2 పేజీల లేఖ ఖరీదు రూ.35 లక్షలు!
లాస్ ఏంజిలెస్: ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్స్టిన్ రాసిన ఓ లేఖ వేలంలో దాదాపు రూ.35 లక్షల ధర పలికింది. 1953లో అర్థర్ కన్వెర్స్ అనే సైన్స్ టీచర్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఐన్‌స్టీన్ ఈ లేఖ రాశారు. 2 పేజీల ఈ లేఖలో ఎలక్ట్రోస్టాటిక్ థియరీకి సంబంధించిన వివరాలు ఉన్నాయి.
‘ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీ ఉయ ప్రిన్స్టన్, రూమ్ నంబర్ 115, న్యూ జెర్సీ’ చిరునామాతో ఉన్న ఈ లేఖను తీసుకొచ్చిన గుర్తు తెలియని వ్యక్తి దీని ధర 15,000 డాలర్లుగా ప్రకటించగా తర్వా త అది 53,503 డాలర్లకు అమ్ముడుపోయింది. ఇన్నిరోజులపాటు ఈ లేఖ కన్వెర్స్ కుటుంబం వద్దే ఉన్నదని, ఆయన టీచర్‌గా ఉన్న సమయంలో సందేహాల నివృత్తి కోసం ఆయన ఐన్‌స్టీన్ కు తరచూ లేఖరు రాసేవారని వేలంపాట నిర్వాహకుడు నేట్ డీ శాండర్స్ తెలిపారు.