‘తలుపులు మూయడానికి ఒప్పుకోలేదు’ | Vidya Balan Reveals The Time She Felt Ugly | Sakshi
Sakshi News home page

నన్ను నేను అద్దంలో చూసుకోలేదు: విద్యాబాలన్‌

Published Tue, Aug 27 2019 7:10 PM | Last Updated on Tue, Aug 27 2019 7:45 PM

Vidya Balan Reveals The Time She Felt Ugly - Sakshi

విద్యా బాలన్‌.. జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత. లేడీ ఓరియెంటెడ్‌ సినిమా అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది విద్యనే. నటనతోనే కాక విభిన్న కథాంశాలను ఎన్నుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు విద్యాబాలన్‌. అయితే ఈ గుర్తింపు వెనక ఎన్నో అవమానాలు, వేధింపులు, కష్టాలున్నాయంటున్నారు విద్యాబాలన్‌. అవి ఏంటో ఆమె మాటల్లోనే.. ‘1990 కాలంలో ‘హమ్‌ పాంచ్‌’తో ఇండస్ట్రీలోకి ప్రవేశించాను. ఆ తర్వాత 2003లో వచ్చిన బెంగాలీ చిత్రం ‘భలో థేకో’తో సినిమాల్లో ప్రవేశించాను. ఈ రెండింటి మధ్య కాలంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. నేను ఎదుర్కొన్న సంఘటనల్లో కొన్ని నేటికి నాకు కళ్లకు కట్టినట్లు గుర్తున్నాయి’ అన్నారు విద్య.
 
‘చెన్నైలో ఉండగా ఓ సంఘటన చోటు చేసుకుంది. నన్ను కలవడానికి ఓ దర్శకుడు వచ్చాడు. ఎక్కడైనా కాఫీ షాప్‌లో కూర్చుని మాట్లాడుకుందామన్నాను. అందుకు అతడు అంగీకరించలేదు. హోటల్‌కు వెడదామన్నాడు. దాంతో తప్పని సరి పరిస్థితుల్లో హోటల్‌కి వెళ్లాను. కానీ మేం కూర్చున్న గది తలుపులు మూయడానికి నేను అంగీకరించలేదు. దాంతో ఆ దర్శకుడు అక్కడి నుంచి వెళ్లి పోయాడు. అతడు అలా ఎందుకు ప్రవర్తించాడో ఆ క్షణం నాకు అర్థం కాలేదు. అర్థం అయ్యాక ఎంతో భయపడ్డాను. మరో చోట ఓ నిర్మాత నాకు తన సినిమాలో అవకాశం ఇస్తానన్నాడు. కానీ ఉన్నట్టుండి నన్ను ఆ సినిమా నుంచి తప్పించాడన్నారు. ఇలాంటి కొన్ని చేదు సంఘటనల తర్వాత 2005లో ‘పరిణీత’ చిత్రంతో విద్య బాలీవుడ్‌లో ప్రవేశించారు.

అక్కడ కూడా ‘లావుగా ఉన్నావ్‌, ఫ్యాషన్‌ సెన్స్‌ లేదు’ అనే విమర్శలు ఎదుర్కొన్నారు విద‍్య. ఆ తర్వాత వచ్చిన ‘లగే రహో మున్నాభాయ్‌’, ‘పా’, ‘నో వన్‌ కిల్డ్‌ జెస్సికా’ చిత్రాలు విద్యలోని నటిని వెలికి తీశాయి. ఆ తర్వాత ‘డర్టీ పిక్చర్‌’ చిత్రంలో నటించి జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు విద్య. ప్రస్తుతం విద్య నటించిన ‘మిషన్‌ మంగళ్‌ చిత్రం’ కూడా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
(చదవండి: ఆమె పుట్టగానే.. నర్సు ఏమన్నదంటే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement