మెక్సికో సిటీ: ఇంటెలిజెన్స్ కోషెంట్.. దీన్నే షార్ట్‌కట్‌లో ఐక్యూ అంటారు. ఇది ఎవరైనా ఒక వ్యక్తి తెలివితేటల స్థాయిని చెప్పే ఓ కొలమానం అనొచ్చు. సమస్యలను విశ్లేషించగల, పరిష్కరించగల సామర్థ్యానికి కొలమానం ఇది. అయితే ఇప్పటి వరకు అత్యధిక ఐక్యూ ఉన్న వారి జాబితాలో ప్రముఖ శాస్త్రవేత్తలు అల్బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫేన్ హాకింగ్‌లు ప్రథమ స్థానంలో ఉన్నారు. వీరి ఐక్యూ లెవల్స్ 160 వరకు ఉన్నట్లు ప్రచారం ఉంది. ఐక్యూ విషయంలో వీరిని మించిపోయింది మెక్సికన్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలిక. ఈ చిన్నారి ఐక్యూ ఏకంగా 162గా గుర్తించారు. ఆ వివరాలు..
మెక్సికోకు చెందిన అధారా పెరెజ్ (8) అనే చిన్నారి మెక్సికోలోని తలాహుక్ మురికివాడ ప్రాంతంలో నివసిస్తూ ఉండేది. అయితే మూడేళ్ల ప్రాయంలో ఉండగా అధారా అస్పెర్జర్ సిండ్రోమ్ (ఆటిజం కోవకు చెందిన వ్యాధి)బారిన పడింది. ఫలితంగా డిప్రెషన్‌తో బాధపడుతుండేది. స్కూల్‌కు వెళ్లడానికి కూడా ఇష్టపడేది కాదు. ఈ క్రమంలో అధారా తల్లిదండ్రులు ఆమెను థెరపీ కోసం సైక్రియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ అధారాను పరీక్షించిన వైద్యులు చిన్నారిలో అసమాన తెలివితేటలు ఉండటం గమనించారు. (చదవండి: నో స్వెట్ సర్జరీ: గుండెపోటుతో యంగ్ బాడీ బిల్డర్ మృతి)
ఈ క్రమంలో అధారాను టాలెంట్ కేర్ సెంటర్‌కు తీసుకెళ్లమని సూచించారు. అక్కడ అధారా ఐక్యూని పరీక్షించగా.. 162గా తేలింది. ఇక టాలెంట్ కేంద్రంలో ఒకే రకమైన స్కిల్స్ ఉన్న విద్యార్థులను చేర్చుకుని వారికి చదువు చెప్తారు. ఈ క్రమంలో అధారాను అక్కడ చేర్చుకున్నారు. (చదవండి: Albert Einstein Birth Anniversary: విశ్వనరుడు ఐన్‌స్టీన్)
టాలెంట్ కేర్ సెంటర్‌లో చేరిన అధారా ఎనిమిదేళ్ల వయసు వచ్చే సరికే ఎలిమెంటరీ, మిడిల్, హై స్కూల్ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. అంతేకాక రెండు ఆన్‌లైన్ డిగ్రీలు పొందింది అధారా. తన అనుభవాల గురించి తెలియజేస్తూ.. ‘డు నాట్ గివ్ అప్’ పేరుతో పుస్తకం కూడా రాసింది. ఇక మానసిక వైకల్యం ఉన్న వారి ఎమోషన్స్‌ని నిత్యం పరిశీలించేందుకు గాను ఓ స్మార్ట్ బ్రాస్‌లెట్‌ని అభివృద్ధి చేసింది. ఆస్ట్రోనాట్ అయి అంతరిక్షం వెళ్లాలని.. అంగారకుడిపై వలస రాజ్యం స్థాపించాలనేది అధారా కోరిక. (చదవండి: ఖగోళ అద్భుతం: బ్లాక్ హోల్ వెనుక ఫస్ట్ టైం వెలుగులు)
తన ప్రతిభ ఆధారంగా అధారా ఫోర్బ్స్ మెక్సికో 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా అధారా తల్లి మాట్లాడుతూ ‘‘అస్పెర్జర్ సిండ్రోమ్ కారణంగా బాల్యంలో నా కుమార్తె ఎవరితో త్వరగా కలిసేది కాదు. ఓ సారి తను ఓ చిన్న ఇంట్లో స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా.. ఫ్రెండ్స్ అధారాను గదిలో పెట్టి బంధించారు. బయట నుంచి తనను హేళన చేయసాగారు. ఆ రోజు నా కుమార్తె పడిన బాధ చూసి.. తనను ఒంటరిగా వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నాను. ఈరోజు తన తెలివితేటలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment