బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోయిన్ రాణిస్తున్న ఆమె ఇటీవల హీరో విక్కీ కౌశల్‌ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు కొంతకాలం సీక్రెట్ డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ గతేడాది ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. ప్రేమ, పెళ్లి విషయంలో కత్రినా-విక్కీలు చాలా గొప్యత పాటించారు. తాజాగా దానికి గల కారణమేంటో వివరించింది కత్రినా. ఇటీవల జరిగిన వోల్ఫ్777 ఫిలింఫేర్ ఆవార్డు ఫంక్షన్‌లో విక్ట్రీనా దంపతులు మెరిసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం కత్రినా జూమ్ టీవీతో మాట్లాడుతూ.. పెళ్లి విషయంలో గొప్యత పాటించడం వెనుక అసలు కారణం చెప్పింది. ‘కరోనా సమయంలో నా ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడింది. అందరు కరోనా బారిన పడ్డారు.
చదవండి: విషాదం.. యువ నటి ఆత్మహత్య, వైరల్‌గా మారిన సూసైడ్ నోట్
వారి విషయంలో మరో చాన్స్ తీసుకోవాలని అనుకొలేదు. మళ్లీ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మా వివాహ వేడుకకు సంబంధించిన విషయాలను రహస్యంగా ఉంచాల్సి వచ్చింది. అందుకే కేవలం కుటుంబ సభ్యులు, బంధువులకు మాత్రమే ఆహ్వానం ఇచ్చాం. మా పెళ్లి సీక్రెట్‌గా జరగడానికి అదే కారణం. అలాంటి పాండమిక్‌లో కూడా మా వివాహం చాలా అద్భుతంగా జరిగింది. ఇద్దరం(నేను, విక్కి) చాలా సంతోషంగా ఉన్నాం’ అని చెప్పుకొచ్చింది. కాగా గతేడాది డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో విక్ట్రీనా (విక్కీ కౌశల్, కత్రినా కైఫ్) పెళ్లి ఘనంగా జరిగింది. అప్పటి వరకు పెళ్లిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వని కత్రినా-విక్కీలు.. మరుసటి రోజే పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేశారు.
చదవండి: హే సీతా-హే రామ.. ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. చూశారా?
Comments
Please login to add a commentAdd a comment