ఓసారి సల్మాన్‌ వద్దకు ఏడుస్తూ వెళితే.. | Salman Khan the greatest strength to me: Katrina Kaif | Sakshi
Sakshi News home page

ఓసారి సల్మాన్‌ వద్దకు ఏడుస్తూ వెళితే..

Published Sun, Jun 18 2017 11:41 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ఓసారి సల్మాన్‌ వద్దకు ఏడుస్తూ వెళితే.. - Sakshi

ఓసారి సల్మాన్‌ వద్దకు ఏడుస్తూ వెళితే..

ముంబయి: వారిద్దరు దూరంగా ఉంటుండొచ్చు. అరుదుగా మాత్రమే కలిసి వెండితెరను పంచుకుంటుండొచ్చు. కానీ, వారు మాట్లాడే ప్రతిసారి మాత్రం పక్కపక్కనే అన్యోన్యంగా ఉన్నట్లుంటుంది. ఒకరిగురించి మరొకరు చెప్పాల్సి వచ్చినప్పుడు అదే సిగ్గు, అభిమానం, ప్రేమ ఇంకా చాలా. ఆ ఇద్దరు ఎవరో కాదు.. బాలీవుడ్‌ మోస్ట్‌ ఎట్రాక్టివ్‌ జంట సల్మాన్‌ఖాన్‌, కత్రినా కైఫ్‌. గతంలో ప్రేమ వ్యవహారం నడిపిన వారిద్దరు ప్రస్తుతం విడిపోయి చెరో దిక్కున ఉంటున్నారు. అయినా ఎప్పుడూ వారి సంబంధం గురించి ప్రశ్నించినా దానిపై గొప్ప గౌరవాన్ని చూపిస్తుంటారు.

తాజాగా కూడా కత్రినా కైఫ్‌ తమ బంధాన్ని గుర్తు చేసుకుంది. ఆమె నటించిన జగ్గా జాసుస్‌ అనే చిత్రం త్వరలో రానున్న నేపథ్యంలో ఓ టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె మరోసారి సల్మాన్‌ గురించి తన అభిప్రాయాలు పంచుకుంది. ‘సల్మాన్‌ గొప్ప దయార్ధుడని, అందరినీ ప్రేమిస్తాడని, సహాయం చేస్తాడని మనందరికీ తెలుసు. కానీ, నాకు మాత్రం గొప్ప బలం. అతడు ఎప్పుడు నాకోసం కొత్తగా ఏమీ చేయాలనుకోలేదు. నేను ఎలా ఉండాలనుకున్నానో అలాగే చూశాడు. బాగా ప్రోత్సహించేవాడు. ప్రతి క్షణం నా వెన్నుతట్టి వెనుకాలే నిల్చున్నాడు. నా కాళ్ల మీద నేను నిలబడేందుకు.. కష్టపడి పనిచేసేందుకు అండగా నిలిచాడు’  అంటూ చెప్పింది. వారిద్దరి మధ్య ఉత్తమ చెత్త విషయాలు ఏమిటని ప్రశ్నించగా వాటిని ప్రత్యేక షోలో చెబుతానంది.

‘ఒక రోజు నేను సల్మాన్‌ని కలిసి ఏడుస్తుంటే అతడు మాత్రం నవ్వుతున్నాడు. ఎంత నీచమైనవాడో అనుకున్నాను. నా తొలి చిత్రంతోనే నా కెరీర్‌ ముగిసిపోయిందని అనుకున్నాను. ఇక నా జీవితం మొత్తం అయిపో​యిందని చెబుతున్నా అతడు మాత్రం అలాగే నవ్వుతున్నాడు. చివరకు నవ్వు ఆపేసి.. ఇదేం పెద్ద విషయం కాదన్నాడు. నేను ఎక్కడి వరకు వెళతానో తనకు కనిపిస్తోందని అన్నాడు. నా జీవితంలో ఏవేం జరగుతాయని నమ్మి వచ్చానో అవన్నీ జరుగుతాయని, కేవలం చేసే పనిమీద శ్రద్ద పెట్టమని చెప్పాడు. అదే చేశాను.. నిజంగా అదే జరిగింది’  అని కత్రినా చెప్పుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement