న్యూయార్క్: ఐన్‌స్టీన్ 1938లో రాసిన రెండు లేఖలు వేలానికి పెట్టారు. దానిలో తన లెక్కల్లో తప్పు ఉందని అంగీకరిస్తూ ఐన్‌స్టీన్ ఒక స్టూడెండ్‌కు రాసిన లేఖ ఉండడంతో వాటికి భారీగా ధర పలికే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ లేఖలకు వేలం నిర్వాహకులు రూ. 2 కోట్ల 43 లక్షల ధర నిర్ణయించే అవకాశం ఉంది.
కొలంబియా యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ చేస్తున్న సమయంలో హెర్బర్ట్ సాల్జర్ అనే విద్యార్థి 1938లో ఐన్‌స్టీన్‌కు ఒక లేఖ రాశాడు. ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన దూర సమాంతర క్షేత్ర సిద్ధాంతం (డిస్టాంట్ పారలిజం ఫీల్డ్ థియరీ)లో తప్పును కనుగొని ఆయనకు లేఖ రాశాడు. ఆ లేఖకు ఐన్‌స్టీన్ రెండు సార్లు బదులిచ్చారు. 1938 ఆగస్టు 29న తొలుత బదులిస్తూ సాల్జర్ ప్రతిపాదన సాధ్యం కాదని చెప్పారు. రెండువారాల తర్వాత తన తప్పును అంగీకరిస్తూ సాల్జర్‌కు మరో లేఖ రాశారు. అందులో తనదే తప్పని ఒప్పుకొన్నారు. సాల్జర్‌కు ఐన్‌స్టీన్ రాసిన రెండు ఉత్తరాలు నవంబర్ 17న ఇక్కడి గ్యుయెర్సీస్ ఆక్షన్ హౌస్‌లో వేలం వేయబోతున్నారు.