సైఫ్ సంచలన వ్యాఖ్యలు
కబీర్ ఖాన్ లేటెస్ట్ మూవీ 'ఫాంతమ్' మరోసారి హెడ్ లైన్ గా మారింది. సినిమా ప్రారంభం అయిన దగ్గరనుంచి ఏదో ఒక వివాదానికి కేంద్రంగా మారుతున్న ఈ సినిమా పై పాకిస్తాన్లో బ్యాన్ విధించటంతో మళ్లీ తెర మీదకు వచ్చింది. అయితే ఫాంతమ్ బ్యాన్పై బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాను సైతం ఆకర్షిస్తున్నాయి.
సైఫ్కు జోడిగా కత్రినా నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ చిత్ర కథ అంతా పాక్ తీవ్రవాదం చుట్టూ తిరుగుతుంది. 26/11 ముంబై దాడులు వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ను మట్టుపెట్టే పోలీస్ పాత్రలో సైఫ్ ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమా సక్సెస్ సైఫ్ కెరీర్కు కూడా కీలకం కావటంతో సినిమా ప్రమోషన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే పాక్లో బ్యాన్ విధించిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరి స్పందించాడు సైఫ్..
జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయ్యద్... ముంబై టెర్రర్ వెనుక అసలు సూత్రధారి అన్న... సైఫ్ ఒక్కసారిగా ఇంటర్ నేషనల్ మీడియాకు షాక్ ఇచ్చాడు.. అంతేకాదు అదే సమయంలో తన ఫ్యామిలీకి సంబందించి కూడా కొన్ని ఇంట్రస్టింగ్ కామెంట్లు చేశాడు సైఫ్. 2012 లో ఐఎస్ఐ చీఫ్గా పనిచేసిన మేజర్ జనరల్ అలీఖాన్ తన అంకుల్ అవుతారని, చిన్నతనంలో ఆయన పిల్లలతో కలిసి ఆడుకున్న రోజులు గుర్తు చేసుకున్నారు.
అంతేకాదు దేశం కన్నా తనకు ఫ్యామిలీ రిలేషన్స్ ఎక్కువ కాదని, భారత దేశానికి హాని చేసేవారు తన కుటుంబసభ్యులైన వారికి మద్ధతు తెలిపే ప్రసక్తే లేదంటూ ఘాటుగా స్పందించాడు. ప్రస్తుతం పాక్ విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న షేర్యార్ ఖాన్ కూడా తన బంధు వర్గం వాడే అన్న సైఫ్, భారత ప్రభుత్వంతో ఆయనకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయిని తెలిపారు. ఏది ఏమైనా సినిమా ప్రముఖులు మూవీ ప్రమోషన్స్ కోసం కాంట్రవర్షియల్ కామెంట్స్ నే ఆశ్రయిస్తారన్న మాటని సైఫ్ మరోసారి నిజం చేశారు. ఫాంతమ్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.