2016 నాదే అంటున్న క్యాట్ | katrina kaif busy with four films | Sakshi
Sakshi News home page

2016 నాదే అంటున్న క్యాట్

Published Fri, Jan 8 2016 2:05 PM | Last Updated on Thu, Apr 4 2019 5:42 PM

2016 నాదే అంటున్న క్యాట్ - Sakshi

2016 నాదే అంటున్న క్యాట్

ఒకప్పుడు బాలీవుడ్‌లో యమ స్పీడుగా సినిమాలు చేసిన హాట్ బ్యూటీ కత్రినా కైఫ్, ఈమధ్య జోరు తగ్గించింది. ముఖ్యంగా వరుస ఫ్లాప్లతో పాటు దీపిక, ప్రియాంకల హవా పెరగటం, స్టార్ హీరోల సరసన అవకాశాలు రాకపోవటంతో ఆచితూచి అడుగులు వేస్తోంది. కత్రినా చివరగా నటించిన బాలీవుడ్ మూవీ ఫాంతమ్ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవటంతో లాంగ్ గ్యాప్ తీసుకుంది. ప్రస్తుతం ఆదిత్య రాయ్ కపూర్ తో కలిసి ఫితూర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్న క్యాట్, వెంటనే వరుస సినిమాలకు రెడీ అవుతోంది.

ఇప్పటికే జగ్గా జాసూస్, బార్ బార్ దేఖో లాంటి సినిమాలకు కమిట్ అయిన కత్రినా.. మరో రెండు ప్రాజెక్ట్స్కు సైన్ చేయనుంది. షారూఖ్ హీరోగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న డాన్ 3తో పాటు, కబీర్ ఖాన్, హృతిక్ రోషన్ల కాంబినేషన్లో తెరకెక్కనున్న యాక్షన్ ఎంటర్ టైనర్లోనూ ఈ బ్యూటీ నటించనుంది. వీటితో పాటు సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న సుల్తాన్ సినిమాలో కత్రినానే హీరోయిన్గా నటించే ఛాన్స్ కనిపిస్తోంది. గత ఏడాది పెద్దగా సందడి చేయకపోయినా 2016 నాదే అంటోంది క్యాట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement