మెగా దర్శకుడికి ఎమర్జెన్సీ ఆపరేషన్‌! | Bajrangi Bhaijaan director Kabir Khan undergoes emergency surgery | Sakshi
Sakshi News home page

మెగా దర్శకుడికి ఎమర్జెన్సీ ఆపరేషన్‌!

Published Mon, May 16 2016 7:02 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

మెగా దర్శకుడికి  ఎమర్జెన్సీ ఆపరేషన్‌! - Sakshi

మెగా దర్శకుడికి ఎమర్జెన్సీ ఆపరేషన్‌!

'బజరంగీ భాయ్‌జాన్‌', 'ఫాంథమ్‌', 'ఏక్‌ థా టైగర్‌', 'న్యూయార్క్‌' వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన బాలీవుడ్ మెగా దర్శకుడు కబీర్‌ ఖాన్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించి.. అత్యవసర ఆపరేషన్‌ను నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ నెల 13న తీవ్ర కడుపునొప్పి రావడంతో కబీర్ ఖాన్‌ను ముంబైలోని కోకిల బెన్‌ ఆస్పత్రికి తరలించారు. ఆయన కడుపులో రాళ్లు (స్టోన్స్‌) ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. వాటిని తొలగించేందుకు వెంటనే ఆపరేషన్‌ నిర్వహించారు. ఆపరేషన్‌ ముగిసిన తెల్లారే కబీర్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయినా.. వారంపాటు పూర్తి బెడ్‌రెస్ట్ తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది.

ఇటీవల కబీర్‌ ఖాన్‌ పాకిస్థాన్‌ వెళ్లడం, కరాచీ విమానాశ్రయంలో ఆయనను ఆందోళనకారులు అడ్డుకోవడం తెలిసిందే. 'బజరంగీ భాయ్‌జాన్‌'లాంటి మెగాహిట్ తర్వాత కబీర్‌ ఖాన్‌ తాజాగా మరో చిత్రాన్ని సెట్స్‌ మీదకు తీసుకెళ్లబోతున్నారు. ఈ చిత్రం కోసం మరోసారి బాలీవుడ్ సూపర్‌ స్టార్ సల్మాన్‌ ఖాన్‌తోనే ఆయన జతకడుతున్నారు. 'ట్యూబ్‌ లైట్‌' టైటిల్‌గా భావిస్తున్న ఈ సినిమాలో భారత్-చైనా అనుబంధాన్ని చూపించబోతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement