షారుక్ ఖాన్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రాల్లో ‘డాన్’ (2006) ఒకటి. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ బంపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలోనే షారుక్ హీరోగా వచ్చిన ‘డాన్ 2’ (2011) కూడా ఘనవిజయం సాధించింది.
ఇప్పుడు పుష్కర కాలం తర్వాత ‘డాన్ 3’కి సన్నాహాలు జరుగుతున్నాయి. గడిచిన పన్నెండేళ్లల్లో ‘డాన్ 3’ గురించి అడపా దడపా చర్చలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ‘డాన్ 3’ గురించి చిత్రనిర్మాత రితేష్ అద్వానీ అప్‌డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఫర్హాన్ అక్తర్ కథ సిద్ధం చేస్తున్నారని, స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యాక షూటింగ్ ప్లాన్ చెబుతామనీ పేర్కొన్నారు రితేష్.
Comments
Please login to add a commentAdd a comment