Viral: Salman Khan Tiger 3 Look Leaked From Russia Shooting - Sakshi
Sakshi News home page

Tiger 3 Salman Pics Leaked: టైగర్‌ 3 కోసం పూర్తిగా మారిపోయిన సల్మాన్‌

Published Sun, Aug 22 2021 4:55 PM | Last Updated on Sun, Aug 22 2021 6:11 PM

Viral: Salman Khan Look From Tiger 3 Leaked Russia - Sakshi

Russia Tiger 3 Shooting Images: బాలీవుడ్‌లో సీరిస్‌లు మంచి ఆదరణ ఉంది. ధూమ్‌, దబాంగ్‌, క్రిష్‌ సినిమాలే అందుకు చక్కటి ఉదాహరణ. బీ టౌన్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ చిత్రాల్లో హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ‘ఏక్‌ థా టైగర్‌’ ఒకటి. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘టైగర్‌ జిందా హై’ కూడా మంచి హిట్‌ను సల్మాన్‌ ఖాతాలో చేర్చింది. ప్రస్తుతం ఈ సీరిస్‌లో మూడో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘టైగర్‌ 3’ గా రానున్న ఈ చిత్రానికి సంబంధించిన సల్మాన్‌ ఫోటోలు కొన్ని సోషల్‌ మీడియాలో లీకై హల్‌ చల్‌ చేస్తున్నాయి.

ఇటీవల చిత్ర పరిశ్రమలో లీకుల బెడద ఎక్కువగా ఉంది. అభిమానులకు సినిమా అప్‌డేట్స్‌ ద్వారా సర్‌ప్రైజ్‌ ఇవ్వాలని హీరోలు, చిత్ర యూనిట్‌ భావిస్తుండగా అవి ముందే నెట్టింట ప్రత్యక్షమై తారలకే షాక్కిస్తున్నాయనే చెప్పాలి. ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ నటిస్తున్న ‘టైగర్‌ 3’ చిత్రం రష్యాలో చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్‌లో భాగంగా.. కారు ఛేజ్ సీక్వెన్స్ కోసం షూట్ చేస్తున్నప్పుడు సల్మాన్ పొడవాటి గోధుమ రంగు గడ్డంతో కనిపించాడు.

అయితే ఆయన అభిమానుల్లో ఒకరు షూటింగ్‌ జరుగుతుండగా కొన్ని ఫోటోలను తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ప్రస్తుతం గడ్డంతో ఉన్న సల్మాన్‌ ఫోటోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఇందులో సల్మాన్‌ గూఢచారిగా నటిస్తున్నందున, బహుశా ఆ లుక్ మారువేషాలలో ఒకటి కావచ్చని తెలుస్తోంది.

ముంబైలో సల్మాన్ ఖాన్ మార్చి చివరిలో ‘టైగర్ 3’ షూటింగ్‌ను ప్రారంభించగా, కరోనా మహమ్మారి కారణంగా చిత్రీకరణ ఆలస్యమౌతూ వచ్చింది. ఇందులో ఇమ్రాన్ హష్మి విలన్‌గా కనిపించనున్నాడు. కలర్స్ టీవీ షో బిగ్ బాస్ 15 షూటింగ్‌ కోసం సల్మాన్ అక్టోబర్ నాటికి భారత్‌కు తిరిగి రావాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement