
యానిమల్ మూవీతో ఊహించని క్రేజ్ దక్కించుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రీ. ఇందులో రణ్‌బీర్ ప్రియురాలి పాత్రలో మెప్పించింది. ఈ సినిమాలో తన గ్లామర్‌తో ఏకంగా పాన్ ఇండియాలో రేంజ్‌లో ఫేమస్ అయిపోయింది. దీంతో ఈ భామకు ఇండస్ట్రీలో అవకాశాలు క్యూ కడుతున్నాయి.
యానిమల్ తర్వాత విక్కీ కౌశల్, త్రిప్తి డిమ్రీ నటించిన చిత్రం బ్యాడ్ న్యూజ్. గత నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ యూత్‌ను బాగానే మెప్పిచింది. తాజాగా ఈ మూవీ ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం అద్దె ప్రాతిపదికన మాత్రమే అందుబాటులో ఉంది. రూ.349 చెల్లించి ఈ మూవీని కుటుంబసమేతంగా ఓటీటీలో చూసేయొచ్చు. ఈ సినిమాలో అమీ ఆర్క్, నేహా ధూపియా ప్రధాన పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment