అమ్మో.. ఆ పాప అల్లరి గడుగ్గాయి | Bajrangi Bhaijaan's Voiceless 6-Year-Old Very Talkative in Real Life | Sakshi
Sakshi News home page

అమ్మో.. ఆ పాప అల్లరి గడుగ్గాయి

Published Tue, Jul 21 2015 11:20 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM

అమ్మో.. ఆ పాప అల్లరి గడుగ్గాయి

అమ్మో.. ఆ పాప అల్లరి గడుగ్గాయి

ముంబయి: బజరంగి భాయీజాన్ చిత్రంలో నటించిన బాలనటి హర్షాలీ మల్హోత్రా అలాంటి ఇలాంటి పాప కాదంట. బాగా అల్లరి గడుగ్గాయట. ఒక్కచోట కూర్చునేది కాదని, నిశ్శబ్దంగా ఉండటం తనకు అస్సలు నచ్చదని ఆమెకు దుస్తుల అలంకరణ చేసిన ముఖేశ్ చెప్పినట్లు హర్షాలీ తల్లి కాజల్ మల్హోత్రా తెలిపింది. ఎంత చెబుతున్నా.. వినకుండా తనకు నచ్చిన పనే చేస్తూ అల్లరితో ఆగమాగం చేసేదని ముఖేశ్ చెప్పేవాడని ఆమె వివరించింది.

బజరంగీ భాయీజాన్ చిత్రంలో సల్మాన్ ఖాన్ పక్కన నటించిన ఈ పాప సినిమా చూసిన వారందరి హృదయాలను తన నటనతో కదిలించింది. కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులు కంటతడి పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ పాప గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ముఖేశ్ పంచుకున్నాడు. ఆ పాప ఎంత అల్లరి చేస్తున్నా చిరాకు అనిపించకుండా ముచ్చటేసేదట, తన ఎనర్జీ చూసి ఔరా అనిపించేదట. ప్రతిసారి అటూఇటూ గెంతులుపెడుతుంటే ఒక్క సల్మాన్ మాత్రమే ఆ పాపను ఆడించి మిగితావారి మాట కూడా వినాలని, కుదురుగా ఉండాలని చెప్పి బుజ్జగిస్తుండేవాడట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement