
ప్రస్తుతం ఓటీటీ వచ్చాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్‌ను సినీ ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా సబ్ టైటిల్స్‌తోనే చూసేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే రోజు రోజుకు కొత్త కొత్త కంటెంట్‌ను ఓటీటీలు అందిస్తున్నాయి. అదే సమయంలో క్రైమ్ థ్రిల్లర్ లాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తాజాగా కంటెంట్‌తోనే యధార్థ సంఘటనల ఆధారంగా సరికొత్త క్రైమ్ డాక్యుమెంటరీని తెరకెక్కించారు.
క్రైమ్ సీన్ బెర్లిన్: నైట్ లైఫ్ కిల్లర్ అనే పేరుతో బెర్లిన్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించారు. ఈ డాక్యుమెంటరీ సిరీస్ రహస్యమైన, విచిత్రమైన హత్యల కేసుల ఆధారంగా తెరకెక్కించారు. ఈ రియల్ క్రైమ్ కథకు జాన్ జాబీల్, కరోలిన్ షాపర్ దర్శకత్వం వహించారు. ఈ ఆసక్తికర డాక్యుమెంటరీ సిరీస్ త్వరలోనే ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
ఏప్రిల్ 3వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే 2012లో జరిగిన చీకటి సంఘటనల గురించి అవగాహన కల్పించడానికి ఈ సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మేకర్స్. క్రైమ్ సీన్ బెర్లిన్: నైట్‌లైఫ్ కిల్లర్‌లో కేవలం మూడు సీజన్లు మాత్రమే ఉన్నాయి. ఈ సిరీస్‌లో రిక్ హబ్నర్, ట్రిస్టన్ బమ్, కార్నెలియా వెర్నర్ ప్రధాన పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment