'ఆమెతో కలిసి పనిచేయడం ఇష్టం' | Salman Khan keen to work with Katrina in his next | Sakshi
Sakshi News home page

'ఆమెతో కలిసి పనిచేయడం ఇష్టం'

Published Mon, Sep 7 2015 11:38 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'ఆమెతో కలిసి పనిచేయడం ఇష్టం' - Sakshi

'ఆమెతో కలిసి పనిచేయడం ఇష్టం'

ముంబై: తన తర్వాతి సినిమాలో కత్రినా కైఫ్ తో నటించాలన్న కోరికను బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ వ్యక్తం చేశారు. ఆమెతో కలిసి పనిచేయడాన్ని తాను ఇష్టపడతానని చెప్పాడు. అభిలాషను వెల్లడించాడు. వీరిద్దరూ మరోసారి కలిసి నటించే అవకాశముందని బాలీవుడ్ లో ఇప్పటికే రూమర్లు షికారు చేస్తున్నాయి. అతుల్ అగ్నిహోత్రి సినిమాలో నటిస్తున్నానని, మిగతా వివరాలు చెప్పలేనని సల్మాన్ ఖాన్ అన్నాడు. ఈ సినిమాలో కత్రినా కైఫ్ నటిస్తుందా, లేదా అనేది వెల్లడి చేయలేదు.

'ఈ సినిమాలో ఆమె ఉంటే నాకూ ఇష్టమే. కానీ నాకేం తెలియదు' అని సల్మాన్ అన్నాడు. ఈ చిత్రంలో కత్రిన హీరోయిన్ గా ఎంపికైతే వీరిద్దరి కాంబినేషన్ లో ఐదో సినిమా అవుతుంది. పార్టనర్, యువరాజ్,  మైనే ప్యార్ కౌన్ కియా, ఏక్ థా టైగర్ సినిమాల్లో సల్మాన్, కత్రిన కలిసి నటించారు. సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' దీపావళికి విడుదలకానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement