Albert Einstein
-
ఐన్‌స్టీన్, హాకింగ్స్లనే మించాడు!
ఒక రంగంలో రాణించడాన్నే గొప్పగా చూసే రోజులివి. భారతీయ మూలాలున్న ఈ బ్రిటిష్ బాలుడు మాత్రం బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలిచి శెభాష్ అనిపించుకుంటున్నాడు. లండన్‌లోని హాన్స్లో ప్రాంతంలో నివసించే క్రిష్ అరోరాకు పియానో అంటే ఇష్టం. పియానో నేర్చుకుని ఏకంగా గ్రేడ్ 7 సరి్టఫికేట్ సాధించాడు. పియానో ఎంతబాగా వాయించగలడో చదరంగం అంతే బాగా ఆడగలడు. మానవ మేధస్సుకు కొలమానంగా చూసే ఇంటెలిజెంట్ కోషెంట్ (ఐక్యూ) పరీక్షలో ఏకంగా 162 స్కోర్ సాధించి ఔరా అనిపించాడు. ఇంతటి స్కోరు ప్రఖ్యాత భౌతిక శాస్తవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, విఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్‌కు కూడా సాధ్యపడకపోవడం విశేషం! ఈ అరుదైన ఫీట్‌తో క్రిష్ ప్రపంచంలోనే అత్యంత మేధావులైన ఒక శాతం మందిలో స్థానం సంపాదించాడని బ్రిటన్ వార్తాసంస్థ ‘మెట్రో’ పేర్కొంది. అత్యంత మేధావుల సంఘమైన ‘మెన్సా’లోనూ క్రిష్ చోటు సాధించాడు.బ్రిటన్‌లోనే అత్యుత్తమ బోధన ప్రమాణాలు పాటించే క్వీన్ ఎలిజబెత్ గ్రామర్ స్కూల్లో వచ్చే ఏడాది చేరబోతున్నాడు. ‘‘11వ క్లాస్ సిలబస్ చాలా ఈజీగా ఉంది. పై తరగతులు నా సామర్థ్యాలకు సవాళ్లు విసురుతాయనుకుంటా. ప్రైమరీ స్కూల్ బోర్ కొట్టింది. ఎప్పుడూ కూడికలు, తీసివేతలు, గుణింతాలు, వాక్య నిర్మాణాలే. ఇప్పుడిక బీజగణితం పట్టుబడతా’’ అని క్రిష్ నవ్వుతూ చెప్పాడు. క్రిష్ తండ్రి మౌళి, తల్లి నిశ్చల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. నాలుగేళ్లప్పుడే తమవాడి అమోఘమైన జ్ఞాపకశక్తి, తెలివితేటలను గుర్తించామని వారు చెప్పారు. ‘‘నాలుగేళ్లకే అనర్గళంగా మాట్లాడేవాడు. తప్పుల్లేకుండా స్పెల్లింగులు చెప్పేవాడు. చక్కగా ఉచ్చరించేవాడు. ఓసారి నా పక్కన మూడు గంటలు కూర్చుని గణిత పుస్తకమంతా కంఠస్థం చేశాడు. ఏకసంథాగ్రాహి. నాలుగేళ్లకే దశాంశ స్థానాలకు లెక్కలు చేయడం మొదలెట్టి ఆశ్చర్యపరిచాడు. ఎనిమిదేళ్ల వయసులో ఒక ఏడాది సిలబస్‌ను ఒక్క రోజులో చదివేశాడు. ఏంచేసినా అత్యున్నత స్థాయి ప్రావీణ్యం చూపాలని ఆరాటపడతాడు’’ అని తల్లిదండ్రులు చెప్పారు.ప్రఖ్యాత ట్రినిటీ కాలేజ్‌లోనూ.. పాఠశాలలో పుస్తకాలతో కుస్తీ పట్టడం మాత్రమే కాదు సంగీతం అన్నా క్రిష్‌కు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే పియానో నేర్చుకున్నాడు. పియానిస్ట్‌గా ఎన్నో అవార్డ్లు అందుకున్నాడు. పియానో వాయించడానికి సంబంధించి కేవలం ఆరు నెలల్లో నాలుగు గ్రేడ్లు పూర్తిచేశాడు. సంగీతానికి సంబంధించి అత్యున్నత కళాక్షేత్రంగా పేరొందిన ట్రినిటీ కాలేజ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సభ్యత్వం సాధించాడు. ప్రస్తుతం గ్రేడ్ 7 పియానో సరి్టఫికేట్ పొందాడు. తన కంటే వయసులో పెద్దవాళ్లతో పోటీపడుతూ వాళ్లను ఓడించి పతకాల పంట పండిస్తున్నాడు. వెస్ట్ లండన్‌లో ఎన్నో పోటీల్లో పాల్గొన్నాడు. హిట్ సంగీతాన్ని వాయించేటప్పుడు చాలా మంది ఎదురుగా సంబంధిత నోట్‌ను రాసుకుంటారు. క్రిష్ ఎలాంటి నోట్ లేకుండానే అద్భుతంగా వాయించి ప్రేక్షకులు ప్రశంసలు పొందిన సందర్భాలు ఎన్నో. ‘‘ సంగీత పోటీల్లో నోట్స్ లేదని భయపడను. తప్పు చేయబోనని నాకు బాగా తెలుసు’’ అని క్రిష్ గతంలో చెప్పాడు. బాలమేధావి ‘యంగ్ షెల్డన్’ వెబ్ సిరీస్‌ను బాగా ఇష్టపడే క్రిష్ ఎక్కువగా పజిల్స్, పదవినోదం లాంటి వాటిని పరిష్కరించడం అలవాటు. చదరంగం మీద ఆసక్తి చూపడంతో ఒక టీచర్‌ను పురమాయించి నేరి్పంచారు. అయితే ఆ టీచర్నే తరచూ ఓడిస్తూ తన అద్భుత మేధను ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నాడు క్రిష్. – లండన్ -
అందమైన జీవితం కోసం ఐన్ స్టీన్ సూత్రాలు
ఐన్ స్టీన్.. ఈ పేరు వినగానే చింపిరి జుత్తుతో కనిపించే ఓ పెద్దాయన గుర్తొస్తాడు కదా. కాస్తంత చదువుకొని ఉంటే శక్తి నిత్యత్వ సూత్రం E = mc² గుర్తొస్తుంది. ఇంకా.. సాధారణ సాపేక్షత సిద్ధాంతం గుర్తొస్తుంది. 20వ శతాబ్దపు మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఐన్ స్టీన్ కేవలం భౌతికశాస్త్రానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆయన శాంతికాముకుడు, రాజకీయ కార్యకర్త, చురుకైన జాత్యహంకార వ్యతిరేకి, నోబెల్ బహుమతి గ్రహీత. ఆయన జీవితం నుంచి, మిత్రులకు రాసిన ఉత్తర ప్రత్యుత్తరాల నుంచి ఆయన చెప్పిన జీవన సూత్రాలను ఈరోజు తెలుసుకుందాం. మీ సమయాన్ని, కృషిని ముఖ్యమైన విషయాలపై వెచ్చించండి మనం ఏదైనా పని చేయాలంటే శక్తిని వెచ్చించాలి. అలాగే రోజువారీ నిర్ణయాలు తీసుకోవడానికి మానసిక శక్తిని వెచ్చించాలి. ఉదయం ఏ బ్రేక్ ఫాస్ట్ తినాలనే దాని దగ్గర్నుంచి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఆఫీస్ కు ఎలా వెళ్లాలి లాంటి వాటికోసం మానసిక శక్తిని వెచ్చించడం వల్ల ఉత్పాదక శక్తి తగ్గుతుంది. అందుకే చాలామంది టాప్ అచీవర్స్ ఇలాంటి చిన్నచిన్న విషయాలకు ప్రాథాన్యం ఇవ్వరు. ఉదాహరణకు ఐన్ స్టీన్ కు మంగలి దగ్గరకు సమయం వృథా చేసుకోవడం ఇష్టం ఉండదు, అందుకే ఆ చింపిరి జుట్టు. ఇక ఆపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఎప్పడూ బ్లూ జీన్స్ మాత్రమే ధరిస్తాడు. అమెజాన్ జెఫ్ బెజోస్, ఫేస్బుక్ జుకర్ బర్గ్ కూడా అంతే. ఏ డ్రెస్ వేసుకోవాలనే నిర్ణయం కోసం తమ మానసిక శక్తిని వెచ్చించకుండా ముఖ్యమైన నిర్ణయాల కోసం ఆదా చేసుకుంటారు. ఎంత కష్టమైనప్పటికీ మీరు ఇష్టపడే పనులే చేయండి ఐన్ స్టీన్ అంటే కేవలం భౌతిక శాస్త్రం మాత్రమే కాదు. ఆయన వయోలిన్ వాయిస్తాడు. పడవ కూడా నడుపుతాడు. తనకు మనసు బాలేనప్పుడు, ఏదైనా సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు ఆయనీ పనులు చేస్తాడు. అలాగని ఐన్ స్టీన్ గొప్ప సెయిలర్ కాదు. కనీసం ఈత కూడా రాదు. పడవ బోల్తాకొట్టి మునిగిపోతుంటే జాలర్లు కాపాడిన సందర్భాలున్నాయి. అయినా ఎందుకు సెయిలింగ్ చేస్తాడంటే... ‘‘సముద్రంలో విహారయాత్ర ప్రశాంతతనిస్తుంది. విభిన్న దృక్కోణాలనుండి ఆలోచించడానికి అద్భుత అవకాశాలు కల్పిస్తుంది’’ అని ఆయనే చెప్పాడు. అందుకే మీ సబ్జెక్ట్ తో పాటు మీరు ఆనందించే ఒక హాబీని అలవాటు చేసుకోండి. అందులో మీరేం నిష్ణాతులు కావాల్సిన అవసరంలేదు. అది మీకు కావాల్సిన మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఫలితంగా మీ ఒత్తిడి తగ్గుతుంది, మీ రంగంలో ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారు. పజిల్ మైండ్‌సెట్‌ను కలిగి ఉండండి. జీవితంలో అనేకానేక సమస్యలు వస్తుంటాయి. వాటికి భయపడి పారిపోతే జీవితం దుర్భరంగా మారుతుంది. సమస్యలను పజిల్ లా చూసి పరిష్కరించుకునే మైండ్ సెట్ ఉంటే వాటిని పరిష్కరించడానికి మీరు కొత్త విధానం గురించి ఆలోచించవచ్చు. ఐన్‌స్టీన్ అలాగే చేసేవాడు. తనకు ఎదురైన ప్రతి కష్టాన్ని ఒక పజిల్‌గా చూసి పరిష్కరించుకునేవాడు. ఉదాహరణకు ఐన్ స్టీన్ కు ముందు చాలామంది శాస్త్రవేత్తలు కాంతి వేగంతో కదిలే వస్తువులను చూశారు. కానీ ఐన్‌స్టీన్ మాత్రమే దాన్ని ఒక పజిల్ లా చూశాడు. సాపేక్ష సిద్ధాంతంతో పరిష్కరించాడు. అందుకే తప్పొప్పుల గురించి ఆలోచించకుండా పజిల్ పరిష్కారంపై దృష్టి పెట్టండి. మిమ్మల్ని ఆకర్షించే విషయాల గురించి లోతుగా ఆలోచించండి ‘‘మీకు ఆసక్తిని కలిగించే ప్రశ్న ఎదురైతే సంవత్సరాల తరబడి దాన్నే పట్టుకుని ఉండండి. లోతుగా అన్వేషించండి. దానిపై పట్టు సాధించండి. అంతేతప్ప సులువుగా అందే విజయాలతో సంతృప్తి చెందకండి’’ అని ఐన్ స్టీన్ కూడా ఒక లేఖలో చెప్పారు. అంతేకాదు.. ‘‘సమస్య క్లిష్టతను చూసి కుంగిపోకూడదు. ప్రయత్నిస్తే దేన్నయినా అర్థం చేసుకోవడం కష్టమేం కాదు. కావాల్సిందల్లా పట్టువిడవని ప్రయత్నం మాత్రమే’’ అని తన స్నేహితుడు డేవిడ్ బోమ్ కు రాసిన ఉత్తరంలో చెప్పాడు. ఉదాహరణకు నేను ఎస్వీ యూనివర్సిటీలో చదివేటప్పుడు ఒక వ్యక్తిని కలిశాను. ఆయన ప్రపంచంలో అత్యధిక డిగ్రీలున్న వ్యక్తి. కానీ ఏ ఒక్క సబ్జెక్ట్ లోనూ లోతైన అవగాహన లేదు. దీన్నే హారిజంటల్ లెర్నింగ్ అంటారు. అంటే.. అన్నీ పైపైన నేర్చుకోవడం. నేనేమో పాతికేళ్లుగా ‘జీనియస్’ అనే ఒకే పదాన్ని పట్టుకుని ఉన్నా. దాని పూర్వాపరాలు, లోతుపాతులు అర్థం చేసుకునేందుకు, పిల్లల్లోని జీనియస్ ను వెలికితీసే మార్గాలు కనుగొనేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నా. దీన్నే వర్టికల్ లెర్నింగ్ అవసరం. ఏ రంగంలోనైనా పట్టు సాధించి, పేరు ప్రఖ్యాతులు సాధించాలంటే ఈ వర్టికల్ లెర్నింగ్ అవసరం. రాజకీయాలు మిమ్మల్ని ఆవేశంతో లేదా నిరాశతో నింపనివ్వవద్దు. మనం రాజకీయాలకు దూరంగా ఉన్నా, రాజకీయాలు మనల్ని నిత్యం అనేక విధాలుగా ప్రభావితం చేస్తూనే ఉంటాయి. అలాగని ఆ రాజకీయాల్లో మునిగి, మీ లక్ష్యాన్ని జారవిడుచుకోకండి. రెండో ప్రపంచయుద్ధం అనంతరం ఇజ్రాయిల్ అధ్యక్ష బాధ్యతలు తీసుకోమని ఐన్ స్టీన్ ను కోరారు. ‘‘రాజకీయాలు తాత్కాలికం. కానీ నా ఫార్ములాలు శాశ్వతం’’ అంటూ ఆ ఆఫర్ ను తిరస్కరించాడు. జీవితం ప్రశాంతంగా సాగాలంటే ఈ సూత్రాన్ని పాటించాలి. సోషల్ మీడియా కాలంలో ఇది చాలా అవసరం. స్నేహితుడు, పరిచయస్తుడు లేదా పూర్తిగా అపరిచితుడు చేసిన పోస్ట్ వల్ల ఎలా కోపంతో ఊగిపోయామో లేదా గంటలు గంటలు వాదించామో ఒక్కసారి గుర్తుచేసుకోండి. దానివల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదని, ఎవరి అభిప్రాయమూ మారదని తెలిసినా అలా సమయం వృథా చేస్తూనే ఉంటాం. మీరు రాజకీయాల్లో రాణించాలనుకుంటే అందులో సమయం వెచ్చించండి, లేదంటే దాని మానాన దాన్ని సాగనివ్వండి. మీరు ప్రశాంతంగా ఉండండి. అధికారానికి గుడ్డి విధేయత సత్యానికి అతి పెద్ద శత్రువు నోబెల్ గ్రహీత జోహన్నెస్ స్టార్క్ వంటివారు కూడా ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని వ్యతిరేకించడంతోపాటు, దానికి వ్యతిరేకంగా ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. దానికి జాతీయవాదాన్ని చేర్చి ఐన్ స్టీన్ పై దాడి ప్రారంభించారు. ఈ కుతంత్రాలు హాస్యాస్పదమైనవి, హానిచేయనివిగా ఐన్ స్టీన్ మొదట భావించినప్పటికీ, వాటిని తట్టుకోలేక అమెరికా పారిపోవాల్సి వచ్చింది. అందుకే "అధికారానికి గుడ్డిగా విధేయత చూపడం సత్యానికి అతిపెద్ద శత్రువు" అని చెప్పాడు. సోషల్ మీడియా కాలంలో, ఫేక్ న్యూస్ యుగంలో ఇది మరింత ముఖ్యమైనది. బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు, అధికారంలో ఉన్నవారి చుట్టూ మేధావులు కూడా చేరి భజనలు చేయడం మీరు గమనించే ఉంటారు. అలా చేయడం ‘మంద మనస్తత్వం’, ‘సామూహిక పిచ్చితనం’ అంటాడు ఐన్ స్టీన్. అందుకే అధికారాన్ని గుడ్డిగా విధేయత చూపకండి. విమర్శనాత్మక దృష్టితో చూడండి. సైన్స్, సత్యం, విద్య అందరికీ... కొందరికి మాత్రమే కాదు 1930లలో వలస వెళ్లి 1940లో పౌరసత్వం పొందిన తర్వాత కూడా ఐన్‌స్టీన్ తరచుగా యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించేవాడు. బానిసత్వం, జాత్యహంకారానికి వ్యతిరేకంగా గొంతు విప్పేవాడు. అందుకే FBI 1932లో ఐన్‌స్టీన్‌పై ఒక ఫైల్‌ను ప్రారంభించింది. అయినా ఆయన అదరలేదు, బెదరలేదు. అమెరికాలోని తొలి నల్లజాతి కళాశాల అయిన లింకన్ యూనివర్శిటీని సందర్శించి ఉపన్యాసాలు ఇచ్చాడు. "సత్యం కోసం శోధించే హక్కు, సత్యమని భావించే వాటిని ప్రచురించి, బోధించే హక్కు" ఉండాలని ఉద్యమించాడు. సైన్స్ ద్వారా వెలికితీసిన ఆవిష్కరణలు, ఫార్ములాలు ఏ జాతికి, దేశానికి లేదా వర్గానికి చెందినవి కావు, మానవాళి అందరికీ చెందినవని ఎలుగెత్తి చాటాడు. మన పిల్లలు గ్లోబల్ సిటిజన్స్ గా మారుతున్న కాలంలో ఈ దృక్పథం మరింత అవసరం. సైకాలజిస్ట్ విశేష్ 8019 000066 psy.vishesh@gmail.com -
యూదుడైన ఐన్‌స్టీన్.. హిట్లర్ బారి నుంచి ఎలా తప్పించుకున్నాడు?
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే దానిపై ప్రస్తుతానికి ఎవరి దగ్గరా సమాధానం లేదు. ఈ ఉగ్రవాద సంస్థను తుడిచిపెట్టితీరుతామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. ఈ నేపధ్యంలో జరుగుతున్న పోరులో ఇప్పటికే వేలాది మంది మరణించారు. నిజానికి ఇజ్రాయెల్ ఒక చిన్న దేశం. ఇక్కడ యూదులు అత్యధిక సంఖ్యలో నివసిస్తున్నారు. అంటే ఇది యూదుల దేశం. ఈ యుద్ధం నేపధ్యంలో యూదులకు సంబంధించి అనేక విషయాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత మేధావిగా గుర్తింపు పొందిన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ యూదు అనే విషయం చాలామందికి తెలియదు. హిట్లర్ పాలనకాలంలో ఐన్‌స్టీన్ తన ప్రాణాలను కాపాడుకునేందుకు జర్మనీ నుంచి పారిపోవాల్సి వచ్చింది. పూర్వం రోజుల్లో యూరప్‌లో యూదులు జనాభా అత్యధికంగా ఉండేది. జర్మనీలో లక్షలాది మంది యూదులు ఉండేవారు. వారిలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కూడా ఒకరు. అడాల్ఫ్ హిట్లర్ ఎన్నికైన తరువాత జర్మనీలో జాతీయవాద భావన తీవ్రతరం అయ్యింది. ఈ నేపధ్యంలో ఐరోపాయేతర ప్రజలపై నిరసనలు మొదలయ్యాయి. జర్మనీలో యూదులపై ద్వేషం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. దీనికి ప్రధానకారణం క్రైస్తవులకు, యూదులకు మధ్య వీపరీతమైన ఘర్షణలు జరిగాయి. యూరప్ లో ఉన్న క్రైస్తవులు బలంగా నమ్మేదేంటంటే.. క్రీస్తును శిలువ వేయడంలో యూదుల పాత్ర ఉందని నమ్మేవారట. దాంతో పాటు యూదులు వ్యాపారంలో బలంగా ఉండడం, ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉండడంతో.. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి యూరోపియన్లు ఎక్కువగా యూదులను ద్వేషించేవారట. చరిత్రలో రకరకాల కారణాలు పేర్కొన్నప్పటికీ.. యూదులను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారన్నదానికి మతపరమైన బేధమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. జర్మనీలో హిట్లర్ మారణహోమం సృష్టించడంతో చాలా మంది యూదులు తమ ప్రాణాలను అరచేతపట్టుకుని ఇతర దేశాలకు పారిపోయారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్లో కూడా ఇదే భయం నెలకొంది. తాను జర్మనీలో ఉంటే ముప్పు తప్పదని భావించి, అమెరికా వెళ్లి, అక్కడ ఆశ్రయం పొందారు. అయితే అప్పటికే ఐన్స్టీన్పేరు విజ్ఞాన ప్రపంచంలో మారుమోగితోంది. ఇతనే కాకుండా జర్మనీకి చెందిన ఎందరో మేథావులు, శాస్త్రవేత్తలు కూడా అమెరికాలో తలదాచుకున్నారు. 1941 నుంచి 1945 వరకు జరిగిన మారణహోమంలో హిట్లర్ దాదాపు 60 లక్షల మంది యూదులను హత్య చేయించాని, వీరిలో ఎక్కువ మంది యూదులని చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం యూదుల జనాభా ప్రపంచవ్యాప్తంగా 2 కోట్లకు తక్కువగానే ఉంది. వీరిలో ఎక్కువ మంది ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నారు. అలాగే యూదులు అమెరికా, కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్లలో కూడా ఉంటున్నారు. ఇజ్రాయెల్ ప్రస్తుత జనాభా 93 లక్షల 60 వేలు. అంటే మన హైదరాబాద్ కంటే తక్కువ జనాభా ఉంది. ఇందులో యూదుల సంఖ్య 72 లక్షల 48వేల మంది. ఇతరులు వేర్వేరు మతాలకు సంబంధించిన వారు ఇజ్రాయెల్ లో స్థిరపడి ఉన్నారు. 2020 జనగణన ప్రకారం అమెరికాలో దాదాపు 80 లక్షల మంది యూదులున్నారు. పైగా అమెరికాలో అత్యున్నత వర్గంలో ఒకరిగా యూదులు ఉన్నారు. రాజకీయాలు, వర్తక, వాణిజ్యంలలో అత్యంత ప్రభావశీలురుగా యూదులున్నారు. ఇది కూడా చదవండి: భారత్ చర్యతో వారి జీవితాలు దుర్భరం: ట్రూడో -
అజ్ఞానం కంటే అహంకారం ప్రమాదం
సంవత్సరం ఇప్పుడే ప్రారంభమైంది. మనం ఇప్పటికీ కాసింత సరదాగా ఉండేందుకు అర్హులమే అని నా అభిప్రాయం. నిస్సందేహంగా మిగిలిన 357 రోజుల్లో అంటే మున్ముందు జరిగే కార్యక్రమాలు మనల్ని ఉద్వేగంతో ముంచెత్తుతాయి. కానీ ఇప్పటికైతే మనం కాస్త తేలిగ్గానే ఉండగలం. కాబట్టి ఇంటర్నెట్ నుంచి నేను కూడబెట్టిన కొన్ని రత్నాలను మీతో పంచుకోనివ్వండి. నాకు బాగా నచ్చే అంశాల్లో ఒకటి అల్బర్ట్ ఐన్‌స్టీన్ పలుకులు. ‘ఈ=ఎంసీ స్క్వేర్’ అనే ఆయన సుప్రసిద్ధ సూత్రీకరణను నేను ఇప్పటికీ అర్థం చేసుకోలేక పోయాను. కానీ ఆయనకు సంబంధించిన ఇతర వివే కంతో నేను అనుసరించి సాగుతాను. ఆయనకు చెందిన ఈ కోణం మనకు పెద్దగా తెలియకపోవడం సిగ్గుచేటు. కాబట్టి ఈరోజు మనకు పెద్దగా తెలియని ఐన్‌స్టీన్ గురించి మీకు చెప్పనివ్వండి. ఐన్‌స్టీన్ చెప్పారంటూ కీర్తిస్తున్న కొన్ని అద్భుతమైన విషయాల్లోని విశేషమైన ఉదాహరణలతో నేను దీన్ని ప్రారంభిస్తాను. ఈ సమయంలో నా మనసును విశే షంగా ఆకర్షించిన ఉల్లేఖనలను నేను ఎంపిక చేసుకుంటాను. ‘అజ్ఞానం కంటే ప్రమాదకరమైన ఒకే ఒక్క అంశం ఏమిటంటే అహంకారం’. ‘ఏ మతిహీనుడైనా తెలుసుకోవచ్చు, విషయమేమిటంటే దాన్ని అర్థం చేసు కోవాలి’. ‘బలహీనులు ప్రతీకారం తీర్చుకుంటారు, బలవంతులు క్షమిస్తారు, తెలివైనవారు పట్టించుకోకుండా ఉంటారు’. ‘నేను నేర్చుకునేదానికి అడ్డుతగిలే ఒకే ఒక విషయం ఏమిటంటే, అది నా చదువు మాత్రమే’. ‘మూర్ఖత్వానికీ, మేధాతనానికీ మధ్య వ్యత్యాసం ఏమిటంటే, మేధాతనానికి దానివైన హద్దులుంటాయి’. ‘విజ్ఞానానికి ఏకైక వనరు అనుభవమే’. నాకు బాగా ఇష్టమైనవాటిల్లో రెండు మరీ సార వంతంగా ఉండి, ముక్కుసూటిగా ఉంటాయి. మొదటిది ఇదీ: ‘మీరు దాన్ని సులభంగా వివరించలేనట్లయితే, దాన్ని మీరు తగినంత అర్థం చేసుకోలేరు’. రెండోది ఇదీ: ‘చిలిపితనం వర్ధిల్లాలి! ఈ ప్రపంచంలో ఇదే నన్ను సంరక్షించే దేవదూత’. ఇప్పుడు ఐన్‌స్టీన్ చెప్పినవాటిల్లో నిర్దిష్ట విభాగాలకు చెందిన వ్యక్తులకు వర్తించే అంశాలకు వస్తాను. ఉదాహరణకు, మన రాజకీయ నేతలు వాటిని ఉపయుక్తంగా వాడుకునే సలహాలు ఆయన ఇచ్చారు. ‘సమాధానాలు ఉన్న వ్యక్తులు చెప్పేది వినవద్దు, ప్రశ్నలు ఉన్న వ్యక్తులు చెప్పేది మాత్రమే వినాలి’ అని ఆయన అన్నారు. ‘ఆలోచన లేకుండా అధికారాన్ని గౌర వించడం అనేది సత్యానికి మహా శత్రువు’ అని ఐన్‌స్టీన్ చెప్పింది మరింత ప్రాసంగికమైనది. ఐన్‌స్టీన్ వివేకంలో ఎక్కువ భాగం మన లాంటి సామాన్యులను లక్ష్యంగా చేసుకున్నది. ‘మీ జీవితాన్ని గడపడానికి రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే ఏదీ అద్భుతం కాదన్నట్టుగా, మరొకటి ఏమిటంటే ప్రతిదీ అద్భుతమే అన్నట్టుగా.’ సులభంగా అలిసిపోయే వారికీ, లేదా ఎదురుదెబ్బలు, వైఫల్యాలతో నిస్పృహ చెందేవారికీ కూడా ఒక హామీ ఉంటుంది. ‘మీరు నిజంగా ఏం చేయాలని అనుకుంటున్నారో దాన్ని ఎన్నటికీ వదిలిపెట్టొద్దు. అన్ని వాస్తవాలు చేతిలో ఉన్న వ్యక్తులకంటే పెద్ద స్వప్నాలు కనే వ్యక్తి చాలా శక్తి మంతుడు.’ బహుశా, తడబడటాన్నీ, పడిపోవడాన్నీ అధిగమించాలంటే ఇదే మార్గం. ‘జీవితం అనేది సైకిల్ స్వారీ లాంటిది. మీ సమతౌల్యాన్ని సాధించాలంటే, మీరు ముందుకు కదులుతూనే ఉండాలి.’ ఐన్‌స్టీన్ చెప్పిన కొన్ని విషయాలను తీసుకుంటే, ఆయన 2023 నాటి భారతదేశాన్ని మనసులో ఉంచుకుని చెప్పారా అని మీరు ఆశ్చర్యపడేలా చేస్తుంది. దీన్ని గురించి ఆలోచించండి: ‘హాని తలపెట్టేవారి వల్ల ప్రపంచం ప్రమాదకరంగా లేదు, దానికేసి చూస్తూ కూడా ఏమీ చేయకుండా ఉండటం వల్ల ప్రమాదం ఉంటోంది’. ఇది కూడా చూడండి: ‘నిత్యం విశ్రాంతి లేనితనంతో వచ్చే విజయం కంటే కూడా ప్రశాంతమైన, నిరాడంబర జీవితం మరింత సంతోషాన్ని తీసుకొస్తుంది’. బహుశా, ఐన్‌స్టీన్‌ని ప్రపంచం కనీవినీ ఎరుగనంత గొప్ప శాస్త్రవేత్తగా భావిస్తున్నారు. అయినా సరే, భౌతిక శాస్త్రం మీద ఉన్నంత గ్రహణ శక్తి ఆయనకు దేవుడి మీదా ఉంది. ‘యాదృచ్ఛికత అనేది దేవుడు అజ్ఞాతంగా ఉండిపోవడానికి ఎంచుకున్న మార్గం’. అలాగే చిన్న పిల్లల గురించీ, వారికి ఏది ప్రేరణ కలిగిస్తుందో ఆయన బాగా అర్థం చేసుకున్నారు. ‘మీరు మీ పిల్లలు తెలివైన వారిగా ఉండాలని కోరుకుంటున్నట్లయితే, జానపద సాహస గాథలు చదివి వినిపించండి. మీరు వారిని మరింత తెలివైనవారిగా ఉండాలని కోరుకుంటు న్నట్లయితే, వారికి మరింత ఎక్కువ అద్భుత గాథలను చదివి వినిపించండి’. మానవుల గురించిన ఐన్‌స్టీన్ గ్రహణశక్తి ఎంత లోతైనదో, ఎంత పదునైనదోనని నాకులాగే మీక్కూడా ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగించినట్లయితే– ఆయనకు తనపట్ల తనకు ఉన్న అవగాహన కూడా అంతే సరిసమానంగా పదునుగా ఉంటుందని నేను చెబుతాను. ‘ఒక గొప్ప శాస్త్రవేత్తను రూపొందించేది మేధస్సేనని చాలామంది జనం చెబుతుంటారు. వారి అభిప్రాయం తప్పు. నడవడికే దానికి కారణం’. దీన్నే ఐన్‌స్టీన్ మరింత స్పష్టంగా చెబుతారు: ‘సహజాతా లనూ, ప్రేరణనూ నేను విశ్వసిస్తాను. ఒక్కోసారి, నాకు కారణం తెలియకుండానే నేను చెప్పినది సరైనది అని భావిస్తుంటాను’. పైగా, ప్రపంచాన్ని అర్థం చేసుకోవ డానికి ఆయన ఊహాశక్తే ఆయనకు అంతర్ దృష్టిని ఇచ్చి ఉంటుందనిపిస్తుంది. ‘నా ఊహాశక్తి ఆధారంగా స్వేచ్ఛగా చిత్రించే కళాకారుడిగా నేను ఉంటాను. జ్ఞానం కంటే ఊహ ముఖ్యమైనది. జ్ఞానం పరిమితి కలది, ఊహాశక్తి ఈ ప్రపంచాన్ని చుట్టేస్తుంది’. చివరగా, మహాత్మాగాంధీ గురించి ఐన్‌స్టీన్ ఇలా చెప్పారు: ‘రక్తమాంసాలు కలిగిన ఇలాంటి వ్యక్తి ఒకరు భూమ్మీద నడియాడి ఉంటారనే విషయాన్ని రాబోయే తరాలు నమ్మలేవు’. గాంధీని ఇప్పటికే మర్చిపోతున్న తరుణంలో, అలా మర్చిపోతున్న తరాల్లో మనమే మొదటివాళ్లుగా ఉంటున్నామా? (క్లిక్ చేయండి: బంగారు బాల్యంలో నేర ప్రవృత్తి) - కరణ్ థాపర్ సీనియర్ జర్నలిస్ట్ -
డియర్ ఐన్‌స్టీన్ సార్.. నేనెవరో మీకు తెలీదు
అల్బర్ట్ ఐన్‌స్టీన్.. ఓ ప్రపంచం మేధావి. అలాంటిది అపరిచితుడిగా పరిచయం చేసుకుంటూనే ఆయన నుంచి ‘శెభాష్’ అనిపించుకున్నాడు భారత్‌కు చెందిన యువ శాస్త్రవేత్త. ఆయనే సత్యేంద్ర నాథ్ బోస్. భౌతిక శాస్త్రం(ఫిజిక్స్)లో వీళ్లిద్దరి కృషికి బోస్-ఐన్‌స్టీన్ గణాంకాలుగా గుర్తింపు దక్కించుకుంది. ఆ గుర్తింపు దక్కి నేటికి 98 ఏళ్లు అవుతుంది. 1924, జూన్ 4వ తేదీన జర్మనీ భౌతిక శాస్త్రవేత్త ఐన్‌స్టీన్.. భారత్‌కు చెందిన సత్యేంద్రనాథ్ బోస్ కృషిని గుర్తించారు. క్వాంటమ్ మెకానిక్స్‌లో బోస్ కనిపెట్టిన థియరీతో ఏకీభవించారు ఐన్‌స్టీన్. అంతేకాదు స్వయంగా ఆయనే జర్మన్లోకి అనువదించి మరీ.. బోస్ పేరిట వ్యాసం ప్రచురించారు. భౌతిక శాస్త్రంలో అరుదైన ఈ ఘట్టానికి 98 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. గూగుల్ సత్యేంద్రనాథ్ బోస్ గౌరవార్థం డూడుల్‌ను రిలీజ్ చేసింది. ‘‘డియర్ సర్, మీ పరిశీలన, అభిప్రాయం కోసం నేను మీకు ఈ కథనాన్ని పంపించాను. క్లాసికల్ ఎలెక్ట్రోడైనమిక్స్ నుండి స్వతంత్రంగా ప్లాంక్ నియమం లోని గుణకం 8π ν2/c3ను తగ్గించడానికి నేను ప్రయత్నించాను. దశ-అంతరాళంలో అంతిమ ప్రాథమిక ప్రాంతంలో కంటెంట్ h3 ఉందని మాత్రమే ఊహిస్తారు. ఈ పరిశోధనా పత్రాన్ని అనువదించడానికి నాకు తగినంత జర్మన్ భాష తెలియదు. ఈ పత్రం ప్రచురణ విలువైనదని మీరు అనుకుంటే, మీరు దాని ప్రచురణను "జైట్స్క్రిఫ్ట్ ఫర్ ఫిజిక్" లో వచ్చేటట్లు చేస్తే నేను కృతజ్ఞుడను. నేను ఎవరో మీకు తెలియదు. అలాంటి అభ్యర్థన చేయడంలో నాకు ఏమాత్రం సంకోచం లేదు. ఎందుకంటే మీ రచనల ద్వారా మీ బోధనల ద్వారా లాభం పొందిన మేమంతా మీ విద్యార్థులం. సాపేక్షతపై మీ పత్రాలను ఆంగ్లంలో అనువదించడానికి కలకత్తాకు చెందిన ఎవరైనా మీ అనుమతి కోరినట్లు మీకు ఇంకా గుర్తుందో,లేదో నాకు తెలియదు. మీరు ఆ అభ్యర్థనను అంగీకరించారు. అప్పటి నుండి ఆ పుస్తకం ప్రచురించబడింది. సాధారణీకరించిన సాపేక్షతపై మీ పరిశోధనా పత్రాలను నేనే అనువదించాను. మీరు ఏమనుకుంటున్నారో తెలుసుకోవటానికి నేను ఆత్రుతగా ఉన్నాను’’ అంటూ లేఖ పంపారు సత్యేంద్రనాథ్ బోస్. ► ఇండియన్ ఫిజిక్స్ త్రిమూర్తులుగా.. సర్ సీవీరామన్, మేఘనాథ్ సాహా, సత్యేంధ్రనాథ్ బోస్‌లకు పేరుంది. ► ఫిజిక్స్ కణ భౌతికశాస్త్రంలో వినిపించే హిల్స్ బోసన్(దైవకణాలు) అనే పదంలో.. బోసాన్ అంటే ఏంటో కాదు.. బోస్ పేరు మీదే బ్రిటిష్ సైంటిస్ట్ పాల్ డిరాక్ అలా నామకరణం చేశారు. ► బోస్-ఐన్‌స్టీన్ స్టాటిక్స్కుగానూ.. 1956లో నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారు. ఫిజిక్స్‌పై ఆయన పరిశోధలను, రచనలను నోబెల్ కమిటీ పట్టించుకోలేదు. ► కానీ, బోస్ ప్రతిపాదించిన బోసన్, బోస్-ఐన్‌స్టీన్ థియరీల ఆధారంగా చేపట్టిన పరిశోధనలకు ఏడు నోబెల్ బహుమతులు వచ్చాయంటే ఆయన కృషి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ► 1954లో భారత ప్రభుత్వం సత్యేంద్రనాథ్ బోస్‌ను పద్మవిభూషణ్‌తో సత్కరించింది. ► పలు యూనివర్సిటీలలో బోధకుడిగా, పరిశోధనా కమిటిలలోనూ ఆయన పని చేశారు. ► సత్యేంద్రనాథ్బోస్.. పశ్చిమ బెంగాల్ కోల్‌కతా(కలకత్తా)లో ఓ సాధారణ కుటుంబంలో జన్మించారు. ► ప్రఫుల్ల చంద్రరాయ్, జగదీశ్చంద్రబోస్లు ఈయనకు గురువులు. ► లూయిస్ డి బ్రోగ్లీ, మేరీ క్యూరీ , ఐన్‌స్టీన్‌లతో కలిసి పని చేసే అవకాశం దక్కింది ఈయనకు. ► అనువర్తిత గణితశాస్త్రంలో ఎమ్మెస్సీ కలకత్తా యూనివర్సిటీ నుంచి పూర్తి చేశాడాయన. ► 1974 ఫిబ్రవరి 4వ తేదీన 80 ఏళ్ల వయసులో కలకత్తాలోనే ఆయన కన్నుమూశారు. ► కేవలం ఫిజిక్స్ మాత్రమేకాదు.. మ్యాథ్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆర్ట్స్‌లోనూ ఆయన ఎంతో కృషి చేశారు. ► నోబెల్ దక్కకపోతేనేం.. ఈ మేధావి మేధస్సును గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కొనియాడారు. మాతృదేశం గుర్తించింది. నేడు భౌతిక శాస్త్రంలో పరిశోధనలు చేస్తున్న పరిశోధకులు.. తమ పరిశోధనలతో ఆయన కృషిని నిరంతరం గుర్తు చేస్తూ ఉన్నారు. -
న్యూరో సైన్స్
-
ఐన్‌స్టీన్, హాకింగ్‌లకన్నా ఈ చిన్నారి బుర్ర మరింత స్మార్ట్
మెక్సికో సిటీ: ఇంటెలిజెన్స్ కోషెంట్.. దీన్నే షార్ట్‌కట్‌లో ఐక్యూ అంటారు. ఇది ఎవరైనా ఒక వ్యక్తి తెలివితేటల స్థాయిని చెప్పే ఓ కొలమానం అనొచ్చు. సమస్యలను విశ్లేషించగల, పరిష్కరించగల సామర్థ్యానికి కొలమానం ఇది. అయితే ఇప్పటి వరకు అత్యధిక ఐక్యూ ఉన్న వారి జాబితాలో ప్రముఖ శాస్త్రవేత్తలు అల్బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫేన్ హాకింగ్‌లు ప్రథమ స్థానంలో ఉన్నారు. వీరి ఐక్యూ లెవల్స్ 160 వరకు ఉన్నట్లు ప్రచారం ఉంది. ఐక్యూ విషయంలో వీరిని మించిపోయింది మెక్సికన్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలిక. ఈ చిన్నారి ఐక్యూ ఏకంగా 162గా గుర్తించారు. ఆ వివరాలు.. మెక్సికోకు చెందిన అధారా పెరెజ్ (8) అనే చిన్నారి మెక్సికోలోని తలాహుక్ మురికివాడ ప్రాంతంలో నివసిస్తూ ఉండేది. అయితే మూడేళ్ల ప్రాయంలో ఉండగా అధారా అస్పెర్జర్ సిండ్రోమ్ (ఆటిజం కోవకు చెందిన వ్యాధి)బారిన పడింది. ఫలితంగా డిప్రెషన్‌తో బాధపడుతుండేది. స్కూల్‌కు వెళ్లడానికి కూడా ఇష్టపడేది కాదు. ఈ క్రమంలో అధారా తల్లిదండ్రులు ఆమెను థెరపీ కోసం సైక్రియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ అధారాను పరీక్షించిన వైద్యులు చిన్నారిలో అసమాన తెలివితేటలు ఉండటం గమనించారు. (చదవండి: నో స్వెట్ సర్జరీ: గుండెపోటుతో యంగ్ బాడీ బిల్డర్ మృతి) ఈ క్రమంలో అధారాను టాలెంట్ కేర్ సెంటర్‌కు తీసుకెళ్లమని సూచించారు. అక్కడ అధారా ఐక్యూని పరీక్షించగా.. 162గా తేలింది. ఇక టాలెంట్ కేంద్రంలో ఒకే రకమైన స్కిల్స్ ఉన్న విద్యార్థులను చేర్చుకుని వారికి చదువు చెప్తారు. ఈ క్రమంలో అధారాను అక్కడ చేర్చుకున్నారు. (చదవండి: Albert Einstein Birth Anniversary: విశ్వనరుడు ఐన్‌స్టీన్) టాలెంట్ కేర్ సెంటర్లో చేరిన అధారా ఎనిమిదేళ్ల వయసు వచ్చే సరికే ఎలిమెంటరీ, మిడిల్, హై స్కూల్ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. అంతేకాక రెండు ఆన్లైన్ డిగ్రీలు పొందింది అధారా. తన అనుభవాల గురించి తెలియజేస్తూ.. ‘డు నాట్ గివ్ అప్’ పేరుతో పుస్తకం కూడా రాసింది. ఇక మానసిక వైకల్యం ఉన్న వారి ఎమోషన్స్‌ని నిత్యం పరిశీలించేందుకు గాను ఓ స్మార్ట్ బ్రాస్లెట్ని అభివృద్ధి చేసింది. ఆస్ట్రోనాట్ అయి అంతరిక్షం వెళ్లాలని.. అంగారకుడిపై వలస రాజ్యం స్థాపించాలనేది అధారా కోరిక. (చదవండి: ఖగోళ అద్భుతం: బ్లాక్ హోల్ వెనుక ఫస్ట్ టైం వెలుగులు) తన ప్రతిభ ఆధారంగా అధారా ఫోర్బ్స్ మెక్సికో 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా అధారా తల్లి మాట్లాడుతూ ‘‘అస్పెర్జర్ సిండ్రోమ్ కారణంగా బాల్యంలో నా కుమార్తె ఎవరితో త్వరగా కలిసేది కాదు. ఓ సారి తను ఓ చిన్న ఇంట్లో స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా.. ఫ్రెండ్స్ అధారాను గదిలో పెట్టి బంధించారు. బయట నుంచి తనను హేళన చేయసాగారు. ఆ రోజు నా కుమార్తె పడిన బాధ చూసి.. తనను ఒంటరిగా వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నాను. ఈరోజు తన తెలివితేటలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. -
ఖగోళ అద్భుతం: బ్లాక్ హోల్ వెనుక ఫస్ట్ టైం వెలుగులు
Astronomers Detect Light Behind Black Hole: విశ్వంలో మనిషి మేధస్సుకు అంతుచిక్కని రహస్యాలెన్నో. వాటిలో బ్లాక్ హోల్ ఒక సంక్లిష్టమైన సబ్జెక్ట్. అదృశ్య ప్రాంతాలుగా కంటికి కనిపించకుండా.. ఖగోళ వస్తువులన్నింటినీ తమలోకి ఆకర్షించుకునే కేంద్రాలివి. అయితే కృష్ణ బిలాల వెనుక ఉన్న ఓ విషయాన్ని తొలిసారి ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించగా, ఐన్‌స్టీన్ అంచనా ఆయన మేధోసంపత్తిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. భూమికి 100 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో కృష్ణ బిలం(ఐ జ్విక్కీ 1) వెనకాల కాంతి ప్రతిధ్వనుల్ని(తేలికపాటి) గుర్తించారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ(అమెరికా) పరిశోధకులు. మెరుపుల్లా మొదలై అటుపై రంగు రంగుల్లోకి మారిపోయాయి ఆ ఎక్స్‌రే కాంతులు. సాధారణంగా బ్లాక్ హోల్లోకి వెళ్లిన కాంతి ఏదీ బయటకు పరావర్తనం చెందదు. దీంతో ఆ వెనకాల ఏముంటుందో అనేది ఇప్పటిదాకా ఖగోళ శాస్రజ్ఞులు నిర్ధారించుకోలేకపోయారు. అయితే ఈ బిలం చుట్టేసినట్లు ఉండడం, కాంతి వంగి ప్రయాణించడం, అయస్కాంత క్షేత్రాలు మెలిదిరిగి ఉండడం వల్లే ఈ కాంతి ప్రతిధ్వనులను రికార్డు చేయగలిగామని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రో ఫిజిస్ట్ డాన్ విల్కిన్స్ వెల్లడించారు. ఐన్‌స్టీన్ ఏనాడో చెప్పాడు జర్మన్ మేధావి, థియోరెటికల్ ఫిజిసిస్ట్ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఈ విషయాన్ని ఏనాడో గుర్తించాడు. కృష్ణ బిలం వెనకాల కాంతి కిరణాల పరావర్తనాలు సాధ్యమని, అంతరిక్షంలో భారీవేవైనా సరే వక్రీకరణ చెందక తప్పవని ‘జనరల్ రియాల్టివిటీ’ పేరుతో ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ టైంలో ఆ థియరీని ఎవరూ పట్టించుకోలేదు. అయితే తాజా పరిశోధనల గుర్తింపుతో ఆయన మేధస్సును నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా సాధారణ టెలిస్కోప్‌ల ద్వారా గుర్తించడం విశేషం. నేచర్ జర్నల్‌లో బుధవారం ఈ మేరకు ఈ ఖగోళ అద్భుతంపై కథనం పబ్లిష్ అయ్యింది. -
Albert Einstein Birth Anniversary: విశ్వనరుడు ఐన్‌స్టీన్
‘కుల మతాలు గీచుకున్న గీతలు జొచ్చి పంజరాన గట్టు పడను నేను, నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగు లేదు విశ్వనరుడ నేను’ అని జాషువా చెప్పినట్లుగా ఐన్‌స్టీన్ కూడా స్వయంగా ఎన్నోసార్లు ‘నేను ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో, ఒక జాతికో, ఒక మిత్ర బృందానికో, చివరికి ఒక కుటుంబానికో చెందినవాడను కాను. నేను ఈ ప్రపంచానికంతటికీ చెందినవాడను’ అని అన్నాడు. ‘టైమ్స్’ పత్రిక ఐన్‌స్టీన్‌ను శతాబ్దపు మహావ్యక్తిగానూ, గాంధీని రెండవ మహావ్యక్తిగానూ ప్రకటించినప్పుడు ఐన్‌స్టీన్ సంతోషపడకుండా ‘గాంధీయే నాకంటే గొప్పవాడు, మొదటి స్థానంలో గాంధీయే ఉండాలి’ అని అన్నాడంటే ఐన్‌స్టీన్ వ్యక్తిత్వం ఎంతటి విశిష్టమైనదో మనం ఊహించుకోవచ్చు. తను ఎప్పుడూ కలవని, తన జాతి, దేశ, మతానికి చెందని, తన ఖండానికే చెందిన మరొక శక్తివంతమైన దేశంతో (ఇంగ్లాడు) పోరాటం చేస్తున్న ఒక బక్క చిక్కిన వ్యక్తి గురించి ఆయన రాసిన మాటలు ఈ రోజు ప్రతి భారతీయుడు కంఠస్థం చేయవలసినవి: ‘మనలాగే రక్తమాంసాలతో కూడిన ఇటువంటి మహోన్నతమైన వ్యక్తి ఈ భూమి మీద నడిచాడంటే భావితరాలు నమ్మలేకపోవచ్చు’ అని అంటూనే ఈ శతాబ్దపు మహామనిషి గాంధీజీ అని కొనియాడారు. ఒక విదేశస్తుడు, అందులోనూ ఒక ఐరోపా ఖండవాసి భారతదేశాన్ని, భారతీయులను సమర్థించడమే ఒక గొప్ప సాహసం అనుకునే ఆ రోజులలో ఒక ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత అయిన ఐన్‌స్టీన్ గాంధీజీని ఒక అవతార పురుషుడిలా వర్ణించాడంటే ఆయన ఎటువంటి స్వేచ్ఛాజీవినో అర్థం చేసుకోవచ్చు. నిరాడంబరుడు తన జీవితమంతా కూడా అధికారాలు, ఆడంబరాలకు దూరంగానే ఉన్నాడు. కారులో వెళ్ళడంకంటే సైకిలు ప్రయాణమే ఇష్టపడేవాడు. ఆయన ధరించే దుస్తులు చూచి చాలామంది ఆయనను లోభి అని, మరి కొంతమంది శుభ్రతకు ప్రాధాన్యమివ్వడని అనుకొనేవారు. కాని ఆయనకు తన పరిశోధనలపైనే తప్ప వేరే ధ్యాస ఉండేది కాదు. తన పనికి ఎవ్వరూ, ఏదీ ఆటంకంగా ఉండకుంటే చాలు అనుకునే మనస్తత్వం. తన 50వ జన్మదినం రోజున పాఠశాల పిల్లలు మెడకు కట్టుకునే ‘టై’ ని, పాదాలకు వేసుకునే సాక్సులను బహుమతిగా ఇచ్చారు. ఎందుకు వాటిని బహుమతిగా ఇచ్చారని పిల్లలను అడిగితే ఐన్‌స్టీన్ ఎప్పుడూ ఎక్కువగా ఇవి వాడరు కనుక ఈ రెండూ వీరి దగ్గర లేవేమోనని ఇచ్చాము అన్నారంటే ఐన్‌స్టీన్ దుస్తుల విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉండేవారో అర్థమవుతుంది. 1933 సంవత్సరంలో అమెరికాలోని ప్రిన్స్ టన్ ఇన్స్టిట్యూట్లో చేరినప్పుడు జీతం ఎంత కావాలో తననే నిర్ణయించుకోమంటే సంవత్సరానికి మూడు వేల డాలర్లు నాకు, నా కుటుంబ ఖర్చులకు సరిపోతుంది, అంతే ఇవ్వండి అని చెప్పగా వారు ఆశ్చర్యపోయి వెంటనే ఐన్‌స్టీన్ సహచరి అయిన ఎల్సాతో మాట్లాడి సంవత్సరానికి 16,000 డాలర్లుగా నిర్ణయించారంటే ఆయన నిరాడంబర త్వం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మోక్షగామి మానవ మేధస్సుకు అందని కొన్ని అతీతమైన శక్తులు ఉన్నాయని ఆయన బలంగా నమ్మేవారు. వీటి కారణంగానే విశ్వగమనం ఎల్లప్పుడూ ఒకే మాదిరిగా ఉంటుందని విశ్వసించేవారు. ఈ నమ్మకంతోనే తను అయార్టిక్ ఎన్యూరిజమ్ వ్యాధిగ్రస్తుడైనప్పుడు శస్త్రచికిత్స చేస్తే వ్యాధి తగ్గుతుందని వైద్యులు చెప్పినప్పుడు సున్నితంగా ఆయన తిరస్కరించారు. ‘కృత్రిమంగా జీవితాన్ని పొడిగించి రుచిలేని జీవి తాన్ని గడపడం నాకు ఇష్టం లేదు. నేను చేయవలసిన విధులన్నీ నిర్వర్తించాను. నేను అనుకున్న లక్ష్యాలు కూడా నెరవేరాయి. మరణ కాలం ఆసన్నమైంది. కావున ఎటువంటి వైద్య సహాయం అవసరం లేదని చెప్పి మరణాన్ని కూడా ఆహ్వానించిన మోక్షగామి అతడు. అందరూ నమ్మే దేవునికి, ఆయన నమ్మే ఆధ్యాత్మిక శక్తులకు చాలా వ్యత్యాసం ఉండేది. మనకు వచ్చే ప్రతి ఫలితానికి దేవుడే కారణమనుకోవడాన్ని, అదృష్ట దురదృష్టాలను, విధిరాతలను ఆయన నమ్మేవారు కాదు. విశ్వానికి సంబంధించిన మానవాతీతమైన సూర్య, చంద్ర, గ్రహాలు మొదలగు వాటి విషయాలలోను, వాటి అప్రకటిత, అనిర్దేశిత, నియమబద్ధ గమన సంబంధిత విషయాలలోనూ అతీతమైన శక్తుల పాత్ర ఉంది అని నమ్మేవాడు. అటువంటి విశ్వసూత్రాల అస్తిత్వం మానవ మేధస్సుకు అతీతమైనదిగా భావించే వారు ఆయన. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా తన అభ్యాసము, పరిశీలన, పరిశోధనలు మాత్రం సాగుతూనే ఉండేవి. తన శాస్త్ర పరిశోధనా విజయ కేతనాన్ని ప్రపంచ పరిశోధనా గగనంలో ఉవ్వెత్తున ఎగురవేసిన విశ్వనరుడు ఐన్‌స్టీన్. వ్యాసకర్త: ఆచార్య ముర్రు ముత్యాలు నాయుడు మాజీ ఉపకులపతి, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం -
