Railway Worker Saved the Childs Life - Sakshi
Sakshi News home page

పట్టుతప్పి పట్టాలపై పిల్లాడు.. క్షణాల్లో స్పందించిన కార్మికుడు.. కన్నార్పనీయని వీడియో!

Published Sun, Aug 13 2023 11:58 AM | Last Updated on Sun, Aug 13 2023 12:44 PM

Railway Worker Saved the Childs Life - Sakshi

ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు భగవంతుడు ఎవరినో ఒకరిని పంపిస్తాడని అంటారు. ఇది నిజమని అప్పుడప్పుడు నిరూపితమవుతుంటుంది. తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఒక వీడియో దీనిని నిరూపిస్తోంది. ఈ వీడియోలో ఒక పిల్లాడు తల్లి చేతుల నుంచి జారి రైలు పట్టాలపై పడిపోవడం, సరిగ్గా అదే సమయానికి రైలు వస్తుండటం.. ఇంతలోనే ఒక  వ్యక్తి ఆ పిల్లాడిని కాపాడటం కనిపిస్తుంది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ముందుగా రైల్వే స్టేషన్‌ వద్ద ఒక పిల్లాడు తన తల్లి చేయి పట్టుకుని నడుస్తుండటాన్ని గమనించవచ్చు. కొంచెం ముందుకు వెళ్లాక ఆ పిల్లాడు తల్లి చేతుల నుంచి జారి పట్టాలపై పడిపోతాడు. దీనిని గమనించిన ఆ పిల్లాడి తల్లి గాభరా పడిపోతూ ఉంటుంది. పిల్లవాడిని పైకి లాగేందుకు తన చేయి అందించే ప్రయత్నం చేస్తుంటుంది. అయితే ఆ మార్గంలో రైలు వస్తుండటంతో ఆమె భయపడిపోతుంది. 

ఇంతలో మరోవైపు నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి,  ఆ పిల్లాడిని ప్లాట్‌ఫారంపైకి ఎక్కిస్తాడు. తాను కూడా వేగంగా ప్లాట్‌ఫారంపైకి ఎక్కిపోతాడు. ఇదంతా రెండుమూడు సెకెన్లలో జరిగిపోతుంది. ఇంతలో రైలు అత్యంత వేగంగా ఆ పట్టాల మీదుగా వెళ్లిపోవడం వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో @Suhan Raza పేరుతో షేర్‌ అయ్యింది. క్యాప్షన్‌లో ఈ రైల్వే ఉద్యోగి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పిల్లాడిని కాపాడినందుకు అతనికి హ్యాట్సాఫ్‌ అని రాశారు. 
ఇది కూడా చదవండి: అందమైన గడ్డం ఆమెకే సొంతం.. మరో గడ్డం బామ్మతో తలపడి..
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement