Don 3
-
చైతూతో ఎంగేజ్మెంట్ తర్వాతా.. మారిపోయిన శోభిత ఇమేజ్...
-
ఐటం సాంగ్‌లో శోభిత ధూళిపాళ.. చై ఒప్పుకుంటాడా?
నాగచైతన్య- శోభిత ధూళిపాళ.. ఇద్దరూ చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారు. కానీ ఆ ప్రేమను ఎన్నడూ బయటపెట్టలేదు. తమ మధ్య ఏమీ లేదన్నట్లుగానే ప్రవర్తించారు. కలిసి షికార్లకు వెళ్లినా గుట్టుగా దాచారు. ఎట్టకేలకు ఈ దాగుడుమూతలకు స్వస్తి పలుకుతూ ఈ మధ్యే నిశ్చితార్థం చేసుకున్నారు. ఆగస్టు 8న ఇరు కుటుంబసభ్యులు తాంబూలాలు మార్చుకున్నారు. వీరి వివాహం ఈ ఏడాది చివర్లోనో లేదా వచ్చే ఏడాది మార్చిలోనో ఉందని ప్రచారం జరుగుతోంది.ఐటం సాంగ్ ఆఫర్అప్పటివరకు ఇద్దరూ తమ సినిమా పనులతో బిజీగా ఉండనున్నారు. తాజాగా శోభితకు బాలీవుడ్ నుంచి ఊహించని ఆఫర్ వచ్చిందట! మునుపెన్నడూ చేయని రోల్ ఇచ్చారట.. అదే ఐటం సాంగ్! రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న డాన్ 3లో శోభితను భాగం చేయాలని దర్శకనిర్మాత ఫర్హాన్ అక్తర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట! ఐటం సాంగ్ చేయాలంటూ శోభితకు ఆయన ఆఫర్ ఇచ్చారంటూ ఓ వార్త నెట్టింట వైరలవుతోంది. శోభిత ఆన్సర్ ఏమై ఉంటుంది?ఈ క్రమంలో ఫర్హాన్ అక్తర్- శోభిత పలుమార్లు భేటీ కానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్లు భోగట్టా! మరి శోభిత.. ఐటం సాంగ్‌కు ఓకే చెప్తుందా? లేదా ఆఫర్ తిరస్కరిస్తుందా? అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయినా శోభిత ఐటం సాంగ్ చేసేందుకు చై ఒప్పుకుంటాడా? అని మరికొందరు సందేహిస్తున్నారు. అసలు డాన్ 3లో శోభిత పాత్ర ఉందా? లేదా? అనే విషయంపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!చదవండి: ఆడాళ్లకు మంచి లైఫ్ ఎక్కడుంది?: మంచు లక్ష్మి -
సినిమా అంటే నేనొక్కడినే కాదు: ఫర్హాన్ అక్తర్
హిందీలో ‘దిల్ చాహ్తా హై’ (2001), ‘లక్ష్య’ (2004), ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’ (2006), ‘డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్ (2011)’ వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రతిభను నిరూపించుకున్నారు ఫర్హాన్ అక్తర్. కానీ ‘డాన్: ది కింగ్ ఈజ్ బ్యాక్’ తర్వాత ఫర్హాన్ దర్శకుడిగా మళ్లీ మెగాఫోన్ పట్టలేదు. అయితే దాదాపు మూడేళ్ల క్రితం ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్ లీడ్ రోల్స్‌లో ‘జీ లే జరా’ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటించారు ఫర్హాన్.కానీ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లకుండానే రణ్వీర్ సింగ్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ‘డాన్ 3’ ప్రకటన వచ్చింది. ఈ సినిమా కూడా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. తాజాగా ఈ విషయాలపై స్పందించారు ఫర్హాన్. ‘‘నేను దర్శకుడిగా సెట్స్‌లోకి వెళ్లక పదేళ్లకు పైనే అయింది. నటుడిగా బిజీగా ఉండటం వల్లే డైరెక్షన్‌కి టైమ్ కుదరలేదు. ‘డాన్ 3’ చిత్రీకరణ వచ్చే ఏడాది ఆరంభమవుతుంది.అలాగే ‘జీ లే జరా’ కూడా నా దర్శకత్వంలోనే ఉంటుంది. ఈ సినిమా ప్రకటన వచ్చి చాలా టైమ్ గడిచింది. సినిమా అంటే నేనొక్కడినే కాదు. నటీనటులు, సాంకేతిక నిపుణుల కాల్షీట్స్ అన్నీ కరెక్ట్‌గా కుదరాలి. నా దర్శకత్వంలో రాబోయే నెక్ట్స్ రెండు సినిమాలు ‘డాన్ 3, జీ లే జరా’నే’’ అన్నారు ఫర్హాన్ అక్తర్. -
విదేశాల్లో శిక్షణ
ఇంటర్నేషనల్ ట్రైనింగ్‌కు రెడీ అవుతున్నారు కియారా అద్వానీ. బాలీవుడ్ ‘డాన్’ ఫ్రాంచైజీలో వస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘డాన్ 3’. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించనున్నారు. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించనున్న ‘డాన్ 3’లో కియారా అద్వానీ హీరోయిన్. ఈ చిత్రంలో రణ్వీర్, కియారా.. ఇద్దరికీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయట. దీంతో అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్స్ పర్యవేక్షణలో ఇద్దరూ స్టంట్స్ నేర్చుకోనున్నారని బాలీవుడ్ టాక్. విదేశాల్లో ఈ శిక్షణ జరుగుతుందని సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది సెప్టెంబరులో ్ర΄ారంభం కానుందని తెలిసింది. -
డాన్ ప్రేయసి
డాన్‌తో లవ్‌లో పడ్డారు హీరోయిన్ కియారా అద్వానీ. బాలీవుడ్ ‘డాన్’ ఫ్రాంచైజీలో రూపొందనున్న తాజా సినిమా ‘డాన్ 3’. రణ్వీర్ సింగ్ హీరోగా నటించనున్న ఈ సినిమాను దర్శక–నిర్మాత – నటుడు–రైటర్ ఫర్హాన్ అక్తర్ తెరకెక్కిస్తారు. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ నటించనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘‘కొత్త శకం మొదలైంది. ‘డాన్’ యూనివర్స్‌లోకి కియారాకు స్వాగతం’’ అని ‘డాన్ 3’ మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో కియారాకు కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉంటాయట. ‘‘ఐకానిక్ ‘డాన్ 3’ ఫ్రాంచైజీలో భాగం కావడం థ్రిల్‌గా ఉంది’’ అన్నారు కియారా అద్వానీ. -
బాలీవుడ్ కొత్త 'డాన్'గా రణ్వీర్ సింగ్.. సెప్టెంబరులో స్టార్ట్
బాలీవుడ్ కొత్త డాన్‌గా రణ్వీర్ సింగ్ మారనున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వచ్చిన హిందీ ‘డాన్’ ఫ్రాంచైజీ చిత్రాల్లో ముందు 1978లో వచ్చిన ‘డాన్’లో అమితాబ్ బచ్చన్, ఆ తర్వాత 2006లో వచ్చిన ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’, ‘డాన్ 2’లో షారుక్ ఖాన్ హీరోలుగా నటించారు. అమితాబ్, షారుక్ డాన్లుగా మెప్పించారు. ఇప్పుడు కొత్త తరం డాన్‌గా బాలీవుడ్ తెరపైకి రణ్‌వీర్‌సింగ్ రానున్నారు. ‘డాన్ 3’లో రణ్వీర్ హీరోగా నటిస్తారని, ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’, ‘డాన్ 2’ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఫర్హాన్ అక్తర్ ఈ సినిమాను తెరకెక్కిస్తారని ఇప్పటికే అధికారిక ప్రకటన వెల్లడైంది. కాగా ఈ సినిమా చిత్రీకరణను సెప్టెంబరులోప్రారంభించేలా ఫర్హాన్ అక్తర్ ప్లాన్స్ రెడీ చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం. ప్రస్తుతం అజయ్‌దేవగన్ మెయిన్ లీడ్ చేస్తున్న ‘సింగమ్ ఎగైన్’ సినిమాలో రణ్వీర్ సింగ్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో తన వంతు చిత్రీకరణను పూర్తి చేసుకున్న తర్వాత ‘డాన్ 3’ షూటింగ్లో పాల్గొంటారట రణ్వీర్ సింగ్. ఈ చిత్రం కోసం స్పెషల్‌గా మేకోవర్ కానున్నారు. ఇక ‘డాన్ 3’ తర్వాత రణ్వీర్ సూపర్ హీరో ఫిల్మ్ ‘శక్తిమాన్’ చిత్రీకరణలో పాల్గొంటారు. -
బాలీవుడ్లో కిక్ ఇస్తున్న ఫ్రాంచైజీ మూవీస్
బాలీవుడ్లో కొన్ని ఫ్రాంచైజీ మూవీస్ ఉన్నాయి. ప్రతి ఏడాది వీటిలో కొన్ని సెట్స్‌పైకి వెళితే.. మరికొన్ని రిలీజ్‌కు రెడీ అవుతుంటాయి. అయితే ఈ ఏడాది విశేషం ఏంటంటే... వివిధ ఫ్రాంచైజీస్లోని మూడో భాగాలు కొన్ని రిలీజ్‌కు రెడీ అవుతుండగా, మరికొన్ని సెట్స్‌పైకి వెళ్తున్నాయి. ఇలా ‘ఏక్ దో తీన్..’ అంటూ థర్డ్ పార్డ్తో బిజీగా ఉన్న కొందరు స్టార్స్ గురించి తెలుసుకుందాం. మళ్లీ టైగర్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో పదేళ్ల క్రితం విడుదలైన ‘ఏక్తా టైగర్’ ఒకటి. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్గా నటించారు. ఇదే చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ‘టైగర్ జిందా హై’ (2017)లోనూ సల్మాన్, కత్రినా జంటగా నటించారు. ఈ చిత్రం కూడా సూపర్ హిట్. ఇక సల్మాన్, కత్రినా ‘టైగర్ 3’కి కూడా జోడీ కట్టారు. ‘ఏక్తా టైగర్’, ‘టైగర్ జిందా హై’ చిత్రాల మాదిరి ‘టైగర్ 3’ కూడా స్పై ఫిల్మే. ‘ఏక్తా టైగర్’కు కబీర్ ఖాన్, ‘టైగర్ జిందా హై’ను అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించగా, ‘టైగర్ 3’కు మనీష్ శర్మ దర్శకుడు. ‘టైగర్’ ఫ్రాంచైజీలోని మూడు సినిమాలకు ముగ్గురు దర్శకులు దర్శకత్వం వహించగా, హీరో హీరోయిన్లు మాత్రం సల్మాన్, కత్రినాలే కావడం ఓ విశేషం. ఓ వైపు దశ్యం.. మరోవైపు సింగమ్ హిందీ తెరపై ‘దృశ్యం’ ఫ్రాంచైజీ బ్లాక్ బస్టర్. హిందీ ‘దృశ్యం’ (2015), ‘దృశ్యం 2’ (2022) చిత్రాల్లో అజయ్ దేవగన్ హీరోగా నటించారు. మలయాళంలో హీరో మోహన్‌లాల్– దర్శకుడు జీతూ జోసెఫ్ కలయికలో రూపొందిన ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలకు హిందీ రెండు భాగాల ‘దృశ్యం’ రీమేక్. అయితే ఈసారి మలయాళంలో మోహన్‌లాల్‌తో, హిందీలో అజయ్ దేవగన్‌తో ఒకేసారి ‘దృశ్యం 3’ను సెట్స్‌పైకి తీసుకువెళ్లే ఆలోచనలో ఉన్నారట జీతూ జోసెఫ్. ఇక హిందీ ‘దృశ్యం’కు నిషికాంత్ కామత్, ‘దృశ్యం 2’కి అభిషేక్ పాతక్ దర్శకత్వం వహించారు. ఇక దర్శకుడు రోహిత్ శెట్టి–హీరో అజయ్ దేవగన్ కాంబినేషన్లో ‘సింగమ్’, ‘సింగమ్ రిటర్న్స్’ల తర్వాత ‘సింగమ్ వన్స్ ఎగైన్’ చిత్రం తెరకెక్కనుంది. ఇలా డైరీలో రెండు థర్డ్ పార్ట్ చిత్రాలకు డేట్స్ కేటాయించారు అజయ్ దేవగన్. బిజీ కిలాడి బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ వరుస చిత్రాలతో బిజీగా ఉంటారు. ఈ క్రమంలో ఈ బిజీ హీరో మూడు ఫ్రాంచైజీస్లోని మూడు థర్డ్ పార్ట్ సినిమాలకు అసోసియేట్ కావడం విశేషంగా చెప్పుకోవాలి. బాలీవుడ్ హిట్ కామెడీ ఫ్రాంచైజీలో ‘వెల్కమ్’ తప్పక ఉంటుంది. 2007లో వచ్చిన ‘వెల్కమ్’, 2015లో విడుదలైన ‘వెల్కమ్ బ్యాక్’ (వెల్కమ్ 2) చిత్రాల తర్వాత ‘వెల్కమ్ టు ది జంగిల్ (వెల్కమ్ 3)’ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సంజయ్ దత్, పరేష్ రావల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ‘వెల్కమ్, ‘వెల్కమ్ బ్యాక్’ చిత్రాలకు అనీజ్ బాజ్మీ దర్శకత్వం వహించగా, ‘వెల్కమ్ టు ది జంగిల్’ను దర్శకుడు అహ్మద్ ఖాన్ తెరకెక్కిస్తున్నారు. అలాగే ‘హేరా ఫేరీ’ (2000), ‘ఫిర్ హేరా ఫేరీ’ (2006) చిత్రాల తర్వాత ఈ ఫ్రాంచైజీలో వస్తున్న ‘హేరా ఫేరీ’ థర్డ్ పార్ట్ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని.. ఈ మూడో భాగంలో అక్షయ్ కుమార్, తాను కలిసి నటించనున్నామని ఇటీవల సునీల్ శెట్టి పేర్కొన్నారు. మరోవైపు ‘జాలీ ఎల్ఎల్బీ 3’ ఉంటుందని, ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, తాను కలిసి నటిస్తామన్నట్లుగా అర్షద్ వార్సీ ఇటీవల పేర్కొన్నారు. 2013లో ‘జాలీ ఎల్ఎల్బీ’, 2017లో ‘జాలీఎల్ఎల్బీ 2’ చిత్రాలు వచ్చాయి. కొత్త డాన్ బాలీవుడ్ బాక్సాఫీస్ మార్కెట్లోకి కొత్త డాన్ వచ్చాడు. ఈ డాన్ పేరు రణ్వీర్ సింగ్. హిందీలో ‘డాన్’ అనగానే తొలుత అమితాబ్ బచ్చన్, ఆ తర్వాత షారుక్ ఖాన్ గుర్తొస్తారు. రచయితలు సలీమ్–జావేద్‌లు సష్టించిన డాన్ క్యారెక్టర్‌తో అమితాబ్ బచ్చన్ టైటిల్ రోల్లో చంద్ర బరోత్ తెరకెక్కించిన ‘డాన్’ (1978) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బాలీవుడ్ తొలి డాన్‌గా అమితాబ్‌ని నిలిపింది. ఇక దాదాపు మూడు దశాబ్దాలకు ‘డాన్’ సినిమా ఆధారంగానే ఫర్హాన్ అక్తర్ 2006లో ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’ తీశారు. ఇందులో షారుక్ ఖాన్ హీరోగా నటించారు. షారుక్ కూడా బెస్ట్ డాన్ అనిపించుకున్నారు. ఇక ఈ సినిమా హిట్ కావడంతో హీరో షారుక్ ఖాన్, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ కాంబినేషన్లో ‘డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్’ (2011) వచ్చి హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలోనే ‘డాన్ 3’ తెరకెక్కనుంది. అయితే ఇందులో షారుక్ నటించడంలేదు. డాన్‌గా రణ్వీర్ íసింగ్ నటిస్తారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను ఆరంభించాలనుకుంటున్నారు. బాలీవుడ్ బ్రహ్మాస్త్రం ఒక సినిమా హిట్ సాధించిన తర్వాత, ఆ సినిమా సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ సెట్స్‌పైకి వచ్చిన సినిమాలు బాలీవుడ్లో చాలా ఉన్నాయి. అయితే ‘బ్రహ్మాస్త్ర’ మాత్రం ఇందుకు విభిన్నం. ఎందుకంటే ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం మూడు భాగాలుగా వస్తుందని ఈ సినిమాను ప్రకటించిన సమయంలోనే వెల్లడించారు మేకర్స్. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా, అమితాబ్ బచ్చన్, నాగార్జున, డింపుల్ కపాడియా కీలక పాత్రల్లో నటించిన ‘బ్రహ్మాస్త్రం’ సినిమా తొలి భాగం ‘బ్రహ్మాస్త్రం: పార్ట్ట్ 1 శివ’ చిత్రం విడుదలై ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ‘బ్రహ్మాస్త్రం పార్ట్ 2: దేవ్’, ‘బ్రహ్మాస్త్రం పార్ట్ 3’ చిత్రాలకు సంబంధించిన ప్రీ ్ర΄÷డక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని ఈ చిత్రదర్శకుడు అయాన్ ముఖర్జీ వెల్లడించారు. అయితే సెకండ్, థర్డ్ పార్ట్ షూటింగ్ ఒకేసారి జరుగుతుందని వరు సగా 2026, 2027లో ఈ సినిమాలు విడుదల అవుతాయనే ప్రచారం జరుగుతోంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ తాజా ్రపాజెక్ట్ ‘వార్ 2’ కాబట్టి ఈ కారణంగా ‘బ్రహ్మాస్త్ర’ సెకండ్ అండ్ థర్డ్ పార్ట్ రిలీజ్ మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది. ఇటు ప్రేమ.. అటు భయం ‘ప్రేమ.. జీవితాన్ని జీవించేలా చేస్తుంది’ అంటూ 1990లో వచ్చిన ‘ఆషికీ’కి బాలీవుడ్ ప్రేమకథా చిత్రాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మహేశ్ భట్ దర్శకత్వంలో రాహుల్ రాయ్, అనూ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఇది. కాగా రెండు దశాబ్దాల తర్వాత ఆదిత్యా రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా మోహిత్ సూరి దర్శకత్వంలో రూపొందిన ‘ఆషికీ 2’ (2013) సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఇప్పుడు ‘ఆషికీ 3’కి శ్రీకారం జరిగింది. కార్తీక్ ఆర్యన్ హీరోగా ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణ ్రపారంభం కానుంది. ఇంకా హీరోయిన్ ఎంపిక పూర్తి కాలేదు. మరోవైపు హారర్ ఫిల్మ్ ‘భూల్ భూలెయ్య 3’లో కూడా హీరోగా నటిస్తున్నారు కార్తీక్ ఆర్యన్. ‘భూల్ భూలెయ్య 2’ను డైరెక్ట్ చేసిన అనీస్ బాజ్మీ, ఆ చిత్రంలో ఓ లీడ్ రోల్ చేసిన కార్తీక్ ఆర్యన్ కాంబినేషన్లోనే ‘భూల్ భూలెయ్య 3’ చిత్రం తెరకెక్కనుంది. ఈ దీపావళికి ఈ చిత్రం విడుదల కానుంది. అక్షయ్ కుమార్ హీరోగా ప్రియ దర్శన్ దర్శకత్వంలో 2007లో ‘భూల్ భూలెయ్య’ చిత్రం విడుదలైన విషయం గుర్తుండే ఉంటుంది. కామెడీ ఫుక్రే హీరో పుల్కిత్ సామ్రాట్, దర్శకుడు మగ్దీప్ సింగ్ లంబా కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘ఫుక్రే 3’ ఈ నెల 28న విడుదల కానుంది. 2013లో వచ్చిన ‘ఫుక్రే’, 2017లోని ‘ఫుక్రే రిటర్న్స్’ ప్రేక్షకులను మెప్పించాయి. ముఖ్యంగా ‘ఫుక్రే రిటర్న్స్’ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ లభించింది. ఇలా బాలీవుడ్లో ముస్తాబు అవుతున్న మూడో భాగం చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. -
పదిహేడేళ్ల తర్వాత...
బాలీవుడ్ సీనియర్ డాన్స్‌కు నూతన డాన్ రణ్వీర్ సింగ్ అండ్ టీమ్ నుంచి ఆహ్వానాలు అందనున్నాయని బాలీవుడ్లో ప్రచారం సాగుతోంది. రణ్వీర్ సింగ్ హీరోగా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ‘డాన్ 3’ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే బాలీవుడ్ వెండితెరపై డాన్ పాత్రలు చేసిన అమితాబ్ బచ్చన్(డాన్– 1978), షారుక్ ఖాన్ (డాన్–2006, ‘డాన్ 2’–2011)లు ‘డాన్ 3’ చిత్రంలో అతిథి పాత్రల్లో కనిపించనున్నారట. ఇందుకోసం రణ్వీర్, ఫర్హాన్‌లు ప్రయత్నాలు మొదలు పెట్టారని టాక్. అయితే 2006లో వచ్చిన ‘కభీ అల్విదా నా కహ్నా’ తర్వాత అమితా»Œ , షారుక్ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. మరి..‘డాన్ 3’ కోసం దాదాపు 17ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటారా? వేచి చూడాలి. -
12 ఏళ్లుగా డాన్ 3 గురించి చర్చ.. ఎట్టకేలకు అప్డేట్ ఇచ్చిన నిర్మాత
షారుక్ ఖాన్ కెరీర్లో చెప్పుకోదగ్గ చిత్రాల్లో ‘డాన్’ (2006) ఒకటి. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ బంపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలోనే షారుక్ హీరోగా వచ్చిన ‘డాన్ 2’ (2011) కూడా ఘనవిజయం సాధించింది. ఇప్పుడు పుష్కర కాలం తర్వాత ‘డాన్ 3’కి సన్నాహాలు జరుగుతున్నాయి. గడిచిన పన్నెండేళ్లల్లో ‘డాన్ 3’ గురించి అడపా దడపా చర్చలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ‘డాన్ 3’ గురించి చిత్రనిర్మాత రితేష్ అద్వానీ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఫర్హాన్ అక్తర్ కథ సిద్ధం చేస్తున్నారని, స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యాక షూటింగ్ ప్లాన్ చెబుతామనీ పేర్కొన్నారు రితేష్. -
డాన్ సీక్వల్కు రెడీ..!
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన రీమేక్ మూవీ డాన్. బిగ్ బి అమితాబ్ బచ్చన్ హీరోగా తెరకెక్కిన డాన్ సినిమాకు రీమేక్ గా 2006లో షారూఖ్ డాన్ తెరకెక్కింది. డాన్ పాత్రలో షారూఖ్ ను చూసిన అభిమానులు ఘనవిజయాన్ని అంధించారు. దీంతో ఐదేళ్ల తరువాత మరోసారి డాన్ పాత్రలో నటించాడు షారూఖ్. డాన్ 2గా తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించకపోయినా.. షారూఖ్ లుక్ కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరోసారి డాన్ పాత్రలో నటించనున్నట్టుగా ప్రకటించాడు కింగ్ ఖాన్. ప్రస్తుతం ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న షారూఖ్ త్వరలో డాన్ 3లో నటించబోతున్నట్టుగా ప్రకటించాడు. ప్రస్తుతం ఫర్హాన్ అక్తర్ ఈ సినిమాకు కథ రెడీ చేసే పనిలో ఉన్నట్టుగా నిర్మాత రితేష్ సిద్వానీ తెలిపారు. తొలి రెండు భాగాల్లో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించగా.. మూడో భాగానికి మాత్రం దీపికను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. -
మూడో డాన్లో ఆయనతో రెండో సారి?
అమితాబ్‌బచ్చన్ నటించిన ‘డాన్’ చిత్రం రీమేక్‌లో నటించి, మళ్లీ కొత్త డాన్‌లా అవతరించారు బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్. ‘డాన్-2’లో కూడా నటించి, భేష్ అనిపించుకున్నారు. త్వరలో ‘డాన్ 3’ మొదలు కానుంది. తొలి, మలి భాగాల్లో నటించిన ప్రియాంకా చోప్రాకు మూడో భాగంలో చోటు దక్కే అవకాశం లేదు. ఎందుకంటే, కత్రినా కైఫ్‌ను తీసుకోవాలని అనుకుంటున్నారట షారుక్. దర్శకుడు ఫర్హాన్ అక్తర్ కూడా అదే అభిప్రాయంతోనే ఉన్నారట. ఇటీవలఈ చిత్రం గురించి కత్రినా కైఫ్‌ని సంప్రతించారట కూడా. ‘జబ్ తక్ ఏ జాన్’ చిత్రంలో షారుక్ కు జోడీగా నటించారు కత్రిన. ఇప్పుడు ‘డాన్ 3’లో ఆయనతో జోడీ కడుతున్నారా? లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. -
2016 నాదే అంటున్న క్యాట్
ఒకప్పుడు బాలీవుడ్లో యమ స్పీడుగా సినిమాలు చేసిన హాట్ బ్యూటీ కత్రినా కైఫ్, ఈమధ్య జోరు తగ్గించింది. ముఖ్యంగా వరుస ఫ్లాప్‌లతో పాటు దీపిక, ప్రియాంకల హవా పెరగటం, స్టార్ హీరోల సరసన అవకాశాలు రాకపోవటంతో ఆచితూచి అడుగులు వేస్తోంది. కత్రినా చివరగా నటించిన బాలీవుడ్ మూవీ ఫాంతమ్ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవటంతో లాంగ్ గ్యాప్ తీసుకుంది. ప్రస్తుతం ఆదిత్య రాయ్ కపూర్ తో కలిసి ఫితూర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్న క్యాట్, వెంటనే వరుస సినిమాలకు రెడీ అవుతోంది. ఇప్పటికే జగ్గా జాసూస్, బార్ బార్ దేఖో లాంటి సినిమాలకు కమిట్ అయిన కత్రినా.. మరో రెండు ప్రాజెక్ట్స్‌కు సైన్ చేయనుంది. షారూఖ్ హీరోగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న డాన్ 3తో పాటు, కబీర్ ఖాన్, హృతిక్ రోషన్ల కాంబినేషన్లో తెరకెక్కనున్న యాక్షన్ ఎంటర్ టైనర్లోనూ ఈ బ్యూటీ నటించనుంది. వీటితో పాటు సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న సుల్తాన్ సినిమాలో కత్రినానే హీరోయిన్గా నటించే ఛాన్స్ కనిపిస్తోంది. గత ఏడాది పెద్దగా సందడి చేయకపోయినా 2016 నాదే అంటోంది క్యాట్.