బాలీవుడ్ భామ సారా అలీఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఏ వతన్ మేరే వతన్'. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ నిర్మించారు. కణ్ణన్ అయ్యర్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని థియేటర్‌లో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్‌లో ఈనెల 21 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ అమెజాన్ ప్రైమ్ గ్లింప్స్ రిలీజ్ చేసింది.
(ఇది చదవండి: బిగ్‌బాస్ షోలో కలిశారు.. రెండేళ్లుగా సహజీనవం.. ఇంతలో!)
ఈ సినిమాను భారత స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో అండర్ గ్రౌండ్ రేడియో స్టేషన్‌ను ఏర్పాటు చేసి.. ఉద్యమకారుల్లో ఉత్తేజం నింపిన ఓ మహిళ కథను తెరపై ఆవిష్కరించనున్నారు. ఉషా మెహతా అనే మహిళ జీవిత కథనే సినిమాగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. స్వాతంత్ర్య ఉద్యమకాలంలో రేడియో కీలక పాత్ర పోషించింది. ఇవాళ ప్రపంత రేడియో దినోత్సవం కావడంతో ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. కాగా.. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మి, సచిన్ ఖేడ్కర్, అభయ్ వర్మ, స్పార్ష్ శ్రీవాత్సవ, అలెక్స్ ఓ నేలి, ఆనంద్ తివారీ కీలక పాత్రలు పోషించారు.
resilience in her voice, and the spirit of freedom in her heart, hear what she has to say to you this #WorldRadioDay 📻#AeWatanMereWatanOnPrime, Mar 21#KaranJohar @apoorvamehta18 @somenmishra0 @SaraAliKhan #KannanIyer @darab_farooqui @Dharmatic_ pic.twitter.com/ZdQvDsFLjH
— prime video IN (@PrimeVideoIN) February 13, 2024
Comments
Please login to add a commentAdd a comment