యుద్ధ స్మారకాన్ని సందర్శించి, అప్పట్లో ఫ్రాన్స్ తరఫున పోరాడి అమరులైన పది వేల మంది భారత సైనికులకు నివాళులర్పించనున్నారు. యునెస్కో ప్రధాన కార్యాలయం, ఎయిర్‌బస్ కంపెనీ, ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీలనూ మోదీ సందర్శిస్తారు. ఫ్రాన్స్ పర్యటన అనంతరం మోదీ జర్మనీ, ఆతర్వాత కెనడాలో పర్యటనకు వెళతారు.