Actress Vidya Balan Comments On Casting Couch Experience - Sakshi
Sakshi News home page

Vidya Balan: డైరెక్టర్ రూమ్‌కి పిలవగానే నాకర్థమైంది: విద్యాబాలన్

Published Fri, Mar 10 2023 4:43 PM | Last Updated on Fri, Mar 10 2023 5:20 PM

Actress Vidya Balan Comments On Casting Couch Experience with Director - Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌ విద్యాబాలన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. డర్టీ పిక్చర్, షేర్ని, కహాని’ వంటి సినిమాలతో ఫేమ్ సాధించింది.  అయితే బాలీవుడ్ బ్యూటీ ప్రస్తుతం లేడీ ఓరియెంటెండ్‌ సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. అయితే తాజాగా విద్యాబాలన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.  ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన విద్యా బాలన్‌ క్యాస్టింగ్ కౌచ్‌ సంచలన కామెంట్స్ చేసింది. కెరీర్‌లో తనకెదురైన అనుభవాలను ఈ సందర్భంగా వివరించింది. 

విద్యాబాలన్ మాట్లాడుతూ.. ' దక్షిణాది సినిమాల్లో పని చేసేందుకు ప్రయత్నిస్తున్నా రోజులవి. ఓ యాడ్ ఫిల్మ్ కోసం డైరెక్టర్‌ను కలిసేందుకు చెన్నై వెళ్లా. అక్కడ కాఫీ షాప్‌లో మాట్లాడుకుందామని దర్శకుడితో చెప్పా. అయితే అతను నన్ను రూముకి వెళ్లి మాట్లాడుకుందామని అడిగాడు. అప్పుడే అతని ఆలోచన నాకర్థమైంది. అప్పుడే నేను గది లాక్ చేయకుండా కొంచెం తెరిచి ఉంచా. దీంతో ఆ దర్శకుడు ఏమీ మాట్లాడకుండా ఐదు మిషాల తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాడు.' అంటూ చెప్పుకొచ్చింది నటి. ఆ సమయంలో తాను తెలివిగా వ్యవహరించడం వల్లే తప్పించుకున్నానని పేర్కొంది. అయితే ఆ దర్శకుడు ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. 

ఇప్పటికీ ఆ సంఘటనను మర్చిపోలేకపోతున్నానని విద్యా బాలన్ చెబుతోంది. ఆ తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్నట్లు తెలిపింది. వాటితో మానసికంగా ఇబ్బందులు పడ్డానని..  బయట పడేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని వెల్లడించింది. ఆ సంఘటనతో దర్శకుడు సినిమా నుంచి తొలగించి.. బాడీ షేమింగ్ చేశారని వాపోయింది. కాగా.. 2005లో వచ్చిన ‘పరిణీత’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన భామ.. 2011 లో వచ్చిన ‘డర్టీ పిక్చర్’ సినిమాతో పాపులర్ అయింది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement