నా జీవితంలోకి ఎవరైనా రావచ్చు...కానీ | Not interested in getting married, says Salman Khan | Sakshi
Sakshi News home page

నా జీవితంలోకి ఎవరైనా రావచ్చు...కానీ

Published Tue, Jan 7 2014 11:39 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

నా జీవితంలోకి ఎవరైనా రావచ్చు...కానీ - Sakshi

నా జీవితంలోకి ఎవరైనా రావచ్చు...కానీ

ముంబై: బాలీవుడ్ బ్యాచులర్ సల్మాన్ ఖాన్ వివాహం పట్ల విముఖత వ్యక్తం చేశాడు. తనకు పెళ్లంటే ఆసక్తి లేదని, బ్యాచ్లర్గా ఉండటానికే ఇష్టపడతానని కండల వీరుడు తెలిపాడు. వయసు యాభై ఏళ్లకు చేరువవుతున్నా ఈ టాప్ హీరో సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉన్న సంగతి తెలిసిందే.  ప్రేమ విషయంలోనూ విసిగిపోయిన సల్లూభాయ్... ప్రియురాలు కలిగి ఉండటం అన్నా ఇష్టం లేదంటున్నాడు. తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదనీ, ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతానని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. గత 30 ఏళ్ల నుంచి ఇలాగే ఉండటానికి ఇష్టపడుతున్నట్లు చెప్పాడు.

సినిమాల్లో సక్సెస్ సాధించినా వ్యక్తిగత జీవితంలో సల్మాన్ ఖాన్ సక్సెస్ సాధించలేకపోయాడు.  అయితే సినిమా రంగంలో అడుగు పెట్టినప్పటి నుంచి సల్మాన్ ఖాన్ చాలా మంది హీరోయిన్లతో స్నేహం చేసాడు. అనంతరం వాళ్లు అతన్ని వీడిపోయిన విషయం తెలిసిందే. దీనిపై సల్మాన్ ఖాన్ స్పందిస్తూ ప్రస్తుతానికి తాను సింగిల్ అని చెబుతూ....తనకు ఏం కావాలో అదే చేస్తానని చెప్పాడు.

ఈ విషయంలో తాను ఎవరికీ వివరణ ఇచ్చుకోవటం కానీ, అబద్దాలు చెప్పుకోవాల్సిన అవసరం  లేదని స్పష్టం చేశాడు. తన జీవితంలోకి రావాలనుకునే వారు రావచ్చు అని ..కానీ వాళ్లు తన నుంచి ఏమీ ఆశించకూడదని తెలిపాడు. అయితే తనకు స్త్రీలంటే గౌరవం ఉందని.... వారిని గౌరవిస్తునే ఉంటానని సల్మాన్ ఖాన్ తెలిపాడు. తాను ఎవరి గురించి చెడుగా మాట్లాడలేదన్నాడు. గతంలో సల్మాన్ ఖాన్...సోమి అలీ, సంగీతా బిజ్లానీ, ఐశ్వర్యారాయ్, కత్రినా కైఫ్తో ప్రేమాయణం నడిపిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement