
‘నన్ను ఇప్పటి యువతరంతో పోల్చడం సరికాదు’ అంటున్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్. బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్‌తో జంటగా నటిస్తున్న కరీనా తాజా చిత్రం ‘గుడ్ న్యూస్’. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో కరీనా మాట్లాడుతూ ‘నేను చిత్ర పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్ధాలు గడిచిపోయాయి. అయినా అభిమానులు ఇప్పటికీ నన్ను ప్రస్తుత యువతరంతో పోల్చుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది’ అని అన్నారు. అయితే ఎప్పుడూ తనని ఇతరులతో పోల్చుతూ ఉంటారని, అది సంతోషకరమైన విషయమే అయినప్పటికీ ఎందుకు అలా పోల్చుతారు... ఇది సరైన పద్దతి కాదంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘ఇరవై ఏళ్ల నుంచి నేను నటనలో ఉన్నాను. నా పనేంటో నేను చేసుకుంటున్నాను. ప్రస్తుతం నా సినీ జీవితం పట్ల సంతృప్తిగా ఉన్నాను.’ అంటూ కరీనా చెప్పుకొచ్చారు.
అయితే కరీనా కపూర్ 2000 సంవత్సరంలో ‘రెఫ్యూజీ’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగు పెట్టారు. తన తొలి చిత్రంతోనే బాలీవుడ్ బిగ్ బీ తనయుడు అభిషేక్ బచ్చన్ సరసన నటించారు. ఇక రెండవ చారిత్రాత్మక చిత్రం ‘అశోకా’ విజయవంతం కావడంతో కరీనాకు మంచి బ్రేక్ వచ్చింది. అలాగే మూడవ సినిమాతోనే బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌లతో కలిసి నటించే చాన్స్ కొట్టేశారు. బ్లాక్ బ్లాస్టర్ హిట్ ‘కభీ ఖుషీ కభీ గమ్’లో హృతిక్‌కు జోడిగా నటించారు. ఆ తరువాత ‘చమేలీ’, ‘జబ్ వే మేట్’, ‘దేవ్’, ‘3 ఇడియట్స్’, ‘బజరంగీ భయిజాన్’, ‘ఉడ్తా పంజాబ్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి కరీనా స్టార్ హీరోయిన్ అయ్యారు. ఇక అప్పటి నుంచి కరీనా గ్లామరస్ పాత్రలతో పాటు ట్రెడిషనల్ క్యారెక్టర్స్ చేస్తూ యువతరం హీరోయిన్స్‌కు గట్టి పోటీనిస్తూ వస్తున్నారు కరీనా.
Comments
Please login to add a commentAdd a comment