అతిచిన్న బంగారు నాణెం
బెర్లిన్: స్విట్జర్లాండ్ ప్రభుత్వం ప్రపంచంలోనే అతి చిన్న బంగారు నాణేన్ని ముద్రించింది. దీనిపై చిత్రించిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ వెక్కిరిస్తున్నట్లుగా ఉన్న బొమ్మ చూడాలంటే మాత్రం కళ్లద్దాలు ధరించాల్సిందే. వెడల్పు 2.96 మిల్లీమీటర్లు ఉండే ఈ నాణెం బరువు 0.0163 గ్రాములు. ప్రపంచంలోనే ఇది అతి చిన్న నాణెం అని స్విస్‌మింట్ వెల్లడించింది. ఇటువంటి 999 నాణేలను మాత్రమే ముద్రించామనీ, ఒక్కో నాణెం వెల సుమారు రూ.18 కాగా రూ.14,657కు విక్రయిస్తామని తెలిపింది. నాణెంతోపాటు దానిపైని శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ చిత్రం చూసేందుకు కొనుగోలుదారులకు కళ్లద్దాలు కూడా అందజేస్తామని వివరించింది. -
గాంధీ కోసం ‘ఐన్‌స్టీన్ చాలెంజ్’
న్యూయార్క్: ప్రపంచంలో ద్వేషం, హింస, బాధలను అంతం చేసేందుకు భుజం, భుజం కలిపి నడుద్దామని విశ్వ మానవాళికి మోదీ పిలుపునిచ్చారు. గాంధీకి ఇష్టమైన ‘వైష్ణవ జనతో’ను ఉటంకిస్తూ.. ఇతరుల బాధను అర్థం చేసుకునేవాడు, కష్టాలను తీర్చేవాడు, అహంకారం లేనివాడే నిజమైన మానవుడని ఆ భక్తిగీతం అర్థమని వివరించారు. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా బుధవారం ద న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ‘భారత్‌కు, ప్రపంచానికి గాంధీ ఎందుకు కావాలి?’ శీర్షికతో మోదీ ఒక వ్యాసం రాశారు. మహాత్ముడిని అత్యుత్తమ గురువని, దారి చూపే వెలుగని, ప్రపంచవ్యాప్తంగా మానవత్వాన్ని విశ్వసించే లక్షలాది మందికి ఆయనే ధైర్యమని అందులో ప్రశంసించారు. ఈ సందర్భంగా ‘ఐన్‌స్టీన్ చాలెంజ్’ను మోదీ తెరపైకి తెచ్చారు. ‘ఇలాంటి ఒక వ్యక్తి రక్తమాంసాలతో ఈ భూమిపై తిరిగాడంటే భవిష్యత్ తరాలు విశ్వసించవేమో’అని మహాత్మాగాంధీ గురించి ప్రముఖ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ చేసిన ప్రశంసను ప్రస్తావిస్తూ.. ‘గాంధీకి నివాళిగా, ఐన్‌స్టీన్ చాలెంజ్‌ను ప్రతిపాదిస్తున్నాను. గాంధీ ఆశయాలను ముందు తరాలకు ఎలా అందించగలం? అనేది అంతా ఆలోచించాలి. వినూత్న విధానాలు, ఆవిష్కరణల ద్వారా గాంధీజీ సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లే విషయమై మేధావులు, టెక్ లీడర్లు, పారిశ్రామిక వేత్తలు, ఔత్సాహికులు కృషి చేయాలి’అని మోదీ కోరారు. గాంధీ ఆశయాల సాధన కోసం తన ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. ‘భారత జాతీయతావాదం భారత్‌కు మాత్రమే పరిమితమైన సంకుచిత వాదం కాదని, విశ్వ మానవాళి సంక్షేమాన్ని కోరే వాదమని గాంధీజీ బలంగా నమ్మారు’అని మోదీ ఆ వ్యాసంలో పేర్కొన్నారు. స్వాతంత్య్రం అంటే విదేశీ పాలన అంతం కావడం ఒక్కటే కాదని, రాజకీయ స్వాతంత్య్రం, వ్యక్తిగత సాధికారత అందులో ఇమిడి ఉన్నాయన్నారు. ‘ప్రతీ వ్యక్తి గౌరవంగా జీవించే ప్రపంచాన్ని ఆయన కలగన్నారు. పేదల సామాజిక ఆర్థిక సంక్షేమాన్ని అంతా బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఈ భూమిపై నివసిస్తున్న మనం అవని సంక్షేమానికి, దానిపై ఉన్న వృక్ష, పశు, పక్ష్యాది సమస్త ప్రాణుల సంక్షేమానికి బాధ్యులుగా ఉండాలి’అని పిలుపునిచ్చారు. -
ఐన్‌స్టీన్ సిద్ధాంతమే నిజం..!
వాషింగ్టన్: ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన గురుత్వాకర్షణ సిద్ధాంతం ప్రతికూల సంద ర్భాల్లో కూడా నిజమేనని నిరూపితమైందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఐన్‌స్టీన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం ప్రకారం బరువుతో సంబంధం లేకుండా విశ్వంలోని ఏ వస్తువైనా ఒకే సమయంలో కిందకు పడిపోతుంది. అయి తే ఐన్‌స్టీన్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే సిద్ధాంతా లు మాత్రం తక్కువ బరువున్న వాటితో పోలిస్తే.. అధిక గురుత్వాకర్షణ శక్తి ఉండే న్యూట్రాన్ స్టార్ కిందకు పడే సమయాల్లో తేడా లుంటాయని పేర్కొన్నాయి. కానీ ఇప్పుడు ఐన్‌స్టీన్ సిద్ధాంతమే మరోసారి నిజమని నిరూపితమైనట్లు అమెరికాలోని గ్రీన్‌బ్యాంక్ అబ్జర్వేటరీ పరిశోధకులు చెప్పారు. నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని గ్రీన్ బ్యాంక్ టెలిస్కోప్ భూమికి 4,200 కాంతి సంవత్సరా ల దూరంలో ఉన్న ట్రిపుల్ స్టార్ సిస్టమ్‌ను 2011లో కనుగొంది. ఈ వ్యవస్థలో న్యూట్రాన్ నక్షత్రం, రెండు మరుగుజ్జు నక్షత్రాలున్నాయి. ఈ న్యూట్రాన్ స్టార్ కన్నా లోపలి తెలుపు రంగు మరుగుజ్జు నక్షత్రం తక్కువ బరువుతో ఉంది. ఇతర పరిశోధకుల సిద్ధాంతా లే నిజమైతే.. న్యూట్రాన్ స్టార్, లోపలి తెలుపు రంగు నక్షత్రం వేర్వేరు సమయాల్లో కిందకు పడిపోవాల్సి ఉందని, కానీ అలా జరగలేదని చెప్పారు. -
తప్పులో కాలేసిన ఇవాంకా ట్రంప్!
సెలబ్రిటీలు చేసే ట్వీట్లు అప్పుడప్పుడూ మిస్ ఫైర్ అవుతుంటాయి. అయితే కొన్నిసార్లు వారు చేసే తప్పులను ఎవరూ గుర్తించలేదని సంతోషించవచ్చు. కానీ నిజం ఏదో ఓ రోజు బయటపడుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటారా.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్నోసార్లు పదాలు తప్పుగా రాస్తూ ట్వీట్ చేయగా అవి వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ట్రంప్ కూతురు ఇవాంకా చేసిన ఓ తప్పు నాలుగేళ్ల తర్వాత వెలుగుచూసింది. ఇవాంకా తప్పులో కాలేయడంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. 2013 జూన్ 23న ఇవాంకా ఓ ట్వీట్ చేశారు. ప్రముఖ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ థియరీ అంటూ ఉదహరిస్తూ ఓ విషయాన్ని చెబుతూ 'ఒకవేళ నిజాలు థియరీలకు మ్యాచ్ అవ్వకపోతే.. ఆ నిజాలనే మార్చివేయాలి' అని ఇవాంకా పేర్కొన్నారు. నాలుగేళ్లు గడిచిపోయాయి ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఐన్‌స్టీన్ ఎస్టేట్‌కు ప్రతినిధిగా ఉన్న గ్రీన్ లైట్ ఇవాంకా ట్వీట్లోని తప్పును గుర్తించారు. అసలు ఈ కొటేషన్‌ను ఐన్‌స్టీన్ చెప్పనేలేదని వెల్లడించారు. ఈ మేరకు ఐన్‌స్టీన్ పేరిట ఉన్న అధికారిక ఖాతా నుంచి ఇవాంకా ట్రంప్ ట్వీట్లోని తప్పిదాన్ని వివరిస్తూ రీట్వీట్ చేశారు. ఇక ఇది మొదలు నెటిజన్లు ఇవాంకాపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. విషయం తెలిస్తేనే ట్వీట్లు చేయాలని నెటిజన్లు సూచిస్తున్నారు. "If the facts don't fit the theory, change the facts." - Albert Einstein #quote #sunday — Ivanka Trump (@IvankaTrump) 23 June 2013 -
2 పేజీల లేఖ ఖరీదు రూ.35 లక్షలు!
