కత్రినా లేకుండానే ఫంక్షన్‌కు.. నటితో హీరో స్టెప్పులు.. | Where Is Katrina Kaif at Anant Ambani, Radhika Merchant Sangeet? | Sakshi
Sakshi News home page

అంబానీ సంగీత్‌లో విక్కీ కౌశల్‌.. మరి కత్రినా కైఫ్‌ ఎక్కడ?

Published Sat, Jul 6 2024 2:31 PM | Last Updated on Sat, Jul 6 2024 3:28 PM

Where Is Katrina Kaif at Anant Ambani, Radhika Merchant Sangeet?

అంబానీ ఇంట పెళ్లి అనగానే సోషల్‌ మీడియా మొత్తం హోరెత్తిపోతోంది. ఎన్నో నెలల నుంచే మొదలైన సందడి ఇ‍ప్పుడు తారాస్థాయికి చేరింది. అనంత్‌ అంబానీ- రాధిక మర్చంట్‌ సంగీత్‌ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. బాలీవుడ్‌ సెలబ్రిటీలందరూ ఈ ఫంక్షన్‌కు హాజరై స్టెప్పులేస్తూ సంతోషంగా గడిపారు.

వదిన రాలేదా?
అయితే హీరో విక్కీ కౌశల్‌ మాత్రం భార్య కత్రినా కైఫ్‌ లేకుండా ఈవెంట్‌కు హాజరయ్యాడు. ఇది చూసిన కొందరు ఫోటోగ్రాఫర్లు.. అదేంటి? వదిన రాలేదా? అని అడిగారు. కత్రినా కైఫ్‌ను వదినగా సంబోధించారు. వారి ప్రశ్నలు విన్న విక్కీ సమాధానమివ్వకుండా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో చూసిన కొందరు మేము కత్రినాను మిస్‌ అవుతున్నాం అని కామెంట్లు చేస్తున్నారు. 

విక్కీ ఎప్పటిలాగే..
అయినా తను చాలా ఏళ్లుగా కష్టపడి పని చేస్తూనే ఉంది. ఇప్పుడైనా కొంత బ్రేక్‌ తీసుకుని ఇంట్లోవారితో కలిసుంటే బాగుంటుంది. విక్కీ గురించి కొత్తగా చెప్పేదేముంది. ఎప్పటిలాగే హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడు అని ఓ నెటిజన్‌ రాసుకొచ్చాడు. కత్రినా ప్రెగ్నెంట్‌, అందుకే రాలేదేమో అని మరికొందరు అభిప్రాపయడ్డారు. కాగా సంగీత్‌లో విక్కీ.. నటి షెహనాజ్‌ గిల్‌తో కలిసి స్టెప్పులేశాడు. ఈయన సినిమాల విషయానికి వస్తే అతడు ప్రధాన పాత్రలో నటించిన బ్యాడ్‌ న్యూస్‌ జూలై 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

 

 

చదవండి: ఓటీటీలు చేతులెత్తేస్తున్నాయి.. ప్రతి సినిమా తీసుకోవట: తాప్సీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement