గదిలోకి వెళ్లగానే వెకిలిగా ప్రవర్తించాడు | Vidya Balan shares her casting couch experience | Sakshi
Sakshi News home page

గదిలోకి వెళ్లగానే వెకిలిగా ప్రవర్తించాడు

Published Thu, Aug 29 2019 12:19 AM | Last Updated on Thu, Aug 29 2019 11:10 AM

Vidya Balan shares her casting couch experience - Sakshi

ఫిల్మ్‌ ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్, హాలీవుడ్‌ దాకా ఉద్యమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. క్యాస్టింగ్‌ కౌచ్‌ పేరిట వేధిస్తున్నారంటూ ఇప్పటికే పలువురు నటీమణులు ఆరోపణలు చేశారు. తాజాగా నటి విద్యాబాలన్‌ కూడా కెరీర్‌ తొలినాళ్లలో క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. అక్షయ్‌ కుమార్, విద్యాబాలన్‌ ముఖ్యపాత్రల్లో జగన్‌ శక్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిషన్‌ మంగళ్‌’. ఈ నెల 15న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విద్యాబాలన్‌ మాట్లాడుతూ– ‘‘కెరీర్‌ తొలిరోజుల్లో చెన్నైలోని ఒక దర్శకుడు నా దగ్గరకు వచ్చి స్టోరీ లైన్‌ చెప్పాడు. ‘పూర్తి కథ చెప్పడానికి కాస్త సమయం పడుతుంది, రూమ్‌లోకి వెళ్దాం’ అన్నాడు. నేను ఏదైనా కాఫీ షాప్‌లో కలుద్దామని చెబితే అతను అంగీకరించలేదు. తీరా హోటల్‌ రూమ్‌కి వెళ్లగానే ఆ వ్యక్తి రూమ్‌ తలుపు వేసి నాతో వెకిలిగా ప్రవర్తించాడు. నాకు కోపం రావడంతో తలుపు తీసి బయటకు పొమ్మన్నాను. అతను నన్ను పైకీ, కిందకీ చూస్తూ వెళ్లిపోయాడు’’ అన్నారు. ఈ సందర్భంలో మరో సంఘటనను గుర్తు చేసుకున్నారామె. ‘‘కెరీర్‌ ఆరంభంలో నా తల్లిదండ్రులతో కలిసి సినిమా అవకాశాల కోసం ఓ నిర్మాతను కలిశాను. నీది హీరోయిన్‌ ముఖమేనా? అని ఆ నిర్మాత అన్నారు’’ అని విద్యాబాలన్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement