ఆ మాజీ ప్రేమికులు మళ్లీ ముచ్చటించుకున్నారా? | Did Katrina Kaif meet Salman Khan at YRF studios? | Sakshi
Sakshi News home page

ఆ మాజీ ప్రేమికులు మళ్లీ ముచ్చటించుకున్నారా?

Published Sat, Jan 9 2016 5:03 PM | Last Updated on Thu, Apr 4 2019 5:42 PM

ఆ మాజీ ప్రేమికులు మళ్లీ ముచ్చటించుకున్నారా? - Sakshi

ఆ మాజీ ప్రేమికులు మళ్లీ ముచ్చటించుకున్నారా?

ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ తన తాజా సినిమా 'ఫిత్తూర్‌' ప్రమోషన్స్‌లో ప్రస్తుతం బిజీగా ఉంది. ఈ క్రమంలో ముంబైలోని యశ్‌రాజ్‌ స్టూడియో (వైఆర్‌ఎఫ్‌)లోకి వెళ్లి సల్మాన్‌ఖాన్‌తో ముచ్చటించినట్టు తెలుస్తోంది. 'దర్శకుడు అలీ అబ్బాస్‌ జఫర్‌ వైఆర్‌ఎఫ్‌లో సుల్తాన్‌ సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. ఆయన గతంలో తీసిన 'మేరే బ్రదర్‌కి దుల్హాన్‌' సినిమాలో కత్రినా నటించింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య అనుబంధం ఉంది. దీనిని పురస్కరించుకొని ఆమె వైఆర్‌ఎఫ్‌కు వచ్చి అలీ అబ్బాస్‌తో ముచ్చటించింది. అదే సమయంలో సల్మాన్‌ అక్కడికి వచ్చారు. సల్మాన్‌ను చూడగానే అతని వద్దకు వెళ్లి పలుకరించి కత్రినా కాసేపు మాట్లాడింది. ఆ తర్వాత ఆమె వెళ్లిపోయింది' అని విశ్వసనీయ సినీ వర్గాలు తెలిపాయి.

అయితే, కత్రినా మాత్రం తాను ఎవరినీ ప్రత్యేకంగా కలువలేదని చెప్తోంది. 'ఫిత్తూర్‌ డబ్బింగ్ జరుగుతున్న సమయంలో సమీపంలోనే ఏదో షూటింగ్‌ కొనసాగుతోంది. అంతేకానీ నేను ఎవరి సెట్స్‌ వద్దకు వెళ్లి.. ఎవరితో మాట్లాడలేదు' అని ఆమె తెలిపింది. కత్రినా, సల్మాన్ మధ్య నడిచిన ప్రేమాయణానికి చాలాకాలం కిందటే బ్రేక్ పడింది. ఇప్పుడు కత్రినా కైఫ్‌ రణ్‌బీర్‌ కపూర్‌తో ప్రణయాన్ని కొనసాగిస్తోంది. వీరు పెళ్లి చేసుకుంటారని కూడా వార్తలు వస్తున్నాయి. మరోవైపు 'సుల్తాన్' సినిమాలో నటిస్తున్న సల్మాన్‌ రొమేనియన్‌ టీవీ నటి లులియా వంటుర్‌తో అనుబంధాన్ని కొనసాగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement