Katrina Kaif And Vicky Kaushal Marriage: Memes On Salman Khan Goes Viral - Sakshi

#VickyKatrinaWedding: విక్కీ-కత్రినాల వివాహం.. సల్మాన్‌ రియాక్షన్‌ ఇలా ఉంటుందా..!

Dec 2 2021 9:19 PM | Updated on Dec 3 2021 10:06 AM

Salman Khan Became Viral Meme As Vicky Katrina Wedding Trends Online - Sakshi

ప్రస్తుతం బాలీవుడ్‌లో అనే కాదు మొత్తం ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఆసక్తికర అంశం ఏంటంటే బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ విక్కీ కౌశల్‌-కత్రినా కైఫ్‌ల పెళ్లి ముచ్చట. గత కొన్ని రోజులుగా వీరి వివాహం గురించి మీడియా, సోషల్‌ మీడియాలో బోలెడన్ని వార్తలు ప్రచారం అవుతున్నాయి. గెస్ట్‌ లిస్ట్‌, వివాహ వేదిక తదితర వివరాల గురించి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంత వరకు విక్కీ, కత్రినలు ఈ వార్తలపై స్పందించలేదు.. అలా అని ఖండించలేదు. మౌనంగా ఉన్నారు. అంటే అర్థాంగీకరామేమో మరి. 

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 2021, డిసెంబర్‌ 9 విక్కీ-కత్రినాల వివాహం అని జోరుగా ప్రచారం సాగుతోంది. రాజస్తాన్‌లోని సవాయి మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా వీరి వివాహ వేడుకకు వేదికగా మారనుందట. సరే వారిద్దరి వివాహం అయిననాడు తప్పకుండా అందరికి తెలుస్తుంది. అయితే ఈలోపు నెటిజనులు మరో పనిలో పడ్డారు. విక్కీ-కత్రినాల వివాహం నాడు సల్మాన్‌ ఖాన్‌ రియాక్షన్‌ ఎలా ఉంటుందో ఊహిస్తూ.. బోలెడన్ని మీమ్స్‌ క్రియేట్‌ చేశారు. అంతటితో ఆగక #VickyKatrinaWedding పేరుతో ఈ మీమ్స్‌ని ట్విటర్‌లో ట్రెండ్‌ చేస్తున్నారు. ఇక వీటిని చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం ఖాయం. వాటిపై మీరు ఓ లుక్కెయండి.

(చదవండి: ఇప్పట్లో రకుల్‌ పెళ్లి లేనట్లే.. అసలు నిజం చెప్పేసిన బ్యూటీ)

ఇక విక్కీ-కత్రినాల వివాహానికి సల్మాన్‌, ఆయన కుటుంబ సభ్యులను ఆహ్వానించలేదట. సల్మాన్‌ కుటుంబానికి ఇంకా ఎలాంటి ఆహ్వానాలు అందలేదట. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్‌ సోదరి అర్పితా ఖాన్‌ తెలియజేశారు. ‘విక్కీ, కత్రినా వివాహానికి సంబంధించి మాకు ఇంతవరకు ఎలాంటి ఆహ్వానం అందలేదు’ అని తెలిపారు. 
(చదవండి: డిసెంబర్‌లోనే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టిన కత్రినా!)

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ తొలిసారిగా 2005లో ‘మైనే ప్యార్ క్యున్ కియా’లో కలిసి నటించారు. ఆ తర్వాత వారు భారత్, యువరాజ్ వంటి చిత్రాలలో కూడా కలిసి పనిచేశారు. ప్రస్తుతం వీరిద్దరూ టైగర్ ఫ్రాంచైజీలో మూడవ చిత్రం టైగర్ 3 లో కలిసి నటిస్తున్నారు.

చదవండి: ఫిక్సైన విక్కీ-కత్రినా పెళ్లి తేదీ, దానికి ముందు ముంబైలో కోర్డు వివాహం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement