
Geetha Krishna Shocking Comments On Casting Couch: కాస్టింగ్ కౌచ్.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఎలాంటి రంగానికి చెందిన మహిళలైన ఈ కమిట్మెంట్ కల్చర్‌కు బాధితులు అవుతున్నారు. ముఖ్యంగా సీని ఇండస్ట్రీలో ఈ పేరు మారుమ్రోగుతుంది. ఇప్పటికే దీనిపై పలువురు నటీమణులు ఈ కాస్టింగ్ కౌచ్ నోరు విప్పుతున్నారు. వారు ఎదుర్కొన్న చేదు అనుభవాలను ధైర్యంగా బయట పెడుతున్నారు.
చదవండి: ‘నా భర్త వల్ల ప్రాణహాని ఉంది’.. పోలీసులను ఆశ్రయించిన నటి
ఈ క్రమంలో కాస్టింగ్ కౌచ్‌పై ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. సంకీర్తన, కీచురాళ్లు, కోకిల వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు గీతా కృష్ణ. ఈ మధ్య ఆయన పలు యూట్యూబ్ చానళ్లకు వరుసగా ఇంటర్య్వూలు ఇస్తూ హీరోహీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గతంలో ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన ఆయన పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పకొచ్చారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడు ఉంటుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
చదవండి: ప్రియుడితో నటి ఎంగేజ్‌మెంట్! ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ వార్నింగ్
‘ఆఫర్ల కోసం చాలా మంది హీరోయిన్లు కమిట్మెంట్ ఇస్తారు. అలా అయితేనే ఇక్కడ అవకాశాలు వస్తాయి. ఈ ఇండస్ట్రీ అమ్మాయిలకు సేఫ్ ప్లేస్ కాదు’ అన్నాడు. సింగర్స్ విషయంలోనూ ఇది జరుగుతుందని, ఈ విషయాలను బయటపెడితే కొత్త ఆఫర్లు రావడం కష్టమవుతుందని ఆయన పేర్కొన్నాడు. అయితే తాను అందరినీ అనడం లేదని ఇలాంటివి వద్దు అని అనుకునే వాళ్లు 10 నుంచి 15 శాతం ఉంటారని గీతాకృష్ణ తెలిపాడు. కాగా ప్రస్తుతం డైరెక్టర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment