సినిమా ఆఫర్ కోసం వెళ్తే.. డైరెక్టర్‌ అలాంటి పాడు పని: బిగ్ బాస్ బ్యూటీ | Bigg Boss Beauty Sreejita De Shares SHOCKING Casting Couch Experience | Sakshi
Sakshi News home page

Bigg Boss: నా భుజాలపై చేతులు వేసి.. అసహ్యంగా.. క్యాస్టింగ్‌ కౌచ్‌పై ప్రముఖ నటి!

Published Fri, Mar 8 2024 3:53 PM | Last Updated on Fri, Mar 8 2024 4:25 PM

Bigg Boss Beauty Sreejita De Shares SHOCKING Casting Couch Experience - Sakshi

క్యాస్టింగ్ కౌచ్‌ ఈ పదం చాలామంది వినే ఉంటారు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. రంగుల ప్రపంచం లాంటి సినిమా రంగంలో ఇది సర్వ సాధారణంగా మారిపోయింది. గతంలో చాలామంది హీరోయిన్స్ క్యాస్టింగ్ కౌచ్‌పై మాట్లాడారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవం ఎదురైన వాళ్లు చాలామందే ఉన్నారు.

తాజాగా ప్రముఖ నటి తనకెదురైన క్యౌస్టింగ్ కౌచ్‌ అనుభవాన్ని పంచుకుంది. బిగ్ బాస్ -16 కంటెస్టెంట్ శ్రీజిత దే సినీ రంగంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని వివరించింది. ఓ సినిమా ఆఫర్ కోసం వెళ్తే డైరెక్టర్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. తాజాగా  ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూలో ఈ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. 

శ్రీజిత మాట్లాడుతూ..' నేను 17 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టా. మాది పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా అనే చిన్న పట్టణం. మా అమ్మ ఎల్లప్పుడూ నాకు మద్దతుగా ఉంటూ నాతోనే ఉండేది. మా అమ్మ దగ్గర ఏ విషయాన్ని కూడా దాచేదాన్ని కాదు. కానీ అనుకోకుండా ఇండస్ట్రీలో కొందరు చెత్త వ్యక్తులను కూడా కలిశాను. కొందరు ప్రాజెక్ట్ లేకపోయినా కేవలం మీటింగ్‌ కోసం పిలిచి టైం పాస్ చేసేవారు. మరికొందరు పెద్ద డైరెక్టర్‌తో సినిమా ఉందంటూ కమిట్‌మెంట్‌ అడిగేవారు. అలా రెండుసార్లు ఇలాంటి అనుభవం ఎదురైంది' అని చెప్పుకొచ్చింది. కానీ ఒకసారి చాలా భయంకరమైన పరిస్థితి నుంచి బయపడ్డానని తెలిపింది. 

శ్రీజిత మాట్లాడుతూ.. "నాకు 19 ఏళ్ల వయస్సులో హిందీ చిత్రం రీమేక్ ఆఫర్ వచ్చింది. డైరెక్టర్ నన్ను సమావేశానికి పిలిచారు. ఆ సమయంలో మా అమ్మ కోల్‌కతాలో ఉంది. నేను ఒంటరిగా డైరెక్టర్ ఆఫీసుకి వెళ్లాను. అతను నా భుజం పట్టుకున్న విధానం, నాతో మాట్లాడే విధానం నాకు నచ్చలేదు. అతను వయసులో చాలా పెద్దవారు. ఎలాంటి వారికైనా ఆయన బుద్ధి ఎలాంటిదో వెంటనే అర్థమైపోతుంది. అతను నన్ను చూస్తున్న తీరు చాలా అసహ్యంగా అనిపించింది. దీంతో వెంటనే నా పర్సు తీసుకుని ఆఫీసు నుంచి బయటికి పరిగెత్తా." అంటూ ఆ షాకింగ్ సంఘటనను వివరించింది. కానీ క్యాస్టింగ్‌ కౌచ్‌ విషయంలో ఎప్పుడు మోసపోలేదని తెలిపింది. 

కాగా.. శ్రీజిత ఉత్తరాన్, తుమ్ హి హో బంధు సఖా తుమ్హీ, లేడీస్ స్పెషల్, లాల్ ఇష్క్, యే జాదూ హై జిన్ కా లాంటి ప్రముఖ టీవీ షోలలో కనిపించింది. బెంగాలీలో తన పాత్రలకు బాగా గుర్తింపు తెచ్చుకుంది. 2007లో కసౌతి జిందగీ కే అనే షోతో తొలిసారిగా ఎంట్రీ ఇచ్చింది. అంతే కాకుండా తషాన్, మాన్సూన్ షూటౌట్, లవ్ కా ది ఎండ్, రెస్క్యూ వంటి చిత్రాలలో కూడా నటించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement