ఎట్టకేలకు స్పందించిన విక్ట్రీనా, ఒక్కటయ్యామంటూ అధికారిక ప్రకటన | Katrina Kaif And Vicky Kaushal Shares Wedding Photos After Marriage | Sakshi
Sakshi News home page

Katrina Kaif-Vicky Kaushal: ఎట్టకేలకు స్పందించిన విక్ట్రీనా, ఒక్కటయ్యామంటూ ప్రకటన

Published Fri, Dec 10 2021 8:16 AM | Last Updated on Sat, Dec 11 2021 12:57 PM

Katrina Kaif And Vicky Kaushal Shares Wedding Photos After Marriage - Sakshi

హీరో విక్కీ కౌశల్, హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ ఏడడుగులు వేశారు. గురువారం రాజస్థాన్‌లోని సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ బర్వారాలో విక్ట్రీనా (విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌) పెళ్లి ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని అధికారికంగా విక్ట్రీనాలు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు తమ పెళ్లి ఫొటోలను షేర్‌ చేస్తూ.. ‘‘మా మనసులో ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమే మమ్మల్ని ఇంతదాకా తీసుకువచ్చింది. మా ఈ కొత్త ప్రయాణానికి అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుతున్నాం’’ అంటూ పోస్ట్‌ షేర్‌ చేశారు.

చదవండి: ఎంఎస్‌ చివరి క్షణాలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్న బ్రహ్మానందం

ఇంతకాలం తమ ప్రేమ, పెళ్లిపై నోరు విప్పని ఈ జంట ఎట్టకేలకు స్పందించారు. వివాహం అనంతరం తమ బంధాన్ని అధికారికం చేశారు. కాగా కల్యాణ మండపాన్ని ఎల్లో, ఆరెంజ్, పింక్‌ కలర్‌ పరదాలతో, రకరకాల పువ్వులతో అలంకరించారని సమాచారం. అద్దాలు పొదిగిన పల్లకిలో పెళ్లి కూతురు కత్రినా కల్యాణ మండపానికి చేరుకున్నారట. ఎరుపు రంగు లెహెంగాలో కత్రినా, తెలుపు రంగు షేర్వానీలో విక్కీ మెరిసిపోయారు. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. ఏడడుగులు వేశాక, విక్ట్రీనా నాలుగు లక్షల ఖరీదైన కేక్‌ను కట్‌ చేసి, సెలబ్రేట్‌ చేసుకున్నారట.

చదవండి: ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోన్న ‘కొండపొలం’, ఎక్కడంటే..

ఇటలీ చెఫ్‌ ఈ కేక్‌ను ప్రత్యేకంగా తయారు చేశారని చెప్పుకుంటున్నారు. అలాగే విందు విషయంలోనూ విక్ట్రీనా ఏమాత్రం తగ్గలేదు. అతిథుల కోసం ఎన్నో పసందైన వంటకాలను చేయించారట. రాజస్థానీ వంటకాలు ఈ వెడ్డింగ్‌ స్పెషల్‌ అని బీ టౌన్‌ ఖబర్‌. విక్ట్రీనా పెళ్లి వేడుకలను ఓ ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ దక్కించుకుందని భోగట్టా.. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ పెళ్లి స్ట్రీమింగ్‌ కానుందని బాలీవుడ్‌ టాక్‌. బాలీవుడ్‌ నుంచి కబీర్‌ ఖాన్, ఆయన సతీమణి మినీ మాధుర్, విజయ్‌కృష్ణ ఆచార్య, నేహా ధూపియా, ఆమె భర్త అంగద్‌ బేడీ తదితరులు హాజరయ్యారని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement