
సల్మాన్‌ను చూస్తే... అసూయగా ఉంటుంది!
అందాల తార కరీనాకపూర్, కండలవీరుడు సల్మాన్‌తో కలిసి ఇప్పటి వరకూ నాలుగు సినిమాల్లో నటించారు. వీరి కాంబినేషన్‌లో తాజా చిత్రం ‘భజరంగీ భాయ్‌జాన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా సల్మాన్ గురించి కరీనా చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
►అప్పటికీ ఇప్పటికీ సల్మాన్‌లో ఏ మాత్రం మార్పు లేదు. పదేళ్ల క్రితం సల్మాన్ ఎలా ఉన్నారో... ఇప్పుడు అలానే ఉన్నారు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు. ఆయనకు ఎన్ని బాధలు ఉన్నా, వాటిని సెట్‌లోకి మాత్రం తీసుకురారు.
►ఇప్పుడు చాలా సెలైంట్ అయిపోయారు. కానీ సెట్‌లో తోటి నటీనటుల బాగోగులు చూసుకోవడంలో సల్మాన్ ది బెస్ట్. సహనటుడు నవాజుద్దీన్ సిద్దిఖి కూడా ఇదే మాట అంటూ ఉంటారు.
► సల్మాన్‌ని దైవంలా భావించే అభిమానులు చాలా మంది ఉన్నారు. తనకు జైలు శిక్ష పడచ్చేమో అన్న పరిస్థితుల్లో కూడా సల్మాన్ చాలా గుండె నిబ్బరంతో ఉన్నారు. ఆయన ముఖంలో ఇసుమంత దిగులు కూడా కనిపించలేదు.
► ఒక్కోసారి ఆయనకున్న అభిమానగణాన్ని చూస్తే చాలా అసూయగా ఉంటుంది. ఆయనకు శిక్ష పడుతుందన్న సమయంలో కూడా అభిమానులు అతని కోసం ప్రార్థించిన తీరుని నేను మర్చిపోలేను. ఆయన మీద దేవుని కృప ఉండటం వల్లే ఆయన చాలా సంతోషంగా ఉంటున్నారు.