Bajrangi Bhaijaan
-
నన్ను వాళ్లతో పోల్చడం కరెక్టు కాదు: కరీనా
‘నన్ను ఇప్పటి యువతరంతో పోల్చడం సరికాదు’ అంటున్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్. బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్‌తో జంటగా నటిస్తున్న కరీనా తాజా చిత్రం ‘గుడ్ న్యూస్’. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో కరీనా మాట్లాడుతూ ‘నేను చిత్ర పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్ధాలు గడిచిపోయాయి. అయినా అభిమానులు ఇప్పటికీ నన్ను ప్రస్తుత యువతరంతో పోల్చుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది’ అని అన్నారు. అయితే ఎప్పుడూ తనని ఇతరులతో పోల్చుతూ ఉంటారని, అది సంతోషకరమైన విషయమే అయినప్పటికీ ఎందుకు అలా పోల్చుతారు... ఇది సరైన పద్దతి కాదంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘ఇరవై ఏళ్ల నుంచి నేను నటనలో ఉన్నాను. నా పనేంటో నేను చేసుకుంటున్నాను. ప్రస్తుతం నా సినీ జీవితం పట్ల సంతృప్తిగా ఉన్నాను.’ అంటూ కరీనా చెప్పుకొచ్చారు. అయితే కరీనా కపూర్ 2000 సంవత్సరంలో ‘రెఫ్యూజీ’ చిత్రంతో బాలీవుడ్లో అడుగు పెట్టారు. తన తొలి చిత్రంతోనే బాలీవుడ్ బిగ్ బీ తనయుడు అభిషేక్ బచ్చన్ సరసన నటించారు. ఇక రెండవ చారిత్రాత్మక చిత్రం ‘అశోకా’ విజయవంతం కావడంతో కరీనాకు మంచి బ్రేక్ వచ్చింది. అలాగే మూడవ సినిమాతోనే బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌లతో కలిసి నటించే చాన్స్ కొట్టేశారు. బ్లాక్ బ్లాస్టర్ హిట్ ‘కభీ ఖుషీ కభీ గమ్’లో హృతిక్‌కు జోడిగా నటించారు. ఆ తరువాత ‘చమేలీ’, ‘జబ్ వే మేట్’, ‘దేవ్’, ‘3 ఇడియట్స్’, ‘బజరంగీ భయిజాన్’, ‘ఉడ్తా పంజాబ్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి కరీనా స్టార్ హీరోయిన్ అయ్యారు. ఇక అప్పటి నుంచి కరీనా గ్లామరస్ పాత్రలతో పాటు ట్రెడిషనల్ క్యారెక్టర్స్ చేస్తూ యువతరం హీరోయిన్స్‌కు గట్టి పోటీనిస్తూ వస్తున్నారు కరీనా. -
చైనాలో సల్మాన్ సినిమా ప్రభంజనం!
న్యూఢిల్లీ: సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ జంటగా నటించిన 'బజరంగీ భాయ్‌జాన్' సినిమా చైనాలో దుమ్మురేపుతోంది. ఈ సినిమా చైనాలో విడుదలై నాలుగు వారాలు గడిచినా.. బాక్సాఫీసు వద్ద ఇప్పటికీ భారీగా వసూళ్లు రాబడుతోంది. చైనాలో 'లిటిల్ లోలిటా.. మంకీ గాడ్ అంకుల్' శీర్షికతో విడుదలై ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. చైనీయుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుండటంతో ఇప్పటివరకు ఈ సినిమా.. ఆ దేశ బాక్సాఫీస్ వద్ద రూ. 281 కోట్లు కొల్లగొట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 'బజరంగీ భాయ్‌జాన్' వసూలు చేసిన కలెక్షన్ల మొత్తం రూ. 907 కోట్లకు చేరింది. ఆమిర్ ఖాన్ 'దంగల్', 'సీక్రెట్ సూపర్ స్టార్' సినిమాలు చైనాలో భారీ వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఆమిర్ స్థాయిలోనే సల్మాన్ సినిమాలపై కూడా చైనా ప్రేక్షకులు అభిమానాన్ని చూపిస్తున్నారు. 'దంగల్', 'బాహుబలి 2', 'సీక్రెట్ సూపర్ స్టార్' సినిమాల తర్వాత చైనాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన నాలుగో సినిమాగా బజరంగీ భాయ్‌జాన్ నిలిచింది. తల్లిదండ్రుల నుంచి వేరయి భారత్‌లో చిక్కుకున్న ఆరేళ్ల పాకిస్థానీ అమ్మాయిని, బంజరంగీ అనే ఒక దేశభక్తుడు ఎలా దాయాది దేశానికి చేర్చాడన్నేది ఈ చిత్ర కథ. 2015లో భారత్‌లో విడుదలైన ఈ సినిమా ఇక్కడ కూడా సూపర్‌హిట్ అయిన సంగతి తెలిసిందే. -
జైలుపాలైన ప్రముఖ నటి, ఆమె తల్లి!
ప్రముఖ బాలీవుడ్ నటి అల్కా కౌశల్, ఆమె తల్లి జైలుపాలయ్యారు. సల్మాన్‌ఖాన్ బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా బజరంగీ భాయ్జాన్లో కరీనాకపూర్ తల్లిగా, కంగనా రనౌత్ 'క్వీన్' కథానాయిక తల్లిగా అల్కా కౌశల్ నటించారు. అంతేకాదు ప్రముఖ బుల్లితెర నటిగా వెలుగొందుతున్న ఆమె ప్రస్తుతం ప్రసారమవుతున్న పలు హిందీ సీరియళ్లలోనూ కీలకమైన నెగిటివ్ పాత్ర పోషిస్తున్నారు. చెక్ బౌన్స్ కేసులో పంజాబ్‌లోని ఓ జిల్లా కోర్టు ఆమెకు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. పరిచయస్తుడి దగ్గర సీరియల్ నిర్మాణం పేరిట అల్కా, ఆమె తల్లి రూ. 50 లక్షలు తీసుకున్నారని, తిరిగి చెల్లించాలని కోరగా.. అతని రూ. 25 లక్షల రెండు చెక్కులు ఇచ్చారని, అవి బౌన్స్ అవ్వడంతో కోర్టు వారికి రెండేళ్ల జైలు శిక్ష విధించిందని న్యాయవాది ఉటంకిస్తూ అమర్ ఉజలా పత్రిక తెలిపింది. అవతార్ సింగ్ అనే వ్యక్తి వద్ద డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వకపోగా.. వారు దొంగతనం, మనీలాండరింగ్వంటి అక్రమాలకు పాల్పడ్డారని న్యాయవాది చెప్పారు. 2015లో అల్కా కౌషల్‌కు స్థానిక కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించగా.. పైకోర్టులో సవాల్ చేయడం ద్వారా ఆమె అప్పట్లో శిక్ష నుంచి తప్పించుకున్నారు. ఇప్పుడు ఆ కేసును విచారించిన సంగ్రూర్ జిల్లా కోర్టు ఆమెకు, ఆమె తల్లికి రెండేళ్ల జైలుశిక్ష విధించింది. -
సుల్తాన్... బాక్సాఫీస్ కా భాయిజాన్!
-
సుల్తాన్... బాక్సాఫీస్ కా భాయిజాన్!
... హిస్టరీ రిపీట్స్ రంజాన్ పండగకు హీరో సల్మాన్ ఖాన్ సినిమా రిలీజయ్యిందంటే హిట్ గ్యారంటీ. అందుకే ఈ కండలవీరుడు నటించే సినిమాలు ఈ పండుగకే విడుదల కావాలని అభిమానులు కోరుకుంటారు. సల్మాన్‌కి కూడా ఇలా ఈద్ సందర్భంగా సినిమా విడుదల చేయడం ఇష్టమే. మరి... ఈ పండుగకు విడుదలైన ప్రతి సినిమా హిట్టే కాబట్టి, ఆ మాత్రం ఇష్టం ఉండటం కరెక్టే. గతంలో ‘వాంటెడ్’, ‘దబంగ్’, ‘బాడీగార్డ్’, ‘ఏక్ థా టైగర్’, ‘బజరంగీ భాయిజాన్’ చిత్రాలు రంజాన్ కానుకలుగా విడుదలై, బంపర్ హిట్ సాధించాయి. ఈసారి ఈద్‌కి హిస్టరీ రిపీట్ చేసిన చిత్రం - ‘సుల్తాన్’. ఈ నెల 6న ఈ చిత్రం విడుదలైంది. ఈద్ పండుగకు రెండు రోజుల ముందే ‘సుల్తాన్’ తెరపైకి దూసుకొచ్చి, విజయ విహారం చేస్తున్నాడు. ఈ చిత్రం వసూళ్లు ఇప్పుడో సంచలనం. అయిదురోజులకే వచ్చేసిన ఖర్చు!..: విడుదలైన తొలి ఐదు రోజుల్లోనే ఈ చిత్రం 180 కోట్ల రూపాయలు వసూలు చేయడం గురించి ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు. ఈ చిత్ర నిర్మాణ వ్యయం దాదాపు 90 కోట్ల రూపాయలని భోగట్టా. కాబట్టి, రిలీజైన బుధవారం నుంచి ఆదివారం దాకా తొలి వారాంతంలోనే బడ్జెట్‌కు రెండింతలు వసూలు చేసిందని హిందీ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. వసూళ్లలో దాదాపు 50 శాతం పంపిణీదారులకు, థియేటర్ యజమానులకూ పోతే, మిగతా 50 శాతం నిర్మాతకు దక్కుతుందని ఉజ్జాయింపు లెక్క. అంటే, రిలీజైన వీకెండ్కల్లా సినిమాకు పెట్టిన ఖర్చు వచ్చే సిందనుకోవచ్చు. సోమవారం నుంచి వస్తున్నదంతా లాభాలే. రిలీజైన ఐదు రోజుల్లోనే సినిమా లాభాల బాట పట్టడంతో యశ్‌రాజ్ ఫిల్మ్స్‌కు చెందిన నిర్మాత ఆదిత్యా చోప్రా ఆనందపడ తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సల్మాన్ మల్ల యోధుడిగా కనిపించిన విషయం తెలిసే ఉంటుంది. దీని కోసం బరువు పెరిగి, తగ్గి.. ఇలా రెండు రకాలుగా సల్మాన్ కనిపించి, ఆకట్టుకున్నారు. ఆ శ్రమకు తగ్గ ఫలితమే దక్కింది. వారం లోపే 200 కోట్ల క్లబ్లో...: ఇక.. ఈ సినిమాకి రిలీజ్ వ్యూహం కూడా కలిసొచ్చింది. మామూలుగా వీకెండ్ వసూళ్లు రాబట్టుకోవడానికి శుక్రవారం సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. ఒక్కోసారి అటూ ఇటూ అవుతుంది. అలాగే, పవిత్ర ఉపవాస దినాలన్నీ అయిపోతాయి కాబట్టి, సర్వసాధారణంగా రంజాన్ పండగ రోజునే సినిమా రిలీజ్ కూడా జరిగేలా చూస్తారు. కానీ, సల్మాన్ ‘సుల్తాన్’ రెండు రోజుల ముందే వచ్చింది. రంజాన్‌ను టార్గెట్ చేసి, 6న రిలీజ్ చేశారు. ఈసారి రంజాన్ ఒక రోజు ఆలస్యమై, 8న రావడం కూడా సినిమాకు బాగా ఉపయోగప డింది. ఆ తర్వాత వారాంతం. దాంతో మంచి వసూళ్లు రాబట్ట గలిగింది. సల్మాన్ గత చిత్రం ‘బజరంగీ భాయిజాన్’ (2015) శుక్రవారం నుంచి ఆదివారం దాకా తొలి వారాంతంలో రూ. 102 కోట్ల వసూలు చేస్తే, ‘సుల్తాన్’ ఆ మూడు రోజులకీ రూ. 107 కోట్లు సాధించింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. సల్మాన్‌ఖాన్ ‘బజ్రంగీ భాయిజాన్’, ఆమిర్ ఖాన్ సూపర్ హిట్ మూవీ ‘పీకే’ ఏడు రోజుల్లో వసులు చేసిన మొత్తాలను (వరుసగా రూ. 182 కోట్లు, రూ. 179 కోట్లు) అయిదు రోజులకే ‘సుల్తాన్’ దాటేయడం విశేషం. దేశవ్యాప్తంగా దాదాపు 4,350 స్క్రీన్స్‌లో విడుదలైన ఈ చిత్రం మొదటి నుంచీ రోజూ సగటున దాదాపు రూ. 36 కోట్ల పైచిలుకు వసూలు చేసింది. ఆ తర్వాత నాలుగు రోజులూ ఆ స్థాయి కలెక్షన్సే రాబట్టింది. వీకెండ్ తర్వాత టికెట్ రేట్లు తగ్గినా, థియేటర్లలో ‘సుల్తాన్’ పట్టు సడలలేదని సినీ వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఏమైనా రిలీజై, వారం కూడా పూర్తి కాకముందే ‘సుల్తాన్’ 200 కోట్ల క్లబ్లో చేరి, సుల్తాన్ బాక్సాఫీస్ భాయిజాన్ అనిపించుకున్నాడు. అంతర్జాతీయంగా..: విదేశాల్లో కూడా ‘సుల్తాన్’ హవా సాగుతోంది. విదేశాల్లో దాదాపు వెయ్యికి పైగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే 14 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 96 కోట్లు) వసూలు చేసింది. మన సోదర దేశమైన పాకిస్తాన్లో సైతం ‘ఈద్’ పండుగ ‘సుల్తాన్’కు బాగా కలిసొచ్చింది. ఆ దేశంలో కూడా రూ. 15 కోట్ల పైగా వసూళ్ళు వచ్చినట్లు భోగట్టా. రానున్న రోజుల్లో వచ్చే తదుపరి వసూళ్లను బట్టి ఇది ఏ రేంజ్ చిత్రం అవుతుందో తెలుస్తుంది. ఏమైనా, ఈ ఏటి టాప్ 3 హిందీ చిత్రాల్లో ‘సుల్తాన్’ ఒకటి అవుతుందని బాక్సాఫీస్ పండితులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు. -
మరో కథ అందిస్తున్న బాహుబలి రచయిత
ముంబయి: బజరంగీ భాయ్‌జాన్ చిత్రానికి కథ అందించి ఉత్తరాదిన సత్తా చాటిన కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ మరో బాలీవుడ్ సినిమా కోసం తన కలానికి పని చెబుతున్నారు. 2001లో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ 'నాయక్' చిత్రం సీక్వెల్‌కు ఆయన కథ అందించబోతున్నారు. దీపక్ ముకుత్, ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. సీక్వెల్లో కూడా అనిల్ కపూర్ ప్రధాన పాత్ర పోషించనున్నాడు. ఈ సందర్భంగా ఈరోస్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ లుల్లా మాట్లాడుతూ... తాజా రాజకీయాల నేపథ్యంలో నాయక్ సినిమా సీక్వెల్‌కు ఇది మంచి తరుణమన్నారు. దీంతో కథ కోసం విజయేంద్ర ప్రసాద్‌ను సంప్రదించడం జరిగిందన్నారు. కాగా ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ 2015లో 'బాహుబలి', 'బజరంగీ భాయ్‌జాన్' సినిమాలకు కథ అందించారు. 2015లో బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టిన 'బజరంగీ భాయ్‌జాన్' సినిమాకు కథ అందించినందుకుగాను ఉత్తమ కథకుడిగా ఆయన ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. ఇక 'నాయక్' చిత్రానికి వస్తే తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా 'ఒకే ఒక్కడు' తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో సూపర్‌హిట్ అయింది. ఆ సినిమా హిందీ వెర్షన్లో అనిల్ కపూర్, రాణీముఖర్జీ హీరో హీరోయిన్లుగా నటించారు. పదిహేనేళ్ల తర్వాత ఈ సినిమాకి హిందీలో సీక్వెల్ తీస్తున్నారు. -
మెగా దర్శకుడికి ఎమర్జెన్సీ ఆపరేషన్!
'బజరంగీ భాయ్‌జాన్', 'ఫాంథమ్', 'ఏక్ థా టైగర్', 'న్యూయార్క్' వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన బాలీవుడ్ మెగా దర్శకుడు కబీర్ ఖాన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించి.. అత్యవసర ఆపరేషన్‌ను నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 13న తీవ్ర కడుపునొప్పి రావడంతో కబీర్ ఖాన్‌ను ముంబైలోని కోకిల బెన్ ఆస్పత్రికి తరలించారు. ఆయన కడుపులో రాళ్లు (స్టోన్స్) ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. వాటిని తొలగించేందుకు వెంటనే ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ ముగిసిన తెల్లారే కబీర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినా.. వారంపాటు పూర్తి బెడ్‌రెస్ట్ తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. ఇటీవల కబీర్ ఖాన్ పాకిస్థాన్ వెళ్లడం, కరాచీ విమానాశ్రయంలో ఆయనను ఆందోళనకారులు అడ్డుకోవడం తెలిసిందే. 'బజరంగీ భాయ్‌జాన్'లాంటి మెగాహిట్ తర్వాత కబీర్ ఖాన్ తాజాగా మరో చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారు. ఈ చిత్రం కోసం మరోసారి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తోనే ఆయన జతకడుతున్నారు. 'ట్యూబ్ లైట్' టైటిల్‌గా భావిస్తున్న ఈ సినిమాలో భారత్-చైనా అనుబంధాన్ని చూపించబోతున్నారు. -
ఫ్యాన్, బజరంగీ కన్నా బాహుబలే మిన్న!
షారుక్‌ఖాన్ తాజా సినిమా 'ఫ్యాన్'.. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకువచ్చింది. సమీక్షకులు మంచి రివ్యూలు ఇచ్చారు. ప్రేక్షకులూ నచ్చిందన్నారు. కానీ కలెక్షన్లలో చూస్తే మాత్రం ఆ ఊపు కనిపించలేదు. తొలిరోజు కలెక్షన్లపై అటు బాలీవుడ్ అయినా ఇటు టాలీవుడ్ అయినా భారీ ఆశలే పెట్టుకుంటున్నది. భారీ ఎత్తున థియేటర్లలోకి దిగుమతి అయిన ఈ సినిమా తొలి రోజు వసూలు చేసింది రూ. 19.20 కోట్లే. మొత్తంగా మొదటి వీకెండ్లో ఈ సినిమా రాబట్టింది రూ. 54 కోట్లు మాత్రమే. ఈ ఏడాది కలెక్షన్ల పరంగా చూసుకుంటే తొలి వీకెండ్లో ఇదే రికార్డు వసూలు కావొచ్చు కూడా. కానీ, బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రాల జాబితాపరంగా చూస్తే 'ఫ్యాన్' కలెక్షన్లు ఒకింత నిరాశపరిచాయనే చెప్పాల్సి ఉంటుంది. గత ఏడాది వచ్చి కలెక్షన్ల ప్రభంజనం సృష్టించిన 'బాహుబలి', 'బజరంగీ భాయ్‌జాన్', 'ప్రేమరతన్ ధన్‌పాయో', 'దిల్వాలే'తో పోల్చుకుంటే 'ఫ్యాన్' వసూలు చాలా వెనుకబడిపోయింది. తొలి నాలుగు రోజుల్లో రూ. 217 కోట్లు వసూలు చేసి.. రాజమౌళి వండర్ 'బాహుబలి' రికార్డు సృష్టించింది. ఈ ఐదు చిత్రాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా చరిత్ర లిఖించింది. ఆ తర్వాతి స్థానంలో రూ. 129.77 కోట్లతో ప్రేమరతన్ ధన్‌పాయో (పీఆర్డీపీ), రూ. 129.65 కోట్లతో భజరంగీ భాయ్‌జాన్, రూ. 75.18 కోట్లతో దిల్వాలే సినిమాలు నిలిచాయి. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన షారుఖ్ తాజా వండర్ 'ఫ్యాన్' మాత్రం తొలి నాలుగు రోజుల్లో రూ. 50.40 కోట్లు వసూలు చేసింది. -
నా 35 కోట్ల మాటేంటి: సల్మాన్
అత్తారింటికి దారేది సినిమాకు సంబంధించి తనకు ఇంకా రూ. 2 కోట్లు ఇవ్వాలంటూ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మీద 'మా'లో ఫిర్యాదు చేశారు హీరో పవన్ కల్యాణ్. కానీ.. 2015 సంవత్సరంలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన బజరంగీ భాయీజాన్ సినిమాకు సంబంధించి సల్మాన్ ఖాన్‌కు ఆ సినిమా నిర్మాత ఇంకా ఏకంగా రూ. 35 కోట్లు బాకీ ఉన్నారట. కబీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీసును మోత మోగించి.. మన దేశంలోనే దాదాపు రూ. 300 కోట్లు వసూలు చేసింది. విదేశాల్లో మరో రూ. 300 కోట్లు కలిపి, మొత్తం రూ. 600 కోట్ల గ్రాస్ వసూళ్లు లభించాయి. సినిమా విడుదలై ఆరు నెలలు గడిచినా.. అంత భారీ కలెక్షన్లు వసూలుచేసినా, ఇప్పటికీ తనకు ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వకపోవడంపై సల్లూభాయ్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. -
కథానాయకుడు
కథకు మూలం ఉంటుంది.... మర్రిచెట్టంత మహావృక్షానికి విత్తనం లాంటి మూలం! మూలం వెతికి, దాన్ని తిరగేయగలిగితే... మూల్యం ఉంటుంది. మర్రిచెట్టంత మూల్యం ఉంటుంది! సృష్టికర్త ఒక్కడే - బ్రహ్మ! మిగతావాళ్ళంతా - స్ఫూర్తికర్తలే! విజయేంద్రప్రసాద్ కథల్లో దమ్ముంటుంది. కథల్లో దమ్మే కాదు... కథెలా పుట్టిందో చెప్పే దమ్మూ ఆయనకుంది. మూలాన్ని తిరగేసి, మూల్యాన్ని మూటగట్టుకున్న ఈ ‘కథా’నాయకుడు ...ఎంతమందికి స్ఫూర్తికర్త అవుతాడో!! ప్రతి సినిమాకూ కథ ఉంటుంది. ప్రతి సినిమాకథకూ వెనక ఇంకొక కథ ఉంటుంది. అది ఆ కథ తాలూకు ఇన్స్పిరేషన్ కథ. మిగతా వాళ్ల సంగతేమో కానీ, నేనైతే ఎక్కడ నుంచి ఎలా ఇన్స్పైరై కథ చేశానో చెప్పేస్తాను. పిల్లాడు ఎలా పుడతాడో అందరికీ తెలుసు. కానీ చెప్పరంతే! అది సీక్రెట్ అనుకుంటే ఎలా? చిన్నప్పట్నుంచీ చూసిన సంఘటనలు, చదివిన పుస్తకాలు... ఒకప్పుడు గుర్తుకొస్తాయి. అవన్నీ కథలకు ఉపయోగపడతాయి. నా కెరీర్‌లోని సూపర్ హిట్ కథల గురించి చెప్పుకోవాలంటే... జానకి రాముడు (1988): నా ఫస్ట్ కథ ‘జానకి రాముడు’. అంతకుముందు ఏవేవో కథలు రాశా కానీ ఏవీ పెర్ఫెక్ట్గా కాదు. నిర్మాత ‘యువచిత్ర’ కాట్రగడ్డ మురారి అప్పట్లో నాగార్జునతో సినిమా తీస్తున్నారు. ‘‘ఏయన్నార్ నటించిన ‘మూగమనసులు’ కథ కావాలి, కానీ ‘మూగమనసులు’లా ఉండకూడద’’ని దర్శకుడు రాఘవేంద్రరావు అడిగారు. అలా ‘జానకి రాముడు’ కథ చేశా. బంగారు కుటుంబం(1994): ఏయన్నార్ గారిది ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా ఉంది. అందులో మూడు కుటుంబాలు విడిపోతాయి. ఆ సినిమా రిలీజయ్యే నాటికి అది టూ ఎర్లీ. కానీ, ఇవాళ్టి రోజులకు అది బావుంటుందని నిర్మాత కైకాల నాగేశ్వరరావు అడిగారు. అప్పుడు దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో అక్కినేని గారు నటించిన ‘బంగారు కుటుంబం’ స్క్రిప్టు రెడీ చేశా. బొబ్బిలి సింహం (1994): బాలకృష్ణ ‘బొబ్బిలి సింహం’కి దాసరి నారాయణరావుగారి ‘ప్రేమాభిషేకం’ గుర్తుంది కదా... అదీ ఇన్స్పిరేషన్. ‘ప్రేమాభిషేకం’ కథలోని మగ, ఆడ రివర్స్ చేసి ‘బొబ్బిలి సింహం’ కథ చేశా. ఏయన్నార్, శ్రీదేవిని - ఈ కథలో రోజా, బాలకృష్ణ చేశా. అయితే, ఇలా ఏ కథనైనా మార్చగలనా అంటే చెప్పలేను. ఏదైనా అవసరాన్ని బట్టే వస్తుంది! సమరసింహారెడ్డి (1999): రాయలసీమ ఫ్యాక్షనిజమ్ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో బాలకృష్ణ ‘సమరసింహారెడ్డి’ గురించి ఇవాళ్టికీ చెప్పుకుంటారు. కానీ, అందరికీ ఆశ్చర్యం కలిగించే సంగతి ఒకటి చెప్పాలి. తమిళం నుంచి తెలుగులోకి డబ్ అయిన ‘సింధూర పువ్వు’ ఇన్స్పిరేషన్తో ‘సమరసింహారెడ్డి’ కథ చేశా. అందులో ఒకావిడ పెంపుడు కూతుర్ని సరిగ్గా చూడదు. సొంత కూతుర్ని మాత్రం సుకుమారంగా పెంచుతుంది. ఇది నచ్చక విజయ్‌కాంత్ దగ్గర అతను కారు డ్రైవర్‌గా చేరతాడు. విజయకాంత్‌ని శత్రువులు ఎటాక్ చేయబోతే, ఇతను వెళ్లి అడ్డుకుని చనిపోతాడు. అప్పుడు విజయ్‌కాంత్‌కి తెలుస్తుంది. ఇతనికో ఫ్యామిలీ ఉందని! ఆ కుటుంబ కష్టం తీర్చడానికి ఇక్కడికొస్తాడు. ఇదీ ‘సింధూర పువ్వు’ కథ. ఆ బేస్ నాకు నచ్చింది. అప్పుడు రత్నం నా దగ్గర అసిస్టెంట్. నేను బొంబాయి మాఫియా బ్యాక్ డ్రాప్లో బాలకృష్ణ డాన్‌గా అనుకున్నా. కానీ, రాయలసీమ ఫ్యాక్షనిజమ్ పెడదామని రత్నం సలహా ఇచ్చాడు. అతనో రియల్ ఇన్సిడెంట్ చెప్పాడు. రియల్‌గా చూశాడట. విజయవాడ రైల్వే స్టేషన్‌కి స్థానికంగా బలం ఉన్న వంగవీటి రంగా, దేవినేని నెహ్రూ ఫ్యామిలీలు రెండూ ఒకేసారి రావడం, పోలీసుల టెన్షన్... చెబితే భలే బాగుందనిపించింది. ఆ సీన్ ‘సమరసింహారెడ్డి’లో అల్లాను. సింహాద్రి (2003): 2000 ముందు వరకూ మద్రాసులో ఉండేవాణ్ణి. ‘వసంత కోకిల’ సినిమా చూసి నా అసిస్టెంట్ ‘అమ్మ’ గణేశ్‌తో ‘‘క్లైమాక్స్‌లో ఆ అమ్మాయి హీరోను వదిలివెళ్ళిపోతుంటే, గుండెల్లో గునపంతో పొడిచేసి వెళ్లిపోయినట్టుగా అనిపిస్తుంది కదూ’’ అన్నాను. వెంటనే, ‘‘హీరోయిన్, తనను ప్రేమించిన హీరో గుండెల్లో గునపంతో పొడిచేసినట్లు కథ చేద్దాం’’ అన్నాడు గణేశ్. హీరో చెడ్డవాడనుకుని హీరోయిన్ అపార్థం చేసుకుని గునపంతో పొడవాలి. ఆ అపార్థం ఏ పరిస్థితుల్లో జరిగింది? అలా... అలా ఆలోచించుకుంటూ, లాజిక్ సెట్ చేస్తూ రెండు రోజుల్లోనే కథ రెడీ చేశాం. అయితే, తెలుగు నేల కాకుండా వేరే ఏదైనా బ్యాక్‌డ్రాప్ ఉంటే బాగుంటుందనుకుంటే, కేరళ గుర్తొచ్చింది. అక్కడ ప్రకృతి వైద్యం ఫేమస్. హీరోయిన్‌తో పరిచయం పెంచుకోవడానికి జబ్బు నటించి, హీరో అక్కడకు వెళ్లాలి. ఇదీ కథ. మొదట ఈ కథను బాలకృష్ణ-బి. గోపాల్‌కి చెబితే ఓకే అన్నారు. కానీ, చివరలో వేరే కథ ఎంచుకున్నారు. ఈ విషయం తెలిసి నిర్మాత దొరస్వామిరాజు నన్ను పిలిపించారు. అప్పుడు చిన్న ఎన్టీఆర్‌తో ‘సింహాద్రి’ సెట్స్ పైకొచ్చింది. సై (2004): ‘సింహాద్రి’ రిలీజ్ తర్వాత జైత్రయాత్రకు వైజాగ్ వెళ్లాం. హోటల్లో ఉండగా ‘‘నాన్నగారూ! ఈసారి కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా చేద్దాం. అలాగని లవ్‌స్టోరీ వద్దు. స్పోర్ట్స్ కావాలి’’ అన్నాడు రాజమౌళి. అప్పటికప్పుడు ఓ లైన్ చెప్పా. ఓ పాత కాలేజీలో ఆర్ట్స్, సైన్స్ గ్రూప్‌లకు మొదట నుంచీ పడదు. వాళ్లకు ఏదైనా గొడవొస్తే ఫుట్‌బాల్ ఆడుకుంటారు. ఓ అమ్మాయి కోసం రెండు గ్యాంగ్‌లూ కొట్టుకుంటాయి. ఓ రౌడీగాడు ఈ కాలేజ్‌ని కబ్జా చేయాలనుకుంటాడు. అప్పుడు ఈ రెండు గ్యాంగులూ కలిసి ఆ రౌడీని ఫుట్‌బాల్‌లో ఓడిస్తారు. కథ చెప్పిన పది రోజులు పోయాక - ‘‘ఫుట్ బాల్ అయితే కిక్ ఉండదు. రగ్బీ గేమ్‌గా మారుద్దాం’’ అన్నాడు రాజమౌళి. అందుకోసం తను చాలా రీసెర్చ్ చేశాడు. న్యూజిలాండ్ ఎక్కడ్నుంచో రగ్బీ కోచ్‌ను కూడా రప్పించారు. విక్రమార్కుడు (2006): రవితేజ డ్యుయల్ రోల్‌తో సినిమా చేద్దామనుకున్నాం. అత్తిలి సత్తిబాబు పాత్ర ముందే పుట్టేసింది. హిలేరియస్‌గా వచ్చింది. రెండో పాత్ర గురించి రాజమౌళి అడిగితే, ‘పోలీసాఫీసర్’ అని చెప్పా. ‘రొటీన్‌గా ఉంటుందేమో’ అన్నాడు. నాకు టెన్షన్ వచ్చింది. రాత్రంతా ఆలోచించా. హిందీలో ‘శూల్’, ఇంగ్లీషులో ‘ఎ ఫిస్ట్‌ఫుల్ ఆఫ్ డాలర్స్’ చూశా. దర్శకుడు ఇ. నివాస్ తీసిన ‘శూల్’లో పోలీసాఫీసర్ రైల్వేస్టేషన్లో దిగితే జట్కా బండివాడు ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం, ఆ వాతావరణం నచ్చింది. దాన్ని వాడుకున్నా. జట్కాబండి బదులు ట్యాక్సీ పెట్టాం. ‘ఎ ఫిస్ట్‌ఫుల్ ఆఫ్ డాలర్స్’లో విలన్, ఒకావిణ్ణి ఉంచుకుంటాడు. కొడుకు అమ్మను చూడడం కోసం దొంగతనంగా ఆ ఇంట్లోకి వెళ్లడం హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. అందులోంచి రాజీవ్ కనకాల పాత్ర పుట్టింది. అలా తయారైంది ‘విక్రమార్కుడు’ స్క్రిప్ట్. యమదొంగ (2007): ఒకసారి రాజమౌళి ‘‘తారక్‌తో యమధర్మరాజు వేషమేయిస్తే ఎలా ఉంటుంది నాన్నా?’’ అని అడిగాడు. బాగుంటుందన్నా. ‘యమగోల’, ‘యమలీల’ తరహాలో కథ చేయమన్నాడు. గ్రాఫిక్స్‌కి కథలో ఇంపార్టెన్స్ ఇవ్వమన్నాడు. అలా పుట్టిందే ‘యమదొంగ’. మగధీర (2009): ‘మగధీర’ అనగానే అందరూ ‘ఒక్కణ్ణి కాదు షేర్‌ఖాన్... వంద మందిని పంపించు’ ఎపిసోడ్ గురించి గుర్తు చేసుకుంటూ ఉంటారు. మా చిన్నప్పుడు కొవ్వూరులోని స్కూల్లో ఆగస్టు 15కి శివాజీ తాలూకు ఓ మరాఠీ సినిమా వేశారు. ఆ సినిమాతో పాటు, తానాజీ వీరపోరాటం, అతను చనిపోవడంతో ‘‘సింహగఢ్ దక్కింది కానీ, సింహం దక్కలేదు’’ అని శివాజీ ఏడ్చినట్లు ‘శివాజీ చరిత్ర’లో చదివిన ఘట్టం మనసులో ఉండిపోయాయి. ఆ తర్వాత ఎప్పుడో దర్శకుడు సాగర్, సూపర్‌స్టార్ కృష్ణతో ‘జగదేకవీరుడు’ టైటిల్ చెప్పి, కథ కావాలని అడిగితే ఈ ఎపిసోడ్ చెప్పా. సాగర్‌కి కథ నచ్చింది కానీ, బడ్జెట్ ఎక్కువ అవుతుందని భయపడ్డారు. ‘సింహాద్రి’ తర్వాత చిరంజీవిగారు రాజమౌళితో సినిమా చేద్దామని పిలిచారు. అప్పుడే ఈ కథ చెప్పాం. ఎందుకనో ముందుకు వెళ్లలేదు. తర్వాత రామ్‌చరణ్‌తో అనుకున్నప్పుడు గుర్తు చేశాం. అలా ‘మగధీర’ పుట్టింది. రాజన్న (2011): నేను మద్రాసు నుంచి హైదరాబాద్ వస్తుంటే, గీత రచయిత సుద్దాల అశోక్‌తేజ రైలులో కలిశారు. తెలంగాణ పోరాటం గురించి వాళ్ల నాన్నగారు సుద్దాల హన్మంతు గురించి చెప్పారు. రజాకార్లు ఆ ఊరి మీద పడి దౌర్జన్యం చేస్తుంటే, అందరూ పారిపోతున్నారట. అక్కడున్న ముసలావిడ ‘‘అలా సూత్తావేంట్రా... వెయ్... దెబ్బకి దెబ్బ వెయ్’’ అని అరిచిందట. దాంతో హన్మంతు పాట అందుకున్నాడట. జనానికి ఊపు వచ్చి అందరూ కలసి రజాకార్లను తరిమి తరిమి కొట్టారట. ఒక పాట ఎలా స్ఫూర్తి నింపుతుందో తెలుసుకుని నేను ఇన్స్పైర్ అయిపోయా. ఆ తర్వాత తెలంగాణ పల్లెలకు వెళ్లా. చరిత్ర చదివా. ఆలోచనలన్నీ కలిపి ‘రాజన్న’ స్క్రిప్టు చేశా. బజ్రంగీ భాయీజాన్ (2015) ఏడెనిమిదేళ్ల క్రితం నేను, కీరవాణి సోదరుడు కాంచీ, కోడెరైక్టర్ మహదేవ్ కలసి చిరంజీవి గారి ‘పసివాడి ప్రాణం’ చూస్తున్నాం. దాన్ని సోల్ తీసుకొని, కథ చేద్దామని ఓ ఐడియా వచ్చింది. హీరోకి ఓ పిల్లాడు దొరికాడు. వాడెవడో తెలీదు. ఆ పిల్లాడు డేంజర్లో ఉంటాడు. దాన్నుంచీ హీరో తప్పిస్తాడు. ఇదీ ఐడియా. ఆ తర్వాత పేపర్లో ఓ వార్త చదివా. పాకిస్తాన్ జంట తమ చిన్నపాపకు హార్ట్‌లో హోల్ ఉందని, ఆపరేషన్‌కి చెన్నై వచ్చారు. డబ్బుల్లేవు. హాస్పటల్ వాళ్లు ఫ్రీగా ఆపరేషన్ చేశారు. ఆ తల్లి ఉద్వేగంగా మీడియాతో మాట్లాడింది. అది నన్ను కదిలించింది. ఇవన్నీ కలిపి ‘బజ్రంగీ...’ స్క్రిప్టు చేశా. ఈ కథ మొదట హీరో సూర్యకు చెప్పా. అతనికి ఎక్కలేదు. రజనీకాంత్, వెంకటేశ్‌లకు కూడా ఈ కథ చెప్పా. ఆమిర్‌ఖాన్‌కి చెప్పా. అతను కొన్నాళ్ల తర్వాత ‘‘కథ బాగుంది కానీ, నేను కనెక్ట్ కాలేకపోతున్నా’’ అన్నాడు. తర్వాత దర్శకుడు కబీర్ఖాన్కి నచ్చి హీరో సల్మాన్‌ఖాన్ దగ్గరకు తీసుకువెళ్లాడు. సినిమా రిలీజయ్యాక సల్మాన్ తండ్రి - రచయిత సలీమ్ గారు ఫోన్ చేసి ‘‘ఇంత గొప్ప కథ నేనెప్పుడూ రాయలేదు’’ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. రచయితల జంట సలీమ్-జావేద్‌లకు నేను వీరాభిమానిని. అలాంటి సలీమ్ గారు నన్ను మెచ్చుకోవడాన్ని మించి ఇంకేం కావాలి! ప్రస్తుతం నా దగ్గర 40-50 కథలున్నాయి. ఇక, నా డ్రీమ్ సబ్జెక్ట్ అంటారా? ఇంకా కలలోకి రాలేదు. వస్తే చెబుతాను! సంభాషణ: పులగం చిన్నారాయణ బాహుబలి (2015) ‘బాహుబలి’కి వేరే ఇన్స్పిరేషన్ లేదు. డబ్బే ఇన్స్పిరేషన్. అప్పటికప్పుడు అనుకుని రాసేసిందే! ‘‘ప్రభాస్‌తో ఫుల్ కాస్ట్యూమ్ డ్రామా కావాలి. అన్నీ గ్రే కేరెక్టర్స్ కావాలి’’ అని రాజమౌళి అడిగాడు. మర్నాడు పొద్దున్నే బాహుబలిని కట్టప్ప పొడిచే సీన్ చెప్పా. తర్వాత రోజు తల్లి నీళ్లలో బిడ్డను పెకైత్తే సీన్ చెప్పా. ఇలా అన్నీ సీన్లుగా చెప్పా. వాటి చుట్టూ కథ అల్లేశా. ‘బాహుబలి-2’ కథ కూడా రెడీ. అప్పుడే రఫ్‌గా చేసేశాం. మొన్నీ మధ్యనే నెలరోజులు కూర్చుని స్క్రిప్ట్ ఫైనల్ చేసేశాం. ఫస్ట్ పార్ట్ రిజల్ట్ చూసి మార్పులేమీ చేయలేదు. పాలిష్ చేశామంతే! -
భజరంగీని దాటేసిన ధన్‌పాయో!
సల్మాన్‌ఖాన్, సోనంకపూర్ జంటగా నటించిన ప్రేమ్‌రతన్ ధన్‌పాయో చిత్రం రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్నది. విడుదలైన తొలి రెండు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించి.. సల్మాన్ గత సినిమా బజరంగీ భాయ్‌జాన్ రికార్డును అధిగమించింది. ప్రేమ్‌రతన్ ధన్‌పాయో తొలి రెండురోజుల్లో రూ. 71.38 కోట్లను వసూలు చేసినట్టు తెలిసింది. 2015 సంవత్సరంలో తొలిరెండురోజుల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ఈ చిత్రం రికార్డులకెక్కింది. ఇంతకుమునుపు బజరంగీ భాయ్‌జాన్ చిత్రం రెండురోజుల్లో రూ. 63.75 కోట్ల వసూళ్లు రాబట్టింది. కుటుంబకథా చిత్రాలను అందంగా తెరకెక్కించే సూరజ్ బార్జాత్యా తీసిన ప్రేమ్‌రతన్ ధన్‌పాయో సినిమాకు మిశ్రమ రివ్యూలు వచ్చినప్పటికీ తొలిరోజు రికార్డుస్థాయిలో రూ. 40.35 కోట్లను వసూలు చేసింది. అయితే, రెండోరోజు ఈ సినిమా కలెక్షన్ 23శాతం పడిపోయింది. మొత్తానికి మూడు రోజుల్లో ఈ సినిమా వందకోట్ల మార్కును దాటే అవకాశముంది. -
ఖాన్ల దోస్తీ కట్!
బాలీవుడ్లో సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్ చాలామంచి స్నేహితులు.. కానీ ఇదొకప్పటి మాట. ఇప్పుడు వారి మధ్య విభేదాలు వచ్చాయి. వారి స్నేహబంధమూ బీటలు వారినట్టు కనిపిస్తున్నది. ఒకప్పుడు తమ స్నేహానికి సాటిలేదన్నట్టుగా జాన్ జిగిరీగా ఉన్న ఈ సూపర్ స్టార్ల మధ్య విభేదాలకు కారణం 'బజరంగీ భాయ్‌జాన్'. కొన్ని నెలల కిందట విడుదలై భారీ వసూళ్ల సాధించిన ఈ సినిమాను మొదట తనకే ఆఫర్ చేశారని, తాను చేయలేకపోవడంతో 'బజరంగీ భాయ్‌జాన్' నిర్మాతలను సల్మాన్ వద్దకు పంపినట్టు అమీర్ పబ్లిక్‌గా ప్రకటించారు. ఈ ప్రకటన సల్మాన్‌ను నొప్పించిందట. 'తాము తిరస్కరించిన పాత్రల గురించి పబ్లిక్‌గా మాట్లాడకూడదనే అలిఖిత నిబంధన బాలీవుడ్ అగ్ర హీరోల నడుమ ఉంది. మున్నాభాయ్ పాత్ర మొదట తనకే వచ్చిందని షారుఖ్ ఎప్పుడైనా చెప్పారా? 'లాగాన్' సినిమాను తిరస్కరించినట్టు అభిషేక్ బచ్చన్ ఎప్పుడైనా నోరువిప్పారా?' అంటూ ఈ విషయంలో అమీర్ గీత దాటాడని సల్మాన్ భావిస్తున్నట్టు ఆయన సన్నిహితుడొకరు తెలిపారు. దానికితోడు అమీర్, సల్మాన్ ప్రస్తుతం రెజింగ్ నేపథ్యంగా సినిమాలను చేస్తుండటం కూడా ఇద్దరి మధ్య దూరాన్ని పెంచిందని చెప్తున్నారు. 'నువ్వు చేస్తున్న సినిమాలో కొన్ని మార్పులు చేసి.. లోకేషన్‌ను మార్చు అని సల్మాన్‌ను అమీర్ కోరారు. అయితే తాను ఎలాంటి మార్పులు చేయబోనని కథ రాసిని ప్రకారమే తెరకెక్కిస్తామని సల్మాన్ స్పష్టం చేశారు. దీంతో ఇద్దరి మధ్య పోటీ వాతావరణం నెలకొంది' అని సన్నిహితవర్గాలు చెప్తున్నాయి. -
గీతను కలుస్తా: సల్మాన్ ఖాన్
ముంబై: భారత్ నుంచి తప్పిపోయి పాకిస్తాన్‌కు చేరిన మూగ చెవిటి అమ్మాయి గీతను తన తల్లిదండ్రుల చెంతకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలకు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మద్దతు తెలిపాడు. తన సొంత తల్లిదండ్రులను కలుసుకోవాలని ఆమె కోరుకుంటే కచ్చితంగా నెరవేరుతుందని అన్నాడు. స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత తనను కలవాలనుకుని గీత అనుకుంటే ఆమెను కలుస్తానని సల్మాన్ హామీయిచ్చాడు. 15 ఏళ్ల పాటు పాకిస్థాన్ లో ఆమెకు ఆశ్రయం కల్పించిన స్వచ్ఛంద సంస్థకు థ్యాంక్స్ చెప్పాడు. అతడు నటించిన 'బజరంగీ భాయిజాన్' సినిమా హిట్ కావడంతో గీత ఉదంతం వెలుగులోకి వచ్చింది. కాగా గీత తమ కూతురేనని ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గ్రామానికి చెందిన జజ్జర కృష్ణయ్య, గోపమ్మ చెబుతున్నారు. పంజాబ్, బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ కు చెందిన నాలుగు కుటుంబాలు కూడా గీత తమ కూతురేనని చెబుతున్నాయి. -
బాహుబలి బాటలో బజరంగి భాయ్‌జాన్
ముంబై: బాలీవుడ్ చిత్రం బజరంగి భాయ్‌జాన్ బాక్సాఫీసు వద్ద బాహుబలి దారిలో పయనిస్తోంది. సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ నటించిన బజరంగి భాయ్‌జాన్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ వెల్లడించింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క, రమ్యకృష్ణ ప్రధాన తారాగణంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బాహుబలి ఇప్పటికే 500 కోట్ల మార్క్ దాటిన సంగతి తెలిసిందే. గత నెల 17న విడుదలైన బజరంగి భాయ్‌జాన్ భారత్‌లోనే 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్టు ఎరోస్ సంస్థ తెలిపింది. 2015లో బాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రం ఇదే. విదేశాల్లోనూ ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. యూఏఈ, ఇంగ్లండ్‌లలో రికార్డు స్థాయి కలెక్షన్లు వచ్చాయి. 90 కోట్ల రూపాయల వ్యయంతో బజరంగి భాయ్‌జాన్‌ను నిర్మించారు. -
బజరంగీ రీమేక్ పనుల్లో పవన్ ?
-
బజరంగి భాయ్‌జాన్ @ రూ. 300 కోట్లు
ముంబై: కండలవీరుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం బజరంగి భాయ్‌జాన్ బాక్సాఫీసు వద్ద కనక వర్షం కురిపిస్తోంది. మూడో వారం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ చిత్రం 300 కోట్ల రూపాయల క్లబ్‌కు చేరువైంది. గత నెల 17న విడుదలయిన బజరంగి భాయ్‌జాన్ 294.98 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సల్మాన్ సరసన కరీనా కపూర్ నటించారు. భారత్‌లో పాటు విదేశాల్లోనూ ఈ చిత్రం హిట్ టాక్‌తో మంచి వసూళ్లు రాబడుతోంది. -
పొరుగుదేశంలోనూ కలెక్షన్ల వర్షం!
రంజాన్ బహుమతిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్మాన్ ఖాన్ సినిమా బజరంగీ భాయీజాన్ మన దేశంలోనే కాక, పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి వారంలో కరాచీ, ఇస్లామాబాద్ రెండు నగరాల్లోనే దాదాపు 30 లక్షలు వసూలు చేసింది. ఇదే సమయంలో విడుదలైన పాకిస్థానీ సినిమాలు 'బిన్ రోయే', 'రాంగ్ నంబర్' లాంటి సినిమాలను వెనక్కి నెట్టి మరీ ఈ కలెక్షన్లు సాధించింది. మొదటివారంలో బజరంగీ సినిమాకు 32 లక్షల రూపాయలు రాగా, బిన్ రోయే సినిమాకు 28 లక్షలు, రాంగ్ నంబర్‌కు 27 లక్షలు వచ్చాయి. హాలీవుడ్ సినిమాలు మినియన్స్, టెర్మినేటర్: జెనెసిస్, యాంట్ మ్యాన్ లాంటి వాటికి అసలు ఆదరణే కరువైంది. వాస్తవానికి ఈ సినిమా పాకిస్థాన్‌లో విడుదల కావడం చాలా కష్టమైంది. అయినా ఇప్పుడు అక్కడి ప్రేక్షకులు మాత్రం సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక భారతదేశంలో అయితే సినిమా రికార్డులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మొదటి వారంలో ఈ సినిమా రూ. 184.62 కోట్లు వసూలు చేసింది. -
'వరుసగా బెదిరింపులు వస్తున్నాయి'
కాబూల్: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘బజ్రంగీ భాయిజాన్’ చిత్రంపై పాకిస్థాన్ సెన్సార్ బోర్డు చైర్మన్ ఫకర్ ఏ ఆలమ్‌కు వరుసగా బెదిరింపులు వస్తున్నాయి. పాకిస్తాన్ ప్రజలను కించపరిచేలా చిత్రంలో వ్యంగ్యమైన యాసను ఉపయోగించారని, కొన్ని సెన్సార్ చేయాల్సిన దృశ్యాలను కూడా ఉన్నాయని విమర్శిస్తూ ఆలమ్‌కు పుంఖానుపుంఖాలుగా ట్వీట్లు వస్తున్నాయి. అసలు ఎందుకు ఈ చిత్రం విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతించందంటూ కూడా విమర్శలు వస్తున్నాయని, కొంతమంది తనను దేశద్రోహిగా ముద్రవేస్తూ బెదిరిస్తున్నారని కూడా ఆలం వెల్లడించారు. ఒకవేళ తాను ద్రోహినైతే ఈ సినిమాను చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు కూడా తన దృష్టిలో ద్రోహియేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విమర్శలతో సంబంధం లేకుండా పాక్ థియేటర్లలో బజ్రంగీ భాయిజాన్ చిత్రం బ్రహ్మాండంగా నడుస్తోంది. ఇప్పటికే వీకెండ్ వసూళ్లు వంద కోట్ల రూపాయలను దాటాయని చిత్రం పంపిణీదారులు తెలియజేస్తున్నారు. ఆలమ్‌కు ప్రేక్షకుల నుంచి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం నడుస్తున్న అన్ని థియేటర్ల వద్ద భద్రతను ఏర్పాటు చేశారు. సెన్సార్ బోర్డు సభ్యులు, పాక్ చిత్ర పరిశ్రమ ఆలమ్‌కు అండగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం బాగా నడుస్తున్నప్పుడు మన దేశంలో మాత్రం దాన్ని ఎందుకు అడ్డుకోవాలని సెన్సార్ బోర్డు సభ్యులు వాదిస్తున్నారు. పైగా బోర్డులో సభ్యులుగా ఉన్న సైనిక ప్రతినిధులు కూడా సెన్సార్ బోర్డు నిర్ణయం పట్ల అభ్యంతరం వ్యక్తం చేయలేదన్న విషయాన్ని వారు గుర్తుచేశారు. -
వారికోసం సల్లూభాయ్!
ముంబై: బాలీవుడ్ కండల వీరుడు, హీరో సల్మాన్ ఖాన్ రైతులను ఆదుకునేందుకు పెద్ద మనసు చేసుకున్నారట. రికార్డు వసూళ్లతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న బజరంగీ భాయిజాన్ సినిమా లాభాల్లో కొంత భాగాన్ని ఆయన అన్నదాతలకు పంచనున్నారట. రీల్ లైఫ్‌లో పాప కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన హీరో ఇపుడు రియల్ లైఫ్ లో రైతన్నను ఆదుకోవడానికి ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీ నాయకురాలు షైనా ఈ విషయాలను వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న అన్నదాతలను ఆదుకునేందుకు సల్మాన్‌ఖాన్, నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ ముందుకు వచ్చారని ఆమె తెలిపారు. అపార నష్టాలతో మనస్తాపానికై గురై రైతులు ఆత్మహత్యలకు చేసుకుంటున్న నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు సినీ పరిశ్రమ చొరవ చూపడం మంచి పరిణామమని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంట నష్టపోతున్న రైతులకు ఆపన్నహస్తం ఇవ్వనున్నట్లు చెప్పారు. తమ లాభాల్లో కొంత భాగాన్ని రైతుల సంక్షేమం కోసం విరాళంగా ఇవ్వడానికి అంగీకరించారని తెలిపారు. దీంతో రైతులకు పెద్ద ఊరట లభించే అవకాశం ఉందన్నారు. అయితే ఈ విషయాన్ని సల్లుభాయ్ ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. కాగా విడుదలైన అయిదు రోజుల్లోనే బజరంగి భాయిజాన్ సుమారు రూ. 150 కోట్లకు పైగా బిజినెస్ సాధించింది. జూలై 17న ప్రేక్షకుల ముందుకొచ్చి ఇంకా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. రాక్‌లైన్ వెంకటేష్ నిర్మాణ సారధ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో కరీనా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశవ్యాప్తంగా తన హవాను కొనసాగిస్తున్న ఈ చిత్రం వారాంతానికి రూ.200 కోట్ల వసూళ్లను దాటొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. -
అమ్మో.. ఆ పాప అల్లరి గడుగ్గాయి
ముంబయి: బజరంగి భాయీజాన్ చిత్రంలో నటించిన బాలనటి హర్షాలీ మల్హోత్రా అలాంటి ఇలాంటి పాప కాదంట. బాగా అల్లరి గడుగ్గాయట. ఒక్కచోట కూర్చునేది కాదని, నిశ్శబ్దంగా ఉండటం తనకు అస్సలు నచ్చదని ఆమెకు దుస్తుల అలంకరణ చేసిన ముఖేశ్ చెప్పినట్లు హర్షాలీ తల్లి కాజల్ మల్హోత్రా తెలిపింది. ఎంత చెబుతున్నా.. వినకుండా తనకు నచ్చిన పనే చేస్తూ అల్లరితో ఆగమాగం చేసేదని ముఖేశ్ చెప్పేవాడని ఆమె వివరించింది. బజరంగీ భాయీజాన్ చిత్రంలో సల్మాన్ ఖాన్ పక్కన నటించిన ఈ పాప సినిమా చూసిన వారందరి హృదయాలను తన నటనతో కదిలించింది. కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులు కంటతడి పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ పాప గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ముఖేశ్ పంచుకున్నాడు. ఆ పాప ఎంత అల్లరి చేస్తున్నా చిరాకు అనిపించకుండా ముచ్చటేసేదట, తన ఎనర్జీ చూసి ఔరా అనిపించేదట. ప్రతిసారి అటూఇటూ గెంతులుపెడుతుంటే ఒక్క సల్మాన్ మాత్రమే ఆ పాపను ఆడించి మిగితావారి మాట కూడా వినాలని, కుదురుగా ఉండాలని చెప్పి బుజ్జగిస్తుండేవాడట. -
సల్మాన్ ఖాన్ సినిమాపై అఖిలేశ్ ఔదార్యం
లక్నో: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తాజా హిట్ చిత్రం బజరంగీ భాయిజాన్‌పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అశిలేశ్ యాదవ్ ఔదార్యాన్ని ప్రదర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 'బజరంగీ..' సినిమాకు వినోదం పన్ను మినహాయిపు కల్పిస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఇండియాలో తప్పిపోయిన పాక్ బాలికను ఇంటికి చేర్చడమనే కథాంశంతో గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం 300 కోట్లకు పైగా వసూళ్లను రాబడుతుందని సినీవర్గాల అంచనా. ఈ రోజు ఉదయం బజరంగీ భాయిజాన్ చిత్ర దర్శకుడు కబీర్ ఖాన్.. సీఎం అఖిలేశ్‌ను కలిసి చిత్ర విశేషాలను వివరించారు. సినీరంగ అభివృద్ధికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న అఖిలేశ్ ఆ మేరకు సల్మాన్ సినిమాకు పన్ను మినహాయిస్తున్నట్లు చెప్పారు. సినిమా షూటింగ్స్‌కు అనువైన లొకేషన్లు ఉత్తరప్రదేశ్ అంతటా ఉన్నాయని, సినిమా రూపకర్తలు ఇక్కడికి వచ్చి సినిమాలు తీయాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా తన సినిమాను చూడాల్సిందిగా భారత్, పాక్ ప్రధానులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్‌లను కోరారు హీరో సల్మాన్ ఖాన్. -
మొన్న బాహుబలి.. నేడు బజరంగి భాయ్‌జాన్
న్యూఢిల్లీ: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం బజరంగి భాయ్‌జాన్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. గత శుక్రవారం విడుదలయిన ఈ సినిమా మూడు రోజుల్లోనే 100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. శుక్రవారం 27.25 కోట్లు, శనివారం 36.60 కోట్లు, ఆదివారం 38.75 కోట్లు రూపాయల కలెక్షన్లు వచ్చాయి. మూడు రోజుల్లో మొత్తం 102.60 కోట్ల రూపాయలు రాబట్టింది. కబీర్ ఖాన్ దర్శకత్వంతో సల్మాన్, కరీనా కపూర్ తదితరులు నటించిన బజరంగి భాయ్‌జాన్ హిట్ టాక్‌తో ప్రదర్శితమవుతోంది. మొన్న బాహుబలి.. నేడు బజరంగి భాయ్‌జాన్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయంటూ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. -
మేకింగ్ ఆప్ మూవీ : బజరంగీ భాయ్‌జాన్
-
'అది అతని కెరీర్ లో నే బెస్ట్ ఫిల్మ్'
ముంబై: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'బజరంగీ భాయ్ జాన్' పై సహచర నటుడు అమిర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సల్మాన్ ఖాన్ కెరీర్ లోనే మంచి చిత్రంగా నిలిచిపోతుందన్నాడు. బజరంగీ భాయ్ చిత్రంలో సల్మాన్ నటన అద్భుతంగా ఉందని కొనియాడాడు. ఆ సినిమాలో ఎప్పుడూ చూడని కొత్త సల్మాన్ ను చూశామని అమిర్ పేర్కొన్నాడు. 'బజరంగీ భాయ్ జాన్' నిజంగా అద్భుతంగా ఉంది. ఈ రోజు వరకూ సల్మాన్ బెస్ట్ ఫిల్మ్ అదే. దర్శకుడు కబీర్ ఖాన్ గొప్ప సినిమాను అందించాడు. అతని సినీ జీవితంలో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోతుంది ' అని అమిర్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం రెండో రోజుల్లోనే రూ.63.75 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. -
తొలి రోజు రూ. 27 కోట్లు వసూలు
న్యూఢిల్లీ: బజరంగీ భాయ్‌జాన్ చిత్రం తొలి రోజే రూ.27 కోట్లు వసూళు చేసింది. ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్ నటించిన అన్ని చిత్రాల రికార్డులను ఈ చిత్రం చెరిపేసింది. సెలవు కాకుండా శుక్రవారం రోజు రిలీజై ఇంతగా కలెక్షన్లని రాబట్టిందని చిత్ర యూనిట్ సభ్యుడు ఒకరు తెలిపారు. ఇక వారంతమైన శని, ఆదివారాల్లో మరింతగా కలెక్షన్లను రాబట్టవచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ చిత్రం 5000 స్క్రిన్స్లో ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో విడుదలయింది.వెండితెరపై చాలా కాలం తరువాత గుబాళించిన మానవతా పరిమళంగా 'బజరంగీ భాయ్‌జాన్' శుక్రవారం రిలీజైంది. కథ విషయానికొస్తే...అన్నీ లెక్కలేసుకొనే చేస్తే దాన్ని జీవితమనీ, మనల్ని మనుషులనీ ఎవరూ అనరు. అనలేరు. యంత్రానికి లేని మనసుంది కాబట్టే, మనం ప్రత్యేకమయ్యాం. కొన్ని భావాలకూ, బంధాలకూ లాజిక్‌లు ఉండవు. అది అంతే! కానీ, మనకు మనమే కులం, మతం, ప్రాంతం, భాష, దేశం - అనే విభజన రేఖలు గీసుకున్నాం. మన లాంటి తోటి మనిషిని కూడా ఈ మరుగుజ్జు ప్రమాణాలతో జడ్జ్ చేయడానికి ప్రయత్నిస్తాం. సాటివాడికి చేయందించడానికి కూడా ఈ లెక్కలు వేస్తాం. సరిగ్గా అలాంటి మనస్తత్త్వమున్న మన లాంటి ఒక వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో తన దేశం, మతం కాని ఒక చిన్నారికి దగ్గరైతే? మాటలు రాని ఆరేళ్ల ఆ మూగ చిన్నారిని సురక్షితంగా తన ఇంటికి చేర్చడానికి జీవితాన్నే రిస్క్‌లో పడేసుకుంటే? ఆ క్రమంలో డబ్బు, ప్రేమ, పెళ్ళి, చివరకు ప్రాణం కూడా పణంగా ఒడ్డడానికి సిద్ధపడితే? మనుషుల మధ్య పెరగాల్సింది ప్రేమే తప్ప, కుల, మత, ప్రాంతాల పేరిట ద్వేషం కాదని గుర్తు చేసేలా 'బజరంగీ భాయ్‌జాన్' తెరకెక్కింది. -
సల్మాన్‌ఖాన్ కేసు పెట్టాడు
ముంబయి: తనపేరుపై తనకు, పలువురు ఫోన్లకు వచ్చిన ఒక ఫాల్స్ వాట్సాప్ పోస్ట్ విషయంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ తీవ్రంగా స్పందించారు. ఆయన కేసు పెట్టారు. స్వయంగా ముంబయి పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. ఎవరో వ్యక్తి స్క్రీన్ షాట్ తీసి అందులో సల్మాన్ ఉద్దేశిస్తూ పోస్ట్ చేయగా అది పలుచోట్ల చక్కెర్లు కొడుతుంది. ఆ ఫేక్ వాట్సాప్ పోస్ట్‌లో 'మీ ముస్లింల మద్ధతు లేకుండానే ఈసారి సినిమా విజయవంతం అవుతుందంటూ' చేర్చారు. దీంతో ఆయన ముంబయి క్రైం బ్రాంచ్ ను ఆశ్రయించారు. సల్మాన్ నటించిన కొత్త చిత్రం 'బజరంగీ భైజాన్' జూలై 17న విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సల్మాన్ ఆంజనేయుడి భక్తుడిగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముస్లింల మద్ధతు అంటూ వచ్చిన ఫేక్ పోస్ట్ ఆయనను కలవర పెట్టడంతో పోలీసులను ఆశ్రయించారు. -
సల్మాన్‌ను చూస్తే... అసూయగా ఉంటుంది!
అందాల తార కరీనాకపూర్, కండలవీరుడు సల్మాన్‌తో కలిసి ఇప్పటి వరకూ నాలుగు సినిమాల్లో నటించారు. వీరి కాంబినేషన్లో తాజా చిత్రం ‘భజరంగీ భాయ్‌జాన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా సల్మాన్ గురించి కరీనా చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ►అప్పటికీ ఇప్పటికీ సల్మాన్‌లో ఏ మాత్రం మార్పు లేదు. పదేళ్ల క్రితం సల్మాన్ ఎలా ఉన్నారో... ఇప్పుడు అలానే ఉన్నారు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు. ఆయనకు ఎన్ని బాధలు ఉన్నా, వాటిని సెట్లోకి మాత్రం తీసుకురారు. ►ఇప్పుడు చాలా సెలైంట్ అయిపోయారు. కానీ సెట్లో తోటి నటీనటుల బాగోగులు చూసుకోవడంలో సల్మాన్ ది బెస్ట్. సహనటుడు నవాజుద్దీన్ సిద్దిఖి కూడా ఇదే మాట అంటూ ఉంటారు. ► సల్మాన్‌ని దైవంలా భావించే అభిమానులు చాలా మంది ఉన్నారు. తనకు జైలు శిక్ష పడచ్చేమో అన్న పరిస్థితుల్లో కూడా సల్మాన్ చాలా గుండె నిబ్బరంతో ఉన్నారు. ఆయన ముఖంలో ఇసుమంత దిగులు కూడా కనిపించలేదు. ► ఒక్కోసారి ఆయనకున్న అభిమానగణాన్ని చూస్తే చాలా అసూయగా ఉంటుంది. ఆయనకు శిక్ష పడుతుందన్న సమయంలో కూడా అభిమానులు అతని కోసం ప్రార్థించిన తీరుని నేను మర్చిపోలేను. ఆయన మీద దేవుని కృప ఉండటం వల్లే ఆయన చాలా సంతోషంగా ఉంటున్నారు. -
నా పాటను మికాసింగ్ దొంగిలించాడు!
ముంబై:తన పాటను సింగర్ మికాసింగ్ దొంగిలించాడని అంటున్నాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. గాయకుడైన మికా సింగ్ పాటను అపహరించడం ఏంటా అనుకుంటున్నారా?, ఇటీవల విడుదల చేసిన 'ఆజ్ కీ పార్టీ'అనే పాటను సల్మాన్ పాడదామనుకున్నాడట. అయితే ఈలోపు ఆ పాటను మికాసింగ్ పాడేసి.. తన కోరికను నెరవేరకుండా చేశాడు. ఆ పాటను పాడటానికి చాలా సార్లు ప్రయత్నించా. ఆ క్రమంలోనే పాట లెంగ్త్ ను కూడా తగ్గించాం. కాగా, మికాసింగ్ తనను అధిగమించి మరీ ఆ సాంగ్ ను ఖాతాలో వేసుకున్నాడు' అని సల్మాన్ చమత్కరించాడు. ఇదిలా ఉండగా భజరంగి భాయిజాన్ ప్రమోషన్ కార్యక్రమానికి సల్మాన్ దూరంగా ఉండనున్నాడు. ప్రస్తుతం హిట్ అండ్ రన్ కేసులో బెయిల్ పై ఉన్న సల్మాన్ ఖాన్ వేరే నగరాల్లో పర్యటనకు అనుమతి లేనందున భజరంగి భాయిజాన్ కు సినిమా ప్రమోషన్ కు దూరం కానున్నాడు. కాగా ముంబైలోని తన ఇంటి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంటాడని అతని ప్రతినిధి ఒకరు తెలిపారు. 2012వ సంవత్సరంలో కబీర్-సల్మాన్ కాంబినేషన్ లో వచ్చిన 'ఏక్తా టైగర్' భారీ విజయాన్ని సాధించింది. ఆ తరువాత వీరిద్దరి కలయికలో వస్తున్న మరో చిత్రమే భజరంగి భాయిజాన్. ఈ సినిమాను జూలై 17 వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.గత రెండు రోజుల క్రితం ఈ చిత్రంలోని 'ఆజ్ కీ పార్టీ' అనే ప్రత్యేక పాటను డైరెక్టర్ కబీర్ ఖాన్, మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ చక్రబొర్తి, సింగర్ మికా సింగ్ లతో తో కలిసి సల్మాన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
సల్మాన్‌కు షాక్ ఇచ్చిన పూనమ్‌పాండే
-
బాహుబలికి పోటీగా భాయ్‌జాన్
-
చికెన్‌కు...ప్రేమతో..!
‘ఎగిరే పావురమా’లో ‘ఆహా ఏమి రుచి’ పాట వినగానే వంకాయ గుర్తొచ్చి నోరూరిపోతుంది. అలాంటి వంటకాల పాటల బాణీలో కండల వీరుడు సల్మాన్‌ఖాన్ ఇప్పుడు చికెన్ పాటకు కాలు కదపనున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వంలోని ‘భజరంగీ భాయ్‌జాన్’ కోసం చికెన్ మీద పాటను రికార్డ్ చేయనున్నారు. అందుకే ఒరిజినల్ శబ్దాలను రికార్డ్ చేయాలన్న ఉద్దేశంతో స్విస్‌కు చెందిన ఇద్దరు స్వరకర్తలను సంప్రతించారట ఈ చిత్ర సంగీత దర్శకుడు ప్రీతమ్. సల్మాన్‌కు చికెన్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఈ పాటలో ఆయన తన ప్రతిభకు ప్రేమను జత చేసి ఉంటారని చెప్పనక్కరలేదు. -
ఒకటి కాదు రెండు..!
జైలు గండం తాత్కాలికంగా తప్పడంతో కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సల్మాన్ ‘భజరంగీ భాయ్‌జాన్’, ‘ ప్రేమ్త్రన్ ధన్ పాయో’ చిత్రాలలో నటి స్తున్నారు. 1980లో వచ్చిన హిట్ చిత్రం ‘హీరో’ రీమేక్ కు సల్మాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర ంలో సల్మాన్ మొదట ఒక పాట పాడతారనే వార్త బయటకు వచ్చింది. కానీ ఒకటి కాదు.. ఏకంగా రెండు పాటలు పాడాలని నిర్ణయించుకున్నారన్నది తాజా సమాచారం. ఈ వార్త విన్నవాళ్లు సల్మాన్ మంచి కిక్‌లో ఉన్నారని చెప్పుకుంటున్నారు. -
షూటింగ్‌కు సల్మాన్ ఖాన్
ముంబై: హిట్ అండ్ రన్ కేసులో ఊరట పొందిన బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మళ్లీ షూటింగ్‌పై దృష్టిసారిస్తున్నారు. శనివారం కాశ్మీర్లో జరిగే బజరంగి భైజాన్ సినిమా షూటింగ్లో పాల్గొననున్నారు. హిట్ అండ్ రన్ కేసులో ముంబై సెషన్స్ కోర్టు సల్మాన్‌కు ఐదేళ్ల శిక్ష విధించగా, శుక్రవారం హైకోర్టు శిక్షను నిలుపదల చేసిన సంగతి తెలిసిందే. సల్మాన్‌కు బెయిల్ మంజూరు చేయడంతో ఊపశమనం కలిగింది. తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు సల్మాన్ కృతజ్ఞతలు చెప్పారు. -
సల్మాన్ షూటింగ్‌కు ఊహించని అతిథి
కాశ్మీర్: అసలే ఎండాకాలం.. కానీ అక్కడ మాత్రం అలా అనిపించకపోవచ్చు. ఎందుకంటే అది మంచు ప్రాంతం. కాశ్మీర్ మిగతా ప్రాంతాలకన్నా ఎప్పటికీ ఆహ్లాదంగానే ఉంటుంది కూడా. కానీ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు మాత్రం కాస్త చిరాకుగా, ఒత్తిడిగా అనిపించింది. అలా అనిపించేలోపే తిరిగి గాల్లో తేలిపోయినట్లు ఒక్కసారిగా లేచి నిల్చున్నారు. ముఖంలో చిరునవ్వు. ఒత్తిడి మాయం. ఇదంతా ఎందుకని అనుకుంటున్నారా..! ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తూ కబీర్ ఖాన్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం బజ్రంగి భైజాన్ కాశ్మీర్ లోయలో షూటింగ్ జరుపుకుంటోంది. చుట్టూ నటీనటులు, కెమెరాలు, మైక్ సౌండ్లతో కాస్తంత అలసి పోయిన సల్మాన్ వెంటనే రిలీఫ్ అయ్యారు. అందుకు కారణం ఆయన గారాల చెల్లెలు అర్పిత, బావ అయూష్ శర్మ అనుకోకుండా షూటింగ్ వద్దకు వచ్చారంట. దీంతో ఒక్కసారిగా తన కుటుంబ సభ్యులు కనిపించడంతోపాటు తాను ఎంతగానో ఇష్టపడే సోదరి అర్పిత ఊహించకుండా వచ్చేసరికి ఆయన ఒక్కసారిగా సంతోషంలో మునిగిపోయారని, అక్కడ చిరునవ్వులు విరబూసాయని అర్పిత ట్వీట్ చేసింది.