ఫిలిం కెరీర్ పరంగా కన్నా పర్సనల్ ఇష్యూస్ తోనే ఎక్కువగా వార్తల్లో ఉండే బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్.. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎదో ఒక గాసిప్ తో ఎప్పుడూ వార్తల్లో కనిపించే ఈ బ్యూటి ఫాంటమ్ ప్రమోషన్ సందర్భంగా ఇంట్రస్టింగ్ కామెంట్ చేసింది. చాలా రోజులుగా యంగ్ హీరో రణబీర్ కపూర్ తో ప్రేమాయణం నడుపుతున్నట్టుగా పుకార్లు షికార్లు చేస్తున్న నేపధ్యంలో తన పెళ్లి విషయంలో షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చింది.
ఇప్పటికే చాలా సార్లు ఈ యువ జంట నిశ్చితార్ధం కూడా అయిపోయినట్టుగా వార్తలు వినిపించాయి.. అయితే కత్రీనా హీరోయిన్ గా ఇటీవల విడుదలైన ఫాంటమ్ సినిమా ప్రమోషన్ సందర్భంగా మరోసారి కత్రినా పెళ్లి విషయం తెరమీదకు వచ్చింది. రణబీర్ తో మీ పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్నకు నేషనల్ అవార్డ్ సాదించాకే అని సమాధానం చెప్పింది. ఈ లాంగ్ లెగ్స్ బ్యూటి.
అయితే తరువాత తన స్టేట్ మెంట్ ను కవర్ చేసుకోవడానికి ప్రయత్నించిన కత్రినా తన సినిమా ఏదైనా నేషనల్ అవార్డ్ సాదించాక పెళ్లి చేసుకుంటానంటూ మాట మార్చింది. ఏది ఏమైనా ఈ బాలీవుడ్ హాట్ బ్యూటికి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేష్యం అయితే ఉన్నట్టుగా కనిపించట్లేదంటున్నాయి బాలీవుడ్ సినీ వర్గాలు.
నేషనల్ అవార్డ్ సాదించాకే పెళ్లి : కత్రినా
Published Sun, Aug 30 2015 9:57 AM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM
Advertisement
Advertisement