సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఫొటోలు రాహుల్ గాంధీకి తలనొప్పిగా మారాయి. రాహుల్ గాంధీ వైవిధ్య భరిత హావభావాలు’ అంటూ జర్మనీ పార్లమెంట్‌లో రాహుల్ దిగిన నాలుగు ఫోటోలను ట్వీటర్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడా ఫోటోలు సోషల్ మీడీయాలో వైరలయ్యాయి. ఆ ఫోటోలపై నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు. కామేడీ కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
కాంగ్రెస్ చీఫ్ ప్రస్తుతం జర్మనీలో పర్యటిస్తున్నారు. ఆ దేశ పార్లమెంటును రాహుల్ సందర్శించారు. ఈ సందర్భంగా తీసిన కొన్ని ఫొటోలను కాంగ్రెస్ ట్విట్టర్‌లో పోస్టు చేసి వాటికి ‘రాహుల్ వైవిధ్య భరిత హావభావాలు’ అని క్యాప్షన్ తగిలించింది.
రాహుల్ సీరియస్‌గా కిందికి, పైకి, పక్కకి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఆ పోటోలు ఉన్నాయి. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మనసారా నవ్వించినందుకు రాహుల్‌కు థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నానని ఒకరంటే, ప్రపంచంలో ఎక్కడున్నా రాహుల్ నవ్విస్తూనే ఉంటారని మరొకరు కామెంట్ చేశారు. ‘పప్పు స్టేజ్ ఎక్కాక ఏం మాట్లాడాలో తెలియడం లేదు’, దేశం గురించి మీ భవిష్యత్ ప్రణాళిక ఏమిటి? అన్న ప్రజల ప్రశ్నకు రాహుల్ రియాక్షన్ ఇదీ.. అంటూ కొందరు కామెంట్ చేయగా, కాంగ్రెస్ పార్టీ తనను తానే ట్రోల్ చేసుకుంటోంది అని మరికొందరు కామెంట్ చేశారు. ‘వైవా పరీక్షల్లో నా పరిస్థితీ ఇదే’ అని మరొకరు పేర్కొన్నారు. 'రాహుల్‌ను తన సొంత సోషల్ మీడియానే దెబ్బతీసేలా ఉంది', ఏం మాట్లాడాలో తెలియక రాహుల్ అలా ఫోజు ఇచ్చారని అని మరొకరు కామెంట్ చేశారు.
The many facets of Rahul Gandhi. #Bundestag pic.twitter.com/MtoNs1TxjO
— Congress (@INCIndia) August 23, 2018
Comments
Please login to add a commentAdd a comment