Janhvi Kapoor Breaks Silence On Bawaal's Auschwitz Dialogue Controversy - Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: సినిమా చూసి ఆయన భావోద్వేగానికి గురయ్యారు: జాన్వీ కపూర్

Published Wed, Jul 26 2023 9:18 PM

Janhvi Kapoor Breaks Silence On Bawaal Auschwitz Dialogue Controversy - Sakshi

శ్రీదేవి కూతురిగా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ సినిమాలతోనూ బిజీగా ఉన్న భామ ఇటీవల వరుణ్‌ ధావన్‌ సరసన నటించిన బవాల్ చిత్రం రిలీజైంది. అయితే ఈ చిత్రాన్ని డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేశారు. జూలై 21 నుంచి ఆమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ ‍అవుతోంది.

ఈ చిత్రానికి పాజిటివ్‌ టాక్ రాగా.. కొన్ని సీన్స్‌పై మాత్రం తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆష్విట్జ్‌తో ఉన్న సంబంధాలను తెరపై చూపించడంపై ఈ సినిమాపై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. ఆష్విట్జ్‌ క్యాంపులను చూపించడాన్ని వాళ్లు తప్పుబడుతున్నారు. కాగా.. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి నితీశ్‌ తివారీ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ వివాదంపై జాన్వీ కపూర్ స్పందించారు. 

(ఇది చదవండి: కమెడియన్‌తో హీరోయిన్ డేటింగ్.. సోషల్ మీడియాలో వైరల్!)

వివాదంపై జాన్వీకపూర్‌ మాట్లాడుతూ.. 'ఇజ్రాయెల్‌ దేశస్థుడైన వ్యక్తి నాకు తెలుసు. అతను ఐవీ లీగ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్. అతడి పూర్వీకులు దురదృష్టవశాత్తు  నాజీల నిర్బంధంలో ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల అతను ఈ చిత్రాన్ని చూసి ఆయన భావోద్వేగానికి గురయ్యారు. మేము తీసిన విధానాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. అంతేకాదు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. సన్నివేశాల్లో ఎక్కడా ఒక్కసారి కూడా బాధించేలా చూపించలేదు. కాబట్టి ఏదైనా ప్రేక్షకుల దృష్టి కోణంపైనే ఆధారపడి ఉంటుంది. మా ఉద్దేశ్యం రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన నష్టాన్ని చూపించడమే.  మీరు మా ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మా ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే నేను ఏమీ చేయలేను. ఈ సినిమాలోని నా పాత్రను చూసి పలువురు విద్యార్థులు చలించిపోయారు. నా పాత్ర చూశాక వాళ్లకు ఒక ధైర్యం వచ్చిందని చెప్పారు. అది నాకెంతో గర్వంగా అనిపించింది.' అని అ‍న్నారు. 

ఆష్విట్జ్‌ అంటే ఏంటి?

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్‌ నాజీలు ఏర్పాటు చేసిన నిర్బంధ క్యాంపులనే ఆష్విట్జ్‌ అంటారు. ఈ క్యాంపుల్లో యూదులను నిర్బంధించి చిత్రహింసలు పెట్టేవారని సమాచారం. ఆష్విట్జ్‌లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. రెండో ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులను తెలియజేస్తూ తెరకెక్కిన ‘బవాల్‌’లో ఆష్విట్జ్ క్యాంపులను చూపించడంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా..బవాల్‌లో వరుణ్, జాన్వీ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మాస్‌ ఆడియన్స్‌కు బాగా నచ్చింది.

(ఇది చదవండి: విమానంలో వెకిలి చేష్టలు.. బొక్కలిరగ్గొట్టిన టాలీవుడ్‌ నటి)

Advertisement
 
Advertisement
 
Advertisement