ఆర్మీ శునకం ‘ఫాంటమ్‌’ ఇకలేదు | Indian Army Dog Phantom Dies In Anti Terror Operation In Jammu And Kashmir, Photo Inside | Sakshi
Sakshi News home page

ఆర్మీ శునకం ‘ఫాంటమ్‌’ ఇకలేదు

Published Tue, Oct 29 2024 7:23 AM | Last Updated on Tue, Oct 29 2024 12:41 PM

Dog Phantom Dies in Anti Terror Operation

అఖ్నూర్: జమ్ముకశ్మీర్‌లోని అఖ్నూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. అసన్ సమీపంలో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన నేపధ్యంలో భారత ఆర్మీ శునకం ‘ఫాంటమ్’ ప్రాణాలు కోల్పోయింది. ఫాంటమ్ బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన శునకం. అది 2020, మే 25న జన్మించింది. ‘మా నిజమైన హీరో, ధైర్యవంతుడైన ఇండియన్ ఆర్మీ డాగ్, ఫాంటమ్ చేసిన అత్యున్నత త్యాగానికి మేము వందనం చేస్తున్నాం’  అని భారత ఆర్మీ పేర్కొంది.

కాల్పుల అనంతరం ఉగ్రవాదులు అటవీ ప్రాంతంలోకి పారిపోయారని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతాన్ని సైన్యం చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో ‘ఫాంటమ్‌’కి శత్రువుల బుల్లెట్లు తగిలాయి.
కే9 యూనిట్‌కి చెందిన శునకాలలో ఫాంటమ్  ఒకటి. ఇది ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో పోరాడేందుకు శిక్షణ పొందిన శునకం. మీరట్‌లోని రీమౌంట్ వెటర్నరీ కార్ప్స్ నుండి ఈ శునకాన్ని తీసుకువచ్చారు. ఈ శునకం 2022, ఆగస్ట్ 12 నుంచి అసాల్ట్ డాగ్ యూనిట్‌లో  ఉంది.

బుల్లెట్ గాయంతో ప్రాణాలు కోల్పోయిన ఫాంటమ్

ఈ సందర్భంగా జమ్మూ డిఫెన్స్ పీఆర్‌ఓ మాట్లాడుతూ, ‘మా శునకం ఫాంటమ్ చేసిన అత్యున్నత త్యాగానికి వందనం చేస్తున్నాం. మన సైనికులు  ఉగ్రవాదులను సమీపిస్తున్నప్పుడు, ఫాంటమ్ శత్రువుల కాల్పులకు గురయ్యింది. దీంతో అది తీవ్రంగా గాయపడి ప్రాణాలొదిలింది. దాని ధైర్యం, విధేయత, అంకితభావం ఎప్పటికీ మర్చిపోలేం’ అని అన్నారు.



ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ సీఎం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement