2 పేజీల లేఖ ఖరీదు రూ.35 లక్షలు! | Albert Einstein's Letter Fetches USD 54,000 At An Auction | Sakshi
Sakshi News home page

2 పేజీల లేఖ ఖరీదు రూ.35 లక్షలు!

Published Wed, Apr 5 2017 9:29 AM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM

2 పేజీల లేఖ ఖరీదు రూ.35 లక్షలు!

2 పేజీల లేఖ ఖరీదు రూ.35 లక్షలు!

లాస్‌ ఏంజిలెస్‌: ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టిన్‌ రాసిన ఓ లేఖ వేలంలో దాదాపు రూ.35 లక్షల ధర పలికింది. 1953లో అర్థర్‌ కన్వెర్స్‌ అనే సైన్స్‌ టీచర్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఐన్‌స్టీన్ ఈ లేఖ రాశారు. 2 పేజీల ఈ లేఖలో ఎలక్ట్రోస్టాటిక్‌ థియరీకి సంబంధించిన వివరాలు ఉన్నాయి.

‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీ ఉయ ప్రిన్స్‌టన్, రూమ్‌ నంబర్‌ 115, న్యూ జెర్సీ’ చిరునామాతో ఉన్న ఈ లేఖను తీసుకొచ్చిన గుర్తు తెలియని వ్యక్తి దీని ధర 15,000 డాలర్లుగా ప్రకటించగా తర్వా త అది 53,503 డాలర్లకు అమ్ముడుపోయింది. ఇన్నిరోజులపాటు ఈ లేఖ కన్వెర్స్‌ కుటుంబం వద్దే ఉన్నదని, ఆయన టీచర్‌గా ఉన్న సమయంలో సందేహాల నివృత్తి కోసం ఆయన ఐన్‌స్టీన్ కు తరచూ లేఖరు రాసేవారని వేలంపాట నిర్వాహకుడు నేట్‌ డీ శాండర్స్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement