పెళ్లి గురించి నోరు విప్పిన సల్మాన్ | Doubtful about marriage but want kids, says Salman Khan | Sakshi
Sakshi News home page

పెళ్లి గురించి నోరు విప్పిన సల్మాన్

Published Wed, Feb 10 2016 6:30 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

పెళ్లి గురించి నోరు విప్పిన సల్మాన్ - Sakshi

పెళ్లి గురించి నోరు విప్పిన సల్మాన్

ముంబై: బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ లిస్టులో అగ్రస్థానంలో ఉన్న స్టార్ సల్మాన్ ఖాన్. ఇప్పటివరకు చాలా సార్లు సల్మాన్ వివాహం గురించి ప్రస్తావన వచ్చింది. తాజాగా సల్మాన్ తన వివాహం అంశంపై పెదవి విప్పాడు. పుణెలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఓ కార్యక్రమానికి సల్లూభాయ్ హాజరయ్యాడు. అక్కడ కూడా పెళ్లి అంశాన్ని, మాజీ ప్రేయసి కత్రినా కైఫ్ గురించి ప్రశ్నల వర్షం కురిపించారు. పెళ్లి చేసుకుంటానో లేదో చెప్పలేనని, ఇంకా ఓ అభిప్రాయానికి రాలేదని సల్మాన్ పేర్కొన్నాడు. అయితే, ఇద్దరు-ముగ్గురు పిల్లలు మాత్రం కావాలని తన కోరిక వెలిబుచ్చాడు. వివాహం చేసుకోకపోతే పిల్లలు కలుగరని తెలుసన్నాడు. 

ఆయనను కత్రినా విషయాలపై కొన్ని ప్రశ్నలు అడిగగా వాటికి సానుకూలంగా స్పందించాడు. కత్రినా విజయంలో తన పాత్ర ఉందని, తన సహాయం గురించి మాత్రమే ఆమె చెప్పింది. కానీ, ఇది చాలా పెద్ద అబద్దమని, కత్రినా చాలా కష్టపడేతత్వం ఉన్న హీరోయిన్ అని చెప్పుకొచ్చాడు. ఆమెలా కష్టపడి పనిచేసే వారిని ఎవరిని చూడలేదని, ఇండియాలోనే ఆమె బిగ్గెస్ట్ స్టార్ అంటూ మాజీ ప్రేయసిని పొగడ్తల్లో ముంచెత్తాడు. తాను విన్న వార్తలను బట్టి రణబీర్ కపూర్, కత్రినాలు బ్రేకప్ అయి ఉండొచ్చునని అభిప్రాయపడ్డాడు. బాంబే హైకోర్టు ఊరట ఇచ్చినప్పటికీ, మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో 'హిట్ అండ్ రన్ కేసు' వివాదం ఇప్పటికీ సల్మాన్ ను వెంటాడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement