
ప్రతీకాత్మక చిత్రం
చైతన్యపురి: కుక్కకు కరెంట్ షాక్ ఇచ్చి చంపేశారని ఓ వ్యక్తి చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ రంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చైతన్యపురి డివిజన్ గణేష్‌పురి కాలనీలో నివసించే శంకర్ వీధి కుక్కలకు ఆహారం వేస్తుంటాడు. మంగళవారం ఒక కుక్క చనిపోయింది.
చదవండి: అడగండి అది మన హక్కు..పెట్రోల్ బంకుల్లో ఈ ఆరు సేవలు ఉచితం
పక్కింట్లో ఉండే మనోజ్ కుటుంబ సభ్యులు విద్యుత్ షాక్ ఇవ్వటంతో అది చనిపోయిందని అనుమానం వ్యక్తం చేస్తూ శంకర్ చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు శునకం కళేబరాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. శంకర్, మనోజ్‌ల మధ్య కొంత కాలంగా ఉన్న గొడవల కారణంగా ఫిర్యాదు చేశాడా...? లేదా నిజంగానే విద్యుత్ షాక్ ఇవ్వటం వల్ల కుక్క చనిపోయిందా...? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment