వీధి రౌడీ నుంచి మాఫియా డాన్ వరకు దావూద్ ఇబ్రహీం నేర పరిణామ క్రమాన్ని దగ్గరి నుంచి చూసింది జర్నలిస్ట్ షీలాభట్. ఆమె దావూద్‌ను ఎన్నోసార్లు ఇంటర్వ్యూ చేసింది. 1970లో...‘చిత్రలేఖ’ మ్యాగజైన్‌లో మాఫియా డాన్ కరీమ్‌లాలాతో షీలాభట్ ఉన్న ఫోటోను చూసి ఆమెకు కాల్ చేశాడు దావూద్. అప్పుడు దావూద్ ‘జస్ట్ ఏ క్రిమినల్’ మాత్రమే. ‘మీరు నాకు ఒక సహాయం చేయాలి. ముంబైలోని గవర్నమెంట్ రిమాండ్ హోమ్‌లో ఉన్న అమ్మాయిలను కరీమ్‌లాలా మనుషులు వేధిస్తున్నారు. మీరు వాళ్ల దుర్మార్గాల గురించి పత్రికల్లో రాయాలి’ అని షీలాను అడిగాడు దావూద్.
‘దావూద్ అంటే భయం కంటే ప్రయాణ ఖర్చుల గురించి బాధే నాలో ఎక్కువగా ఉండేది’ అని దుబాయ్ ప్రయాణాన్ని గుర్తు చేసుకొని నవ్వుతూ చెప్పింది షీలా.
ఒకసారి దావూద్‌ను ఇంటర్య్వూ చేయడం కోసం దుబాయ్‌కు వెళ్లింది. ‘లెట్స్ ఈట్’ అంటున్నాడే తప్ప ఇంటర్య్వూకు మాత్రం ‘నో’ అంటున్నాడు దావూద్. మూడురోజుల తరువాత మాత్రం ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఒక మర్డర్ గురించి మాట్లాడుతూ ‘వాడిని నేను చంపి ఉండకపోతే, వాడు నన్ను కచ్చితంగా చంపేవాడు. షీలాజీ... మీరే చెప్పండీ. నేను చేసింది ఏమైనా తప్పంటారా?’ అని అమాయకంగా ముఖం పెట్టాడు దావూద్!
తాజాగా ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలాంటి విషయాలెన్నో చెప్పింది షీలాభట్.
Comments
Please login to add a commentAdd a comment