ఓటీటీలో రూ.700 కోట్ల సినిమా.. ఉచితంగా చూసేయండి | Rajkummar Rao and Shraddha Kapoor Movie is now streaming on this OTT | Sakshi
Sakshi News home page

ఫ్రీ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన హారర్‌ కామెడీ థ్రిల్లర్.. మీరు చూశారా?

Published Thu, Oct 10 2024 4:25 PM | Last Updated on Thu, Oct 10 2024 4:42 PM

Rajkummar Rao and Shraddha Kapoor Movie is now streaming on this OTT

ఇటీవల థియేటర్లలో రిలీజై బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ చిత్రంగా నిలిచింది. ఆగస్టు 15న రిలీజై ఈ ఏడాదిలోనే అత్యధిక వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా యానిమల్, పఠాన్, బాహుబలి లాంటి పెద్ద సినిమాల రికార్డులను అధిగమించింది. రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్‌ ప్రధాన పాత్రల్లో వచ్చిన మూవీ స్త్రీ- 2.  అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ హారర్ కామెడీ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.

తాజాగా ఈ మూవీ ఓటీటీకి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పటికే అద్దె ప్రాతిపదికన ప్రైమ్‌లో అందుబాటులో ఉన్న ఈ సినిమా.. నేటి నుంచి ఉచితంగా అందుబాటులోకి వచ్చేసింది. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్‌శక్తి ఖురానా కీలక పాత్రలు పోషించారు.


స్త్రీ 2 కథేంటంటే..

2018 లో రిలీజై భారీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన హారర్‌ థ్రిల్లర్‌ స్త్రీ  చిత్రానికి సీక్వెల్‌ ఇది. పార్ట్‌ 1లో స్త్రీ పీడా విరిగిపోయిందని చండేరీ ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. అయితే అప్పుడే సర్‌ ఖటా అనే విచిత్రమైన దెయ్యం ఒకటి ఊర్లోని అమ్మాయిలను మాయం చేయడం ప్రారంభిస్తుంది. అలా ఓ సారి విక్కీ (రాజ్ కుమార్ రావు) స్నేహితుడి ప్రియురాలిని సర్‌ ఖటా మాయం చేస్తుంది. దీంతో నలుగురు స్నేహితులు(రాజ్‌ కుమార్‌ రావు, పంకజ్‌ త్రిపాఠి, అభిషేక్‌ బెనర్జీ, అపర్‌ శక్తి ఖురానా) కలిసి స్త్రీ(శ్రద్ధా కపూర్‌) సహాయం కోరతారు. విచిత్రమైన దెయ్యం సర్‌ ఖటా నుంచి చండేరీ ప్రజలను ‘స్త్రీ’ గ్యాంగ్‌ ఎలా రక్షించింది అనేది ఈ సినిమా స్టోరీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement