న్యూఢిల్లీ: సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ జంటగా నటించిన 'బజరంగీ భాయ్‌జాన్' సినిమా చైనాలో దుమ్మురేపుతోంది. ఈ సినిమా చైనాలో విడుదలై నాలుగు వారాలు గడిచినా.. బాక్సాఫీసు వద్ద ఇప్పటికీ భారీగా వసూళ్లు రాబడుతోంది. చైనాలో 'లిటిల్ లోలిటా.. మంకీ గాడ్ అంకుల్' శీర్షికతో విడుదలై ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. చైనీయుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుండటంతో ఇప్పటివరకు ఈ సినిమా.. ఆ దేశ బాక్సాఫీస్ వద్ద రూ. 281 కోట్లు కొల్లగొట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 'బజరంగీ భాయ్‌జాన్' వసూలు చేసిన కలెక్షన్ల మొత్తం రూ. 907 కోట్లకు చేరింది.
ఆమిర్ ఖాన్ 'దంగల్', 'సీక్రెట్ సూపర్ స్టార్' సినిమాలు చైనాలో భారీ వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఆమిర్ స్థాయిలోనే సల్మాన్ సినిమాలపై కూడా చైనా ప్రేక్షకులు అభిమానాన్ని చూపిస్తున్నారు. 'దంగల్', 'బాహుబలి 2', 'సీక్రెట్ సూపర్ స్టార్' సినిమాల తర్వాత చైనాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన నాలుగో సినిమాగా బజరంగీ భాయ్‌జాన్ నిలిచింది. తల్లిదండ్రుల నుంచి వేరయి భారత్‌లో చిక్కుకున్న ఆరేళ్ల పాకిస్థానీ అమ్మాయిని, బంజరంగీ అనే ఒక దేశభక్తుడు ఎలా దాయాది దేశానికి చేర్చాడన్నేది ఈ చిత్ర కథ. 2015లో భారత్‌లో విడుదలైన ఈ సినిమా ఇక్కడ కూడా సూపర్‌హిట్ అయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment