phantom
-
ఆర్మీ శునకం ‘ఫాంటమ్’ ఇకలేదు
అఖ్నూర్: జమ్ముకశ్మీర్‌లోని అఖ్నూర్లో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. అసన్ సమీపంలో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన నేపధ్యంలో భారత ఆర్మీ శునకం ‘ఫాంటమ్’ ప్రాణాలు కోల్పోయింది. ఫాంటమ్ బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన శునకం. అది 2020, మే 25న జన్మించింది. ‘మా నిజమైన హీరో, ధైర్యవంతుడైన ఇండియన్ ఆర్మీ డాగ్, ఫాంటమ్ చేసిన అత్యున్నత త్యాగానికి మేము వందనం చేస్తున్నాం’ అని భారత ఆర్మీ పేర్కొంది.కాల్పుల అనంతరం ఉగ్రవాదులు అటవీ ప్రాంతంలోకి పారిపోయారని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతాన్ని సైన్యం చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో ‘ఫాంటమ్’కి శత్రువుల బుల్లెట్లు తగిలాయి.కే9 యూనిట్‌కి చెందిన శునకాలలో ఫాంటమ్ ఒకటి. ఇది ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో పోరాడేందుకు శిక్షణ పొందిన శునకం. మీరట్‌లోని రీమౌంట్ వెటర్నరీ కార్ప్స్ నుండి ఈ శునకాన్ని తీసుకువచ్చారు. ఈ శునకం 2022, ఆగస్ట్ 12 నుంచి అసాల్ట్ డాగ్ యూనిట్లో ఉంది.UpdateWe salute the supreme sacrifice of our true hero—a valiant #IndianArmy Dog, #Phantom.As our troops were closing in on the trapped terrorists, #Phantom drew enemy fire, sustaining fatal injuries. His courage, loyalty, and dedication will never be forgotten. In the… pic.twitter.com/XhTQtFQFJg— White Knight Corps (@Whiteknight_IA) October 28, 2024ఈ సందర్భంగా జమ్మూ డిఫెన్స్ పీఆర్ఓ మాట్లాడుతూ, ‘మా శునకం ఫాంటమ్ చేసిన అత్యున్నత త్యాగానికి వందనం చేస్తున్నాం. మన సైనికులు ఉగ్రవాదులను సమీపిస్తున్నప్పుడు, ఫాంటమ్ శత్రువుల కాల్పులకు గురయ్యింది. దీంతో అది తీవ్రంగా గాయపడి ప్రాణాలొదిలింది. దాని ధైర్యం, విధేయత, అంకితభావం ఎప్పటికీ మర్చిపోలేం’ అని అన్నారు.ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ సీఎం -
Tecno Phantom V Fold వచ్చేసింది: అతి తక్కువ ధరలో, అదిరిపోయే పరిచయ ఆఫర్
సాక్షి, ముంబై: భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో, టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ లాంచ్ అయింది. స్మార్ట్‌ఫోన్ దిగ్గజం టెక్నో ఫాంటమ్ నుంచి భారత మార్కెట్లో ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్‌ను దేశంలోనే అతి చవకైనదిగా కంపెనీ ప్రకటించింది ఆకట్టుకునే ప్రీమియం డిజైన్, వర్చువల్లీ క్రీజ్ ఫ్రీ ఫోల్డబుల్ మెయిన్ డిస్ప్లేతో కస్టమర్లను ఆకట్టుకుంటుందని కంపెనీ తెలిపింది. టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ భారత మార్కెట్లో రూ.88,888 ప్రారంభ ధరతో విడుదలంది. సింగిల్ వేరియంట్లో మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌పై పరిచయ ఆఫర్ కూడా ఉంది. స్పెషల్ డిస్కౌంట్‌తో ధర రూ.77,777 వద్ద ఏప్రిల్ 12న అందుబాటుల ఉంది. దీంతో పాటు హెచ్డీబీ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 5వేల డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే రెండు సంవత్సరాల వారంటీతో పాటు, ఫాంటమ్ వీ ఫోల్డ్ రూ. 5,000 విలువైన ఉచిత ట్రాలీ బ్యాగ్, కొనుగోలు చేసిన ఆరు నెలల్లోపు వన్-టైమ్ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్, స్టాండ్‌తో కూడిన ఉచిత ఫైబర్ ప్రొటెక్టివ్ కేస్ లభించనుంది. ఫాంటమ్ వీఫోల్డ్కి గట్టి పోటీగా భావిస్తున్న శాంసంగ్ గెలాక్సీ Z Fold 4 ధర రూ. 1,54,998గాఉంది. ఫాంటమ్ వీఫోల్డ్స్పెసిఫికేషన్స్: 6.42-అంగుళాల LTPO, ఔటర్ AMOLED డిస్ప్లేను. ప్రాథమిక లోపలి స్క్రీన్ 2296 X 2000 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 7.65-అంగుళాల 2K LTPO AMOLED ఫోల్డబుల్ డిస్ప్లే. ఫోన్ కంటెంట్ ఆధారంగా 120Hz రిఫ్రెష్ రేట్ వరకు వేరియబుల్తో వస్తుంది.ఏరోస్పేస్-గ్రేడ్ ఇన్నోవేటివ్ డ్రాప్-షేప్ కీ ఫీచర్లు ఉన్నాయని పేర్కొంది. స్టేబుల్-రేషియో రొటేట్, స్లైడ్ టెక్, రివర్స్ స్నాప్ స్ట్రక్చర్‌ను కలిగి ఉంది. ఫోల్డ్, క్రీజ్-ఫ్రీ ఎక్స్పీరియన్స్ అందిస్తుందని టెక్నో కంపెనీ చెప్పింది. హుడ్ కింద MediaTek ఫ్లాగ్షిప్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్ ఉంది. ఈ చిప్సెట్ గరిష్టంగా 12GB LPDDR5 RAM, 512GB UFS 3.1 స్టోరేజీతో లభ్యం. ట్రిపుల్ రియర్ కెమెరా 50 ఎంపీ ప్రైమరీ కెమెరా , 13ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 50ఎంపీ 2x పోర్ట్రెయిట్ కెమెరాతో వచ్చింది. అలాగే ఔటర్ డిస్ప్లేలో 32ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఇన్నర్ ఫోల్డబుల్ డిస్ప్లేలో 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరాలున్నాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ సెక్యూరిటీ , చక్కటి ఆడియో అనుభవం కోసం స్టీరియో స్పీకర్లను పొందుపరిచింది. (బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్: కీవే బైక్స్‌పై భారీ ఆఫర్) కాగా టెక్నో ఇటీవల MWC 2023లో తన తొలి ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్ ఫాంటమ్వ వీ ఫోల్డ్‌ను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. తాజగా కంపెనీ ఎట్టకేలకు దీనిని భారతదేశంలో లాంచ్ చేసింది. ప్రస్తుతం ఫాంటమ్ వీ ఫోల్డ్ దేశంలో అత్యంత సరసమైన ఫుల్-స్క్రీన్ ఫోల్డింగ్ స్మార్ట్ఫోన్లలో ఒకటిగా నిలిచింది. ( ఇదీ చదవండి: మహీంద్రా అండ్ మహీంద్రా మాజీ చైర్మన్ కేషుబ్ మహీంద్రా కన్నుమూత) -
అతి ఖరీదైన కారు లాంచ్..
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత విలువైన కార్లకు పెట్టింది పేరైన లగ్జరీ కార్ మేకర్ రోల్స్ రాయిస్ పాంథమ్ కొత్త ప్రీమియం మోడల్స్‌ను లాంచ్ చేసింది. పాంథమ్ ఎనిమిదో ఎడిషన్‌గా రెండు వేరియంట్లను నార్త్ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. స్టాండర్డ్ మోడల్ ఎక్స్ షోరూం ధర రూ. 9.5 కోట్లుగా నిర్ణయించింది. ఎక్స్‌టెండెండ్ వీల్ బేస్ వెర్షన్ మోడల్ ధర రూ.11.35 కోట్లుగా నిర్ణయించింది. సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని కస్టమర్లకు అందించేలా హెడ్లైట్లు (లేజర్ లైట్ టెక్నాలజీన) రాత్రిపూట 600 మీటర్ల వెలుతురును అందిస్తాయని కంపెని చెబుతోంది. ఈ కొత్త జనరేషన్ పాంథమ్‌ను అల్యూమినియం స్పేస్ ఫ్రేమ్ ప్లాట్‌ఫాంతో రూపొందించారు. గత మోడల్ కంటే ఇది తేలిగ్గా ఉంటుందట. 6.75 లీటర్ల ట్విన్ టర్బో చార్జ్డ్ వీ 12 ఇంజీన్ రూపొందించిన కారు కేవలం 5.3 సెకన్లలోనే 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. విండ్‌స్క్రీన్‌తో అనుసంధానమైన 'ఫ్లాగ్ బేరర్' తో కూడిన స్టీరియో కెమెరా సిస్టమ్ రోడ్డును చూసి, దానికనుగునంగా సస్పెన్షన్ సర్దుబాటు చేస్తుంది. స్టార్ లైట్ రూఫ్, డోర్లను క్లోజ్ చేసే బటన్లు తదితర ఫీచర్లు ప్రధానంగా ఉండనున్నాయయి. బిజినెస్ క్లాస్ కస్టమర్లకు అద్భుతమైన రైడింగ్ అనుభవం అందించనుంది. అంతేకాదు ఈ కార్ల కొనుగోలుపై లాంచింగ్ ఆఫర్‌గా 24 గంటల రోడ్ సైడ్ సపోర్ట్ , రీజనల్ వారంటీతోపాటు నాలుగేళ్లపాటు సర్వీస్‌ను ఉచితంగా అందించనుంది. జనాభా ఇతర దేశాల కన్నా ఎక్కువ పెరుగుతుండటం , ప్రామాణికమైన, బెస్పోక్ లగ్జరీ కార్లపై ఆసక్తి కారణాల రీత్యా ఇండియాలో తమకు ఆకర్షణీయమైన మార్కెట్ నిలుస్తోందని రోల్స్ రాయ్స్ మోటార్ కార్స్, ఆసియా పసిఫిక్ రీజినల్ డైరెక్టర్ పాల్ హారిస్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని సెలెక్ట్ కార్స్ ప్రయివేట్ లిమిటెడ్ ఏకైక అధికార డీలర్‌గా రోల్స్ రాయిస్ ఎంచుకుంది. -
మెగా దర్శకుడికి ఎమర్జెన్సీ ఆపరేషన్!
'బజరంగీ భాయ్‌జాన్', 'ఫాంథమ్', 'ఏక్ థా టైగర్', 'న్యూయార్క్' వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన బాలీవుడ్ మెగా దర్శకుడు కబీర్ ఖాన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించి.. అత్యవసర ఆపరేషన్‌ను నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 13న తీవ్ర కడుపునొప్పి రావడంతో కబీర్ ఖాన్‌ను ముంబైలోని కోకిల బెన్ ఆస్పత్రికి తరలించారు. ఆయన కడుపులో రాళ్లు (స్టోన్స్) ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. వాటిని తొలగించేందుకు వెంటనే ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ ముగిసిన తెల్లారే కబీర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినా.. వారంపాటు పూర్తి బెడ్‌రెస్ట్ తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. ఇటీవల కబీర్ ఖాన్ పాకిస్థాన్ వెళ్లడం, కరాచీ విమానాశ్రయంలో ఆయనను ఆందోళనకారులు అడ్డుకోవడం తెలిసిందే. 'బజరంగీ భాయ్‌జాన్'లాంటి మెగాహిట్ తర్వాత కబీర్ ఖాన్ తాజాగా మరో చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారు. ఈ చిత్రం కోసం మరోసారి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తోనే ఆయన జతకడుతున్నారు. 'ట్యూబ్ లైట్' టైటిల్‌గా భావిస్తున్న ఈ సినిమాలో భారత్-చైనా అనుబంధాన్ని చూపించబోతున్నారు. -
2016 నాదే అంటున్న క్యాట్
ఒకప్పుడు బాలీవుడ్లో యమ స్పీడుగా సినిమాలు చేసిన హాట్ బ్యూటీ కత్రినా కైఫ్, ఈమధ్య జోరు తగ్గించింది. ముఖ్యంగా వరుస ఫ్లాప్‌లతో పాటు దీపిక, ప్రియాంకల హవా పెరగటం, స్టార్ హీరోల సరసన అవకాశాలు రాకపోవటంతో ఆచితూచి అడుగులు వేస్తోంది. కత్రినా చివరగా నటించిన బాలీవుడ్ మూవీ ఫాంతమ్ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవటంతో లాంగ్ గ్యాప్ తీసుకుంది. ప్రస్తుతం ఆదిత్య రాయ్ కపూర్ తో కలిసి ఫితూర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్న క్యాట్, వెంటనే వరుస సినిమాలకు రెడీ అవుతోంది. ఇప్పటికే జగ్గా జాసూస్, బార్ బార్ దేఖో లాంటి సినిమాలకు కమిట్ అయిన కత్రినా.. మరో రెండు ప్రాజెక్ట్స్‌కు సైన్ చేయనుంది. షారూఖ్ హీరోగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న డాన్ 3తో పాటు, కబీర్ ఖాన్, హృతిక్ రోషన్ల కాంబినేషన్లో తెరకెక్కనున్న యాక్షన్ ఎంటర్ టైనర్లోనూ ఈ బ్యూటీ నటించనుంది. వీటితో పాటు సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న సుల్తాన్ సినిమాలో కత్రినానే హీరోయిన్గా నటించే ఛాన్స్ కనిపిస్తోంది. గత ఏడాది పెద్దగా సందడి చేయకపోయినా 2016 నాదే అంటోంది క్యాట్. -
కత్రినా... ఎందుకు వద్దంటోంది?
కత్రినా కైఫ్... ఆ పేరు వినగానే మనకు వెంకటేశ్‌తో నటించిన ‘మల్లీశ్వరి’ గుర్తొస్తుంది. ఆ సినిమాలో రాజవంశీకురాలిగా కత్రినా నటన గుర్తొస్తుంది. అభినయంతో పాటు అందంతో అందరినీ కట్టిపడేసిన ఈ బాలీవుడ్ భామ గురించి ఇప్పుడో వార్త హల్చల్ చేస్తోంది. అది ఏమిటంటే, ఈ అమ్మడు ఇటీవల తన దగ్గరకు వచ్చిన అవకాశాలన్నిటినీ ఏదో ఒక విధంగా పక్కన పడేస్తోందట! ‘అవును. ఆ మాట నిజమే. కత్రినా తాను చేసే సినిమాల సంఖ్యను బాగా తగ్గించుకుంటున్నారు. అయితే, అందుకు కారణం మాత్రం మాకూ తెలియదు’ అని కత్రినా సన్నిహిత వర్గాలు చెప్పాయి. కాగా, ముంబయ్ సినీ జనాలు మాత్రం దీని గురించి ఒక మాట చెబుతున్నారు. వస్తున్న పాత్రలు, సినిమాలను ఈ మూడు పదులు దాటిన భామ కాదనడం వెనుక ఒక కారణం ఉందట! ఇప్పటికే పలుసార్లు ప్రేమ వ్యవహారాలు విఫలమైన కత్రినా ఈ సారి పెళ్ళి పీటలకెక్కాలని భావిస్తున్నారట. అందు కోసమే సినిమాలు తగ్గించుకుంటున్నట్లు ముంబయ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ‘ఫాంటమ్’ చిత్రంలో మెరిసిన కత్రినా నిజానికి రోహిత్ శెట్టి దర్శకత్వంలోని ‘దిల్వాలే’, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ‘బాజీరావ్ మస్తానీ’, ఆశుతోష్ గోవారీకర్ రూపొందిస్తున్న ‘మొహెంజొదారో’ చిత్రాల్లో కూడా నటించాల్సింది. ఈ భారీ చిత్రాల్లోని అవకాశాలను కత్రినా కాదనడానికీ, ఈ పెళ్ళి ప్రతిపాదనకూ లింక్ ఉందని జనం వాదన. మరికొందరు మాత్రం ‘ఆ... అదేం లేదు. ఆ సినిమాలన్నీ చాలా సమయం పట్టే భారీ ప్రాజెక్ట్‌లు కాబట్టే కత్రినా సున్నితంగా తోసిపుచ్చింది’ అని చెబుతున్నారు. మరి, ఇంతకీ కత్రినా మనసులో ఏముందంటారు? ఆమే పెదవి విప్పి, అదేమిటో చెప్పాలి. -
నేషనల్ అవార్డ్ సాదించాకే పెళ్లి : కత్రినా
ఫిలిం కెరీర్ పరంగా కన్నా పర్సనల్ ఇష్యూస్ తోనే ఎక్కువగా వార్తల్లో ఉండే బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్.. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎదో ఒక గాసిప్ తో ఎప్పుడూ వార్తల్లో కనిపించే ఈ బ్యూటి ఫాంటమ్ ప్రమోషన్ సందర్భంగా ఇంట్రస్టింగ్ కామెంట్ చేసింది. చాలా రోజులుగా యంగ్ హీరో రణబీర్ కపూర్ తో ప్రేమాయణం నడుపుతున్నట్టుగా పుకార్లు షికార్లు చేస్తున్న నేపధ్యంలో తన పెళ్లి విషయంలో షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇప్పటికే చాలా సార్లు ఈ యువ జంట నిశ్చితార్ధం కూడా అయిపోయినట్టుగా వార్తలు వినిపించాయి.. అయితే కత్రీనా హీరోయిన్ గా ఇటీవల విడుదలైన ఫాంటమ్ సినిమా ప్రమోషన్ సందర్భంగా మరోసారి కత్రినా పెళ్లి విషయం తెరమీదకు వచ్చింది. రణబీర్ తో మీ పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్నకు నేషనల్ అవార్డ్ సాదించాకే అని సమాధానం చెప్పింది. ఈ లాంగ్ లెగ్స్ బ్యూటి. అయితే తరువాత తన స్టేట్ మెంట్ ను కవర్ చేసుకోవడానికి ప్రయత్నించిన కత్రినా తన సినిమా ఏదైనా నేషనల్ అవార్డ్ సాదించాక పెళ్లి చేసుకుంటానంటూ మాట మార్చింది. ఏది ఏమైనా ఈ బాలీవుడ్ హాట్ బ్యూటికి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేష్యం అయితే ఉన్నట్టుగా కనిపించట్లేదంటున్నాయి బాలీవుడ్ సినీ వర్గాలు. -
మూవీ రివ్యూ: ఫాంటమ్
టైటిల్: ఫాంటమ్ జానర్: ఫిక్షనల్ యాక్షన్ థ్రిల్లర్ తారాగణం: సైఫ్ అలీ ఖాన్, కత్రినా కైఫ్ రచన, దర్శకత్వం: కబీర్ ఖాన్ నిర్మాత్: సాజిద్ నదియావాలా, సిద్ధార్థ్ రాయ్ కపూర్ రచన: కబీర్ ఖాన్, కౌసర్ మునీర్ స్క్రీన్ ప్లే: కబీర్ ఖాన్, పర్వేజ్ షేక్ మూల కథ: హుస్సేన్ జైదీ రచన 'ముంబై అవెంజర్స్' సంగీతం: ప్రీతమ్, కేకే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జూలియస్ పాకియామ్ సినిమాటోగ్రఫీ: అసీమ్ మిశ్రా ఎడిటింగ్: ఆరిఫ్ షేక్ విడుదల: 28 ఆగస్ట్, 2015 నిడివి: 135 నిమిషాలు బడ్జెట్: 55 కోట్లు చరిత్ర పొడవునా ఎన్నోన్నె దురాక్రమణలు, అంతకు రెట్టింపు దాడులను తట్టుకుని తనదైన శైలిలో సాగిపోతున్న భారతావని.. దానికి పశ్చిమాన అరేబియా సముద్రతీరంలో దేశ ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న ముంబై నగరం.. ఆ నగరానికి మకుటం లాంటి తాజ్ మహల్ హోటల్.. నెరిసిన తల, పొడవాటి గడ్డంతో తాజ్ ముందు ఫుట్‌పాత్‌పై సైకిల్ మీద టీ అమ్మే ముసలాయన ముఖంలో గొప్ప వెలుగు. సంతోషంగా అందరికీ టీ ఇస్తుంటాడు. అక్కడే నిల్చున్న హీరోయిన్ కత్రినా కైఫ్‌కు కూడా టీ ఇస్తాడు. 'క్షమించండి, నా దగ్గర డబ్బుల్లేవ్' అన్న కత్రినాతో... నవ్వుతూ ఇలా అంటాడు.. 'ఫర్లేదమ్మా, ఈ రోజు ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోను. ఎందుకో తెలుసా.. (తాజ్‌ను చూపిస్తూ) ఇదిగో ఈ హోటల్లోనే నా కొడుకు వెయిటర్‌గా పనిచేసేవాడు. ఆ రోజు రాత్రి చనిపోయినవాళ్లలో వాడు కూడా ఉన్నాడు. నా కొడుకుతోపాటు వందల మందిని పొట్టనపెట్టుకున్న ఆ రాక్షసులు హతమయ్యారని ఈ రోజు వార్తల్లో చెప్పారు. అది విని నాకు చాలా ఆనందం కలిగింది. ఏడేళ్ల తర్వాతగానీ నా కొడుకు ఆత్మకు శాంతి దొరికిందనిపించింది. అందుకే అందరికీ ఉచితంగా టీ ఇస్తున్నా..' *** *** *** *** ఫాంటమ్ సినిమాలో ఇది ఆఖరు సీన్. ఉన్మాదాన్ని మించిన ఉగ్రవాద కార్యకలాపాలతో భారత్‌ను ఇబ్బందులపాలుచేస్తూ, ఇక్కడి అమాయకులను పొట్టన పెట్టుకుంటున్నపాకిస్థానీ ముష్కర ముఠాల నాయకులను ఏమీ చేయలేమా? సాక్ష్యాధారాలు లేవు. ఉన్నా వాటిని పాకిస్థాన్ కోర్టులు విశ్వసించవు. మరెలా? ఈ మారణహోమం తప్పక కొనసాగాల్సిందేనా? అనే ప్రశ్నలకు దర్శకుడు కబీర్ ఖాన్ చెప్పిన ఊహాజనిత సమాధానమే ఫాంటమ్ సినిమా. హుస్సేన్ జైదీ రాసిన 'ముంబై అవెంజర్స్' పుస్తకానికి వెండితెర రూపం. నిజానికి ఫాంటమ్ ఓ ఊహాజనిత కామిక్ హీరో. తన గురించిన సమాచారాన్ని బయటికి తెలియనివ్వకుండా, సమాజానికి చేటుచేసే కేటుగాళ్ల భరతం పడతాడు. ఈ సినిమా ఫాంటమ్ కూడా అంతే. భారత్‌లో విధ్వంసాలు సృష్టిస్తూ, పాకిస్థాన్, ఇతర దేశాల్లో స్వేచ్ఛగా తిరుగుతున్న 26/11 ముంబై దాడుల మాస్టర్ మైండ్స్‌ను అంతమొందిస్తాడు. కథలోకి వెళితే.. డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, సహచర జవాన్ ప్రాణాలు పోవడానికి కారణమైనందుకు ఇండియన్ ఆర్మీ నుంచి తొలగింపునకు గురవుతాడు ధనియాల్ ఖాన్ (సైఫ్ అలీ ఖాన్). కొద్దికాలానికి ఆర్మీ రికార్డుల్లో అతని పేరు కూడా మాయం అవుతుంది. పాకిస్థాన్‌కు కౌంటర్ ఎటాక్ ఇవ్వడానికి ఓ యువ ఆఫీసర్ చెప్పిన ఐడియాను అతి కష్టం మీద అంగీకరిస్తాడు రా (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) చీఫ్. ప్లాన్ సిద్ధమవుతుంది. కానీ దాన్ని అమలు చేయగల ధీరోదాత్తుడు కావాలి. అంతటి సమర్థుడి కోసం దేశంలోని అన్ని భద్రతా బలగాల్లో పనిచేస్తున్న జవాన్ల జాబితాను జల్లెడపడతారు. ఆఖరికి ఫాంటమ్లా తన వివరాలను బయటికి తెలియనివ్వకుండా సుదూర ప్రాంతంలో జీవిస్తోన్న ధనియాల్ ఖాన్ పేరును ఫిక్స్ అవుతారు. తీవ్రంగా గాలించి, అతని జాడ తెలుసుకుని, ఈ ఆపరేషన్ నువ్వు మాత్రమే చెయ్యగలవంటారు రా అధికారులు. మొదటి నిరాకరించినా, ఈ పనితో ప్రాణాలు కోల్పోయిన తన సహచరుడి ఆత్మకు శాంతి దొరుకుతుందని, సైన్యంలోకి తిరిగి సగర్వంగా చేరొచ్చనే హామీతో రంగంలోకి దిగుతాడు ధనియాల్ ఖాన్. విదేశాల్లో ప్రతీకార హత్యలు సాజిద్ మిర్.. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న అతడు, ముంబైలో మారణహోమం సృష్టించిన కసబ్ గ్యాంగ్‌కు శిక్షణ ఇవ్వడమేకాక, దాడి సమయంలో ఫోన్ ద్వారా ఆదేశాలు జారీచేసిన వ్యక్తి. అతడి జాడ కనిపెట్టేందుకు లండన్ వెళ్లిన ధనియాల్కు సహాయకారిగా వస్తుంది నవాజ్ మిస్త్రీ (కత్రినా కైఫ్), ఓ రహస్య కన్సల్టెన్సీలో పనిచేసే ఆమె ఇండియన్ పార్సీ. వివిధ దేశాల గూఢచార సంస్థలు ఆ కన్సల్టెన్సీ సేవలను వినియోగించుకూంటూ ఉంటారు. సాజిద్‌ను చంపే క్రమంలో ధనియాల్ ప్రదర్శించిన దూకుడు నచ్చక గుడ్ బై చెప్పి వెళ్లిపోతుంది నవాజ్. కట్ చేస్తే.. చికాగోలోని జైలు. ముంబై దాడుల్లో తనదైన పాత్ర పోషించి, ఆ తరువాత అరెస్టయిన డేవిడ్ హెడ్లీ ప్రస్తుతం ఉంటోన్న జైలు. నాటకీయ రీతిలో ఆ జైలులోకి ప్రవేశించిన ధనియాల్.. హెడ్లీ స్నానం చేసే నీళ్లలో విషం కలిపి వాణ్ని చంపేస్తాడు. ఇక మిగిలిని ఇద్దరు మాస్టర్ మైండ్స్ హఫీజ్ సయ్యద్, సబాహుద్దీన్ ఉమ్వి (అసలు పేరు జకీ ఉర్ రహమాన్ లఖ్వీ)లను అంతం చేసేందుకు పాకిస్థాన్ వెళ్లాలనుకుని, అందుకు సాయం చేయమని నవాజ్ (కత్రినా)ను కోరతాడు ధనియాల్. తాజ్‌పై దాడి ఆమెను కూడా బాధించి ఉంటుంది కాబట్టి హీరోతో కలిసి తాను కూడా పాకిస్థాన్‌కు పయనమవుతుంది నవాజ్. పాక్ వీధుల్లో ధనియాల్ సాహసాలు సినిమా సెకండ్ హాఫ్ మొత్తం పాకిస్థాన్‌లోనే. ఓ భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్న హపీజ్ సయ్యద్‌ను అంతం చేయడానికి.. సభలో అతడు మాట్లాడబోయే మైకులో బాంబు పెడతాడు ధనియాల్. మరోవైపు జైలులో ఉన్న లఖ్వీని చంపేందుకు అతడికి ఎంతో నమ్మకస్తుడైన డాక్టర్ దగ్గర పనిచేసే నర్స్ సహాయం కోరతాడు. నాయకులు నూరిపోసే జీహాద్ మత్తులోపడి ప్రాణత్యాగాలకు సిద్ధపడుతున్న ఎందరో పాకిస్థానీ యువకులు వాళ్ల తల్లులకు గర్భశోకం మిగుల్చుతున్నారు. అలాంటి తల్లులకు ప్రతినిధే ఈ నర్స్. తన కొడుకులాంటి ఇంకొందరు ఉగ్రవాదానికి బలి కాకూడదనే ఉద్దేశంతో ఇంజక్షన్‌ను మార్చేస్తుంది. అలా విషపు ఇంజక్షన్‌తో లఖ్వీ చస్తాడు. ఇటు లాహోర్ బహిరంగ సభకు తాను కూడా వెళ్లిన ధనియాల్.. బాంబును పేల్చేలోగా అతడి ప్లాన్, ఫోటో సహా పూర్తి వివరాలు ఐఎస్ఐకి తెలిసిపోతాయి. దీంతో హఫీజ్ బాంబు దాడి నుంచి తప్పించుకుంటాడు. అతడ్ని వెంటాడి మరీ చంపుతాడు ధనియాల్ ఖాన్. చంపేముందు ఒక్క మాట చెబుతాడు. 'హఫీజ్ సయ్యద్.. ఈ ఇండియాకు ఏం కావాలి? అని పదే పదే ప్రశ్నిస్తావు కదా. సమాధానం చెప్తా విను.. ఇండియాకు కావాల్సింది న్యాయం' చట్టమంటూ ఒకటుంది! బహుశా ఇలాంటి న్యాయాన్నే భారతదేశంలోని అధిక సంఖ్యాకులు కోరుతూ ఉండొచ్చు. కానీ చట్టమంటూ ఒకటుంటుంది. ఎంతటి సముచిత న్యాయమైనా చట్టం పరిధిలోనే జరగాలే తప్ప మరోలా జరగవద్దనేది లిఖిత శాసనం. అందుకే మొత్తం ఆపరేషన్‌ను భారత ప్రభుత్వం అనుమతి తీసుకోకుండానే (అడిగినా ఇవ్వదు కాబట్టి) నిర్వహిస్తారు రా అధికారులు. అంతెందుకు.. ఆపరేషన్ పూర్తి చేసి జల మార్గం గుండా భారత్‌కు తిరిగొస్తూ నడి సముద్రంలో చిక్కుకున్న ధనియార్ ఖాన్, నవాజ్‌లను కాపాడటానికి నేవీ అధికారులు అంగీకరించరు. పాక్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించడం చట్ట విరుద్ధం కాబట్టి వారు ఆపని చేయలేరు. చివరికి రా అధికారి ఒత్తిడితో వాళ్లను కాపాడటానికి వెళతారు. కానీ అప్పటికే బుల్లెట్ దెబ్బలు తిన్న ధనియాల్ ఖాన్ చనిపోయి నీటమునుగుతాడు. దటీజ్ పవర్ ఆఫ్ రివేంజ్ సాధారణంగానే రివేంజ్ స్టోరీస్‌లో ఓ కిక్ ఉంటుంది. దాన్ని ప్రేక్షకులకు సమగ్రంగా అందించడంలో సఫలీకృతుడయ్యాడు దర్శకుడు కబీర్ ఖాన్. కథలో ఏం జరగబోతుందో ముందే తెలినప్పటికీ బిగుతైన కథనం ప్రేక్షకుడికి నిమిషం పాటైనా బోర్ కొట్టించదు. ముందే చెప్పుకున్నట్లు ఇది ఫిక్షన్ సినిమా కాబట్టి విదేశాల్లో, శత్రుదేశంలో హీరో చేసే సాహసాలు, ఆర్మీ రికార్డుల్లో అతడి పేరు గల్లంతు, ఐఎస్ఐతో బేరసారాలు తదితర అంశాల్లో లాజిక్ వెతుక్కోవాల్సిన పనిలేదు. పాక్- అమెరికా సంబంధాలు, ధనియాల్ ఫొటోను సాధించడంకోసం భారత్‌లో ఐఎస్ఐ ఏజెంట్లు బాహాటంగా తిరగడం, సిరియాలో యుద్ధవాతావరణం తదితర సీన్లు రియలిస్టిక్‌గా గోచరిస్తాయి. కబీర్ కు పాకిస్థానంటే అంత ప్రేమెందుకు? హైదరాబాదీ అయిన కబీర్ ఖాన్.. పాకిస్థాన్‌పై తనకున్న అదోరకమైన ప్రేమను మరోసారి చాటుకున్నాడు. 2006 నుంచి అతడు తీసిన ఐదు సినిమాలకు బ్యాక్ డ్రాప్ పాకిస్థానే కావడం విశేషం. ఇక ఇప్పటికే వయసు మీదపడిపోయిన హీరో సైఫ్ అలీ ఖాన్‌కు చాలా కాలం తర్వాత మంచి హిట్ దొరికిందని చెప్పొచ్చు. సినిమా చూసిన తర్వాత ధనియాల్ ఖాన్ పాత్రకు అతడే సరైన వ్యక్తి అని ప్రతిఒక్కరు ఫీలవుతారు. ఇక నవాజ్ పాత్రలో హీరోతోపాటు సాహసాలు చేస్తూ కత్రినా కైఫ్ మెప్పించింది. సొంతగా చెప్పుకున్న హిందీ డబ్బింగ్లో ఇంగ్లీష్ యాక్సెంట్ స్పష్టంగా వినబడుతున్నప్పటికీ తెరపై ఆమె అభినయం ముందు అది చాలా చిన్న విషయంగా కనబడుతుంది. సైఫ్, కత్రినా తప్ప మిగతా పాత్రధారులందరూ అంతగా గుర్తింపులేనివారే. కొసమెరుపు పాకిస్థాన్‌లో ఈ సినిమాను నిషేధించడం నూటికి నూరుపాళ్లు న్యాయమే. ఎందుకంటే ఏ దేశమైనాసరే, తాను తప్పుచేస్తున్నప్పటికీ, తనను నిందిస్తూ, తన పౌరులను అంతమొందించే కథాంశంతో రూపొందిన సినిమా (అది ఫిక్షనే అయినప్పటికీ)ను అంగీకరిస్తుందని మనం భావించాల్సిన అవసరంలేదు. ఆ విధంగా సినిమాకు ముందు 'ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు ఏ వ్యక్తినిగానీ లేదా సంస్థను గానీ ఉద్దేశించినవి కావు. పూర్తిగా కల్పితాలు' అని ఫాంటమ్ రూపకర్తలు చెప్పడం రొటీన్ వ్యవహారమే తప్ప నిజం కాదు. -
సైఫ్ సంచలన వ్యాఖ్యలు
కబీర్ ఖాన్ లేటెస్ట్ మూవీ 'ఫాంతమ్' మరోసారి హెడ్ లైన్ గా మారింది. సినిమా ప్రారంభం అయిన దగ్గరనుంచి ఏదో ఒక వివాదానికి కేంద్రంగా మారుతున్న ఈ సినిమా పై పాకిస్తాన్లో బ్యాన్ విధించటంతో మళ్లీ తెర మీదకు వచ్చింది. అయితే ఫాంతమ్ బ్యాన్పై బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాను సైతం ఆకర్షిస్తున్నాయి. సైఫ్‌కు జోడిగా కత్రినా నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ చిత్ర కథ అంతా పాక్ తీవ్రవాదం చుట్టూ తిరుగుతుంది. 26/11 ముంబై దాడులు వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్‌ను మట్టుపెట్టే పోలీస్ పాత్రలో సైఫ్ ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమా సక్సెస్ సైఫ్ కెరీర్‌కు కూడా కీలకం కావటంతో సినిమా ప్రమోషన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే పాక్‌లో బ్యాన్ విధించిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరి స్పందించాడు సైఫ్.. జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయ్యద్... ముంబై టెర్రర్ వెనుక అసలు సూత్రధారి అన్న... సైఫ్ ఒక్కసారిగా ఇంటర్ నేషనల్ మీడియాకు షాక్ ఇచ్చాడు.. అంతేకాదు అదే సమయంలో తన ఫ్యామిలీకి సంబందించి కూడా కొన్ని ఇంట్రస్టింగ్ కామెంట్లు చేశాడు సైఫ్. 2012 లో ఐఎస్ఐ చీఫ్‌గా పనిచేసిన మేజర్ జనరల్ అలీఖాన్ తన అంకుల్ అవుతారని, చిన్నతనంలో ఆయన పిల్లలతో కలిసి ఆడుకున్న రోజులు గుర్తు చేసుకున్నారు. అంతేకాదు దేశం కన్నా తనకు ఫ్యామిలీ రిలేషన్స్ ఎక్కువ కాదని, భారత దేశానికి హాని చేసేవారు తన కుటుంబసభ్యులైన వారికి మద్ధతు తెలిపే ప్రసక్తే లేదంటూ ఘాటుగా స్పందించాడు. ప్రస్తుతం పాక్ విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న షేర్యార్ ఖాన్ కూడా తన బంధు వర్గం వాడే అన్న సైఫ్, భారత ప్రభుత్వంతో ఆయనకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయిని తెలిపారు. ఏది ఏమైనా సినిమా ప్రముఖులు మూవీ ప్రమోషన్స్ కోసం కాంట్రవర్షియల్ కామెంట్స్ నే ఆశ్రయిస్తారన్న మాటని సైఫ్ మరోసారి నిజం చేశారు. ఫాంతమ్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. -
కళాపర్వం
పనితోపాటే పుట్టింది పాట. పనీపాటా జతకట్టింది జన పదం. అదే జాన పదం. అచ్చమైన పల్లె సంస్కృతికి దృశ్యరూపం. ప్రపంచంలో మరే ఇతర దేశంలో లేనన్ని భిన్న కళలు, విభిన్న సంస్కృతులు మన సొంతం. ఈ కళాకృతులన్నింటికి వేదికయ్యింది శిల్పారామం. ‘పర్వ పూర్వోత్తర్’ పేరుతో జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంత ఆహూతులను అలరించింది... - ఎస్. శ్రావణ్‌జయ ఆనందమైనా.. విషాదమైనా... సంబరమైనా.... పాండిత్యానికి అతీతంగా పరవశమే పరమపద సోపానంగా సాగే కళ జానపదం. అచ్చమైన గ్రామీణ సంస్కృతికి ప్రతిబింబం. భిన్న సంస్కృతులకు నిలయమైన మన దేశంలో ప్రాంతానికో ఆటపాటా. అఖిల భారత రంగస్థల ఉత్సవం సందర్భంగా సంగీత నాటక్ అకాడమీ, భారత్ ఫోక్ ఆర్ట్ అకాడమీ సంయుక్తంగా ఈశాన్య రాష్ట్రాల జానపద నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు. శిల్పారామంలో శుక్రవారం ప్రారంభమయిన ఈ అద్భుత నృత్య ప్రదర్శన ఆదివారం వరకు కొనసాగనుంది. రాధాకృష్ణుల నృత్యం... ‘ఏడే ళ్ల వయసులో ఈ నృత్యాన్ని నేర్చుకోవడం ప్రారంభించాను. ప్రతి రోజూ ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటల పాటు క్రమం తప్పకుండా నేర్చుకోవాలి. ఇప్పుడు నా వయసు 38. కొన్ని సార్లు ఈ నాట్యం గంట పాటు ఉంటుంది. బృందంలో ఏ ఒక్కరూ అలసిపోయినా ప్రమాదమే. మా మణి పూర్ రాష్ట్రంలో ప్రతి యాసాంగ్(హోలీ) పండుగకి మా బృందం ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తుంది. హోలీ పండుగ సందర్భంగా రాధాకృష్ణులు చేసే నృత్యమే ఈ డోల్ చోలమ్కి ప్రధాన నేపథ్యం’ అన్నారు డోల్ చోలమ్ కళాకారుడు జ్ఞానేశ్వర్. నవ వసంత వేడుక... ‘అసోంలో కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తాం. అసోం మహిళలు ఈ నాట్యాన్ని ఎంతో ఇష్టపడి చేస్తారు. దేశ వ్యాప్తంగా మా బృందం చాలా చోట్ల ప్రదర్శన ఇచ్చింది’ అంటోంది బిహు నృత్య దళం. వీటితోపాటు మణిపూర్‌కే చెందిన ‘థాంగ్ థా’, మిజోరం నృత్యం చెరా, బెంగాల్ - బౌల్ గాన్ ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.