కత్రినా... ఎందుకు వద్దంటోంది? | Is Katrina Kaif turning down scripts to get settled? | Sakshi
Sakshi News home page

కత్రినా... ఎందుకు వద్దంటోంది?

Published Mon, Oct 12 2015 12:18 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

కత్రినా... ఎందుకు వద్దంటోంది? - Sakshi

కత్రినా... ఎందుకు వద్దంటోంది?

 కత్రినా కైఫ్... ఆ పేరు వినగానే మనకు వెంకటేశ్‌తో నటించిన ‘మల్లీశ్వరి’ గుర్తొస్తుంది. ఆ సినిమాలో రాజవంశీకురాలిగా కత్రినా నటన గుర్తొస్తుంది. అభినయంతో పాటు అందంతో అందరినీ కట్టిపడేసిన ఈ బాలీవుడ్ భామ గురించి ఇప్పుడో వార్త హల్‌చల్ చేస్తోంది. అది ఏమిటంటే, ఈ అమ్మడు ఇటీవల తన దగ్గరకు వచ్చిన అవకాశాలన్నిటినీ ఏదో ఒక విధంగా పక్కన పడేస్తోందట! ‘అవును. ఆ మాట నిజమే. కత్రినా తాను చేసే సినిమాల సంఖ్యను బాగా తగ్గించుకుంటున్నారు. అయితే, అందుకు కారణం మాత్రం మాకూ తెలియదు’ అని కత్రినా సన్నిహిత వర్గాలు చెప్పాయి.
 
  కాగా, ముంబయ్ సినీ జనాలు మాత్రం దీని గురించి ఒక మాట చెబుతున్నారు. వస్తున్న పాత్రలు, సినిమాలను ఈ మూడు పదులు దాటిన భామ కాదనడం వెనుక ఒక కారణం ఉందట! ఇప్పటికే పలుసార్లు ప్రేమ వ్యవహారాలు విఫలమైన కత్రినా ఈ సారి పెళ్ళి పీటలకెక్కాలని భావిస్తున్నారట. అందు కోసమే సినిమాలు తగ్గించుకుంటున్నట్లు ముంబయ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ‘ఫాంటమ్’ చిత్రంలో మెరిసిన కత్రినా నిజానికి రోహిత్ శెట్టి దర్శకత్వంలోని ‘దిల్‌వాలే’, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ‘బాజీరావ్ మస్తానీ’, ఆశుతోష్ గోవారీకర్ రూపొందిస్తున్న ‘మొహెంజొదారో’ చిత్రాల్లో కూడా నటించాల్సింది.
 
  ఈ భారీ చిత్రాల్లోని అవకాశాలను కత్రినా కాదనడానికీ, ఈ పెళ్ళి ప్రతిపాదనకూ లింక్ ఉందని జనం వాదన. మరికొందరు మాత్రం ‘ఆ... అదేం లేదు. ఆ సినిమాలన్నీ చాలా సమయం పట్టే భారీ ప్రాజెక్ట్‌లు కాబట్టే కత్రినా సున్నితంగా తోసిపుచ్చింది’ అని చెబుతున్నారు. మరి, ఇంతకీ కత్రినా మనసులో ఏముందంటారు? ఆమే పెదవి విప్పి, అదేమిటో చెప్పాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement