స్టార్ హీరోయిన్ నటించిన ఓ మూవీ ఓటీటీలో నేరుగా రిలీజ్ కానుంది. స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్య కథతో తీసిన ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. విజువల్స్, స్టోరీ పరంగా కాస్త ఆసక్తి రేపుతున్న ఈ చిత్రం కోసం ఇప్పుడు సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఇదే సినిమా? ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
తెలుగులో తక్కువ కానీ హిందీలో చాలా సినిమాలు నేరుగా ప్రముఖ ఓటీటీల్లో రిలీజై అయిపోతున్నాయి. లాక్‌డౌన్ తర్వాత నుంచి ఈ ట్రెండ్ బాగా ఊపందుకుంది. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, హీరోయిన్ సారా అలీ ఖాన్ కాంబోలో తీసిన సినిమా 'ఏ వతన్ మేరే వతన్'. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఉషా మెహతా అనే స్వాతంత్ర్య ఉద్యమకారిణి జీవితాన్ని స్పూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
1942లో భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు చాలామంది నిస్వార్థంగా పనిచేశారు. అలా అండర్ గ్రౌండ్‌లో రేడియో స్టేషన్ ఏర్పాటు చేసి, ఉద్యమకారుల్లో చైతన్యాన్ని రగిల్చిన ఓ మహిళ కథే ఈ సినిమా. సారా అలీ ఖాన్ టైటిల్ రోల్ పోషించింది. ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా మార్చి 21 నుంచి ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ట్రైలర్ రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించారు.
(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా)
Comments
Please login to add a commentAdd a comment