లాస్ ఏంజిలెస్: ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్స్టిన్ రాసిన ఓ లేఖ వేలంలో దాదాపు రూ.35 లక్షల ధర పలికింది. 1953లో అర్థర్ కన్వెర్స్ అనే సైన్స్ టీచర్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఐన్‌స్టీన్ ఈ లేఖ రాశారు. 2 పేజీల ఈ లేఖలో ఎలక్ట్రోస్టాటిక్ థియరీకి సంబంధించిన వివరాలు ఉన్నాయి. ‘ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీ ఉయ ప్రిన్స్టన్, రూమ్ నంబర్ 115, న్యూ జెర్సీ’ చిరునామాతో ఉన్న ఈ లేఖను తీసుకొచ్చిన గుర్తు తెలియని వ్యక్తి దీని ధర 15,000 డాలర్లుగా ప్రకటించగా తర్వా త అది 53,503 డాలర్లకు అమ్ముడుపోయింది. ఇన్నిరోజులపాటు ఈ లేఖ కన్వెర్స్ కుటుంబం వద్దే ఉన్నదని, ఆయన టీచర్‌గా ఉన్న సమయంలో సందేహాల నివృత్తి కోసం ఆయన ఐన్‌స్టీన్ కు తరచూ లేఖరు రాసేవారని వేలంపాట నిర్వాహకుడు నేట్ డీ శాండర్స్ తెలిపారు. -
టెక్ తేనెటీగలు
‘‘ఈ భూమ్మీద తేనెటీగలు మాయమైపోతే ఆ తరువాత నాలుగేళ్లలో మనిషన్న వాడు కూడా లేకుండా పోతాడు’’... ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చేసినట్టుగా చెబుతున్న ఈ వ్యాఖ్య అక్షర సత్యం. మొక్కల్లో పరపరాగ సంపర్కానికి ఇవే కీలకమని మనమూ చదువుకున్నాం. దురదృష్టవశాత్తూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తేనెతుట్టెలు, తేనెటీగలు కరవైపోతున్నాయి. రసాయనిక క్రిమి, కీటక నాశినులను ఈ చిన్ని ప్రాణాలు తట్టుకోలేకపోతున్నాయి. నిజమేగానీ... ఇప్పుడీ విషయమంతా ఎందుకు అంటే... ఈ ఫొటోలు చూసేయండి!. పువ్వు మధ్యలో ఓ బుల్లి డ్రోన్ కనిపిస్తోందా... అది కూడా ఓ తేనెటీగ వంటిదే. కాకపోతే జీవంతో కాకుండా బుల్లి మోటార్‌తో నడుస్తుంది. ఇది అచ్చం తెనెటీగల మాదిరిగానే పూల పుప్పొడిని అటు ఇటూ మార్చేస్తుందట కూడా. జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ వీటిని డిజైన్ చేసింది. రెండంటే రెండు అంగుళాల సైజుండే డ్రోన్ అడుగు భాగంలో జంతువుల వెంట్రుకలు కొన్ని అతికించారు. ఈ వెంట్రుకలకు కొంత జిగురు కూడా జోడించడంతో వాలిన ప్రతి పువ్వు నుంచి ఇది పుప్పొడిని సేకరించగలదు. ఆ తరువాత ఇంకో పువ్వుపై రాలితే చాలు... కాగల కార్యం అయిపోయినట్లే! అయితే ప్రస్తుతానికి ఈ డ్రోన్లను వాడే అవకాశాలు లేవని, జీపీఎస్, కృత్రిమ మేధ వంటి కొన్ని ఇతర హంగులను జోడించాల్సి ఉందని అంటున్నారు వీటిని సృష్టించిన శాస్త్రవేత్త ఇజిరో మియాకో! అంతేకాకుండా ఈ డ్రోన్లు పూల లోపల పాక్కుంటూ కదిలేందుకు సూక్ష్మస్థాయి యంత్రాలు కూడా అవసరమవుతాయని, మరింత స్పష్టమైన చిత్రాలు తీయగల చిన్న చిన్న కెమెరాలను అభివృద్ధి చేయాల్సి ఉందని అంటున్నారు ఆయన. నశించి పోతున్న తేనెటీగలకు ప్రత్యామ్నాయంగా డ్రోన్లను వాడాలన్న మియాకో ఐడియా బాగానే ఉన్నప్పటికీ ఇందుకు అభ్యంతరపెట్టే వారూ లేకపోలేదు. ప్రపంచం మొత్తమ్మీద ప్రస్తుతం దాదాపు 3.2 లక్షల కోట్ల తేనెటీగలు ఉన్నాయి అనుకుంటే.. అవి తమనుతాము పోషించుకుంటూ మనిషికి ‘తేనె’ను అందిస్తున్నాయని, యంత్రాలు ముమ్మాటికీ ఆ పని చేయలేవని అంటున్నారు ససెక్స్ విశ్వవిద్యాలయ బయాలజిస్ట్ డేవిడ్ ఘాల్సన్. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఐన్‌స్టీన్ వందేళ్ల నాటి మాటే నిజమైంది!
జర్మనీకి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ వందేళ్ల కిందట చెప్పిన విషయం నేడు ప్రయోగపూర్వకంగా వెలుగులోకి వచ్చింది. గురుత్వాకర్షణ తరంగాలను దాదాపు వందేళ్ల కిందట ఐన్ స్టీన్ ప్రస్తావించారు. అంతరిక్షంలో వాటి ఉనికిని, సమయానికి అనుగుణంగా అవి ఎలా ప్రవర్తిస్తాయన్న అంశాలపై అప్పట్లోనే ఐన్‌స్టీన్ వివరించారు. సాపేక్ష సిద్ధాంతం అంశాలపై అమెరికన్ శాస్త్రవేత్తలు నేటికీ పరిశోధన చేస్తూనే ఉన్నారు. గురుత్వాకర్షణ తరంగాలను గతంలో ఉన్నట్లు గుర్తించినప్పటికీ వాటిని మన కంటికి కనిపించేలా చేసే సాధనాలను సైంటిస్టులు రూపొందించలేదు. బుధవారం తమ కృషి ఫలించిందని, ఆ తరంగాలను చూపించే సాధనం లేసర్ ఇంటర్ ఫెరో మీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ(లిగో)ను వాడి ఉనికిని గుర్తించారు. అంతరక్ష విజ్ఞానంలో శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకెశారని చెప్పవచ్చు. 1.4 బిలియన్ సంవత్సరాల వయసున్న బ్లాక్ హోల్స్ రెండు ఢీకొనగా గురుత్వాకర్షణ తరంగాలు ఏర్పడ్డట్లు కనుగొన్నారు. లిగోను ఉపయోగించి అంతుచిక్కని ఎన్నో అంతరిక్ష సంబంధ అంశాలకు సమాధానాలు రాబడతామని అమెరికన్ సైంటిస్టులు ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కృష్ణబిలాలు (బ్లాక్ హోల్స్) ఎలా ఏర్పడతాయి, వాటితో పాటు మరిన్ని అంతరిక్ష రహస్యాలను ఛేదిస్తామని గ్లాస్గో యూనివర్సిటీ గ్రావిటేషనల్ రీసెర్చ్ టీమ్ డైరెక్టర్ షైలా రోవాన్ పేర్కొన్నారు. లిగో రెండు డిటెక్టర్స్ కలిగి ఉండగా, ఒకటి లివింగ్ స్టన్, లూసియానాలో, మరొకటి వాషింగ్టన్ లోని హంఫోర్డ్ లో మూడు వేల కి.మీ దూరంలో ఉన్నాయి. కొన్నిసార్లు రెండు బ్లాక్ హోల్స్ ఒకదాని చుట్టూ మరొకటి పరిభ్రమిస్తూ తమ శక్తిని కోల్పోయి ఒక బ్లాక్ హోల్ గా ఏర్పడతాయి. గురుత్వాకర్షణ తరంగాల సహాయంతో బ్లాక్ హోల్స్ కలయిక దృగ్విషయాన్ని తెలుసుకునేందుకు వీలుంటుంది. -
ఐన్‌స్టీన్ డిగ్రీలు కేజ్రీవాల్‌కు ఓకేనా?
ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిగ్రీల విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన, చేస్తున్న గొడవ అంతా ఇంతా కాదు. అసలు మోదీకి డిగ్రీలే లేవని ఒకసారి, అన్నీ నకిలీలు చూపిస్తున్నారని ఇంకోసారి, పేర్లు తేడా ఉన్నాయని మరోసారి ఇలా పదే పదే మోదీ డిగ్రీల గురించి ఆయన రచ్చ చేస్తూనే ఉన్నారు. దాంతో ఇప్పుడు కేజ్రీవాల్ - డిగ్రీలు అనే అంశం మీద సోషల్ మీడియాలో జోకులు, కార్టూన్లు రకరకాలుగా చక్కర్లు కొడుతున్నాయి. అందులో తాజాగా ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కూడా అరవింద్ కేజ్రీవాల్ దగ్గరకు వచ్చి, తన డిగ్రీలను ఆయనకు చూపించి, అవన్నీ నిజమైనవేనని సర్టిఫై చేయించుకున్నట్లుగా ఉన్న ఒక కార్టూన్ సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతోంది. ట్విట్టర్లో ఒక వ్యక్తి ఈ ఫొటోను ట్వీట్ చేయగా.. దాన్ని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యం స్వామి కూడా రీట్వీట్ చేశారు. దానికితోడు వాట్సాప్‌లోని పలు గ్రూపుల్లో కూడా ఈ ఫొటో సర్క్యులేట్ అవుతోంది. -
శాస్త్రవేత్త కాకపోయి ఉంటే...
మీకు అల్బర్ట్ ఐన్‌స్టీన్ తెలుసా? సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన విశ్వవిఖ్యాత భౌతిక శాస్త్రవేత్త అని సైన్సు పుస్తకంలో చదువుతుంటారు కదా! ఆయన గురించి మీకు తెలియని మరో సంగతేమిటంటే... ఆయనకు సంగీతంలో మంచి ప్రవేశం ఉంది. ఐన్‌స్టీన్ పదమూడో ఏట మోజార్ట్ అనే సంగీతకారుడి కచేరీ విన్నాడు. అంతే సంగీతంపై మక్కువ ఏర్పడింది. అప్పటి నుంచి వయోలిన్, పియానో సాధన ప్రారంభించాడు. శాస్త్ర పరిశోధనలు, ప్రయోగాల్లో తలమునకలుగా ఉంటూ, తీరిక వేళల్లో సంగీత సాధనతో సేదదీరేవాడు. శాస్త్రవేత్త కాకపోయి ఉంటే సంగీతకారుడిగా ఎదిగేవాడినని చెప్పేవాడు. -
నాస్తికత కూడా ఒక విశ్వాసమే అని మరచారు!
