ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే దానిపై ప్రస్తుతానికి ఎవరి దగ్గరా సమాధానం లేదు. ఈ ఉగ్రవాద సంస్థను తుడిచిపెట్టితీరుతామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. ఈ నేపధ్యంలో జరుగుతున్న పోరులో ఇప్పటికే వేలాది మంది మరణించారు. నిజానికి ఇజ్రాయెల్ ఒక చిన్న దేశం. ఇక్కడ యూదులు అత్యధిక సంఖ్యలో నివసిస్తున్నారు. అంటే ఇది యూదుల దేశం. ఈ యుద్ధం నేపధ్యంలో యూదులకు సంబంధించి అనేక విషయాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత మేధావిగా గుర్తింపు పొందిన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ యూదు అనే విషయం చాలామందికి తెలియదు. హిట్లర్ పాలనకాలంలో ఐన్‌స్టీన్ తన ప్రాణాలను కాపాడుకునేందుకు జర్మనీ నుంచి పారిపోవాల్సి వచ్చింది.
పూర్వం రోజుల్లో యూరప్‌లో యూదులు జనాభా అత్యధికంగా ఉండేది. జర్మనీలో లక్షలాది మంది యూదులు ఉండేవారు. వారిలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కూడా ఒకరు. అడాల్ఫ్ హిట్లర్ ఎన్నికైన తరువాత జర్మనీలో జాతీయవాద భావన తీవ్రతరం అయ్యింది. ఈ నేపధ్యంలో ఐరోపాయేతర ప్రజలపై నిరసనలు మొదలయ్యాయి. జర్మనీలో యూదులపై ద్వేషం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. దీనికి ప్రధానకారణం క్రైస్తవులకు, యూదులకు మధ్య వీపరీతమైన ఘర్షణలు జరిగాయి. యూరప్ లో ఉన్న క్రైస్తవులు బలంగా నమ్మేదేంటంటే.. క్రీస్తును శిలువ వేయడంలో యూదుల పాత్ర ఉందని నమ్మేవారట. దాంతో పాటు యూదులు వ్యాపారంలో బలంగా ఉండడం, ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉండడంతో.. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి యూరోపియన్లు ఎక్కువగా యూదులను ద్వేషించేవారట. చరిత్రలో రకరకాల కారణాలు పేర్కొన్నప్పటికీ.. యూదులను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారన్నదానికి మతపరమైన బేధమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది.
జర్మనీలో హిట్లర్ మారణహోమం సృష్టించడంతో చాలా మంది యూదులు తమ ప్రాణాలను అరచేతపట్టుకుని ఇతర దేశాలకు పారిపోయారు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌లో కూడా ఇదే భయం నెలకొంది. తాను జర్మనీలో ఉంటే ముప్పు తప్పదని భావించి, అమెరికా వెళ్లి, అక్కడ ఆశ్రయం పొందారు. అయితే అప్పటికే ఐన్‌స్టీన్‌పేరు విజ్ఞాన ప్రపంచంలో మారుమోగితోంది. ఇతనే కాకుండా జర్మనీకి చెందిన ఎందరో మేథావులు, శాస్త్రవేత్తలు కూడా అమెరికాలో తలదాచుకున్నారు. 1941 నుంచి 1945 వరకు జరిగిన మారణహోమంలో హిట్లర్ దాదాపు 60 లక్షల మంది యూదులను హత్య చేయించాని, వీరిలో ఎక్కువ మంది యూదులని చరిత్ర చెబుతోంది.
ప్రస్తుతం యూదుల జనాభా ప్రపంచవ్యాప్తంగా 2 కోట్లకు తక్కువగానే ఉంది. వీరిలో ఎక్కువ మంది ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నారు. అలాగే యూదులు అమెరికా, కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్‌లలో కూడా ఉంటున్నారు. ఇజ్రాయెల్ ప్రస్తుత జనాభా 93 లక్షల 60 వేలు. అంటే మన హైదరాబాద్ కంటే తక్కువ జనాభా ఉంది. ఇందులో యూదుల సంఖ్య 72 లక్షల 48వేల మంది. ఇతరులు వేర్వేరు మతాలకు సంబంధించిన వారు ఇజ్రాయెల్ లో స్థిరపడి ఉన్నారు. 2020 జనగణన ప్రకారం అమెరికాలో దాదాపు 80 లక్షల మంది యూదులున్నారు. పైగా అమెరికాలో అత్యున్నత వర్గంలో ఒకరిగా యూదులు ఉన్నారు. రాజకీయాలు, వర్తక, వాణిజ్యంలలో అత్యంత ప్రభావశీలురుగా యూదులున్నారు.
ఇది కూడా చదవండి: భారత్ చర్యతో వారి జీవితాలు దుర్భరం: ట్రూడో
Comments
Please login to add a commentAdd a comment