Bawaal Movie
-
మరింత ముదురుతోన్న ఆష్విట్జ్ వివాదం.. ఆ సినిమాను తొలగించాలంటూ డిమాండ్!
బాలీవుడ్ భామ జాన్వీకపూర్, వరుణ్ ధావన్ జంటగా నటించిన తాజా చిత్రం బవాల్. ఈ చిత్రంలో జూలై 21న నేరుగా ఓటీటీలోనే రిలీజైంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారి తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు వివాదానికి దారితీస్తున్నాయి. ఇటీవలే ఆష్విట్జ్ సీన్స్‌పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. యూదుల మారణకాండను ఉద్దేశించేలా చిత్రీకరించిన సన్నివేశాలపై నెటిజన్స్ తీవ్ర అభ్యంతరం చేస్తున్నారు. (ఇది చదవండి: ఫ్రెండ్ పార్టీలో చిల్ అవుతోన్న టాలీవుడ్ హీరోయిన్.. ఏకంగా మందు కొడుతూ!) ఈ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని ఓటీటీ నుంచి పూర్తిగా తొలగించాలని యూదుల మానవ హక్కుల సంస్థ సైమన్ వైసెంతల్ సెంటర్ రంగంలోకి దిగింది. ఈ చిత్రాన్ని వెంటనే అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. నాజీల డెత్ క్యాంపుల్లోని సన్నివేశాలతో దర్శకుడు ప్రచారం పొందాలనుకున్నాడని ఆరోపించింది. హిట్లర్ జరిపిన మారణహోమంలో 6 మిలియన్ల మంది యూదులు ప్రాణాలు కోల్పోయారు. ఆ నరమేధాన్ని ఈ సినిమాలో తక్కువ చేసి చూపించారు. అందుకే ఈ చిత్రాన్ని వెంటనే ప్రైమ్ నుంచి తొలగించాలని మానవ హక్కుల సంస్థ సైమన్ వైసెంతల్ సెంటర్ అసోసియేట్ డీన్, డైరెక్టర్ ఆఫ్ గ్లోబల్ సోషల్ యాక్షన్ రబ్బీ అబ్రహం కూపర్ డిమాండ్ చేశారు. ఆష్విట్జ్ అంటే ఏంటి? రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ నాజీలు ఏర్పాటు చేసిన నిర్బంధ క్యాంపులనే ఆష్విట్జ్ అంటారు. ఈ క్యాంపుల్లో యూదులను నిర్బంధించి చిత్రహింసలు పెట్టేవారు. ఆష్విట్జ్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. రెండో ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులను తెలియజేస్తూ తెరకెక్కిన ‘బవాల్’లో ఆష్విట్జ్ క్యాంపులను చూపించడంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. నెటిజన్స్ కామెంట్స్ సైతం జాన్వీ కపూర్ స్పందించింది. మీరు సరైన కోణంలో చూడాలని కౌంటర్ ఇచ్చింది. మరోవైపు నెట్టింట జరుగుతోన్న వివాదంపై నితీశ్ తివారీ ఇటీవల స్పందించారు. బవాల్‌లో మంచి సందేశాలు ఉన్నాయని తెలిపారు. ఆష్విట్జ్లో ఎదురైన పరిస్థితులు చూసి అజ్జూ, నిషా చలించిపోయినట్టు చూపించాం కదా.. విమర్శలు చేసేవాళ్లకు అవీ కనిపించలేదా? అని నితీశ్ ప్రశ్నించారు. (ఇది చదవండి: బుల్లితెర నటి ఐవీఎఫ్.. నాలుగో ప్రయత్నంలో విజయం.. కానీ..) -
ఆష్విట్జ్ సీన్ వివాదం.. నెటిజన్స్‌కు జాన్వీ స్ట్రాంగ్ కౌంటర్!
శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ సినిమాలతోనూ బిజీగా ఉన్న భామ ఇటీవల వరుణ్ ధావన్ సరసన నటించిన బవాల్ చిత్రం రిలీజైంది. అయితే ఈ చిత్రాన్ని డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేశారు. జూలై 21 నుంచి ఆమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రాగా.. కొన్ని సీన్స్‌పై మాత్రం తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆష్విట్జ్తో ఉన్న సంబంధాలను తెరపై చూపించడంపై ఈ సినిమాపై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. ఆష్విట్జ్ క్యాంపులను చూపించడాన్ని వాళ్లు తప్పుబడుతున్నారు. కాగా.. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి నితీశ్ తివారీ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ వివాదంపై జాన్వీ కపూర్ స్పందించారు. (ఇది చదవండి: కమెడియన్‌తో హీరోయిన్ డేటింగ్.. సోషల్ మీడియాలో వైరల్!) వివాదంపై జాన్వీకపూర్ మాట్లాడుతూ.. 'ఇజ్రాయెల్ దేశస్థుడైన వ్యక్తి నాకు తెలుసు. అతను ఐవీ లీగ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్. అతడి పూర్వీకులు దురదృష్టవశాత్తు నాజీల నిర్బంధంలో ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల అతను ఈ చిత్రాన్ని చూసి ఆయన భావోద్వేగానికి గురయ్యారు. మేము తీసిన విధానాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. అంతేకాదు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. సన్నివేశాల్లో ఎక్కడా ఒక్కసారి కూడా బాధించేలా చూపించలేదు. కాబట్టి ఏదైనా ప్రేక్షకుల దృష్టి కోణంపైనే ఆధారపడి ఉంటుంది. మా ఉద్దేశ్యం రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన నష్టాన్ని చూపించడమే. మీరు మా ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మా ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే నేను ఏమీ చేయలేను. ఈ సినిమాలోని నా పాత్రను చూసి పలువురు విద్యార్థులు చలించిపోయారు. నా పాత్ర చూశాక వాళ్లకు ఒక ధైర్యం వచ్చిందని చెప్పారు. అది నాకెంతో గర్వంగా అనిపించింది.' అని అన్నారు. ఆష్విట్జ్ అంటే ఏంటి? రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ నాజీలు ఏర్పాటు చేసిన నిర్బంధ క్యాంపులనే ఆష్విట్జ్ అంటారు. ఈ క్యాంపుల్లో యూదులను నిర్బంధించి చిత్రహింసలు పెట్టేవారని సమాచారం. ఆష్విట్జ్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. రెండో ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులను తెలియజేస్తూ తెరకెక్కిన ‘బవాల్’లో ఆష్విట్జ్ క్యాంపులను చూపించడంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా..బవాల్‌లో వరుణ్, జాన్వీ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మాస్ ఆడియన్స్‌కు బాగా నచ్చింది. (ఇది చదవండి: విమానంలో వెకిలి చేష్టలు.. బొక్కలిరగ్గొట్టిన టాలీవుడ్ నటి) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
ఓటీటీల్లో ఈ శుక్రవారం 15 సినిమాలు రిలీజ్
ఎప్పటిలానే మరో వీకెండ్ వచ్చేసింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో బయటకెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి మరేం చేయాలి. ఇంట్లోనే కూర్చుని చిల్ అవ్వాలి. అలా కావాలంటే ఎంటర్ టైన్మెంట్ ఉండాలి. కట్ చేస్తే ఈ శుక్రవారం ఏకంగా 15 సినిమాలు-వెబ్ సిరీసులు ఓటీటీల్లో రిలీజ్‌కు రెడీ అయిపోయాయి. వీటిలో స్ట్రెయిట్ తెలుగు మూవీస్‌తో పాటు డబ్బింగ్ చిత్రాలు-సిరీసులు కూడా ఉన్నాయండోయ్. వీటిలో 'అశ్విన్స్', 'ధూమమ్' చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటిని మీరు ట్రై చేయొచ్చు. (ఇదీ చదవండి: ప్రభాస్ ఫస్ట్‌లుక్ డిలీట్.. దానికి భయపడ్డారా?) ఈ శుక్రవారం విడుదలయ్యే సినిమాల లిస్ట్ నెట్‌ఫ్లిక్స్ దే క్లోన్డ్ టైరోన్ - ఇంగ్లీష్ చిత్రం స్వీట్ మంగోలియన్స్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) అశ్విన్స్ - తెలుగు సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్) రేవన్ సాంగ్ - అరబిక్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది) అమెజాన్ ప్రైమ్ ధూమమ్ - తెలుగు డబ్బింగ్ సినిమా బవాల్ - హిందీ మూవీ అన్‌స్టాపబుల్ - తెలుగు చిత్రం (ఆల్రెడీ స్ట్రీమింగ్) గాయ్ రిచ్చీస్ ద కోవనెంట్ - ఇంగ్లీష్ సినిమా ఆహా నచ్చింది గర్ల్‌ఫ్రెండూ - తెలుగు సినిమా నేను సూపర్ ఉమెన్ - బిజినెస్ రియాలిటీ షో జీ5 మౌరా - పంజాబీ చిత్రం జియో సినిమా ట్రయల్ పీరియడ్ - హిందీ మూవీ చాంద్ లో - గుజరాతీ సినిమా- జూలై 22 స్పెషల్ ఊప్స్: లయనెస్ - ఇంగ్లీష్ సిరీస్ - జూలై 23 దో గుబ్బారే - హిందీ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) (ఇదీ చదవండి: ఇదేం ఫస్ట్ లుక్! 'ప్రాజెక్ట్ K'పై ఘోరమైన ట్రోల్స్)