స్పందన అక్టోబర్ 10న ‘దైవికం’లో ‘ఖగోళ అవిశ్వాసి’ అనే శీర్షికతో స్టీఫెన్ హాకింగ్ మీద మాధవ్ శింగరాజు రాసిన ఆర్టికల్‌కి స్పందనగా ఈ ఉత్తరం. సైన్సు అన్న పదానికి నిర్వచనం, పరిధి అవగాహన చేసుకోకుండా ఆయన దీనిని రాశారనుకోవాలి. ఒక ప్రసిద్ధ మత పెద్ద దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడితే ఒక ఆస్తికుడికి వచ్చేంత బాధను ఆయన అనుభవించినట్లున్నారు! స్టీఫెన్ అలా మాట్లాడకపోవడం వింత కాదని, మన శాస్త్రవేత్తలు అంగారక గ్రహం మీదకు రాకెట్టు పంపేటప్పుడు పూజ చేయడం ఒక వైచిత్రి అని ఆయన గమనించలేకున్నారు. ‘సైన్సు లేని మతం కుంటిది, మతం లేని సైన్సు గుడ్డిది’ అన్న 20వ శతాబ్ది సువిఖ్యాత ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కూడా ‘దేవుడి పట్ల నమ్మకం పిల్ల చేష్ట’, ‘మతానికి చెందిన కథలు మూఢనమ్మకాలు’ అని తన చివరి రోజుల్లో ప్రకటించాడని వాల్టన్ నెజాక్సన్ ఇటీవలి ఐన్‌స్టీన్ బయోగ్రఫీలో ప్రస్తావించాడని తెలిస్తే ఐన్‌స్టీన్‌ని మాధవ్ గారు ఎన్ని మాటలు అని ఉండేవారో! మాధవ్ గారు సకల సృష్టినీ ఒకే కళ్లద్దాల ద్వారా చూస్తున్నట్లున్నారు. అందుకే ఆయన ‘విశ్వాసం’ అనే పదాన్ని ఆస్తికులకు ధారాదత్తం చేశారు. విశ్వాసం, నమ్మకం వంటి పదాలు పలు రకాల విషయాలకు ఆపాదితాలు అని మరిచారు. అసలు నాస్తికత కూడా ఒక విశ్వాసమే అని మరవడం దారుణం. ప్రపంచమంతా దైవం, దాని ఆధారిత మతాల పట్ల నమ్మకం లేకపోవడం వల్ల గాక... ఆ నమ్మకం, విశ్వాసం ముదిరి మూఢంగా, మూర్ఖంగా తయారై సాటి జీవుల పట్ల వైషమ్యాలు, కక్షలు, హననాలకు కారణం అవుతున్నప్పుడు, ఇటువంటి వ్యాఖ్యల వల్ల (స్టీఫెన్ హాకింగ్ చేసిన వ్యాఖ్యల వల్ల ) వాటి కాఠిన్యం కాస్తయినా తగ్గి సకల సృష్టికి మంచి జరుగుతుందని ఆశిద్దాం. - ఒక అజ్ఞేయతావాది (Agnostic) -
ఐన్‌స్టీన్ సిద్ధాంతానికి కృష్ణబిలాల ఆధారం
విశ్వంలో గురుత్వాకర్షణ శక్తి తరంగాలు విడుదలవుతుంటాయని సాపేక్ష సిద్ధాంతంలో ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ చేసిన ప్రతిపాదనకు బలం చేకూర్చే ఆధారాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాంతితో సహా విశ్వంలోని అన్ని రకాల పదార్థాలనూ హాంఫట్ చేసేసే కృష్ణబిలాలు సాధారణంగా అన్ని గెలాక్సీల కేంద్రాల్లోనూ ఉన్నా.. చాలావరకూ ఒక భారీ కృష్ణబిలం(సూపర్ మ్యాసివ్ బ్లాక్‌హోల్) మాత్రమే ఉంటుందని ఇదివరకూ గుర్తించారు. కానీ.. 400 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఓ గెలాక్సీ కేంద్రంలో మూడు భారీ కృష్ణబిలాలు అతిదగ్గరగా పరస్పరం బంధించబడి ఉన్నాయని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కేప్‌టౌన్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ఈ కృష్ణబిలాలు మన సూర్యుడి కన్నా.. 10 లక్షల నుంచి 1,000 కోట్ల రె ట్ల ద్రవ్యరాశితో ఉండవచ్చట. వీటిలో రెండు కృష్ణబిలాలు చాలా దగ్గరగా 500 కాంతి సంవత్సరాల దూరంలోనే ఉండటమే కాకుండా, అవి ఒకదాని చుట్టూ ఒకటి ధ్వనివేగానికి 300 రెట్ల వేగంతో తిరుగుతున్నాయట. అందువల్ల వీటి నుంచి వెలువడుతున్న గురుత్వాకర్షణ శక్తి అలల మాదిరిగా అంతరిక్షంలోకి విడుదలవుతోందట. అలాగే దూరంగా ఉండటం వల్ల మరో బ్లాక్‌హోల్ నుంచి సరళరేఖ మాదిరిగా శక్తి తరంగాలు వెలువడుతున్నాయట. ఐన్‌స్టీన్ ఊహించిన గురుత్వాకర్షణ తరంగాల అన్వేషణకు ఈ కృష్ణబిలాలపై అధ్యయనం బాగా దోహదపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
వేలానికి ఐన్‌స్టీన్ లేఖలు
న్యూయార్క్: ఐన్‌స్టీన్ 1938లో రాసిన రెండు లేఖలు వేలానికి పెట్టారు. దానిలో తన లెక్కల్లో తప్పు ఉందని అంగీకరిస్తూ ఐన్‌స్టీన్ ఒక స్టూడెండ్కు రాసిన లేఖ ఉండడంతో వాటికి భారీగా ధర పలికే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ లేఖలకు వేలం నిర్వాహకులు రూ. 2 కోట్ల 43 లక్షల ధర నిర్ణయించే అవకాశం ఉంది. కొలంబియా యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ చేస్తున్న సమయంలో హెర్బర్ట్ సాల్జర్ అనే విద్యార్థి 1938లో ఐన్‌స్టీన్‌కు ఒక లేఖ రాశాడు. ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన దూర సమాంతర క్షేత్ర సిద్ధాంతం (డిస్టాంట్ పారలిజం ఫీల్డ్ థియరీ)లో తప్పును కనుగొని ఆయనకు లేఖ రాశాడు. ఆ లేఖకు ఐన్‌స్టీన్ రెండు సార్లు బదులిచ్చారు. 1938 ఆగస్టు 29న తొలుత బదులిస్తూ సాల్జర్ ప్రతిపాదన సాధ్యం కాదని చెప్పారు. రెండువారాల తర్వాత తన తప్పును అంగీకరిస్తూ సాల్జర్కు మరో లేఖ రాశారు. అందులో తనదే తప్పని ఒప్పుకొన్నారు. సాల్జర్కు ఐన్‌స్టీన్ రాసిన రెండు ఉత్తరాలు నవంబర్ 17న ఇక్కడి గ్యుయెర్సీస్ ఆక్షన్ హౌస్‌లో వేలం వేయబోతున్నారు. -
సంస్కృతి పునరుద్ధరణకు పూనుకోవాలి
మన కాలంలోని విజ్ఞులు వేదాల గొప్పతనాన్ని కొనియాడారు. మనకు లెక్కించడం నేర్పిన భారతీయులకు మనం ఎంతో రుణపడి ఉండాలి, అది లేకుండా ఏ శాస్త్ర ఆవిష్కరణా సాధ్యమయ్యేది కాదని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వ్యాఖ్యానించారు. ఈ సృష్టి మొత్తం యోగ. ఈ సృష్టిలో ప్రతిదీ యోగికి అందుబాటులో ఉంటుంది. యోగశక్తితోనే మన పూర్వికులు సృష్టిరహస్యాలను ఛేదించారు. అందుకే మన కాలంలోని విజ్ఞులు వేదాల గొప్పతనాన్ని కొనియాడారు. మనకు లెక్కించడం నేర్పిన భారతీయులకు మనం ఎంతో రుణపడి ఉండాలి, అది లేకుండా ఏ శాస్త్ర ఆవిష్కరణా సాధ్యమయ్యేది కాదని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వ్యాఖ్యానించారు. గత శతాబ్దాలన్నింటితో పోలిస్తే ఈ శతాబ్దపు ప్రత్యేకత వేదాలు అందుబాటులో ఉండటమేనని అణుబాంబుకు పితామహుడైన ఓపెన్ హీమర్ పేర్కొన్నాడు. మనమంతా ఆ రుషులకు వారసులమే, వారి నుంచి అనంతమైన వైదికజ్ఞానాన్ని ఆర్జించాం. హవనాలకు సంబంధించిన వైదిక విజ్ఞానం అందులో ఒకటి. హవనాలు అంటే హోమాలు, యజ్ఞాలు. అవి కేవలం కర్మకాండలు కావు. అగ్నిశక్తిని సమీకరించి వాతావరణాన్ని శుద్ధి చేసేందుకు ఈ సృష్టిలో ఉన్న శక్తులతో సంయోగపరుస్తాయి. అభివ్యక్తమయ్యే సృష్టిలో అన్ని కోణాలు పంచభూతాలైన పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశాలతో కూడినవే. వీటన్నింటిలో కూడా అగ్ని ప్రత్యేకస్థానాన్ని కలిగి ఉంది. పంచభూతాల్లో మిగిలిన వాటిని కలుషితం చేయగలరు కాని అగ్నిని చేయలేరు. శుద్ధికి, ఇతర పదార్థాలలో పరివర్తన తేవడంలో ఇది వాహనంగా ఉంటుంది. హవనంలో అగ్నికి అన్నింటినీ సమర్పిస్తారు. ఇందుకు బదులుగా అగ్ని వీటిని దేవలోకాన్ని పోషించే నిర్దిష్టమైన సువాసనలుగా మారుస్తుంది. మనం పళ్లు, కాయగూరలపై ఆధారపడి జీవించినట్టే, దేవతలు సువాసనలపై ఆధారపడి జీవిస్తారు. కనుక ఇది సంపూర్ణంగా ఉండటం అత్యంత కీలకం. దీనివల్ల సమర్పించే సమిధ, సామగ్రి, ఘృతం స్వచ్ఛంగా ఎంచుకోవడమే కాకుండా ఉచ్చారణ, భావ స్వచ్ఛత అవసరం అవుతాయి. గురు సన్నిధిలో వైదిక హవనం సమర్పించినప్పుడు అందులో పాల్గొన్నవారికి అద్భుతమైన అనుభవాలు కలుగుతాయి. అటువంటి హవనంలో హవన కుండం నుంచి పొగ ఎప్పుడూ బయటకు రాదు. అది జల్లే సువాసనలు మనసుకు ఎంతో హాయిని, ప్రశాంతతను, స్వస్థతను చేకూర్చే లక్షణాలను కలిగి ఉంటాయి. హవన అగ్నిపై తమ దృష్టిని నిలిపిన వారికి దీర్ఘరోగాలు నయమవుతాయని శాస్త్రోక్తి. వాతావరణం కూడా ఎంతో ప్రశాంతంగా, స్వచ్ఛంగా మారి పక్షులు వచ్చి దగ్గరలో ఉన్న చెట్లపై వాలతాయి. నిజమైన హవనానికి ఉన్న ఆకర్షణ శక్తి అది. ఈ ప్రతికూల కాలంలో దురదృష్టవశాత్తు మనం మన సంస్కృతిని మరచిపోతున్నాం. అన్యాయాలపై ఎవరూ పోరాటం చేయరు. ఈ సృష్టి గందరగోళమై, చెడు ఆధిపత్యం సాధిస్తుంది. నేడు నదులు ఎండిపోతున్నాయి. ప్రతి రెండు రోజులకొకసారి వరదలు, భూకంపాలు, సునామీల కారణంగా భారీస్థాయిలో విధ్వంసం, దుఃఖం కలుగుతున్నాయని మనం వింటుంటాం. యోగను స్వస్థత చేకూర్చే ఒక చికిత్స ప్రక్రియగా, ధర్మాన్ని మతంగా, హవనాలను కళ్లను మండించే బూడిదగా, ధూపాలుగా, గొంతుకడ్డం పడేదిగా, దీర్ఘాలు తీసే మంత్రాలుగా, దైవాన్ని ఆవాహన చేసేవిగా గాక సహనాన్ని పరీక్షించేవిగా చూస్తున్నారు. దుర్గంధంతో, వినలేని చప్పుడు ఉన్నచోటుకు విందుకు ఆహ్వానం అందడాన్ని ఊహించుకోండి. మీరు వెడతారా? అందుకు విరుద్ధంగా మళ్లీ తిరిగి రాకూడదనే నిర్ణయం తీసుకునేలా చేస్తాయి. దేవతల విషయంలోనూ ఇదే నిజం... ప్రస్తుతం కలియుగంలో దేవలోకం పౌష్టికాహార లేమితో ఉంది. హవనాల నిర్వహణలో కొరత ఉంది. నిర్వహించే వాటిలో కూడా అధికం అవసరమైన స్వచ్ఛత స్థాయి ప్రమాణాలను అందుకోలేవు. ధ్యానకేంద్రాలలో స్వచ్ఛంద సేవకులు మానవాళికి, సృష్టికి సేవ చేయడంలో... కనుమరుగైపోతున్న మన సంస్కృతిని పునరుద్ధరించే ప్రయత్నం చేయాలి. యోగి అశ్విని వ్యవస్థాపకులు, ధ్యాన్ ఫౌండేషన్