మాజీ ప్రేయసికి భయపడిన సల్మాన్! | I'm in awe of you: Salman tells Katrina | Sakshi
Sakshi News home page

మాజీ ప్రేయసికి భయపడిన సల్మాన్!

Published Sun, Jan 24 2016 4:30 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

మాజీ ప్రేయసికి భయపడిన సల్మాన్! - Sakshi

మాజీ ప్రేయసికి భయపడిన సల్మాన్!

ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటుడు, కండల వీరుడు సల్మాన్‌ ఖాన్ తన మాజీ ప్రేయసి కత్రినా కైఫ్‌ను వినూత్నంగా పొగడ్తల్లో ముంచెత్తాడు. ఆమెకు తాను తెగ భయపడ్డానని చెప్తూనే ఆమె టాలెంట్పై ప్రశంసలు గుప్పించారు. ఓ నేషనల్ టెలివిజన్ చానెల్లో బిగ్ బాస్ నౌ ఫైనల్ అనే కార్యక్రమంలో కత్రినాతోపాటు పాల్గొన్న సల్మాన్ ఆమెను పలువిధాల పొగడ్తల్లో ముంచెత్తారు. కత్రినా డ్యాన్స్ స్కిల్స్, ఆమె నటనలో అభినయం అత్యద్భుతం అన్నారు. అంతేకాదు, తనకు తెలిసిన వారిలో కత్రినా శక్తిమంతురాలు అని, చాలా మంచిదని చెప్పారు.

'నువ్వు చాలా స్ట్రాంగ్ వుమెన్. నువ్వు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నీకు పదహారేళ్లు. ఇప్పటికే చాలా దూరం చేరుకున్నావు. దీనంతటికి కారణం నీ కఠోర శ్రమే. దేవుడు నాకు కనిపించి టాలెంట్, హార్డ్ వర్క్లలో ఏది కోరకుంటావని కోరితే నేను హార్డ్ వర్క్నే కోరుకుంటా' అని సల్మాన్ అన్నారు. దీనికి కత్రానా స్పందిస్తూ 'నాకు టాలెంట్ కూడా ఉంది.. కాకపోతే కొంచెమే అని బదులిచ్చింది. దీనికి తిరిగి సల్మాన్ బదులిస్తూ ఎప్పుడు మనం కష్టపడుతుంటామో అప్పుడే టాలెంట్ మెరుగవతుంటుంది. నువ్వు టాలెంట్ ఉన్నదానివని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకనొక సందర్భంలో మొత్తం దేశం నీ టాలెంట్కు భయపడింది.. నేను కూడా' అంటూ మాజీ ప్రేయసిని మాటలతో అలరించాడు సల్మాన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement