casting director
-
ఇలా మధ్యలో ఉండేవారి వల్ల కెరీర్ నాశనం: దర్శకుడు
ఎంతోమంది కెరీర్‌ను మధ్యలో ఉన్నవాళ్లే నాశనం చేస్తున్నారంటున్నాడు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. కొందరు మేనేజర్ల వల్ల ఆ హీరోల కెరీర్ ప్రమాదంలో పడుతుందని చెప్తున్నాడు. ఇంతకీ ఇదంతా ఎప్పుడు వచ్చిందంటే.. కాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ చాబ్రా... ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఇదీ పరిస్థితి.. ఒక్క నటుడు, 200మంది కాస్టింగ్ డైరెక్టర్లు, 15,680 మేనేజర్లు అని (దండంరా నాయనా అన్నట్లుగా ఓ ఎమోజీ జత చేసి) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు.మేనేజర్ చేసిన పనికి..దీనికి వివేక్ స్పందిస్తూ.. అవును, ఓ మేనేజర్ దురుసు ప్రవర్తన వల్ల గతవారం ఓ ప్రముఖ నటుడిని సినిమాలో నుంచి తీసేయాల్సి వచ్చింది. ఆ మేనేజర్ ఓ పెద్ద స్టార్ కిడ్ టాలెంట్ ఏజెన్సీలో పని చేస్తాడు. అందుకని అంత ఓవర్‌గా ప్రవర్తించాల్సిన అవసరం లేదుకదా!దీని గురించి వర్క్షాప్వీళ్ల వల్ల ఎంతోమంది కెరీర్ నాశనమవుతున్నాయి. దీని గురించి వర్క్‌షాప్ నిర్వహించాల్సిందంటూ ముకేశ్ చాబ్రాను కోరాడు. అయితే నటుడు, మేనేజర్ వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఇకపోతే ప్రస్తుతం వివేక్ అగ్నిహోత్రి.. ద ఢిల్లీ ఫైల్స్ అనే సినిమా చేస్తున్నాడు. I had to fire a lead actor last week because his manager was so arrogant and behaved as if he had the prerogative to be like this just because he is an employee of a ‘Huge Celeb’s’ Star Kid Talent Agency’. These middlemen have destroyed more careers than made it. Do a workshop… https://t.co/r3RtDtyBBu— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) September 27, 2024 చదవండి: దేవర సినిమా రివ్యూ -
విరాట్ కోహ్లి గొప్ప నటుడు, కానీ సినిమాల్లోకి రావొద్దు!
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మంచి నటుడే కానీ సినిమాల్లోకి మాత్రం రావొద్దంటున్నాడు కాస్టింగ్ డైరెక్టర్, నటుడు ముకేశ్ చాబ్రా. రిటైర్మెంట్ తర్వాత కూడా ఈ రంగుల ప్రపంచంలోకి వచ్చే సాహసం చేయొద్దని సూచిస్తున్నాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ముకేశ్ చాబ్రా మాట్లాడుతూ.. కోహ్లి గొప్ప నటుడు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈ పంజాబీ మనిషి జీవితాన్ని చదివేశాడు. విజయాన్ని ఎంతో నేర్పుగా అదిమిపట్టుకున్నాడు. సినిమాల్లోకి వద్దులుక్స్, ఫిట్నెస్, మానసిక ఆరోగ్యం.. అన్నింటిపైనా శ్రద్ధ తీసుకున్నాడు. తను గొప్పవాడు, తెలివైనవాడు. అలాగే ఎంతో సరదాగా ఉంటాడు. డ్యాన్స్ చేస్తాడు, మిమిక్రీ చేస్తాడు. కోహ్లి కామెడీ టైమింగ్ కూడా భలే ఉంటుంది. ఇతడు మన దేశం గర్వపడే స్థాయికి ఎదిగాడు. అతడికి పేరు తెచ్చిపెట్టిన క్రీడారంగంలోనే ఆయన కొనసాగాలి తప్ప సినిమాల్లోకి రాకూడదు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకపోతేనే బెటర్ అని అభిప్రాయపడ్డాడు.యాడ్స్ వరకే..కాగా విరాట్ కోహ్లి ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో నటించాడు. కొన్నింటిలో భార్య, హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి యాక్ట్ చేశాడు. అయితే యాడ్స్ వరకే పరిమితమైపోయాడు. ఎన్నడూ సినిమాల్లోకి వచ్చే ప్రయత్నం చేయలేదు.చదవండి: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి దంపతులు -
కాఫీకి పిలిచి రూమ్‌కు రమ్మన్నాడు: స్టార్ హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. డర్టీ పిక్చర్, షేర్ని, కహాని’ వంటి సినిమాలతో ఫేమ్ సాధించింది. అయితే బాలీవుడ్ బ్యూటీ ప్రస్తుతం లేడీ ఓరియెంటెండ్ సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. అయితే తాజాగా విద్యాబాలన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన విద్యా బాలన్ క్యాస్టింగ్ కౌచ్ సంచలన కామెంట్స్ చేసింది. కెరీర్లో తనకెదురైన అనుభవాలను ఈ సందర్భంగా వివరించింది. విద్యాబాలన్ మాట్లాడుతూ.. ' దక్షిణాది సినిమాల్లో పని చేసేందుకు ప్రయత్నిస్తున్నా రోజులవి. ఓ యాడ్ ఫిల్మ్ కోసం డైరెక్టర్‌ను కలిసేందుకు చెన్నై వెళ్లా. అక్కడ కాఫీ షాప్‌లో మాట్లాడుకుందామని దర్శకుడితో చెప్పా. అయితే అతను నన్ను రూముకి వెళ్లి మాట్లాడుకుందామని అడిగాడు. అప్పుడే అతని ఆలోచన నాకర్థమైంది. అప్పుడే నేను గది లాక్ చేయకుండా కొంచెం తెరిచి ఉంచా. దీంతో ఆ దర్శకుడు ఏమీ మాట్లాడకుండా ఐదు మిషాల తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాడు.' అంటూ చెప్పుకొచ్చింది నటి. ఆ సమయంలో తాను తెలివిగా వ్యవహరించడం వల్లే తప్పించుకున్నానని పేర్కొంది. అయితే ఆ దర్శకుడు ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికీ ఆ సంఘటనను మర్చిపోలేకపోతున్నానని విద్యా బాలన్ చెబుతోంది. ఆ తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్నట్లు తెలిపింది. వాటితో మానసికంగా ఇబ్బందులు పడ్డానని.. బయట పడేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని వెల్లడించింది. ఆ సంఘటనతో దర్శకుడు సినిమా నుంచి తొలగించి.. బాడీ షేమింగ్ చేశారని వాపోయింది. కాగా.. 2005లో వచ్చిన ‘పరిణీత’ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన భామ.. 2011 లో వచ్చిన ‘డర్టీ పిక్చర్’ సినిమాతో పాపులర్ అయింది. -
బాలీవుడ్ యువ కాస్టింగ్ డైరెక్టర్ మృతి
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వెనువెంటనే పెను విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖుల వరుస మరణాలు బీటౌన్ ఇండస్టీని ఆందోళనకు గురి చేస్తోంది. బుధవారం పాటల రచయిత అన్వర్ సాగర్ మరణించిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ యువ కాస్టింగ్ డైరెక్టర్ క్రిష్ కపూర్ మృతి చెందారు. మెదడులో రక్తస్రావం జరిగి మే 31న ముంబైలో తుదిశ్వాస విడిచారు. క్రిష్ కపూర్ మరణాన్ని అతని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. అతి చిన్న వయస్సులోని క్రిష్ కపూర్ మృతి చెందడం బాలీవుడ్లో తీవ్ర విషాదాన్ని నింపింది. 28 ఏళ్ల వయసున్న కపూర్‌కు భార్య, ఏడేళ్ల పాప ఉన్నారు. (పాటల రచయిత అన్వర్ ఇక లేరు) మహేష్ భట్ నిర్మాతగా వ్యవహరించిన ‘జలేబీ’, కృతి ఖర్బందా నటించిన ‘వీరే కి వెడ్డింగ్’ వంటి సినిమాలకు క్రిష్ కాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. అయితే కపూర్ రోడ్డు ప్రమాదంలో మరణించాడని పలు వార్తలు వినిపించగా.. అతని మామయ్య సునీల్ భళ్లా ఈ వార్తలను ఖండించారు. సబర్బన్ మీరా రోడ్డులో ఉన్న తన ఇంట్లో క్రిష్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని వెంటనే ఆసుపత్రిలో చేర్చగా మెదడులో రక్తస్రావం ఏర్పడి మరణించాడని వెల్లడించారు. తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, పూర్తిగా ఆరోగ్యంగా ఉండేవాడని ఆయన పేర్కొన్నారు. క్రిష్ మరణం తమ కుటుంబాన్ని షాక్‌కు గురిచేసిందని సునీల్ భళ్లా వాపోయారు. (చిరంజీవి ఇచ్చిన సరుకులే ఆసరా..) -
మోడల్స్‌తో వ్యభిచారం.. ఆ ఖర్చులను మీరే భరించాలి..!
ముంబై: నగరంలో గత ఐదేళ్లుగా వ్యభిచార గృహాన్ని నడుపుతోన్న క్యాస్టింగ్ డైరెక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇండస్ట్రీకి అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలకు మాయమాటలు చెప్పి వ్యభిచార వృత్తిలోకి దించుతున్నారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. నవీన్ కుమార్ ప్రేమ్‌లాల్ ఆర్య (32) అనే వ్యక్తి బాలీవుడ్లో క్యాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈజీ మనీ కోసం అలవాటు పడిన ఆయన.. స్నేహితులు అజయ్ శర్మ, విజయ్‌లతో కలిసి వ్యభిచార దందాకు తెరలేపారు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని యువతులకు వలవేసి.. వారితో వ్యభిచారం చేయించడం మొదలుపెట్టారు. గత ఐదేళ్లుగా కొనసాగుతున్న ఈ దందాకు పోలీసులు చెక్ పెట్టారు. నవీన్‌ను అరెస్ట్ చేయడానికి ప్లాన్ వేసిన పోలీసులు కస్టమర్లా నవీన్‌కు ఫోన్ చేశారు. ఇద్దరు అమ్మాయిలు కావాలని అడిగారు. దీనికి ఓకే చెప్పిన నవీన్.. ఇండస్ట్రీలో మోడల్‌గా, ఆర్టిస్ట్‌గా పనిచేస్తోన్న ఇద్దరు అమ్మాయిలను పంపుతానని మాటిచ్చారు. అయితే.. ఒక్కో మహిళకు రూ.60 వేల క్యాష్‌తోపాటు హోటల్ ఖర్చులను కూడా భరించాలని చెప్పారు. పోలీసులు అందుకు అంగీకరించడంతో అమ్మాయిలతో కలిసి హోటల్‌కు వచ్చిన నవీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మో.. ఆ పాప అల్లరి గడుగ్గాయి
ముంబయి: బజరంగి భాయీజాన్ చిత్రంలో నటించిన బాలనటి హర్షాలీ మల్హోత్రా అలాంటి ఇలాంటి పాప కాదంట. బాగా అల్లరి గడుగ్గాయట. ఒక్కచోట కూర్చునేది కాదని, నిశ్శబ్దంగా ఉండటం తనకు అస్సలు నచ్చదని ఆమెకు దుస్తుల అలంకరణ చేసిన ముఖేశ్ చెప్పినట్లు హర్షాలీ తల్లి కాజల్ మల్హోత్రా తెలిపింది. ఎంత చెబుతున్నా.. వినకుండా తనకు నచ్చిన పనే చేస్తూ అల్లరితో ఆగమాగం చేసేదని ముఖేశ్ చెప్పేవాడని ఆమె వివరించింది. బజరంగీ భాయీజాన్ చిత్రంలో సల్మాన్ ఖాన్ పక్కన నటించిన ఈ పాప సినిమా చూసిన వారందరి హృదయాలను తన నటనతో కదిలించింది. కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులు కంటతడి పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ పాప గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ముఖేశ్ పంచుకున్నాడు. ఆ పాప ఎంత అల్లరి చేస్తున్నా చిరాకు అనిపించకుండా ముచ్చటేసేదట, తన ఎనర్జీ చూసి ఔరా అనిపించేదట. ప్రతిసారి అటూఇటూ గెంతులుపెడుతుంటే ఒక్క సల్మాన్ మాత్రమే ఆ పాపను ఆడించి మిగితావారి మాట కూడా వినాలని, కుదురుగా ఉండాలని చెప్పి బుజ్జగిస్తుండేవాడట.