బాలీవుడ్ భామ జాన్వీకపూర్, వరుణ్ ధావన్ జంటగా నటించిన తాజా చిత్రం బవాల్. ఈ చిత్రంలో జూలై 21న నేరుగా ఓటీటీలోనే రిలీజైంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారి తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు వివాదానికి దారితీస్తున్నాయి. ఇటీవలే ఆష్విట్జ్ సీన్స్‌పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. యూదుల మారణకాండను ఉద్దేశించేలా చిత్రీకరించిన సన్నివేశాలపై నెటిజన్స్ తీవ్ర అభ్యంతరం చేస్తున్నారు.
(ఇది చదవండి: ఫ్రెండ్ పార్టీలో చిల్ అవుతోన్న టాలీవుడ్ హీరోయిన్.. ఏకంగా మందు కొడుతూ!)
ఈ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని ఓటీటీ నుంచి పూర్తిగా తొలగించాలని యూదుల మానవ హక్కుల సంస్థ సైమన్ వైసెంతల్ సెంటర్ రంగంలోకి దిగింది. ఈ చిత్రాన్ని వెంటనే అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. నాజీల డెత్ క్యాంపుల‍్లోని సన్నివేశాలతో దర్శకుడు ప్రచారం పొందాలనుకున్నాడని ఆరోపించింది. హిట్లర్ జరిపిన మారణహోమంలో 6 మిలియన్ల మంది యూదులు ప్రాణాలు కోల్పోయారు. ఆ నరమేధాన్ని ఈ సినిమాలో తక్కువ చేసి చూపించారు. అందుకే ఈ చిత్రాన్ని వెంటనే ప్రైమ్ నుంచి తొలగించాలని మానవ హక్కుల సంస్థ సైమన్ వైసెంతల్ సెంటర్ అసోసియేట్ డీన్, డైరెక్టర్ ఆఫ్ గ్లోబల్ సోషల్ యాక్షన్ రబ్బీ అబ్రహం కూపర్ డిమాండ్ చేశారు.
ఆష్విట్జ్ అంటే ఏంటి?
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ నాజీలు ఏర్పాటు చేసిన నిర్బంధ క్యాంపులనే ఆష్విట్జ్ అంటారు. ఈ క్యాంపుల్లో యూదులను నిర్బంధించి చిత్రహింసలు పెట్టేవారు. ఆష్విట్జ్‌లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. రెండో ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులను తెలియజేస్తూ తెరకెక్కిన ‘బవాల్’లో ఆష్విట్జ్ క్యాంపులను చూపించడంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. నెటిజన్స్ కామెంట్స్ సైతం జాన్వీ కపూర్ స్పందించింది. మీరు సరైన కోణంలో చూడాలని కౌంటర్ ఇచ్చింది. మరోవైపు నెట్టింట జరుగుతోన్న వివాదంపై నితీశ్ తివారీ ఇటీవల స్పందించారు. బవాల్‌లో మంచి సందేశాలు ఉన్నాయని తెలిపారు. ఆష్విట్జ్‌లో ఎదురైన పరిస్థితులు చూసి అజ్జూ, నిషా చలించిపోయినట్టు చూపించాం కదా.. విమర్శలు చేసేవాళ్లకు అవీ కనిపించలేదా? అని నితీశ్ ప్రశ్నించారు.
(ఇది చదవండి: బుల్లితెర నటి ఐవీఎఫ్.. నాలుగో ప్రయత్నంలో విజయం.. కానీ..)
Comments
Please login to add a commentAdd a comment